విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
(అమరుల బంధుమిత్రుల సంఘం వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ ఉప్పు కృష్ణ అనారోగ్యంతో ఈ రోజు మరణించారు. ఆ అమరుడి పై అమరుల బంధు మిత్రుల సంఘం తరపున ప్రధాన కార్యదర్శి పద్మకుమారి ప్రకటన)
కామ్రేడ్ ఉప్పు కృష్ణ గుండె పోటుతో ఈ రోజు చనిపోయాడు. కృష్ణన్న అమరుల బంధుమిత్రుల సంఘం వ్యవస్థపక సభ్యుడు. అమరుల రక్తసంబంధికులతో కమిటీ ఏర్పాటు చేసి కన్వీనర్ భాద్యతలు స్వీకరించాడు. కో కన్వీనర్ కొడకంచి నర్సన్న తోడ్పాటుతో అనేక గ్రామాలు తిరిగారు. ఉప్పు కృష్ణకు ఇద్దరు కూతుర్లు. ఒక కొడుకు. కొడుకు పీపుల్స్ వార్ పార్టీలో పని చేస్తూ, పోలీసులకు చిక్కి తీవ్రమైన చిత్ర హింసలతో వీరమరణం పొందాడు. అతని కొడుకును తెచ్చుకోడానికి ఆయన అనేక ఇబందులు పడ్డాడు. అప్పటికే ఆయన ʹఅఖిలభారత ప్రజాప్రతిఘటన వేదిక ʹ లో రాష్ట్రస్థాయి నాయకుడు.
కొడుకు శవం తెచ్చుకోడానికి తాను పడ్డ యాతన పగవారికి కూడా రాకూడదని విలపించాడు. తనలాంటి రాజ్యహింస బాధితులతో కల్సి ధిక్కారాన్ని ప్రకటించాడు. శవాల స్వాధీనానికి ముందుకు కదిలాడు.
కొడుకు చనిపోయిన కొంతకాలానికి పెద్ద కూతురు ప్రమీల కూడా బూటకపు ఎన్ కౌంటర్లో అమరురాలు అయ్యింది. ప్రమీల సహచరుడు మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అయిన రామచందర్ కూడా అమరుడే. ఇద్దరు పిల్లల్ని, అల్లుడిని కోల్పోయి తనలాంటి ఎందరికో తోడుగా నిలిచాడు. ఒకరోజు ప్రకాశం జిల్లా లో ఎదురుకాల్పులు జరిగాయి. మార్కాపుర్ హాస్పిటల్లో మావోయిస్టు శవాన్ని ఉంచారు. అతని తల్లిదండ్రులతో ఉప్పు కృష్ణ అక్కడికి వెళ్ళాడు. మూత్రవిసర్జనకు పక్కకు వెళ్లిన కృష్ణపై పోలీసులు దాడిచేసి రెండు చేతులు విరగొట్టారు. రెండు నెలలు హాస్పిటల్లో వున్నాడు. దీర్ఘ కాలం నుండి షుగర్ ఉంది. వృధ్యాప్యం. దానితో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అప్పటినుండి ఆయన కోలుకోలేదు. ఆ తర్వాత షుగర్ మూలంగా కాలు తొలగించారు.
ప్రతి జూలై 18 అమరుల సంస్మరణకు హైదరాబాద్ వచ్చేవాడు. అరెస్టు ఎవరైనా వారి యోగక్షేమాలు ఆడిగేవాడు. సాయిబాబా, వరవరరావు ల ఆరోగ్యాల కోసం ఆందోళన చెందేవాడు. ఆమరుల ఆశయాలను ఎత్తి పట్టిన వారిలో తన పిల్లల్ని చూసుకునేవాడు. ఆయనకు అమరుల బంధుమిత్రుల సంఘం అశ్రునయనాలతో వినమ్రగా నివాళ్లు అర్పిస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన స్వగ్రామం ఉయ్యందనలో అంత్యక్రియలు జరుగుతాయి.ఈ ఊరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గరలో ఉంటుంది.
Keywords : abms, uppu krishna, guntur, martyr,
(2021-04-16 01:54:55)
No. of visitors : 351
Suggested Posts
| అర్దరాత్రి హడావుడి అంత్యక్రియలు ఎందుకోసం ? బంగారు తెలంగాణల ఏం జరుగుతోంది ?పేర్లు, వారి స్వగ్రామాలు తదితర వివరాలు ఉద్దేశపూర్వకంగానే తెలియజేయలేదు. సోమవారం ములుగు మార్చురీ దగ్గరికి వెళ్లిన అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులకు మృతదేహాలను చూసే అవకాశం ఇవ్వలేదు. కనీసంగా మృతుల వివరాలు కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి అంత్యక్రియలు జరిగిపోయేలా కుటుంబసభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. |
| మొదటితరం ఆదర్శ విప్లవకారుడు నర్సన్నదశాబ్ద కాలంగా అమరుల బంధుమిత్రుల సంఘంలో క్రియాశీలకంగా, బాధ్యునిగా ఉంటూ ఈతరం వారికి అమరుల బంధుమిత్రుల సంఘం నేతగా సుపరిచితుడైనవాడు నర్సన్న. తుదిశ్వాస వరకూ నమ్మిన విలువల కోసం పోరాడుతూ ఆ విప్లవ కమ్యూనిస్టు సాంస్కృతిక విలువల ప్రతినిధిగా నిలిచినవాడు నర్సన్న. |
| వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ మృతి |
| వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన నెటిజనులు |
| దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు... |
| ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు |
| కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు |
| ఏప్రిల్ 26 భారత్ బంద్ ను జయప్రదం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ పిలుపు |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు |
| Chattisghar Encounter: Maoist Party released a Letter |
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే - కే.కేశవరావు |
| అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ |
| లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి |
| సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత
|
| ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
|
| Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages |
| శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు |
| జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్ |
| విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన
|
| టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
|
| సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్ |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
|
| Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists |
| హత్రాస్ లో మరో ఘోరం: యువతిపై అత్యాచారం చేసిన వాడే ఆమె తండ్రిని కాల్చి చంపాడు
|
more..