Sharmistha:కామ్రేడ్ షర్మిస్టా చౌదరికి విప్లవ జేజేలు - ప్రగతిశీల మహిళా సంఘం
17-06-2021
సిపిఐ (ఎం-ఎల్) రెడ్ స్టార్ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మహిళా విభాగం ఆల్ ఇండియా రివల్యూషనరీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (ఎయిర్‌వో) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ షర్మిస్ట ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందుతూ ప్రగతిశీల మహిళా సంఘం (pow) జాతీయ కార్యవర్గం నుండి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాము. ఆమె పని చేస్తున్న పార్టీ, సంస్థలలో ఆమె సహచరులందరికీ సంఘీభావం తెలియజేస్తున్నాము. గత నాలుగు నెలల నుండి ఆమె అనారోగ్యంతో ఉన్నట్లుగా, నెల క్రితం వచ్చిన కోవిడ్ నుండి కోలుకున్నప్పటికీ అనారోగ్యం తీవ్రతరం కావడంతో ఆమెను కోల్‌కతాలోని ఎస్ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్పించగా తీవ్రమైన గుండెపోటు వచ్చి 47 ఏళ్లకే చివరి శ్వాస విడిచింది అని మిత్రుల ద్వారా తెలిసి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆమె జీవిత భాగస్వామి కామ్రేడ్ అలీక్ చక్రవర్తికి, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు మా సంతాపాన్ని, సానుభూతిని తెలియచేస్తున్నాం.
కమ్యూనిస్ట్ విప్లవోద్యమంలో పనిచేసిన షర్మిస్టా పూర్తి సమయం విప్లవ రాజకీయ కార్యకర్తగా మారడానికి ముందు ʹది టెలిగ్రాఫ్ʹ లో జర్నలిస్టుగా చేస్తున్న తన ఉద్యోగాన్ని వదిలివేసింది. ఒక విప్లవ కార్యకర్తగా షర్మిస్టా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. బెంగాల్‌లో ప్రజా ఉద్యమాలతో లోతైన సంబంధం కలిగి ఉన్న ఆమె కుల,వర్గ అణచివేతలకు, బలవంతపు భూసేకరణకు, నిర్వాసిత సమస్యలకు వ్యతిరేకంగా పోరాడారు. సింగూర్, నందిగ్రామ్, లాల్‌గడ్, నోనాదంగా, భంగర్ .ప్రాంతాలలో ప్రజల పోరాటాలకు మద్దతుగా నిలిచారు.
దేశవ్యాప్తంగా లైంగిక వేధింపులకు, రాజ్యహింసకు, అణచివేతకు వ్యతిరేకంగా ఏర్పడిన WSS సంస్థలో భాగస్వామ్యం తీసుకున్నది. దానిలో భాగంగా బస్తర్ నుండి నందిగ్రామ్ వరకు జరిగిన నిజనిర్ధారణలో పాల్గొని, డాక్యుమెంటేషన్ కృషిలో భాగం పంచుకున్నది.
కామ్రేడ్ షర్మిష్ట దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక మహిళా ఉద్యమాలలో ముఖ్య భూమిక పోషిస్తూ వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో వెనిజులా,జర్మనీ,నేపాల్ దేశాలలో నిర్వహించిన మహిళా సదస్సులలో పాల్గొనారు. ఆమెతో, ఇతర మహిళా సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రగతిశీల మహిళా సంఘం (pow) జాతీయ కార్యవర్గం నేపాల్ లో జరిగిన ప్రపంచ సోషలిస్టు మహిళా సదస్సులో పాలు పంచుకున్నది.
భారతదేశంలో, విప్లవాత్మక మహిళా ఉద్యమంలో ఒకదశలో ఫ్రంట్‌లైన్ నాయకురాలిగా నిలిచిన షర్మిస్టా ʹమార్క్సిజం అండ్ ది ఉమెన్స్ క్వశ్చన్ʹ పై సమర్పించిన పత్రం విప్లవ మహిళా పోరాటాలకు ఒక ముఖ్యమైన దృక్పథం, అవగాహన అందించేదిగా గుర్తింపు పొందింది. 2018, బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ మహిళా విముక్తి సదస్సులో షర్మిస్టా కీలక భాగస్వామ్యం తీసుకున్నారు.
అందులో, ప్రపంచంలోని అనేక దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొని వర్ణ, వర్గ, లింగ, అసమాన సమాజంలో మహిళలు నిర్వహించాల్సిన పాత్రపై చర్చించారు. ఆకాశంలో సగం, భూమి మీద సగం, మానవ ఉత్పత్తి, పునరత్పత్తిలో, మహిళల పాత్ర పై ఆ అనేక తీర్మానాలు చేయడంలో కామ్రేడ్ షర్మిష్ట ముఖ్య భూమిక పోషించారు. మహిళా సమస్యలపై దేశ-విదేశ పత్రికల్లో అనేక వ్యాసాలు .ఆమె రాశారు..
ఇటీవల, పశ్చిమబెంగాల్లో 24 పరగణాల జిల్లా, భంగర్ ప్రాంతంలో పవర్ గ్రిడ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం ఆ ప్రాంత ప్రజలు మహత్తర భూ పోరాటం, జీవావరణ ఉద్యమం జరపటానికి నాయకత్వం వహించిన వారిలో కామ్రేడ్ షర్మిష్ట అగ్రగణ్యురాలు. నిర్బంధాలతో ఉద్యమ అణచివేతకు పూనుకున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెపై "ఉపా" చట్టం పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టినప్పటికీ ధృడంగా నిలబడి పీడిత ప్రజానీకానికి అండదండగా నిలబడ్డారు. మహిళా ఉద్యమంతో పాటు అసంఘటిత రంగ కార్మికులు,జ్యూట్ పరిశ్రమలో కార్మికుల ఉద్యమంలో పాల్గొని షర్మిస్టా నాయకత్వం వహించారు.
ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అనేక అట్టడుగు .పోరాట సంస్థలతో కలిసి ఎన్‌ఆర్‌సి పీపుల్స్ మూవ్‌మెంట్ వేదికను ఏర్పాటు చేయడానికి కృషిచేశారు. ʹజోమి జీబికా కమిటీʹకి ప్రాతినిధ్యం వహించారు. దేశవ్యాపిత ప్రజా నిరసనలను ఎదుర్కుంటున్న రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, దేశద్రోహమైన చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ బెంగల్లో సాగిన ప్రజా ఉద్యమంలో ముఖ్య భూమికను నిర్వహించారు. 2021, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా ʹనో ఓటు టు బిజెపిʹ నినాదంతో ఏర్పడిన ఫాసిస్ట్ వ్యతిరేక పౌర సమాజ ఉద్యమ వేదికకు ఎన్నుకున్న 40 మంది కన్వీనర్‌లలో ఆమె ఒకరు.
భారతదేశ విప్లవోద్యమంలో అసమాన ప్రతిభ ఉన్న కొద్దిమంది మహిళా నాయకులలో ఒకరైన కామ్రేడ్ షర్మిష్ఠ చౌదరి మరణం అఖిల భారత విప్లవ మహిళా సంస్థ (Airwo)కి, సిపిఐ (ఎంఎల్) రెడ్ స్టార్ పార్టీకి మాత్రమే కాకుండా మహిళా విముక్తి కై పోరాడే అన్ని శక్తులకు, విప్లవ కమ్యూనిస్టులకు, జాతీయ, అంతర్జాతీయ, ప్రగతిశీల శక్తులకు గొప్ప లోటుగా భావిస్తున్నాం. ఆ కామ్రేడ్ మరణంతో ఏర్పడ్డ లోటును పూరించవల్సిన బాధ్యత మహిళా ఉద్యమంపై ఉన్నదని తెలియజేస్తూ... కామ్రేడ్ షర్మిస్టాకు ప్రగతిశీల మహిళా సంఘం (pow) జాతీయ కార్యవర్గం రెడ్ సెల్యూట్ తెలుపుతున్నది.
(Sandhya Pow ఫేస్ బుక్ నుండి....)
Keywords : cpi (ml) red star, sharmishta, deth, martyr, POW, CPI (ML) Red Star Leader Sharmistha Choudhury Dies of Post-Covid Complications
(2024-09-06 12:34:30)
No. of visitors : 1086
Suggested Posts
| కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీజాదవ్ పూర్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సహకారంతో ఏబీవీ సృష్టించిన హింసాకాండను వ్యతిరెకిస్తూ... ప్రజాస్వామ్యంపై కాషాయ మూక చేస్తున్న దాడులను నిరసిస్తూ....విద్యార్థిలోకం గర్జించింది. వాళ్ళకు మద్దతుగా ప్రజలు కదం తొక్కారు. |
| అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటనసిద్దాంతపరంగా శత్రువులమని చెప్పుకునే సీపీఎం, బీజేపీ లు ఎన్నికల రాజకీయాల్లో మాత్రం దోస్తానా చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి సిద్దాంతాలు అవసరం లేదని భావిస్తున్నట్టున్నాయి ఆ రెండు పార్టీలు. పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో త్రుణమూళ్ కాంగ్రెస్ ను ఓడించడం కోసం |
| జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ లో ఓ విద్యార్థిపై కాషాయమూక విరుచుకుపడింది. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేసింది. |
| కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గిఅమరుడు కిషన్ జీ నాయకత్వంలో పీడితులు మహత్తర పోరాటాలు చేసిన పశ్చిమ బెంగాల్ జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ అగ్గి రాజుకుంటోంది. జంగల్ మహల్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ లు తీవ్రతరం చేశారు. |
| విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్య - ఇది రాజ్య ఉగ్రవాదమే అని ప్రజా సంఘాల ఆరోపణప్రజా ఉద్యమ కార్యకర్త, విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. |
| జైల్లో రాజకీయ ఖైదీ సుశాంత్ శీల్ మృతి.... ప్రభుత్వానిదే బాధ్యత అని CRPP ప్రకటనజైలు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సుషాంత్ షీల్ అనే రాజకీయ ఖైదీ డమ్ డమ్ కేంద్ర కారాగారంలో ఈ మధ్యాహ్నం ( 16 - 6 - 2020 ) మరణించారు. అతని మరణవార్తను అధికారికంగా ధృవీకరించనప్పటికీ సుషాంత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి, విచారానికి లోనవుతున్నాం. |
| భిన్నాభిప్రాయాలపై దాడికి తీవ్ర ప్రతిఘటన ఉంటుంది.. ప్రాణాలకు తెగించే ప్రజలున్నారు - అమర్త్యసేన్ప్రజాస్వామ్యమంటే కేవలం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యంలో అందరి ప్రయోజనాలకు చోటుంటుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ ఉద్ఘా టించారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని |
| కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాల యంలో గురువారంనాడు ఏబీవీపీ నిర్వహించిన సెమినార్ కు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో హాజరయ్యి మైనార్టీల ఉద్దేశాలను తాము పట్టించుకోబోమనీ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని, మూక దాడులను ప్రతిసారీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే రీతిలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రోహోదగ్రులై నిరసన వ్యక్త |
| బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు
పశ్చిమ బెంగాల్ భీర్భూమ్ జిల్లాలోని ఓ కుగ్రామం బరోమాసియాకు చెందిన సునీతా హన్స్ధా ఇప్పుడు గుండె పగిలి ఏడుస్తున్నది. తరతరాలుగా ఆ భూమిపై వ్యవసాయం చేస్తూ తుకున్న తమను భూమిని వదిలి వెళ్లిపోవాలని అంటున్నారని కన్నీరు పెట్టుకుంటున్నది. |
| UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోందిఅక్టోబర్ 12వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో, రాజకీయ కార్యకర్త టిప్పు సుల్తాన్‌ను శాంతినికేతన్‌లోని గురుపల్లిలో వున్న అతని ఇంటి నుండి పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు. |