చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...
తేదీ : 6 ఏప్రిల్, 2021
బీజాపూర్ జిల్లా, జీరగూడెం గ్రామం వద్ద ఫాసిస్టు ʹసమాధాన్-ప్రహార్ʹ సైనిక అభియాను ప్రజా గెరిల్లాల ప్రతిదాడి!
ప్రియమైన ప్రజలారా!
ఏప్రిల్ 3, 2021న ఫాసిస్టు మోదీ, అమిత్ షాల పోలీసులు 2000 మందితో బస్తర్ ఐజి సుందర్ రాజు నాయకత్వంలో సుక్మా-బీజాపూర్ జిల్లాలలో గ్రామాల మీద ʹసమాధాన్-ప్రహార్ʹ పేరుతో భారీ స్లాయి దాడికి వచ్చారు. పిఎల్‌జిఎ నిర్మూలించే దృష్ట పథకంతో వచ్చారు. 2020 ఆగస్టు లోనే ఢిల్లీలో అమిత్ షా నాయకత్వంలో జరిగిన పోలీసు అధికారుల సమావేశంలోనే ఈ భారీ దాడులకు పథకం నిర్ణయించారు. తరువాత రాయ్ పూర్ కేంద్రంగా పని చేస్తున్న నరహంతక విజయకుమార్ నాయకత్వంలో అక్టోబర్ లో తెలంగాణ వెంకటాపూరంలో 5రాష్ట్రాల పోలీసు అధికారులతో క్షేత్రస్థాయి సైనికదాడికి పథకం పన్నారు. బస్తర్ సుందరరాజును బస్తర్ సైనిక కమాండుకు బాధ్యత ఇచ్చారు. ఈ దాడులకు ప్రత్యేక అధికారిగా కేంద్రం నుండి అశోక్ జునేజా (డిజిపి)ను నియమించారు.
2020న నవంబర్ నుండి ప్రారంభమైన ఈ దాడులలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానీకాన్ని 150 మందికి పైగా హత్యలు చేసారు. వేలాది మంది ప్రజలను జైల్లో పెట్టారు. మహిళలపై అత్యాచారం చేసి చంపడం, అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేయడం, ప్రజల ఆస్థులను నాశనం చేయడం, సంపదను లూటీ చేయడం వంటివి చేసారు. ఒకవైపున ఈ విధంగా హింసాకాండను కొనసాగిస్తూ మరో ప్రక్కన అభివృద్ధి పేరుతో పోలీసుల రక్షణలో రోడ్ల నిర్మాణం చేపడుతూ దీనినే అభివృద్ధి అని చెబుతున్నారు. సంక్షేమం కోసం జనతన సర్కార్లు సూల్స్, హాస్పటల్స్ నడుపుతుంటే ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తూ మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని దృష్ప్రచారం చేస్తున్నారు. పోలీసు క్యాంపులకు, ప్రభుత్వ విధ్వంస కాండకు వ్యతిరేకంగా ప్రజలు దండకారణ్య వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ʹస్కూల్స్, హాస్పటల్స్ కావాలని, పోలీసు క్యాంపులు వద్దని" డిమాండ్ చేస్తున్నారు.
సామ్రాజ్యవాద అనుకూల, ప్రజా వ్యతిరేక ఫాసిస్టు మోడీ ప్రభుత్వ పోలీసు బలగాలు 2021, ఏప్రిల్ 3న జీరగూడెం దాడికి వచ్చినప్పుడు పిఎల్ జీఎ బలగాలు వారిపై ప్రతిదాడి చేసారు. ఈ సాహసోపేతమైన ప్రతిదాడిలో, వేల సంఖ్యలో వచ్చిన కిరాయి పోలీసు బలగాల మీద పిఎల్‌జిఎ చేసిన ప్రతిఘటనలో 23 మంది పోలీసులు చనిపోయారు. ఒకరు మాకు బంధీగా దొరికారు. 30 మందికి పైగా గాయపడగా, మిగిలిన వారు పారిపోయారు. దీనికి ముందే జీరగూడెం గ్రామస్తుడు మాడవి సుక్కాలును పట్టుకొని కాల్చి చంపి, ఎప్పటిలాగే కాల్పుల్లో చనిపోయాడని బూటకపు ప్రచారం చేసారు.
ఈ దాడిలో 4గురు పిఎల్ జీఎ యోధులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. 1. కామ్రేడ్ ఓడి సన్ని 2. కామ్రేడ్ పద్దమ్ లక్మా 3. కామ్రేడ్ కోవాని బద్రు 4, కామ్రేడ్ నూప సురేష్, కామ్రేడ్ సన్నీ మృతదేహాన్ని మేము తెచ్చుకోలేకపోయాం . మిగిలిన ముగ్గురిని విప్లవ ప్రజల మధ్యన విప్లవ సాంప్రదాయాలతో, విప్లవ జోహార్లు చెబుతూ అంతిమ సంస్మరణ జరిపాం.
నిజానికి పోలీసులు మాకు శత్రువులు కాదు. పాలకవర్గాలు తెచ్చిపెట్టిన అన్యాయమైన యుద్ధంలో బలి పశువులు కావద్దని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సంతాపం తెలియ జేస్తున్నాం. ఈ దాడిలో పిఎల్ జీఎ 14 ఆయుధాలను, 2000 పైగా తూటాలను, మరి కొంత యుద్ధ సామాగ్రిని పోలీసుల నుండి స్వాధీనం చేసుకున్నది.
సామ్రాజ్యవాదుల, దళారీ బూర్జువాల నమ్మిన బంటు నరేంద్రమోడీ దేశంలోని ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను సామ్రాజ్యవాద కంపెనీలకు, అంబానీ, అదానీల వంటి దళారీ కంపెనీలకు అప్పజెబుదామని, పెట్టుబడిదారుల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని పార్లమెంటులోనే ప్రకటించాడు. వనరుల దోపిడికి, సంపద తరలింపులకు మావోయిస్టు పార్టీ ఆటంకంగా ఉండటంతో, మావోయిస్టులు లేని భారత్ ను నిర్మాణం చేస్తామని ప్రకటిస్తున్నాడు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై సైనిక దాడులు చేస్తున్నాడు. 2022 లోగా మావోయిస్టు పార్టీన్ని నిర్మూలిస్తామనే లక్ష్యాన్ని ప్రకటించాడు. జీరగూడెం దాడి తరువాత జగ్డల్ పూర్ వచ్చిన అమిత్ షా మాట్లాడుతూ ʹమా పోలీసు బలగాల్లో నైతిక స్థైర్యం ఎక్కువ వుందని, మావోయిస్టు వ్యతిరేక సైనిక దాడిని మరింత తీవ్రతరం చేసి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని" ప్రకటించాడు.
ఈ పరిస్థితిల్లో ప్రజలను, వనరులను, ప్రజా సంపదలను కాపాడుకోవడంలో భాగంగా పిఎల్ జీఎ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిదాడి చేయవలసి వస్తున్నది.
చర్చల గురించి ఒక మాట - చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గతంలో జరిగిన అనేక చర్చల సందర్భాల్లో ఉద్యమకారులు ఎప్పుడూ ఆయుధాలు విడిచింది లేదు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. బలగాల మోహరింపులు, క్యాంపుల నిర్మాణం, దాడులు, నిర్బంధాలను నిలిపివేస్తే చర్చలు జరుగుతాయి. అలా కాకుండా బలగాలతో దాడులు చేస్తున్నందుకే కొండగాం, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన ప్రతిదాడులలో పోలీసులు చనిపోవలసి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.
మోడీ అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాల కాలంలో ఆర్థిక సంక్షోభం తీవ్రమై, రాజకీయ పరిస్థితులు దిగజారి ప్రజల మానప్రాణాలకు, దేశ సంపదకు ప్రమాద పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల మీద అన్ని సంస్థల మీద - దళితులు, ఆదివాసులు, మత మైనార్టీలు, మహిళలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలపై ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారు. పోరాడుతున్న మేధావులు, ప్రజాస్వామిక వాదులను అర్బన్ మావోయిస్టులనే పేరు మీద, చివరకు బూర్జువా పార్టీల నాయకుల మీద మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడులు పెరిగి పోతున్నాయి. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, యన్ ఐ ఎ(NIA) కు విస్తృత అధికారాలు ఇచ్చి ఫాసిస్టు పాలనను చట్టబద్ధం చేస్తున్నాడు. మేమే దేశభక్తులమని బుకాయిస్తున్నాడు.
దేశవ్యాప్తంగా జల్-జంగల్-జమీన్-ఇజ్జత్ నినాదాలతో అడవి, మైదానాలలోని ప్రజలు పోరాడుతూ, ప్రకృతి వనరులను, సంపదను కాపాడుకుంటున్నారు. వీరే నిజమైన దేశ భక్తులు. ఆ పోరాటాలకు సీపీఐ (మావోయిస్టు) నాయకత్వాన్ని అందిస్తూ, ఆ పోరాటాలను మిలిటెంట్ గా ముందుకు తీసుకుపోతున్నది. ప్రజా పోరాటాలను, ప్రజా యుద్ధాన్ని నడుపుతున్నది.
దేశం నేడు అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉంది. దేశ ప్రజలకు మోడీ, అమిత్ షాల ఫాసిజమే అత్యంత ప్రమాదకారి. అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమై పోయిన పరిస్థితుల్లో, చట్టబద్ద ఆందోళనలను క్రూరంగా అణచి వేస్తున్న పరిస్థితుల్లో ప్రజాందోళన, ప్రజాయుద్దం, జమిలిగా సాగే సాయుధ పోరాట మార్గమే ప్రత్యామ్నాయం. ʹఅన్ని అధికారాలు ప్రజలకేʹ అనే విధానంతో నడుస్తున్న ʹజనతన సర్కార్లʹ మార్గమే సరియైన ప్రత్యామ్నాయం. అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజలు జనతన సర్కార్ మార్గంలో భాగస్వాముల కావాలని కోరుతున్నాం. మోడీ, అమిత్ షాలు ఎన్ని రాక్షస మారణకాండలకు పథకాలు పన్నినా వాటినన్నింటినీ ప్రజాయుద్ధం ద్వారా ఓడిద్దాం.
గమనిక-ప్రభుత్వం నిర్దిష్టంగా మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే, మా వద్ద బంధీగా ఉన్న పోలీసును అప్పగిస్తాం. అప్పటి వరకు అతను జనతన సర్కార్ల రక్షణలో క్షేమంగా ఉంటాడు.
విప్లవాభినందనలతో,
వికల్స్,
అధికార ప్రతినిధి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).
Keywords : chattis garh, maoists, encounter, crpf,
(2024-10-09 18:11:10)
No. of visitors : 4611
Suggested Posts
| మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి. |
| ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహంచత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. |
| హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు. |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులుచత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. |
| ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. |
| పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటనజూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. |
| పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్కరణ - భారీ బహిరంగ సభ ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది. |