మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

మావోయిస్టు

08-06-2021

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అనారోగ్యంతో వైద్యం చేయించుకోవడానికి వచ్చిన తమ పార్టీ దండకారణ్యం దక్షిణ సబ్ జోనల్ కమ్యూనికేషన్ విభాగం ఇన్ చార్జ్, డీవీసీఎమ్ మధుకర్ ను జూన్ 1 నుండి 5 వరకు వైద్య సేవలందించకుండా ఆ పేరుతో అమానవీయంగా హింసించి జూన్ 6న ఆయనను హత్య చేశారని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్యం దక్షిణ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి సమత విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. ఇది 15 రోజులలోపే పోలీసులు చేసిన రెండవ హత్య అని, మే 27న పీఎల్ జీఏ కు చెందిన ఒక ప్లాటూన్ కమాండర్ గంగాల్ ను కూడా ఇదే తరహలో హత్య చేశారని ఆమె పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ ప్రకటన పూర్తి పాఠం....

కామ్రేడ్ శోభరాయ్ హత్యను తీవ్రంగా నిరసించండి!

మా పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమ్యూనికేషన్ విభాగం ఇన్ చార్జ్, డీవీసీఎమ్ కామ్రేడ్ శోభరాయ్ (గడ్డం మధుకర్)ను జూన్ 6న తెలంగాణ పోలీసులు కూృరంగా హత్య చేయటాన్ని మా దక్షిణ సబ్ జోనల్ బ్యూరో తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ క్రూరమైన చర్యను నిరసించాల్సిందిగా మానవ హక్కుల సంఘాలనూ, ప్రగతిశీల ప్రజాస్వామ్య మేధావులనూ, మీడియా మిత్రులనూ, వామపక్ష పార్టీలనూ, విప్లవ ప్రజలనూ కోరుతున్నది.

అనారోగ్యం కారణంగా చికిత్స కోసం తెలంగాణలోని వరంగల్ పట్టణానికి వెళ్లిన కామ్రేడ్ శోభరాయ్ ని జూన్ 1న తెలంగాణ ఎస్ ఐ బీ అరెస్టు చేసిన విషయం విదితమే. పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. అంతేకాదు, మెరుగైన చికిత్సకోసం ఆయనను ఆసుపత్రిలో భర్తీ చేసినట్లు గొప్పలు చెప్పుకున్నారు. తిరిగి జూన్ 6న కరోనాతో కామ్రేడ్ శోభరాయ్ మరణించినట్లు మీడియాకు ప్రకటనను ఇచ్చారు.

వాస్తవానికి జరిగిందేమంటే జూన్ 1 నుండి 5 వరకు కామ్రేడ్ శోభరాయ్ కు వైద్య సేవలందించకుండా ఆ పేరుతో అమానవీయంగా హింసించి జూన్ 6న ఆయనను పాశవికంగా హత్య చేశారు. 15 రోజులలోపే అత్యంత కుట్ర పూరిత పద్ధతిలో చేసిన రెండవ హత్య ఇది. మే 27న మా పీఎల్ జీఏ కు చెందిన ఒక ప్లాటూన్ కమాండర్ కామ్రేడ్ గంగాల్ ను ఇదే తరహలో హత్య చేశారు.

దక్షిణ సబ్ జోనల్ బ్యూరో మా ప్రియమైన కామ్రేడ్ శోభరాయ్ కి తలవంచి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నది, ఆయన ఆశయాలను తుదకంటా కొనసాగిస్తామనీ మరోసారి ప్రతిన బూనుతున్నది. కామ్రేడ్ శోభరాయ్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం, కొండపల్లి గ్రామంలో 38 సం|| రాల క్రితం నిరుపేద కుటుంబంలో జన్మించాడు. 16 యేళ్ల చిన్న వయస్సులోనే 1999లో సిర్పూర్ దళంలో సభ్యుడుగా చేరాడు. తరువాత 2000 సం||లో దండకారణ్యానికి బదిలీ అయ్యాడు.

ఇక్కడ కొద్ది కాలం ఆయుధాల తయారీ విభాగంలో పని చేసిన తరువాత జోన్ కమ్యూనికేషన్ విభాగానికి బదిలీ అయ్యాడు. పోలీసులు హత్య చేసే వరకు ఆయన కమ్యూనికేషన్ విభాగంలోనే తన సేవలందించాడు. తను అమరుడయ్యేనాటికి దక్షిణ సబ్ జోనల్ కమ్యూనికేషన్ విభాగానికి ఇన్ చార్జ్ గా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన పార్టీ క్యాడర్లతో, ప్రజలతో ఎల్లప్పుడు కలిసిమెలిసి ఉండేవాడు. గత 22 సంవత్సరాల‌ తన విప్లవ జీవితంలో పట్టుదలతో, విరామం ఎరుగని శ్రమతో కామ్రేడ్ శోభరాయ్ అందించిన సేవలను విప్లవోద్యమం సదా గుర్తుంచుకుంటుంది.

కేంద్రంలోని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం మోడీ మార్గదర్శకత్వంలో ఛత్తీస్ గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజా వ్యతిరేక భూపేష్ బఘేల్, కేసీఆర్ ప్రభుత్వాలు మా పార్టీ, పీఎల్‌జీఏ, జనతన సర్కార్లను, ప్రజా సంఘాలను నిర్మూలించేందుకు సమాధాన్ ప్రహార్ దాడులను గత నవంబర్ నుండి మునుపెన్నడూ లేనంతగా వేగవంతం చేశాయి. ఈ దాడుల్లో భాగంగా దండకారణ్యంలో పోలీసు, అర్ధ సైనిక, సైనిక, కమాండో బలగాలతో క్యాంపులను పెంచడం, కూంబింగ్లు, చుట్టుముట్టి అణచివేత దాడులు, డ్రోన్ దాడులు సహా మరెన్నో కుట్రపూరితమైన, మోసపూరితమైన పద్ధతులను చేపడుతున్నారు.

మావోయిస్టు నాయకులకు, కార్యకర్తలకూ కొరోనా సోకిందనీ, విషపూరిత ఆహారంతో తీవ్ర అనారోగ్య పాలవుతున్నారనీ, వైద్య సౌకర్యం దొరకక చాలమంది మరణించారని పోలీసులు నీచమైన, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. దీనితో పాటు పోలీసు అధికారులు తమ చేతికి చిక్కిన వారిని హత్య చేస్తూనే కరోనాను సాకుగా చూపుతూ సరెండర్ కావాలనీ, సరెండర్ అయితే మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తామని ప్రలోభ పెడుతున్నారు.

వాస్తవానికి జెనీవా ఒప్పందపు సూత్రాలలో రసాయనిక పదార్థాలను వాడకూడదనే అంతర్జాతీయ యుద్ధ నియమాలను తుంగలో తొక్కి మా సరఫరా వ్యవస్థలోని అతి బలహీనమైన ఒక లింకు ద్వారా తిండి పదార్థాలలో విషం కలిపి నమ్మకస్తుల ద్వారా అందించడంతో కొద్ది మంది మా కామ్రేడ్స్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం వారిలో అత్యధికులు కోలుకున్నారు.

అత్యంత తీవ్ర అనారోగ్యం పాలయిన కారణంగా మెరుగైన వైద్య సేవల కోసం బయటకు పంపిన మా ఇద్దరు కామ్రేడ్లు అమానవీయంగా హత్య చేసిన ప్రభుత్వాలు ఒక వైపు కలుషిత ఆహారం ద్వారా మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు అనారోగ్యం పాలవుతున్నారనీ మరోవైపు కరోనా బాధితులయ్యారనీ పచ్చి అబద్ధాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్నాయి.

ప్రభుత్వాల ఈ అబద్ధపు ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మకూడదనీ, దీన్ని పెద్ద ఎత్తున ఖండించాల్సిందిగా విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి మానసిక యుద్ధంలో భాగంగా ప్రభుత్వాలు చేపడుతున్న పై మోసపూరిత, కూట్రపూరిత, అమానవీయ పద్దతులను గట్టిగా వ్యతిరేకించాలని మా పార్టీ ప్రజలకూ ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి చేస్తున్నది.

సమత
అధికార ప్రతినిధి,
దక్షిణ సబ్ జోనల్ బ్యూరో,
దండకారణ్యం,
భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు

Keywords : chattis garh, gaddam madhukar, death, adilabad, komram bheem, warangala, police, murder, samatha
(2024-06-23 01:51:47)No. of visitors : 2318

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్క‌రణ - భారీ బహిరంగ సభ

ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మావోయిస్టు