వాళ్ళ అమరత్వంలోంచి అడవి చిగురిస్తున్నట్లుగానే ఉంటుంది

వాళ్ళ

మావోయిస్టు పార్టీ నాయకులు హరిభూషణ్, భారతక్క మరణం అనేక మందిని కలిచివేసింది. వాళ్ళతో పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేకున్నా వాళ్ళ గురించి విన్నవాళ్ళు అనేక విధాలుగా సపంధించారు. సోషల్ మీడియాలో అనేక మంది తమ భావాలను పంచుకున్నారు. కొందరు ఆ అమరులపై కవితలు రాశారు. అలా మా దృష్టికి వచ్చిన, శాఖమూరి రవి, వీ. సంతోష్, పీవీ కొండల్ రావు, వెంకట్ నాగిళ్ళ, నాగేశ్వర్, విష్ణు వర్ధన్ రెడ్డి వేముల రాసిన కవితలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. మా దృష్టికి రానివి ఇంకా అనేకం ఉంటాయి.

ప్రజల మనుషులు -శాఖమూరి రవి

వాళ్ళు....
పత్రాల్లాంటివారు
అవి....
పత్రహరితాన్ని త్యాగం చేసి
ప్రజలకోసం ప్రాణవాయువునిస్తాయి......
వాళ్లు...
జీవితాలను త్యాగం చేసి ప్రజలకోసం ప్రాణవాయువునిడుస్తారు...
అవి...
నేలరాలుతాయి పర్యావరణ హింసలో అయినా చిగురిస్తాయి
అదే స్థానంలో ప్రాణవాయువునివ్వడం కోసం...
వాళ్లు ఒరిగి పోయారు పర్యావరణ రాజ్యహింసలో
అయినా చిగురిస్తారు
వేలాది పూరి గుడిసెల్లో........

మెరవండి … ఉరమండి ‍ -పీవీ కొండల్ రావు

మిత్రమా…
ఆ మిణుక్కు మంటున్నది
నువ్వే కదా..
నేనేనే .. నీ గొంతు..
అవును నువ్వే…
ఆకాశంలో
పిల్లల కోడి
పొదుగులో
రెండు కొత్త
నక్షత్రాలు..
మీరంతా
అక్కడున్నారు
మెరవండి..
అప్పుడప్పుడు
పిడుగులై
కొన్నిసార్లు
ఉరుములై
మమ్మల్ని
ఉత్తేజితుల్ని
చెయ్యండి.
అవునూ
ఆకాశపు
అబూజ్మడ్
చేరారా…!?

వాళ్ళుబతికే ఉంటారు ‍ -వీ. సంతోష్

పారే నదిప్రవాహంలా
వీచే పవనంలా
అడవి తల్లి ఒడిలో
ఒదిగిపోయిన వాళ్లు
బతికే ఉంటారు.
పూచే పువ్వులో
పునాస పంటల్లో
పసిపిల్లల బోసి నవ్వుల్లో
పూరి గుడిసెల్లో కందిలయి
వాళ్లు బతికే ఉంటారు..
అమరులు వాళ్లు
అరుణకాంతులు వాళ్లు

వాళ్ళు -నాగేశ్వర్

వాళ్ళ అమరత్వంలోంచి
అడవి చిగురిస్తున్నట్లుగానే ఉంటుంది.
వాళ్ళ చిరునవ్వుల్లోంచి
అడవిపూలు వికసిస్తున్నట్లుగానే ఉంటుంది.
వాళ్ళ ఆత్మవిశ్వాసపు దారుల్లో
జనతన రాజ్యం నిర్మాణమవుతున్నట్లుగానే ఉంటుంది.
వాళ్ళు
అడవిలా విస్తరించిన చోట,
నదిలా ప్రవహించిన చోట,
పర్వతశిఖర త్యాగమైన చోట,
అడవి ఆకాశం మీద
వెన్నెల దీపాల్లా కండ్లు తెరిచినచోట,
అంతా ఎడారి
ఉత్త మట్టిదిబ్బని ఎలా ప్రకటించేది?
తొలకరి చినుకులకు పులకరించే
ప్రకృతి వనమని ప్రకటించక తప్పదు

మనిషి రూపం లేకుండపోవడాన్ని తట్టుకోవడం ఎట్ల - వెంకట్ నాగిళ్ళ‌

ఊహించనిరీతిలొ వచ్చే
ఒక ప్రకటనో
మనసు పొరలపై తేలియాడే
అమరుని రూపమో
శరాఘాతంలా వచ్చి
గుండెను చీల్చుతూ
బ్రతుకంతటినీ కన్నీటి బిందువునుచేస్తుంది
దుంఖం బయటికిరాదు
మనసులొ ఉండదు
గొంతులొ గూడుకట్టుకొని
ప్రాణం విలవిలలాడుతుంది
భరించలెని ఆవేదన
మేనంతటినీ దహించివేస్తుంది
కలలు రాలుతున్న కాలంలొ బ్రతుకుతున్నాం
అందరి కన్నీళ్ళు తుడవవలసిన అడవి
దుఖంలొ మునిగిపొవడం చూస్తున్నాం
త్యాగమని అన్నా అమరత్వమని అన్నా
మనిషి రూపం లేకుండపోవడాన్ని తట్టుకోవడం ఎట్ల
గ్యాపకాలలొ మిగిలె మనిషిని
ఆచరణలొ బ్రతికించుకొవడం తప్ప
ఎవరి కన్నీళ్లకైన ఉపశమనమంటూ ఉంటుందా!?

ఎర్ర మల్లెలను ఏరుకుంటాము ‍ -విష్ణు వర్ధన్ రెడ్డి వేముల‌

అడవికే అందమైన
ఎర్ర మల్లెలు మోదుగు పూలు రాలిపోతుంటే గుండెలవిసిపోతున్నాయి
ఆదివాసులకు ఆయుధం ఎక్కుపెట్టి
దోపిఢి గుండె పై గురిపెట్టి కాల్చడం
నేర్పిన గురువులు రాలిపోతుంటే
పలక బలపం చేతులో పెట్టి
రాయటం చదవటం నేర్పి
విప్లవ సిద్ధాంతాన్ని బోదించి
దోపిఢి పీఢన వ్యవస్థను కూల్చడం
నేర్పిన బోదకులు ఒరిగిపోతుంటే
పేగు బంధం పోరు బంధంమై
కంట నీరై పొరలి ప్రవాహమైతుంది
రక్త బంధం వర్ధ బంధంమై
ఆశయ జెండాలను ఎగరేయమంటుంది
రాజ్యహింసలో రాలి పోయిన
అమరులారా లాల్ సలాంలు
కారోనా కరోనాటుకు కనుమూసిన
సమరులారా విప్లవ జోహార్లు
ఎర్ర మల్లెలను ఏరుకుంటాము
పోరు మల్లెల మాలలను కట్టుకుంటాము
మీ రూపాల స్థూపాలను మీ ఆశయ నావను
అలంకరించుకుంటాము
సదా మిమ్ముల స్మరించుకుంటాము
వేసవి చెట్ల ఆకులను రాల్చి
అడవినే అంతం చేశానని కలలు కంటుంది
చెట్లు చిగురించడం అడవి పచ్చబడటం
పూలు వికశించడం ప్రకృతి ప్రక్రియ
అడ్డుకోవడం ఎవరి తరం
రాజ్యం ఎన్ని వికృత అకృత్యాలకు
పాల్పడ్డా
ప్రకృతి పోరు బిడ్డలను తన ఒడిలోన
సమరులను లాలిస్తుంది
అమరులను పాలిస్తుంది
అరుణతారలకు
విప్లవ జోహార్లర్పిస్తుంది

Keywords : haribhushan, bharatakka, maoists, corona, covid 19, deaths, poems
(2024-04-18 04:26:29)



No. of visitors : 3472

Suggested Posts


అమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలి

అమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలి

అస్తిత్వ ప‌రిధులు దాటి కార్మిక‌వ‌ర్గ ప్ర‌తినిధులై.. -పాణి

విషాదం కూడా రోమాంచితంగా ఉంటుందా? మామూలుగానైతే అంగీకరించలేం. కానీ అదీ అనుభవంలోకి వస్తుంది. అప్పుడే తెలుస్తుంది.. విషాద రేఖకు కూడా ఒక మెరుపు అంచు ఉంటుందని. అదే దు:ఖం నుంచి తెప్పరిల్లే ఓదార్పు గీతమవుతుంది. అదే నడచి వచ్చిన దారిని రక్త కాంతులతో దేదీప్యమానం చేస్తుంది. తెరచాప వలె భవిష్యత్తులోకి లాక్కెళుతుంది.

ఆదివాసీ, పీడిత ప్రజల గుండె ధైర్యం కామ్రేడ్.హరిభూషణ్ -అలెండి

ఆదివాసీ, పీడిత, తాడిత ప్రజానీకానికి జూన్ 21, 2021 తీవ్రమైన దుఃఖాన్ని కలిగించిన రోజు. ఆదివాసీ, పీడిత ప్రజల ప్రియమైన నాయకుడు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ

హరిభూషణ్ భార్య శారదక్క చనిపోలేదు... అసత్య‌ ప్రచారాలను ఖండించిన మావోయిస్టు పార్టీ

పోలీసులు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని నమ్మకండి. కా ,శారద, కా. హిడ్మా ఆరోగ్యంగానే వున్నారు. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే ఉద్ద్యేశ పూర్వకంగా దుష్ప్ర‌చారం చేస్తున్నారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వాళ్ళ