lakshadweep సినీ నటిపై దేశద్రోహం కేసు - పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసిన బీజేపీ నాయకులు

lakshadweep

12-06-2021

(lakshadweep )లక్షద్వీప్ కు చెందిన సినీ నటి, నిర్మాత ఐషా సుల్తానా (Aisha Sultana)పై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీకి మూకమ్మడి రాజీనామాలు చేశారు. ఆమెపై కేసు బీజేపీ (BJP)లక్షద్వీప్ అధ్యక్షుడు సి. అబ్దుల్ ఖాదర్ హాజీ (C. Abdul Khader Haji ) చేసిన పిర్యాదు ఆధారంగానే పోలీసులు నమోదు చేశారు.

లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ గా ప్రఫుల్ ఖోడా (Praful Khoda Patel)పటేల్ నియమితులైన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల పర్యవసనంపై ఆ ద్వీప ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన నిర్ణయాల వల్లే ఒక్క కరోనా కేసు కూడా లేని లక్షద్వీప్ లో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోయాయని ఆరోపణలున్నాయి. అంతే కాక ఆయన తీసుకవస్తున్న చట్టం వల్ల లక్షద్వీప్ పర్యావరణం దెబ్బ తింటుందని, ప్రజల సంస్కృతి నాశ‌నమవుతుందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
పటేల్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో కొంత కాలంగా అక్కడ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చలో సినీ నటి, నిర్మాత ఐషా సుల్తానా ప్రఫుల్ ఖోడా పటేల్ ను తీవ్రంగా విమర్షించింది. ఆయనను లక్షద్వీప్ ప్రజలపై బీజేపీ ఎక్కుపెట్టిన జీవాయుధమని ఆమె అభివర్ణించారు. ఆమె కామెంట్ల‌పై లక్షద్వీప్ బీజేపీ అధ్యక్షుడు సి. అబ్దుల్ ఖాదర్ హాజీ పోలీసులకు పిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఆమెపై దేశద్రోహ కేసు నమోదు చేశారు.

ఐషాపై దేశద్రోహ కేసు నమోదు చేయడాన్ని లక్షద్వీప్ లోని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. ఆమెపై కేసుకు కు నిరసనగా మేదావులు, ప్రజాస్వామిక వాదులు తమ గొంతు విప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకీ చెందిన పలువురు నాయకులు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాళ్ళలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ హమీద్ ముల్లిపుళ, వక్ఫ్ బోర్డు సభ్యుడు ఉమ్ముల్ కులూస్ పుతియపుర, ఖాదీ బోర్డు సభ్యుడు సైఫుల్లా పక్కియోడా, చెట్లట్ యూనిట్ కార్యదర్శి జబీర్ సలీహాత్ మన్జిల్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యకార్యకర్తలు ఉన్నారు.

లక్షద్వీప్ బీజేపీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీకి 12 మంది సభ్యుల‌ బృందం ఈ మేరకు ఓ లేఖ రాసింది. అందులో....ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ చర్యలు ప్రజా వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉన్నాయని పార్టీ మొత్తానికి తెలుసు అని వారు పేర్కొన్నారు. పటేల్ పనితీరు విధానం గురించి పలువురు పార్టీ నాయకులు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు సమర్పించారని వారు హాజీకి గుర్తు చేశారు. "లక్షద్వీప్ యొక్క పలువురు బిజెపి నాయకులు పర్ఫుల్ పటేల్, జిల్లా కలెక్టర్లు అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ఇప్పటికే మాట్లాడారని మీకు తెలుసు" అని లేఖలో వారు రాశారు.

"మీరు చెతియత్ (సుల్తానా ఐషా నివాస ద్వీపం) సోదరిపై తప్పుడు మరియు అన్యాయమైన ఫిర్యాదు చేసారు. ఆమె కుటుంబాన్ని మరియు ఆమె భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై మేము మా దృడమైన‌ అభ్యంతరాన్ని తెలియజేస్తూ బీజేపీ లో మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించాము, ʹ అని వారు లేఖలో పేర్కొన్నారు.

కాగా లక్షద్వీప్ ప్రజలు చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్త మద్దతు వస్తున్నది. సోషల్ మీడియాలో ʹసేవ్ లక్షద్వీప్ʹ అనే నినాదం వైరల్ అయ్యింది. ప్రఫుల్ పటేల్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి కూడా కేంధ్రానికి లేఖ రాశారు. లక్షద్వీప్ ప్రజలు అనేక రోజులుగా తమ నిరసన ప్రదర్శనలను అనేక రూపాల్లో కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై కేంధ్రం మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు.

Keywords : Lakshadweep, aisha sultana, BJP, paraful khoda patel, Over Dozen BJP Workers Resign to Protest Sedition Case Against Filmmaker
(2024-04-25 00:14:17)



No. of visitors : 550

Suggested Posts


భారత్ దేశ ప్రభుత్వం లక్షద్వీప్ లోని అతి పురాతన న్యూస్ పోర్టల్ ద్వీప్ డైరీని ఎందుకని నిషేధించింది?

గత కొన్ని రోజుల నుండి, #SaveLakshadweep కేంపెయిన్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఆహారపు అలవాట్లు, ద్వీపాల మత సంస్కృతి, భూ హక్కులు, పంచాయతీ ఎన్నికల అభ్యర్థిత్వానికి కుటుంబ నియంత్రణ,

సినీ నటిపై దేశ ద్రోహం కేసు

పటేల్ రాక ముందు వరకు లక్షద్వీప్ లో ఒక్కరికి కూడా కరోనా సోక లేదని, ఒక్క కోవిడ్ 19 పాజిటీవ్ కేసూ నమోదు కాలేదని, పటేల్ వచ్చాక తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా వ్యాపించిందని ఆమె మండి పడ్డారు. ఓ మలయాళ టీవీ ఛానల్ లో చర్చలో పాల్గొన్న ఆమె...

SaveLakshaDweep: సేవ్ లక్ష ద్వీప్ - నిరసనల హోరు

లక్షద్వీప్ ను రక్షించుకునేందుకు సాగుతున్న ఉద్యమాన్ని అక్కడి ప్రజలు ఉదృతం చేశారు. ఈ రోజు (సోమవారం) 12 గంటల పాటు నిరాహార ధీక్షలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ నాయకుడు,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


lakshadweep