రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన‌


రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన‌

రాజకీయ

11-06-2021

కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది. భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడం కోసం, ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకై భారతీయ కిసాన్ యూనియన్( BKU) ఏక్తా (ఉగ్రహాన్) ఢిల్లీ సరిహద్దుల్లో ఈ ర్యాలీని నిర్వహించనుంది.

ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే UAPA, NSA మరియు దేశద్రోహం వంటి క్రూరమైన చట్టాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన ఆ సంఘం భీమా కోరెగావ్ అరెస్టులు జరిగి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు BKU పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి షింగారా సింగ్ మన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ముంబై జైళ్ళలో తప్పుడు ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న బికె 16 (భీమా కోరేగావ్ కేసులోని 16 మంది)ని విడుదల చేయాలని జాతీయ స్థాయిలో వివిధ ప్రజాస్వామ్య సంస్థలు ఇచ్చిన‌ పిలుపుకు BKU సంఘీభావం తెలిపింది. ప్రజల కోసం రచనలు చేసే, మాట్లాడే డజన్ల కొద్ది మేధావులు, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను తప్పుడు ఆరోపణలపై మోడీ ప్రభుత్వం జైలులో పెట్టిందని షింగారా సింగ్ మన్ ఆరోపించారు. ʹʹభీమా కోరేగావ్ కేసులో మేధావులను అరెస్టు చేసి మూడేళ్ళు అయింది, వారి విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. వారిలో అనేక మంది వృద్ధులు ఎన్నో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. జైళ్ళలో కోవిడ్ మహమ్మారి తీవ్రంగా విస్తరించినప్పటికీ వారికి బెయిల్ కూడా ఇవ్వ‌లేదు. ప్రభుత్వం వారి ఆరోగ్య పరిస్థితులపై శ్రద్ధ చూపడం లేదు. వాళ్ళు జైలులోనే చనిపోయేలా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అనేక మంది ఢిల్లీ జైళ్లలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్నవారిలో నటాషా నార్వాల్ వంటి యువతుల నుండి స్టాన్ స్వామి వంటి వృద్ధ పాస్టర్ల వరకు ఉన్నారు.ʹʹ అని సింగ్ అన్నారు.

ప్రభుత్వ మత ఫాసిస్ట్ విధానాల గురించి అవగాహన కల్పిస్తున్నారని ఆ మేదావులను అరెస్టు చేశారు. వారిలో చాలా మంది గత అనేక దశాబ్దాలుగా ఆదివాసులు, పేద రైతులు, దళితులు, మహిళలు, ఇతర కార్మిక వర్గాల హక్కుల కోసం మాట్లాడుతున్నారు, రచనలు చేస్తున్నారు, పోరాడుతున్నారు. వారిని నిర్బంధించడం ద్వారా, సమాజంలోని ఈ వర్గాల మనస్సులలో భయాన్ని కలిగించాలని, ఆ మేదావులను ప్రజల నుండి దూరం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఎంతగా అంటే, వారి విడుదల కోరుకునే ప్రతి గొంతును మావోయిస్టు లేదా దేశద్రోహి అని ముద్ర వేస్తారు. అరెస్టు చేసిన మేధావులను విడుదల చేయడం, ఈ క్రూర‌ చట్టాలను రద్దు చేయడం, ప్రజాస్వామ్య హక్కుల‌ను, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడం కోసం జూన్ 13 న జరిగే ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొనాలని షింగారా సింగ్ మన్ అన్ని వర్గాల ప్రజలకు, సంస్థలకు విజ్ఞప్తి చేశారు.

జూన్ 13 న జరిగే ఈ సభలో పంజాబ్‌కు చెందిన ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు, రచయితలు, కళాకారులు పాల్గొంటారు. ప్రజాస్వామ్య హక్కుల మండలి ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ (షహీద్ భగత్ సింగ్ మేనల్లుడు), ప్రోగ్రెసివ్ రైటర్స్ యూనియన్ నుండి సుఖ్ దేవ్ సింగ్ సిర్సా, డాక్టర్ నవ్‌షరన్, నాటక రచయిత డాక్టర్ సాహిబ్ సింగ్, ప్రముఖ కవి సుర్జిత్ జడ్జి, రచయిత జస్పాల్ మంఖేరా, న్యాయవాది ఎన్‌కె జీత్, థియేటర్ ఆర్టిస్ట్ కమల్ బర్నాలా తదితరులు పాల్గొంటారని భారతీయ కుసాన్ యూనియన్ (BKU )ఏక్తా (ఉగ్రహాన్) పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి షింగారా సింగ్ మన్ తెలియజేశారు.

Keywords : BK16, BKU, Ugrahan, Ektha, punjab, delhi, jail,Release jailed intellectuals and Repeal Black laws
(2023-01-29 08:16:36)No. of visitors : 1357

Suggested Posts


bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ

భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ ‍ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది.

UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి

భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన

స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది.

Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌

భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది.

భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?

భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న‌16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు.

హ‌నీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది.

Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర

బీమా కోరేగాం ఎల్గార్ ప‌రిష‌ద్ కేసులో అరెస్ట‌యి జైలు నిర్భంధంలో ఉన్న హ‌క్కుల సంఘాల నేత‌లు, మేధావులు మ‌రో ప్ర‌మాద‌క‌ర‌మైన స‌వాలును ఎదుర్కోబోతున్నారు. వారిని త‌లోజా జైలునుంచి మ‌హారాష్ట్ర‌లోని వివిధ జైళ్ల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా

ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది.

Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన

నా వయస్సు 70 ఏళ్లు పైన ఉంటుంది. నేను ఢిల్లీలో నివసిస్తున్నాను. నవ్‌లఖాతో కలవడానికి జైలు అధికారులు అనుమతిచ్చే పది నిమిషాల వ్యవధిలో అతడిని కలవడానికి నవీ ముంబైలోని తలోజా జైలుకు ప్రయాణించడం నాకు చాలా కష్టం.

Search Engine

పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
more..


రాజకీయ