సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌


సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌

సాహిత్య

సాహిత్య అకాడమీ అవార్డును ప్రముఖ మరాఠీ రచయిత తిరస్కరించారు. నందా ఖరే అనే ప్రముఖ మరాఠీ రచయిత 2014 లో రాసిన ʹఉద్యాʹ అనే నవలకు సాహిత్య అకాడమీ ఈ ఏడు అవార్డు ప్రకటించింది. ఉద్యా నవల ఇతివృత్తం చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది.

యంత్రాలు మానవులను ఎలా బానిసలుగా మార్చేశాయో, ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం నిఘా నీడలో చేరిందో ఈ నవల వివరిస్తుంది. ఖరే అసలు పేరు అనంత్ యశ్వంత్ ఖరే.

తనను తాను వామపక్షవాదిగా చెప్పుకునే ఖరే రచయితలకు భావజాలం ఉండాలని నమ్ముతాడు. సాహిత్యం ఆకాశంలోంచి పుట్టదని సమాజంలోంచే పుట్టే సాహిత్యం కూడా ఖచ్చితంగా రాజకీయ చర్యే అని ఖరే అంటాడు.

సాహిత్యంలో జ్ఞానపీఠ్ అవార్డు తర్వాత అత్యున్నత సాహిత్య పురస్కారమైన సాహిత్య అకాడమీ అవార్డును ఎందుకు అంగీకరించలేదని అడిగినప్పుడు, ఖరే మర్యాదపూర్వకంగా ఇలా అన్నాడు, ʹనాకు ఎంత లభించాలో అంత‌ లభించింది… నేను ప్రజల అభిమానాన్ని, గౌరవాన్ని అందుకున్నాను. గత నాలుగేళ్లుగా అవార్డులు తీసుకోవడం మానేశాను ʹ అని చెప్పారు.

అత్యంత ప్రతిష్టాత్మకమైన, గౌరవనీయమైన మరాఠీ రచయితలలో ఒకరిగా పరిగణించబడుతున్న ఖరే, సమాజంలో మరియు సంస్కృతిలో (గత కొన్ని సంవత్సరాలుగా) జరిగిన మార్పులు ʹప్రమాదకరమైనవిʹ అని నొక్కి చెప్పారు.

"మనం మరింతగా నాగరికత, సంస్కృతి లేనివారిగా మారాము. అంతకుముందు ఇలా ఉండేది కాదు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, విభిన్న భావజాలాల మనుషులు ఒకరినొకరు గౌరవించుకునేవారు. ʹ "మనం మరింత అసహనానికి గురయ్యామా?" అని ఆవేదనచెందిన ఖరే గతం గురించి మాట్లాడుతూ నాగ్‌పూర్‌లో నివసించిన తన తండ్రిని ఖరే గుర్తుచేసుకున్నాడు, "అతను ఆర్ఎస్ఎస్ నాయకుడు బాలాసాహెబ్ డియోరాస్ మరియు ప్రసిద్ధ సిపిఐ నాయకుడు ఎబి బర్ధన్ లకు మంచి స్నేహితుడు, కానీ ఎవరితోనూ సమస్య రాలేదు." అన్నాడు ఖరే

బాలాసాహెబ్ డియోరాస్ మరియు బర్ధన్ ఇద్దరూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగారు.

భారతదేశంలో రోజురోజుకు దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలపట్ల నందా ఖరే ఆవేదనపడుతున్నాడు. " పదాలు అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది, కాని రాజ్యాంగం యొక్క ఆత్మ మార్చబడింది" అన్నారాయన‌

భీమా కోరెగావ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆంగ్ల ప్రొఫెసర్ సోమ సేన్ గురించి నందా మాట్లాడుతూ, ʹయుఎపిఎ వంటి చట్టాలను రద్దు చేయాలి. అలా చేయడం అంత సులభం కానప్పటికీ. ʹ

"నేను అత్యవసర రోజులను కూడా చూశాను, కాని దేశంలో ఇప్పుడు అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉంది ఇది మరింత ప్రమాదకరమైనది" అని అన్నారు ఖరే

నందా ఖరే అవార్డులను తీసుకోవడం మానేశారనే విషయం తమ‌కు తెలియదని అవార్డు సెలక్షన్ కమిటీలో ఒకరైన అఖిల్ భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్ మాజీ అధ్యక్షుడు వసంత అబాజీ దహకే మీడియాతో చెప్పారు. సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేయడానికి ముందు రచయిత అనుమతి తీసుకోరు అని ఆయన అన్నారు.

Keywords : sahitya academy award, marathi, nanda khare, reject
(2021-04-17 06:57:11)No. of visitors : 458

Suggested Posts


0 results

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
హత్రాస్ లో మరో ఘోరం: యువతిపై అత్యాచారం చేసిన వాడే ఆమె తండ్రిని కాల్చి చంపాడు
more..


సాహిత్య