ఈ హత్యలను మీరెందుకు ప్రశ్నించడం లేదు? - పద్మకుమారి

ఈ

21-06-2021

విశాఖపట్నం జిల్లా కొయ్యూరు అడవుల్లో ఈ నెల 16న బుధవారం ఆరుగురు మావోయిస్టులను పోలీసులు హత్య చేశారు. ఇందులో ఇద్దరు మగవాళ్లు. నలుగురు అమ్మాయిలు.

వీళ్లలో బహుశా సందె గంగన్న ఇరవై ఏళ్లకు పైగా అజ్ఞాత విప్లవోద్యమంలో పని చేశాడు. సీనియర్ నాయకుడు. ఈ ఎన్కౌంటర్లో అమరులైన మిగతా అందరూ విప్లవాన్ని కలగని, నిజం చేయగల నవ యవ్వన సాహసంతులు. పాతికేళ్లలోపు వాళ్లే. ఫేస్బుక్లో వాళ్ల మృతదేహాలు చూడండి. మరణంలోనూ ఆ స్వప్నాలు వసివాడలేదు. జీవించి ఉన్న వాళ్లకు అవి ఏ ప్రశ్నలు సంధిస్తున్నాయో పరిశీలించండి.

విప్లవంలోకి యువత రావడం లేదనే అసంతృప్తితో పెదవి విరిచే వాళ్లు మన చుట్టూ ఎందరో ఉన్నారు. వీళ్లే కాదు, ఏ ఎన్కౌంటర్లో బలైపోయిన వాళ్ల వయసులనైనా లెక్కించండి. దాదాపు అందరూ ఆ వయసు వాళ్లే ఉంటారు. దేశాన్ని విముక్తం చేయగల ధీరోదాత్త యువతరం కనిపిస్తుంది. అందులో కూడా సగం మంది యువతులే.

వాళ్లను వెంటాడి ఎందుకు చంపేస్తున్నారని రాజ్యాన్ని స్త్రీవాదులు అడగలేకపోతున్నారు? ఆదివాసులు కాబట్టే మీకు పట్టింపు లేదోమో చూసుకోండి. వాళ్లను రాజ్యం జంతువులను వెంటాడినట్లు వేటాడుతున్నా ఆదివాసులనే అలసత్వం మీకుందేమో పరీక్షించుకోండి. సమాజానికి, చరిత్రకు, చివరికి విప్లవానికి పురుష కోణం ఉంటుందని చెప్పిన ఫెమినిస్టులు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. వాళ్లు అందరినీ ప్రశ్నించారు. అన్నిటినీ నిలదీశారు. లైంగిక దోపిడీ, స్త్రీ పురుష వివక్ష, కనిపించని పితృస్వామ్య అణచివేత రూపాలను ఎన్నిటినో ఆవిష్కరించారు. ఇంతా చేసి ఇప్పుడేమైపోయారు. స్త్రీవాదం అందరినీ స్త్రీల విషయంలో సున్నితంగా ఆలోచింపజేసిందని అంటారు. నిజమే. చాలా చేసింది. అన్నీ చేసి ఇప్పుడు బండబారిపోయిందనుకోవాలా?

కొయ్యూరులో ఈ నెల 16న జరిగినట్లాంటి ఘటనలు దాదాపు రోజూ జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ తర్వాత కూంబింగ్లో భాగంగా 18వ తేదీ చత్తీస్ఘడ్ లో మరో మహిళా మావోయిస్టును చంపేశారు. ఇలాంటి వాటిపై ఎన్నడూ స్త్రీవాదులు నోరు విప్పలేదు. స్త్రీల గురించి సమాజం ఆలోచించదని, మాట్లాడదని వాళ్లు చెప్పారు. స్త్రీలపై హింస సమస్యే కాదన్నట్లు దాచేస్తుందని గుర్తింపజేశారు. స్త్రీల అనుభవాలను, వాళ్లపై అమలయ్యే హింసను స్త్రీలే గుర్తించగలరని చెప్పారు. స్త్రీలు తమ విముక్తి కోసం పోరాటానికి సిద్ధం కావాలన్నారు. కానీ రాజ్యానికి పితృస్వామ్య స్వభావం ఉంటుందని అంగీకరించడం వాళ్లకు ఇష్టం లేదా? అని సందేహించాల్సి వస్తోంది. ప్రతిఘటనా పోరాటాల్లో ఉన్న మహిళలపై రాజ్యం లైంగిక దాడి కూడా చేస్తోంది. వాళ్ల అంగాంగాలను ఛిద్రం చేసి హత్య చేస్తోంది. ఈ హత్యాకాండలో మహిళలు అయినందు వల్ల మగ విప్లవకారుల కంటే అదనపు హింసను అనుభవించాల్సి వస్తోంది.

విప్లవంలో స్త్రీలపై ఇంత హింస అమలవుతున్నా ఇలాంటి విషయాల్లో స్త్రీవాదుల మౌనానికి అర్థం ఏమిటి. దాన్ని ఏమని చెప్పాలి? ఇప్పటికీ స్త్రీవాద దృష్టితో మంచి కథలు, కవిత్వాలు రాసేవాళ్లు చాలా మందే ఉన్నారు. వాటి మీద ఎన్నో పుస్తకాలు ప్రచురిస్తున్నారు. అలాంటి రచనలు ఇంకా రాయాలి కూడా. కానీ సైన్యం, పోలీసులు వందలాది మంది అమ్మాయిలను అత్యాచారాలు చేసి, దారుణంగా హింసించి చంపేస్తున్నా ఎందుకు చీమ కుట్టినట్టు అనిపించడం లేదని ప్రశ్నించడం తప్పవుతుందా? ఇంతగా స్పందన లేకపోవడాన్ని ఏమని పిలవాలి?

ఈ ఎన్కౌంటర్లో మరణించిన కామ్రేడ్ సందె గంగన్న ఆ ఇంట్లో నాలుగో అమరుడు. బీసీ కులానికి చెందిన వ్యక్తి. ఆయన సొంత అన్న రాజన్న విప్లవోద్యమంలో ప్రాణత్యాగం చేశాడు. పెద్దనాన్న కొడుకు సందె రాజమౌళి, మావోయిస్టుపార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. బూటకపు ఎదురు కాల్పుల పేర హత్యకు గురయ్యాడు. ఆయన సహచరి నేలకొండ రజిత పోలీసులతో వీరోచితంగా పోరాడుతూ చనిపోయింది. ఆమె ఆ రోజుల్లోనే పీపుల్స్ వార్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు. వీళ్లందరి తల్లుల అంతరంగం ఎట్ల ఉంటుందో స్త్రీవాదులకు అర్థమవుతుందా? స్త్రీలను విప్లవోద్యమం పట్టించుకోదని అపోహ ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున స్త్రీలు భాగమవుతున్నారు. మరి వాళ్లను ఇంత ఘోరంగా హత్య చేస్తుంటే ఎందుకు మీరు స్పందించడం లేదు? ఇది విప్లవోద్యమంలో పని చేస్తున్న మహిళల పరిస్థితే కాదు. ఉద్యమ ప్రాంతాల గ్రామాల్లోని సాధారణ మహిళలు కూడా ఈ హింస అనుభవిస్తున్నారు.

దళిత బహుజనులను విప్లవోద్యమం పట్టించుకోదని చాలా మంది ఆరోపిస్తుంటారు. ఫేస్బుక్ లో చర్చలు చేస్తుంటారు. కులాల చర్చలు చేసే దళిత బహుజన మేధావులకు, రచయితలకు గంగన్న మరణం దృష్టిలోకైనా వచ్చిందా? మీ కులాల లెక్కల ప్రకారమైనా మీకు ఆయన మరణం బాధ కలిగించి ఉండాలని ఆశించడం తప్పు కాదనుకుంటాను. బహుశా ఆయన విప్లవ రాజకీయాల్లో ఉన్నందు వల్లే ఈ హత్యాకాండ మీద మౌనం వహిస్తున్నారా? కనీస స్పందన కరువైందా? ఇలా అడగడం తప్పు కాదనుకుంటాను.

ఇట్లా అస్తిత్వవాదుల్లో మానవీయ స్పందన లేకపోవడానికి కూడా విప్లవోద్యమ వైఫల్యమే అనగల మేధావులు మనకు ఉన్నారు. విప్లవోద్యమ లోపాలు చెప్పే అత్యుత్సాహాన్ని, మేధావితనాన్ని కూడా నేను గౌరవిస్తాను. విప్లవోద్యమం లోపాల గురించి ఫేస్బుక్ లాంటి చోట అనేక మంది మేధావులు గుట్టలకొద్ది రాస్తుంటారు. విప్లవోద్యమం మీద తీర్పరులుగా, న్యాయ నిర్ణేతలుగా రోజూ మాట్లాడుతూ ఉంటారు. కాదనడం లేదు. దాన్ని ప్రశ్నించడం లేదు. కానీ ఈ హత్యలపై ఒక్క వాక్యం రాయకుండా విప్లవోద్యమంలోని లోపాల గురించి రాస్తూపోవడం ఏం బాగుంటుందని అనిపించకపోవడం అనేదే అన్నిటికన్నా సమస్య. వ్యక్తిగత స్థాయిలో కూడా మీరు కావలసీ పట్టించుకోకపోవడంలోని మర్మం ఏమిటనేదే ప్రశ్న. ఈ ధోరణి ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి హత్యాకాండలపై మీకు స్త్రీల అస్తిత్వం వైపు నుంచీ పట్టడం లేదు. దళిత బహుజన అస్తిత్వం వైపు నుంచీ పట్టడం లేదు. మానవ హక్కుల వైపు నుంచీ పట్టడం లేదు. ఎందుకని?

విప్లవోద్యమం ఇప్పుడు సక్రమంగా నడవడం లేదనే వాళ్లు కూడా మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అంతా తప్పుల తడకలని, మావోయిస్టులకు జ్ఞానం లేదని అంటుంటారు. విప్లవోద్యమం మంచి చెడ్డల గురించి ఎంతైనా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు సరిగా విప్లవాన్ని నడపాలనుకున్నా రాజ్యాన్ని ప్రశ్నించాల్సిందే. ఆ పని చేయకపోతే మీరు సక్రమంగా విప్లవం చేయడానికి కాదు, ఇట్లా ప్రశ్నించడానికీ ఈ దుర్మార్గ రాజ్యం మిమ్మల్ని కూడా మిగల్చదు. అందరినీ మింగేస్తుంది.

విప్లవం కోసం మరణశాసనం రాసుకొని వెళ్లిన వాళ్లు కాబట్టి, వాళ్లను రాజ్యం వెంటాడి, వేటాడి, విషం పెట్టి.. రకరకాల హింసా రూపాల్లో చంపేసినా మనకెందుకులే అనుకుంటే పరిస్థితి ఎక్కడి దాకా వస్తుందో అందరూ ఊహించగలరు.

ఇటు తెలంగాణ నుంచి, అటు ఆదివాసీ ప్రాంతాల నుంచి దేశవ్యాప్త విప్లవోద్యమం నిర్మాణంలో భాగంగా కృషి చేస్తూ ఈ ఆరుగురు అమరులయ్యారు. మామూలుగా ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా అమరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్తలు శవాల స్వాధీనానికి వెళ్లేవాళ్లు. ఈ పని జరగకుండా చేయడానికే ఏబీఎంఎస్ ను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. మరో పదిహేను సంఘాలను కూడా బ్యాన్ చేసింది. దీనికి కొవిడ్ తోడైంది. అయినా గంగన్న కుటుంబసభ్యులతోపాటు అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు వెళ్లాలనుకున్నారు. అందుకే కావచ్చు.. ఇద్దరికే పాస్ ఇస్తామని పోలీసులు అన్నారు. ఇద్దరమే అంత దూరం పొయి రావడం కష్టమని కుటుంబ సభ్యులు అన్నారు. మరో నలుగురు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. అక్కడా గంగన్న శవాన్ని కూడా పూర్తిగా చూడనివ్వలేదు. పోస్టుమార్టం చేసి శవాన్ని ఇచ్చేశారు.

19వ తేదీ మధ్యాహ్నం పెద్ద‌ప‌ల్లి జిల్లా (ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా) ఓదెల మండ‌లం గుంపుల గ్రామంలో ఎప్పటిలాగే అమరుల బంధుమిత్రుల సంఘం, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గంగన్న అంతిమయాత్ర జరిగింది. పోలీసు పహారా మధ్య, కొవిడ్, ఏబీఎంఎస్ పై నిషేధం ఉన్నా, అమరుల కుటుంబాలు, విప్లవ ప్రజానీకం వందలాది మంది హాజరయ్యారు. ఘనంగా విప్లవ సంప్రదాయంలో గంగన్నకు వీడ్కోలు పలికారు. నిషేధాలను అట్టడుగు ప్రజలు ధిక్కరించగలరని మరోసారి రుజువైంది.

ఆ విప్లవ కుటుంబాలు, నలుగురి అమరత్వం, ఆ తల్లుల గుండెకోత, కుటుంబ సభ్యుల కన్నీటి వరద.. విప్లవమెంత గొప్పది, ప్రాణమిచ్చేంత ధీరత్వాన్ని అదెలా వేలాది మందికి అందిచ్చింది? బిడ్డల త్యాగం సరే, ఆ పిల్లల త్యాగాన్ని గౌరవించి, అర్థం చేసుకోగల ఆ తల్లులకు ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది. ప్రతి తల్లి పిడికిలెత్తి, జెండా ఎత్తి నిలబడుతోంది.

అందుకే నిషేధం మధ్యనే అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు వెళ్లడం, విప్లవాభిమానులు రావడం, తలా ఒక చితి కర్రను పేర్చడం, ఎర్రజెండాను ఎత్తిపట్టి నివాళి ప్రకటించడం.. ఇవేవీ..ఆ తల్లుల చైతన్యం ముందు గొప్పవి కాదు. ప్రత్యేకంగా చెప్పుకోదగినవి కాదు. ఇలాంటి తల్లుల సంకల్పంతో ఏర్పడ్డ అమరుల బంధుమిత్రుల సంఘం మీద నిషేధాన్ని రాజ్యం ఎందుకు విధించిందో మేధావులకు, అస్తిత్వవాదులకు ఇప్పటికౖేెనా అర్థమైతే చాలు.
గంగన్న ఈ మట్టిలో, మంటల్లో కలిసిపోయాడు. మిగతా వాళ్ల భౌతిక కాయాలు కూడా అంతే. కానీ ఈ నిషేధ సందర్భంలో అయినా ఆ చితిమంటల వేడి మీకేమైనా తగులుతుందా? వాళ్లు మావోయిస్టులు కాబట్టి మాకేమీ పట్టదని సమర్థించుకుంటారా?

మీ మీ అస్తిత్వవాదాలు, ప్రజాస్వామ్యాలు, సమానత్వాలు కేవలం మాట్లాడుకోడానికేనా? లేక నిజంగానే కులము, స్త్రీలు అనే కోణాల్లో అయినా మానవీయంగా స్పందించడానికా?
రాజ్యహింసకు బలైపోతున్న వాళ్లంగా ఈ మాటలు ఎందుకు అడగకూడదు?
- పద్మకుమారి

Keywords : ABMS, Fake Encounter, visakhapatnam, peddapalli, sande ganganna, sande rajamouli
(2024-04-25 00:09:28)



No. of visitors : 2586

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఈ