గుంపులలో సందె గంగన్న సంస్మరణ సభ (వీడియో)
28-06-2021
ఏవోబీలో ఎన్ కౌంటర్ లో మరణించిన సందె గంగన్న సంస్మరణ సభ ఈ రోజు ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గుంపులలో జరిగింది. ఒక వైపు పోలీసుల నిర్బంధం, మరో వైపు కరోనా నబందనల మధ్య జరిగిన ఈ సభలో ఆ గ్రామస్తులే కాక ఇతర గ్రామాలనుండి కూడా ప్రజలు హాజరయ్యారు. అమరులైన సందె గంగన్న, సందె రాజ మౌళి, సందె రాజన్న, పద్మక్కలకు
ఈ సందర్భంగా ప్రజలు నివాళులు అర్పించారు. అమ్రులకు జోహార్లు అర్పిస్తూ పాటలు పాడారు.
ఈ సందర్భంగా అమరుల బంధు మిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ కుమారి మాట్లాడుతూ...
ʹʹఎన్నటికన్నా ఇప్పుడు ఎక్కువగా నిర్బంధాలు పెరిగినయ్. దాంతో పాటే కరోనా నిబందనలు కూడా ఉన్నాయి, ప్రజా సంఘాల మీద నిషేధం ఉంది. వీటి మధ్యనే మనం అమరులను సంస్మరించుకోవాలి. నిషేధాల మధ్యనే అమరులున్నరు. నిషేధాల మధ్యనే ఉద్యమాలున్నయి. నిషేధాల మధ్యనే ప్రజలున్నారు. ప్రజా ఉద్యమాలలో ఒరిగిన వీరులను నిషేధాల మధ్యనే స్మరించుకుంటాం.ఇది మనకు కొత్తది కాదు. ఈ నిర్బంధాలున్నయి కాబట్టే విప్లవకారులున్నరు.
ఈ నిర్బంధాలున్నయ్ కాబట్టే ఈ త్యాగాలున్నాయి. కాలమెప్పుడూ ఇట్లనే ఉండదు. బహిరంగ సభలు పెట్టుకొని, స్తూపాలు కట్టుకొని అమరులను స్మరించుకునే రోజంటూ వస్తది. అప్పటివరకు మనం మనకు తోచినవిధంగా అమరులను స్మరించుకుంటూనే ఉంటాము. మనం ఈ రోజు స్మరించుకుంటున్న ఈ వీరులు ఇక్కడి నుండి ఎక్కడైతే ప్రజల కోసం పని చేశారో ఆ ప్రాంతాల్లో ప్రజలు వీళ్ళను స్మరించుకుంటూ బహిరంగ సభలే నిర్వహిస్తున్నరు. ఆ వార్తలు మన దాకా రావడం లేదు. ఇప్పుడున్న మీడియా పాలకుల పక్షానే ఉన్నది కనుక ఆ విషయాలను మీడియా మనకు చెప్పదు. చూపించదు. అమరులు గొప్పగా జీవించారు.
ఈ మధ్య కాలంలో కరోనా వల్ల కొందరు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అవి నిజంగా కరోనా మరణాలేనా అనే అనుమానాలొస్తున్నాయి. హరి భూషణ్ చనిపోయిన వార్త ప్రకటించడానికి ముందే బస్తర్ ఐజీ ప్రకటన అనేక అనుమాలకు తావిస్తోంది. హరిభూషణ్ కరోనాతో గానీ విషప్రయోగం ద్వారా కానీ చనిపోయి ఉంటాడని ఆయన ప్రకటించాడు. సందె గంగన్న అమరత్వం గురించి కూడా ఇప్పటి వరకు ఏం వివరాలు తెలియలేదు. పార్టీ ప్రకటిస్తే తప్ప నిజాలు తెలియదు.ʹʹ
గాజర్ల అశోక్ మాట్లాడుతూ...
ʹʹనాకున్న శక్తి సామర్ద్యాలను, నాకున్న ఙానాన్నిప్రజల్కు అందివాల్సినంత అందివ్వలేక పోతున్న. దండకారణ్యంలో నా అవసరం చాలా ఉన్నది అక్కడికే వెళ్తే అని సందె గంగన్న ఇక్కడ ఉన్నప్పుడు అంటూ ఉండే వాడు. సందె రాజ మౌళి ఎలియాస్ ప్రసాదన్న చనిపోయినప్పుడు జరిగిన సంస్మరణ సభలో గంగన్న మాట్లాడుతూ... ʹʹనేను ప్రసాదన్న స్పూర్తితోనే విప్లవంలోకి వచ్చిన అయితే ఈ రోజు ప్రజల మధ్య ఉంటూ ఎన్నో నేర్చుకున్నా. ప్రజల కోసమే చివరి వరకు బతకాలని నిర్ణయించుకున్నʹʹ అని ప్రకటించిండు. అదే మాట మీద నిలబడ్డడు.ʹʹ
ఈ సభలో సందె గంగన్న మీద తాను రాసిన కవితను శాఖమూరి రవి వినిపించగా, భారతక్క పాట పాడారు. గంగన్న సోదరుడు మహేందర్, విప్లవ రచయిత బాలసాని రాజయ్య, శాంతక్క తదితరులు ఈ సభలో మాట్లాడారు.
Keywords : sande gangayya, aob, encounter, sande rajamauli, padmakka, peddapalli, gumpula
(2023-09-26 04:07:47)
No. of visitors : 2422
Suggested Posts
| ఏవోబీలో మరో ఎన్ కౌంటర్ - సందె గంగయ్యతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి !ఏవోబీలో మరో (పోలీసుల కథనం ప్రకారం)ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టు మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. |
| గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టిన వేలాది ఆదివాసులు - మావోయిస్టు ప్రమీల మృతదేహం కోసం పోరాటంఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరిధి బెజ్జంగి–ఆండ్రపల్లి మధ్య అటవీ ప్రాం తంలో జరిగినట్టు చెబుతున్న ఎన్కౌంటర్ నిజమా అబద్దమని మావోయిస్టు పార్టీ నాయకురాలు ప్రమీలను పట్టుకొని కాల్చి చంపారని. స్థానిక ఆదివాసులైన జయంతి , రాధిక గొల్లూరి,సుమలా , రాజశేఖర్ కర్మలను పోలీసులు అరెస్టు చేసి పట్టుకెళ్ళారని వారిని కూడా చంపేస్తారేమోననే ఆందోళన ఆద |
| మావోయిస్టు అరుణ ఎక్కడ ?
సీపిఐ మావోయిస్టు పార్టీ నాయకురాలు అరుణ ఎక్కడుంది? పోలీసుల అదుపులో ఉన్నదా ? ఏవోబీలోనే సేఫ్ గా ఉన్నదా ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉన్నది. ఈ నెల 22న గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుణ చనిపోయిందని ప్రచారం కూడా సాగింది. |
| అనారోగ్యంతో ఉన్న మీనాను పట్టుకొని కాల్చి చంపారు - స్పష్టం చేస్తున్న ఆదివాసులుఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగినట్టు అందులో మావోయిస్టు పార్టీ నాయకురాలు ప్రమీల ఎలియాస్ మీనా ఎలియాస్ జిలానీ మృతి చెందిన ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. |
| ఏవోబీలో పోలీసు పదఘట్టనల మధ్య దిగ్విజయంగా మావోయిస్టుల బహిరంగ సభపోలీసుల కూంబింగ్ తీవ్రంగా జరుగుతుండగానే సీపీఐ మావోయిస్టు పార్టీ అదే ప్రాంతంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న బలిమెల రిజర్వాయర్ కటాఫ్ ఏరియాలో ఈ సభ నిర్వహించారు. |
| అక్టోబరు దాడి తర్వాత... AOBలో ఏం జరుగుతోంది...? ʹʹ వాళ్లు మా ప్రభుత్వంపై దాడి చేశారు. అయితే శాశ్వతంగా వారు నష్టం కలిగించలేరు. ఈ రోజు కను చూపు మేరలో కూడా పోలీసుల జాడ లేదు. మళ్లీ మా పార్టీ పూర్తిస్థాయిలో వచ్చేసిందిʹʹ అని చెప్పాడు దోమ్రు.... |
| కామ్రేడ్... నీ నెత్తిటి బాకీ తీర్చుకుంటాం... గర్జించిన వేల గొంతులువార్త తెలుసుకున్న వందలాది గ్రామాలనుండి వేలాది మంది ఆదివాసులు ఆదివారం రాత్రి నుండే కొండెముల గ్రామానికి రావడం మొదలుపెట్టారు. సోమవారం ఉదయానికే ఆ గ్రామం ఎర్రజెండాలు చేబూనిన వేలాదిమందితో నిండిపోయింది. తమ ప్రియతమ నాయకుడి భౌతిక కాయాన్ని చూసిన ప్రజలు బోరుమంటు విలపించారు.... |
| కళ్ళముందు కదలాడుతున్న అమరుల ఙాపకాలు - సావి కొల్లఅదిగో ఆ ఎర్ర గోంగూర చెట్టుందే అదే విప్లవ యువ కిశోరం మున్నా శత్రు సేనలతో వీరోచితంగా పోరాడుతూ తన రక్తంతో ఎరుపెక్కించిన నేల. ఆ చోటంతా ఎర్ర గోంగూర మొక్కలతో అచ్చం ఎర్రపూల వనంలా విరబూసింది. ఆ జారుడు మట్టిదారి మన ప్రియతమ మహిళా నాయకురాలు భారతక్క తూటాల గాయాలతో పైకి ఎక్కలేక జారిపడ్డ బాట. ఆ కొండమలుపులోనే మిలిటరీ దిగ్గజం యాదన్న మరో తరాన్ని కాపాడడానికి శత్రు మోర్టార్ |
| పితృస్వామ్యంపై విల్లెత్తిన విప్లవ మహిళ - భారీ బహిరంగ సభఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ముంచింగుపుట్టు ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా , మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సభ... |
| నిత్య పోలీసు దాడుల నడుమ మావోయిస్టుల నాయకత్వంలో సాగుతున్న భూపోరాటాల జైత్ర యాత్రగ్రామాలపై పోలీసుల దాడులు... ఎన్ కౌంటర్ హత్యలు.... ఏవోబీలో ఒక వైపు పోలీసులు ప్రతి చెట్టును, పుట్టను తమ తుపాకులతో జల్లెడ పడుతూ భయోత్పాతం సృష్టిస్తుండగానే... మరో వైపు ప్రజలు భూపోరాటాలు, అమరుల సంస్మరణ సభలు జరుపుకుంటూ తమ... |
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
more..