సినీ నటిపై దేశ ద్రోహం కేసు

సినీ

11-06-2021

సేవ్ లక్ష ద్వీప్ నినాదం ఆ ద్వీపంలో అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ గా ప్రఫుల్ కోడా పటేల్ నియమితులైన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆ ద్వీప పర్యావరణాన్ని, ప్రజల సంస్కృతిని నాసనం చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రజలు నిరసనలకు నడుం భిగించారు. ఈ నేపథ్యంలో లక్షద్వీప్ లోని చెతియాత్ ద్వీపానికి చెందిన‌ సినీ నటి, నిర్మాత ఐషా సుల్తానా లక్షద్వీప్ కు మద్దతుగా గళమెత్తారు. పటేల్ వచ్చాక లక్షద్వీప్ పరిస్థితి దారుణంగా తయారయ్యిందని ఆమె ఆరోపించారు. పటేల్ రాక ముందు వరకు లక్షద్వీప్ లో ఒక్కరికి కూడా కరోనా సోక లేదని, ఒక్క కోవిడ్ 19 పాజిటీవ్ కేసూ నమోదు కాలేదని, పటేల్ వచ్చాక తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా వ్యాపించిందని ఆమె మండి పడ్డారు. ఓ మలయాళ టీవీ ఛానల్ లో చర్చలో పాల్గొన్న ఆమె...

"లక్షద్వీప్‌లో కోవిడ్ -19 కేసులు 0 ఉండేవి. ఇప్పుడు, రోజుకు 100 కేసులు వస్తున్నాయి. కేంద్రం ప్రయోగించినది బయో ఆయుధం. కేంద్ర ప్రభుత్వం బయో ఆయుధాన్ని ప్రయోగించిందని నేను స్పష్టంగా చెప్పగలను" అని ఐషా ఆరోపించారు.
దీంతో ఆమెపై లక్షద్వీప్ బీజేపీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. ఆ పిర్యాదు ఆధారంగా పోలీసులు ఐషా పై దేశద్రోహం కేసు నమోదు చేశారు.

కవరట్టి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఐషా సుల్తానాపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ఎ (దేశద్రోహం) మరియు 153 బి (ద్వేషపూరిత ప్రసంగం) కింద కేసు నమోదైంది.

ఈ విషయంపై ఆమె ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. తనపై దేశద్రోహ కేసు నమోదు చేసినట్లు రాశారు. ʹఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అయితే, నిజం మాత్రమే విజయం సాధిస్తుంది. ఫిర్యాదు చేసిన బిజెపి నాయకుడుది లక్షద్వీపే. అతను తన భూమిలి ద్రోహం చేస్తున్నాడు. నేను దాని కోసం పోరాటం కొనసాగిస్తాను. రేపు, ద్రోహం చేసిన వారు ఒంటరిగా ఉంటారు, ʹఅని ఐషా సుల్తానా అన్నారు.

"లక్షద్వీప్ ప్రజలకు: సముద్రం మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు సముద్రాన్ని రక్షిస్తారు. ద్రోహం చేసిన వారికి భయం ఉంది కాని మనకు లేదు. నేను నా గొంతు వినిపిస్తూనే ఉంటాను. ఇప్పటి నుండి నా గొంతు మరింత బిగ్గరగా ఉంటుంది ʹఅని ఆమె రాసింది.
కాగా ఐషా సుల్తానా పై దేశద్రోహం కేసు నమోదు చేయడం పట్ల ద్వీపంలో నిరసనలు వినిపిస్తున్నాయి. అక్కడి ప్రజలు, మేదావులు ఆమెపై పెట్టిన కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Keywords : lakshadweep, malayalam, Aysha Sulthana, Sedition case, Sedition case filed against Lakshadweep actor-model Aisha Sultana for ʹbio-weaponʹ remark
(2024-04-25 00:14:39)



No. of visitors : 678

Suggested Posts


భారత్ దేశ ప్రభుత్వం లక్షద్వీప్ లోని అతి పురాతన న్యూస్ పోర్టల్ ద్వీప్ డైరీని ఎందుకని నిషేధించింది?

గత కొన్ని రోజుల నుండి, #SaveLakshadweep కేంపెయిన్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఆహారపు అలవాట్లు, ద్వీపాల మత సంస్కృతి, భూ హక్కులు, పంచాయతీ ఎన్నికల అభ్యర్థిత్వానికి కుటుంబ నియంత్రణ,

SaveLakshaDweep: సేవ్ లక్ష ద్వీప్ - నిరసనల హోరు

లక్షద్వీప్ ను రక్షించుకునేందుకు సాగుతున్న ఉద్యమాన్ని అక్కడి ప్రజలు ఉదృతం చేశారు. ఈ రోజు (సోమవారం) 12 గంటల పాటు నిరాహార ధీక్షలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ నాయకుడు,

lakshadweep సినీ నటిపై దేశద్రోహం కేసు - పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసిన బీజేపీ నాయకులు

లక్షద్వీప్ కు చెందిన సినీ నటి, నిర్మాత ఐషా సుల్తానా (Aisha Sultana)పై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీకి మూకమ్మడి రాజీనామాలు చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సినీ