వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు


వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు

వేటకు

13-06-2021

జార్ఖండ్‌, లతేహర్ జిల్లాలోని గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకూ-పిరీ అడవిలో వేట కోసం వెళ్ళిన‌ ఆదివాసీ యువకుల పై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిరి నివాసి 23 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు, అదే గ్రామానికి చెందిన దీనానాథ్ సింగ్ గాయపడ్డాడు.

గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వేట కోసం అడవికి వెళ్తున్నప్పుడు భద్రతా దళాలు యువకుడిని కాల్చి చంపాయని, మరణించిన బ్రహ్మదేవ్ సింగ్ తండ్రి సుశీల్‌చంద్ర సింగ్‌తో సహా పలువురు గ్రామస్తులు చెప్పారు. మరణించిన యువకుడితో పాటు అదే గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్, సుకుల్ దేవ్ సింగ్, గోవింద్ సింగ్, రాజేశ్వర్ సింగ్, దిననాథ్ సింగ్ వెళ్ళారు. వారి వద్ద ʹభరూట్వ తుపాకీʹ (నాటు తుపాకీ)ఉందని గ్రామస్తులు అంటున్నారు.

యువత చేతులు పైకెత్తి, తాము మావోయిస్టులం కాదని చెప్పినప్పటికీ భద్రతా దళాలు కాల్పులు జరిపాయని గ్రామస్తులు అని చెప్పారు.

కుమాండి ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్, కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్ బృందం మావోయిస్టులపై సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు, పిరి అడవి సమీపంలో ఆయుధాలతో ఉన్న కొంతమంది యువకులు పోలీసులను చూడగానే కాల్పులు జరిపితే, పోలీసులు చేసిన తిరుగు కాల్పుల్లో ఒక యువకుడు మృతి చెందాడు, యువతతో వెళ్లిన 5 మంది యువకులను పట్టుకుని విచారిస్తున్నాం అనేది లతేహర్ ఎస్పీ ప్రశాంత్ ఆనంద్ కథనం.

వేటకు వెళ్లిన తాము ఒక జంతువును కనబడితే కాల్పులు జరిపామని యువకులు పోలీసులకు చెప్పారు. ఈ యువకుల నుండి 5 నాటు తుపాకులను (భరుట్వా బందూక్) కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఉదయమే, జార్ఖండ్‌లోని అన్ని ప్రధాన వార్తాపత్రికల (ప్రభాత్ ఖబర్, దైనిక్ భాస్కర్, దైనిక్ జాగరన్) వెబ్ పోర్టల్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు చనిపోయాడు, 4- 5 ఆయుధాలతో సహా అనేక సామాన్లు స్వాధీనం చేసుకున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ సాయంత్రం లతేహర్ ఎస్పీ ప్రకటన వచ్చిన తరువాత ఆ వార్తను తొలగించి, సవరించిన వార్తను వేశారు.

లతేహర్ ఎస్పీ, గ్రామీణ ఆదివాసీల ప్రకటన చూసిన తరువాత, భద్రతా దళాలు చాలా ఘోరంగా బాధ్యతారహితంగా ప్రవర్తించాయని స్పష్టంగా చెప్పవచ్చు.

కాల్పులు జరిపే ముందు వారి దుస్తులు, ఆయుధాల్ని చూడలేదా? అందరూ సివిల్ డ్రెస్‌లో ఉన్నారు, నాటు తుపాకీలతో ఉన్నారు. కాల్పులు జరపడానికి ముందు భద్రతా దళాలు కొంచెం మానవత్వం, నిజాయితీని చూపించి ఉంటే, ఈ రోజు ఒక అమాయక ఆదివాసీ యువకుడు మరణించేవాడు కాదు.

వాస్తవానికి, జార్ఖండ్‌లో మావోయిస్టుల పేరిట బూటకపు ఎన్‌కౌంటర్ల సుదీర్ఘ జాబితా ఉంది. ఈ రోజు వరకు ఏ సందర్భంలోనూ భద్రతా దళాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అందువల్ల కాల్పులు జరపడానికి ముందు దాని పరిణామాల గురించి భద్రతా దళాలు ఆలోచించడం లేదు. ఈ హత్య కేసులో భద్రతా దళాలపై జార్ఖండ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందో లేదో చూడాలి.

(janchowk.com సౌజన్యంతో)

Keywords : jharkhand, Jharkhand youth mistaken as Maoist, killed in retaliatory firing by security forces
(2021-09-23 05:50:15)



No. of visitors : 4575

Suggested Posts


అవును నేను మావోయిస్టునే..!

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి.

Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు....

demanding the immediate release of Damodar Turi

We strongly condemn the unlawful arrest of Damodar Turi (Central Convenor Committee member of Visthapan Virodhi Jan Vikas Andolan) by Jharakhand Police on 15 February 2018. And demand for immediate release for him.

వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు

చిరియాబెడా (అంజెడ్‌బెడా) గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు ʹహోʹ సముదాయానికి చెందినవారు. వీరు షెడ్యూల్డ్ తెగకు చెందినవారు, ʹహోʹ భాషలో మాట్లాడుతారు. సిఆర్‌పిఎఫ్ సిబ్బంది గ్రామస్తులను హిందీలో మాట్లాడమని ఒత్తిడి చేసి, వారు హిందీ మాట్లాడలేమని చెప్పినప్పుడు, కొట్టడం ప్రారంభించారు. అతి క్రూరంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లు పైకప్పుపై పనిచేస్తున్

ఆ ఆదివాసీ యువకుడిది ఎన్ కౌంటర్ కాదు హత్యే, సీఆర్పీఎఫ్ అధికారే దోషి - 9 ఏండ్ల తర్వాత తేల్చిన సీఐడి

గ్రామానికి చేరుకున్న వెంటనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు 20-22 మంది గ్రామస్తులను పట్టుకుని అందరి చేతులను వెనక్కు విరిచికట్టేసి, తమ వెంట తీసుకెళ్లి ఆ రాత్రి వారందరినీ వూరి బయట మైదానంలో వుంచి మర్నాడు జూన్ 29న తమ సామాన్లను బహదా అడవికి మోయించుకెళ్లారు. అక్కడ నుండి యింకా ముందుకు సామాను తీసుకెళ్లడానికి నిరాకరించడంతో మంగల్ హోన్‌హాగ్‌ను కాల్చి చంపారు.

RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI

PUDR condemns the arrest of anti-displacement activist and founder member of ʹVisthapan Virodhi Jan Vikas Andolanʹ (VJVA) Damodar Turi, on February 15, 2018 at Ranchi, an hour after the ʹLoktantra Bachao Manchʹ (Save Democracy Forum) organized meeting had ended.

Search Engine

న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌
300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
more..


వేటకు