విద్యార్థినులపై లైంగిక వేధింపులు... 500 మంది స్టూడెంట్స్ కంప్లైంట్ - ఉపాధ్యాయుడు అరెస్ట్

దిగ్భ్రాంతి కలిగించే ఘోరమైన ఓ సంఘటన చెన్నై లోని ఓపాఠశాలలో జరిగింది. ఓ టీచర్ తన వద్ద‌ విద్య అభ్యసించే విద్యార్థినులను లైంగికంగా వేదించాడు. ఒక్క సారి, రెండు సార్లు కాదు. కొన్ని సంవత్సరాలుగా వందల మంది పై ఈ దుర్మార్గానికి ఒడిగడుతూనే ఉన్నాడు. 500 మంది విద్యార్థినులు, పూర్వ‌ విద్యార్థులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకోవడం, స్కూల్ మేనేజ్ మెంట్ కు లేఖ రాయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది.

తమిళనాడు రాస్హ్త్ర రాజధాని చెన్నై లోని పద్మ శేషాద్రి బాల భవన్ (పిఎస్‌బిబి) పాఠశాల కెకె నగర్ బ్రాంచ్‌కు చెందిన 12 వ తరగతి వాణిజ్య, అకౌంటెన్సీ ఉపాధ్యాయుడు జి రాజగోపాలన్ కొన్ని సంవత్సరాలుగా విద్యార్థినుల తో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆన్ లైన్ క్లాసెస్ లో షర్ట్ వేసుకోకుండా కనిపించడం, చెప్పనలవి కాని బూతు మాటలు మాట్లాడటం, విద్యార్థినులకు వ్యక్తిగతంగా మెసేజ్ లు పెట్టి వేదించడం, విద్యార్థులను అందరి ముందు బూతులు తిడుతూ వేదించడం చేస్తున్నాడు. ఓ బాలికను ముద్దు పెట్టుకోవడం, తన తొడలపై కూర్చోవాలని విద్యార్థినులను కోరడం, సినిమాలకు రావాలని మెసేజ్ లు చేయడం.... ఈ విషయాలన్నింటిపై ఈ స్కూల్ అల్యూమినీ అసోసియేషన్ సభ్యులు సోషల్ మీడియాలో వీటిపై చర్చించడం, రాజగోపాల‌న్ చేసిన వాట్సప్ మెసేజ్ ల స్క్రీన్ షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం, 500 మంది పూర్వ‌, ప్రస్తుత విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి ఓ లేఖ రాయడం తో యాజమాన్యం టీచర్ రాజగోపాలన్ ను సస్పెండ్ చేసింది.


యాజమాన్యం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆరోపణలు గురించి తెలియగానే నిజనిర్దారణ కోసం అంతర్గత కమిటీ నియమించామని తెలిపింది. విచారణ న్యాయంగా, పారదర్శకంగా ఉంటుందని తాము అందుకున్న అన్ని ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యం ఆ ప్రకటనలో పేర్కొంది. విచారణ జరుగుతున్న‌ కాలంలో పాఠశాల పూర్వ, ప్రస్థుత విద్యార్థులెవ్వరితో మాట్లాడవద్దని రాజగోపాల్ ను ఆదేశించామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

ʹʹబాలికలను వేధించడమే కాకుండా అబ్బాయిలపై కూడా శారీరకంగా దాడి చేసి, ʹమొత్తం తరగతి గది ముందు అసభ్యకరమైన మాటలతో తిట్టేవాడుʹ అని పాఠశాల యాజమాన్యానికి రాసిన ఈ మెయిల్ లో విద్యార్థులు ఆరోపించారు.

మరో వైపు ఈ టీచర్ రాజగోపాలన్ ను మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై POCSO చట్టం లోని సెక్షన్లు 11 (ఒక వ్యక్తి పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడి, మాటలు చెప్పడం, అతని శరీరాన్ని ప్రదర్శించడం మొదలైనవి) మరియు సెక్షన్ 12 (ఎవరైతే, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే వారికి జైలు శిక్ష విధించబడుతుంది) ఐపిసి చట్టం 354 (ఎ) (లైంగిక వేధింపులకు మరియు లైంగిక వేధింపులకు శిక్ష) మరియు 509 (ఏదైనా స్త్రీని అవమానించడం, ఏదైనా మాటలు పలకడం, ఏదైనా శబ్దం లేదా సంజ్ఞ చేయడం లేదా ఏదైనా వస్తువును ప్రదర్శించడం); ఐటి చట్టం సెక్షన్ 67 మరియు 67 (ఎ) (అశ్లీల విషయాలను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి శిక్ష) కింద కేసు నమోదు చేశారు.

Keywords : chennai, teacher, PSBB, Chennai police arrest PSBB School teacher accused of sexual harassment under POCSO Act
(2024-04-25 00:26:56)



No. of visitors : 1562

Suggested Posts


దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు

దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్లే.. దేవుడు లేడని చెప్పే హక్కు కూడా ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుందని కోర్టు పేర్కొంది.

విద్యార్థినులపై ఆద్యాత్మిక గురువు లైంగిక వేధింపులు... కేసు నమోదు కాగానే ఆస్పత్రిలో చేరిన బాబా

ఆయనో (Self-styled spiritual guru) స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఎలియాస్ బాబా ప్రజలకు బోధనలు చేసే వ్యాపారమే కాక విద్యావ్యాపారం చేస్తున్నాడు. అసలే భక్తి బోధనలు చేసే బాబా... పైగా ఇంటర్నేషనల్ స్కూల్

చెన్నై వీధుల్లో పడవల్లో ప్రయాణం

వెనీస్ నగరంలో తిరిగినట్టు చెన్నై వీధుల్లో జనం ఇప్పుడు బోట్లల్లో తిరుగుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ఓలా కంపెనీ తాజాగా ఇప్పుడక్కడ బోటింగ్ సర్వీసులను....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


విద్యార్థినులపై