include 'men';
?>
bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ
భీమా కోరేగావ్ (bhima koregaon) కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని, పేదల కోసమే పని చేసే వాళ్ళపై దేశద్రోహం కేసు మోపడం అన్యాయమని ఆమె ఆ వీడియోలో ఆవేదన వెలిబుచ్చారు.
ఆమె మాట్లాడిన మాటలు....
ʹʹనా పేరు సురేఖా గోర్కే. నేను సాగర్ గోర్కే తల్లిని. సాగర్ కు చిన్నప్పటి నుండి పాటలు పాడటమంటే చాలా ఇష్టం. స్కూల్ లో ఆ తర్వాత కాలేజ్ లో కూడా అతను పాటలు పాడేవాడు. డాన్స్ లు చేసే వాడు.కాలేజ్ లో కబీర్ కళా మంచ్ తో కలిసి పని చేశాడు. రమేష్, జ్యోతి తదితరులతో కలిసి అనేక స్టేజ్ షోలు కూడా చేశాడు. ఆ షోలు చూడటానికి మేము కూడా వెళ్ళే వాళ్ళం. అయితే మాకెప్పుడూ అతను పాడిన పాటల్లో, మాట్లాడిన మాటల్లో తప్పు కనిపించలేదు. తప్పును తప్పని, ఒప్పును ఒప్పని చెప్పేవాళ్ళు. నాకొడుకు హత్య చేయలేదు. ఎలాంటి నేరం చేయలేదు. అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. కబీర్ కళా మంచ్ కళాకారులందరిపైనా ఆ కేసులు పెట్టారు. ఎందుకలా చేస్తున్నారు. నా బిడ్డ ఏనాడూ ఎవ్వరితో కొట్లాట పెట్టుకోలేదు. అతను చెడ్డ పనులు చేస్తున్నాడని ఏ ఒక్కరూ అనలేదు.
జైల్లో కోవిడ్ విస్తరించింది. నా కొడుకుతో పాటు దాదాపు 50 మందిని ఒకే హాల్ లో పెట్టారు. ఎవరికి కరోనా ఉన్నదో ఎవరికి లేదో ఎలా తెలుస్తుంది. నా కుమారుడి ప్రాణాలకు ప్రమాదమున్నది. అతనికి కోవిడ్ వల్ల ఏమన్నా అయితే బాధ్యత ఎవరిది ? మేము చాలా ఆందోళనలో ఉన్నాము. బైట ఉన్న మేమే కోవిడ్ వల్ల భయం భయం గా జీవిస్తున్నాము. ఇక జైల్లో కోవిడ్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ పరిస్థుతుల్లో వాళ్ళందరినీ విడిచి పెట్టాలని నా వినతి. వాళ్ళేం నేరం చేయలేదు. మేము చాలా పేదవాళ్ళం కూలీ చేసుకుంటే తప్ప మా కడుపు నిండదు. కోవిడ్ వల్ల మాకు ఏ పనీ లేదు. ఇంట్లోనే ఉండాల్సి వస్తున్నది. నా కుమారుడికి సహాయం కూడా చేయలేని పరిస్థితి మాది. నా కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు. అతను ఎవరినీ చంపలేదు, దొంగతనం చేయలేదు. మా వృద్దాప్యంలో మాకు ఆసరాగా ఉండాల్సిన వాడు.....
మీ అందరికి నాదొక విన్నపం. మా పిల్లలు ఎవరి కోసం పని చేశారు ? ప్రజల కోసమే పని చేశారు. పూరి గుడిశెల్లో నివసించే వారి కోసం పని చేశారు. వాళ్ళ కోసం మీరు గొంతు విప్పి మాట్లాడాలి.ʹʹ
Keywords : BK16, VARAVARARAO, #FreeKKM, KABIR KALAMANCH, PUNE, MUMBAI, ARREST, bhima koregaon, sedition, sagar gorkhe, SUREKHA GORKHE
(2025-01-16 00:07:07)
No. of visitors : 2628
Suggested Posts
| భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది. |
| రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన
కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది. |
| UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన |
| భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. |
| స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలుభీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది. |
| Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన
భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది. |
| హనీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు
భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది. |
| Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర బీమా కోరేగాం ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయి జైలు నిర్భంధంలో ఉన్న హక్కుల సంఘాల నేతలు, మేధావులు మరో ప్రమాదకరమైన సవాలును ఎదుర్కోబోతున్నారు. వారిని తలోజా జైలునుంచి మహారాష్ట్రలోని వివిధ జైళ్లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. |
| కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది. |
| Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
నా వయస్సు 70 ఏళ్లు పైన ఉంటుంది. నేను ఢిల్లీలో నివసిస్తున్నాను. నవ్‌లఖాతో కలవడానికి జైలు అధికారులు అనుమతిచ్చే పది నిమిషాల వ్యవధిలో అతడిని కలవడానికి నవీ ముంబైలోని తలోజా జైలుకు ప్రయాణించడం నాకు చాలా కష్టం. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..