భారత్ దేశ ప్రభుత్వం లక్షద్వీప్ లోని అతి పురాతన న్యూస్ పోర్టల్ ద్వీప్ డైరీని ఎందుకని నిషేధించింది?

భారత్

30-05-2021

గత కొన్ని రోజుల నుండి, #SaveLakshadweep కేంపెయిన్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఆహారపు అలవాట్లు, ద్వీపాల మత సంస్కృతి, భూ హక్కులు, పంచాయతీ ఎన్నికల అభ్యర్థిత్వానికి కుటుంబ నియంత్రణ, కార్పొరేటైజేషన్‌ మొదలైనవాటికి ప్రమాణంగా ముసాయిదా నిబంధనలకు సంబంధించి ప్రస్తుత జాతీయ టీవీ చానెల్స్, ఇంగ్లీష్ వార్తాపత్రికలు చాలా తక్కువ ప్రసారం చేస్తున్నాయి. ద్వీపంలోని మొట్టమొదటి ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ద్వీప్ డైరీని భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం నిషేధించింది.

కొత్తగా నియమితుడైన అడ్మినిస్ట్రేటర్, ప్రఫుల్ ఖోడా పటేల్ చేసిన సవరణలు, నిబంధనలను అతిత్వరితంగా ప్రజలపై విధించడం గురించి ద్వీప్ డైరీ వార్తలను ప్రచురిస్తోంది. పదేళ్ల క్రితం రచయితలు, సాహిత్య కార్యకర్తల బృందం ప్రారంభించిన వార్తా వెబ్‌సైట్ 2021 మే 23 న మొదటిసారి నిషేధానికి గురైంది.

ఒక విప్లవసాహిత్య పాట వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినందుకు నిషేధించారని ద్వీప్ డైరీ సీనియర్ సంపాదకీయ సభ్యుడు కె బహీర్ భావిస్తున్నారు. తాను నివసించే కిల్తాన్ ద్వీపంలో ఇంటర్నెట్ లేకపోవడంతో పాటలోని విషయమేమిటో ఆయనకు తెలియదు. "లక్షద్వీప్‌లో చురుకైన మీడియా లేదు. కొన్ని సంవత్సరాల క్రితం, స్థానిక వార్తలను పంచుకోవడానికి మేము ఒక బ్లాగును ఉపయోగించేవాళ్లం. తరువాత దానిని న్యూస్ పోర్టల్‌గా మార్చాము. లక్షద్వీప్ సాహిత్య కార్యకర్తల సంఘం (లక్షద్వీప్ లిటరరీ యాక్టివిస్ట్స్ గ్రూప్) 2010 లో వెబ్‌సైట్‌ను స్థాపించింది. వార్తలతో పాటు, కథలు, కవితలు, డ్వీప్‌కు సంబంధించిన సమస్యలపై కథనాలు వంటి సాహిత్య విషయాలను ప్రచురిస్తుంది. ఈ వెబ్‌సైట్ ద్వారానే ద్వీప్‌లో నివసించే ద్వీపవాసులు, ప్రవాస ద్వీపవాసులు, మలయాళీ సమాజం ద్వీప్ సమాచారం తెలుసుకుంటారు. ఇది చాలా సంవత్సరాలు ఎటువంటి అవరోధాలు లేకుండా సాగింది. ఇంటర్నెట్ అంతరాయం కలిగినప్పుడు మాత్రమే, మా వార్తా నవీకరణ నిలిచిపోతుంది.

ద్వీప్‌లో కొత్త పరిణామాలకు సంబంధించి ద్వీపవాసుల నుండి భిన్నాభిప్రాయాలు, నిరసనలు ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఈ భావోద్వేగాలను నమోదు చేసే పాటను మా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసారు, కిల్తాన్ ద్వీపంలో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల నేను ఇంకా చూడలేదు. ప్రభుత్వాన్ని ఈ పాట రెచ్చగొట్టడంవల్ల బ్లాక్ చేశారని నా అవగాహన.ʹఅని కె బహీర్ ʹద్వీప్ డైరీʹ చరిత్ర ను వివరించారు. సుమారు ఏడుగురు విలేకరులతో పనిచేస్తున్న ద్వీప్ డైరీ తన నివేదికలను ప్రత్యక్ష వాస్తవిక భాషలో, చాలా సంక్షిప్తంగా వ్రాస్తుంది.

"నేను సుమారు 3,000 మంది జనాభా వున్న ద్వీపంలో నివసిస్తున్నాను. రోజువారీ, దాదాపు 30 కోవిడ్ కేసులు వస్తున్నాయి. కిల్తాన్ ద్వీపంలో, ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది, ఇక్కడ ఒక వైద్య అధికారి, ఇద్దరు కాంట్రాక్ట్ వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించారు, 10 నుండి 15 పడకలు మాత్రమే ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తే, రోగిని హెలికాప్టర్ లేదా ఓడ ద్వారా మరొక ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఈ పధ్ధతి అమలులో వుంది. రోగిని కవరట్టిలోని ఒక ఆసుపత్రికి తీసుకెళతారు లేదా వారిని అగట్టిలోని రాజీవ్ గాంధీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువెళతారు. ఇందులో కాస్త అభివృద్ధి చెందిన సౌకర్యం ఉంది. అక్కడ చూడలేకపోతే ఆ రోగిని ఎర్నాకులంకు మారుస్తారు. రవాణా ఛార్జీలు రోగి భరించాల్సి ఉంటుంది. కొందరు ఆరోగ్య బీమాను ఉపయోగిస్తున్నారు.

కరోనా విపత్తు సమయంలో, బయటి నుంచి ద్వీప్‌లోకి వచ్చే వ్యక్తులు ఒక వారం పాటు ప్రభుత్వ క్వారెంటైన్‌లో ఉండాల్సి వుంటుంది. తరువాత, నెగిటివ్ వస్తే వారిని ఓడలో ఇంటి క్వారెంటైన్‌లో ఉంచుతారు. మళ్ళీ మరొక కోవిడ్ పరీక్ష అయిన తరువాత మాత్రమే వారు ద్వీపంలోకి వెళ్లడానికి అనుమతి ఉంటుంది.

కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేటర్ ఈ షరతులు, ప్రోటోకాల్‌లను ఎత్తివేసిన తరువాత మాత్రమే, కోవిడ్ ద్వీపంలోకి ప్రవేశించింది. రోజువారీ కోవిడ్ కేసులు ముప్పైకి దగ్గరగా ఉన్నాయి. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి, రోగులను పాఠశాల భవనాలలోకి విడిగా వుండానికి పంపిస్తున్నారు. ఆరోగ్య స్థితి మరింతగా క్షీణిస్తే ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది.

చేపలు పట్టే బోట్లు నిలిపే, యితర లావాదేవీలు జరిగే ప్రాంతమే వైట్ సాండ్ ప్రాంతం. మత్స్యకారులు ఈ ప్రాంతంలో షెడ్లను నిర్మించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందునుంచి ఈ షెడ్లు ఉండేవి. ఇటీవలి కాలంలోనే ఈ ప్రాంతంపై ప్రభుత్వ అధికారుల దావా బలపడింది. పర్యాటక ప్రాజెక్టులు నిర్మితమవబోతున్నాయనేదానికి యిది సంకేతాన్నిస్తుంది.

ఈ భూముల యాజమాన్యంకోసం బిజెపి నాయకులు ఒక ఎజెండాతో పనిచేస్తున్నారని మాకు అనుమానం ఉంది. ఈ ప్రాంతంలో క్లియరింగ్ చేయడం గురించి మాకు తెలియదు. లాక్డౌన్ వల్ల, ఇళ్ళ నుండి బయటకు వెళ్లలేకపోతున్నాము. లక్షలాది రూపాయలు విలువగల మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి.

వారు పంచాయతీ ఉపచట్టాల సవరణ ముసాయిదా తయారుచేశారు. దీనిలోని ఒక నిబంధన ప్రకారం, ఇద్దరు పిల్లలకు పైగా ఉన్న వ్యక్తి ఎన్నికలలో పోటీ చేయకూడదు. చిత్తుప్రతి దాదాపు 70 పేజీలు వుంది. ఈ ముసాయిదా చదవడానికి ఇక్కడి రాజకీయ నాయకులకు కూడా సమయం ఇవ్వలేదు. "మనల్ని ప్రభావితం చేసే వార్తలను మేము ప్రచురిస్తాము. జాతీయ స్థాయిలో జరిగినదాని గురించి మా వెబ్‌సైట్‌లో పెడితే అది భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుంది. కానీ మేము ద్వీప్ గురించిన వార్తలకు ప్రాధాన్యత ఇస్తాము, ʹఅని ఆయన అన్నారు.

(ప్రతిపాదిత లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021కింద, ద్వీపాలను నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయక తదితర ప్రయోజనాల కోసం నాలుగు ప్రాంతాలుగా విభజిస్తారు. ఒక ప్రధాన పట్టణ ప్రణాళికదారుడికి (చీఫ్ టౌన్ ప్లానర్) ప్రజల సొంత భూమిహక్కుపైన అధికారం వుంటుంది.

2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికులు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వున్న లక్షద్వీప్ లో, బయటి వ్యక్తులు తమ సొంత భూమిలో స్థిరపడతారని ఆందోళన చెందిన ద్వీపవాసులు అడ్మినిస్ట్రేటర్‌కి రాసిన లేఖలో ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నియంత్రణ పాలక అధికారానికి అంటే అడ్మినిస్ట్రేటర్‌కి ఒక నిర్దిష్ట ద్వీపం భౌగోళిక భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కార్యకలాపాలు ప్రణాళికాధికారి చేస్తాడు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం లక్షద్వీప్‌లో అత్యల్ప నేరాలు నమోదయ్యాయి. సామాజిక వ్యతిరేక చర్యల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని పరిపాలన ప్రతిపాదించింది. గొడ్డు మాంసం రవాణా, అమ్మకం, నిల్వ, వినియోగాలను నిషేధించాలని లక్షద్వీప్ జంతు సంరక్షణ నిబంధనలు 2021 ప్రతిపాదించింది. తాము ఏమి తినాలనే దానిపై ద్వీపవాసులకుండే హక్కులపై నేరుగా దాడి చేస్తుంది. 2021 లో కొత్తగా జారీ చేసిన ఆదేశాలతో, రవాణా, మద్యం అమ్మకాలపై సాంస్కృతిక నిషేధం కూడా ఎత్తివేయబడింది).
(keyboardjournal.com సౌజన్యంతో)
తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి

Keywords : lakshadweep, dweepdiary, bjp, ban
(2024-04-25 00:26:10)



No. of visitors : 1038

Suggested Posts


సినీ నటిపై దేశ ద్రోహం కేసు

పటేల్ రాక ముందు వరకు లక్షద్వీప్ లో ఒక్కరికి కూడా కరోనా సోక లేదని, ఒక్క కోవిడ్ 19 పాజిటీవ్ కేసూ నమోదు కాలేదని, పటేల్ వచ్చాక తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా వ్యాపించిందని ఆమె మండి పడ్డారు. ఓ మలయాళ టీవీ ఛానల్ లో చర్చలో పాల్గొన్న ఆమె...

SaveLakshaDweep: సేవ్ లక్ష ద్వీప్ - నిరసనల హోరు

లక్షద్వీప్ ను రక్షించుకునేందుకు సాగుతున్న ఉద్యమాన్ని అక్కడి ప్రజలు ఉదృతం చేశారు. ఈ రోజు (సోమవారం) 12 గంటల పాటు నిరాహార ధీక్షలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ నాయకుడు,

lakshadweep సినీ నటిపై దేశద్రోహం కేసు - పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసిన బీజేపీ నాయకులు

లక్షద్వీప్ కు చెందిన సినీ నటి, నిర్మాత ఐషా సుల్తానా (Aisha Sultana)పై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీకి మూకమ్మడి రాజీనామాలు చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


భారత్