Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర
01-07-2021
బీమా కోరేగాం ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయి జైలు నిర్భంధంలో ఉన్న హక్కుల సంఘాల నేతలు, మేధావులు మరో ప్రమాదకరమైన సవాలును ఎదుర్కోబోతున్నారు. వారిని తలోజా జైలునుంచి మహారాష్ట్రలోని వివిధ జైళ్లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జైలు నిర్బంధంలో ఉన్న హక్కుల నేతలు తమ కుటుంభ సభ్యులకు, ప్రసార మాధ్యమాలకు తప్పుడు సమాచారం అందజేస్తున్నారన్న నెపంతో జైలు అధికారులు వారిని వివిధ జైళ్లకు తరలించేందుకు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని మహారాష్ట్రలోని వివిధ జైళ్లకు తరలించేందుకు ప్రయత్నించటం ఇది మూడోసారి. జైలు నిర్భంధంలో ఉన్న 16మంది హక్కుల సంఘాల నేతలు, మేధావులను వివిధ జైళ్లకు తరలించాలని గత మార్చి నెలలోనే జైలు సూపరింటెండెంట్ కౌస్థబ్ కురలేకర్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత ఇదే విధమైన పిటిషన్‌ను జూన్ మూడున కూడా వేశాడు. మూడో సారి ప్రయత్నంగా జూన్ 24న కూడా తరలించేందుకు పిటిషన్ దాఖలు చేశారు. గత ఆరు నెలల్లో మూడు సార్లు ఈ విధమైన పిటిషన్లు దాఖలు చేయటం గమనార్హం.
గతంలోనే సుప్రీంకోర్టు ఖైదీలను ఇష్టానుసారంగా ఒక జైలు నుంచి మరో జైలుకు మార్చడాన్ని తప్పుపట్టింది. ఖైదీల అభీష్టానికి వ్యతిరేకంగా జైలు మార్చటం చేయరాదని కూడా రూలింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో మైలు రాయిగా చెప్పుకోదగిన ఉదంతం కూడా ఉన్నది. సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు.. ఖైదీని ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా, అతన్ని తన బంధువులు, సంబంధీకులు కలిసే వీలులేకుండా సుదూర ప్రాంత జైలుకు తరలించటమంటే.. అతని జీవించే హక్కును నిరాకరించటమే అని వాఖ్యానించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని అతిక్రమించటమేనని తెలిపింది. ఇలాంటి తీర్పులే దేశంలో అనేక సందర్బాళ్లో, పలు మార్లు వెలువడ్డాయి.
ఎల్గార్ పరిషద్ కేసులో నిర్బంధితులుగా ఉన్న వారిని సుదూర ప్రాంత జైలుకు మార్చి వారి మౌలిక ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని వారి బంధువులు, సంబంధీకులు ఆరోపిస్తున్నారు. తోలోజా జైలు సూపరింటెండెంట్ ఎల్గార్ పరిషద్ కేసులోని వారిని వివిధ జైళ్లకు తరలించాలని ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా.. హక్కుల నేతల బంధువులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ సుప్రీయా సూలేను కలిసి జైళ్లు మార్చడాన్ని నిలువరించాలని కోరారు. దీంతో సూలే.. జైళ్లు మార్చటం లాంటి కఠిన నిర్ణయం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే.. జైలు అధికారులు ఎవరినీ జైలు మార్చటం లేదని హామీ ఇచ్చారు. కానీ.. జైలు సూపరింటెండెంట్ మాత్రం జైలు మార్చే ప్రక్రియపై మరే చర్యకు పూనుకోరాదనినిర్బంధితుల బంధువులు, కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగుతూనే ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే.. జైలు సూపరింటెండెంట్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేయటం గమనార్హం.
కరోనా మహమ్మారి నేపథ్యంలో మొత్తం ప్రపంచంతో పాటు భారత్ కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యింది. లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో జైళ్లు కూడా కరోనా కోరల్లో చిక్కుకుని తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి. తలోజా జైలును కూడ కరోనా మహమ్మారి కాటేసింది. ఎంతో మంది జైలు నిర్బంధంలో ఉన్నవారు కరోనాతో మరణించిన ఉదంతాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయి తలోజా జైలు నిర్బంధలో ఉన్న 16 మందిలో పలువురు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఆదివాసీ హక్కుల కార్యకర్త 84 ఏండ్ల స్టాన్ స్వామి, ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ 54 ఏండ్ల హాని బాబు కూడా వైరస్ బారిన పడ్డారు. వారు కరోనా తో తీవ్ర అనారోగ్యం పాలైన కారణంగా వారిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించే పరిస్థితి ఏర్పడింది.
దేశంలోనే అతి ఎక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్రభాగాన నిలిచింది. తలోజా జైలు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యింది. ఈ పరిస్థితుల్లో తలోజా జైలు గాథ మరీ విషాదకరమైనది. తలోజా జైలులో 2,124 మంది ఖైదీలను మాత్రమే ఉంచటానికి సదుపాయాలు, వసతులున్నాయి. అలాంటి జైలులో ప్రస్తుతం 2,700మందిని కుక్కి ఉంచారు. తలోజా జైలు మరో ప్రత్యేక విషాధ పరిస్థితి ఏమంటే.. దేశంలోని మిగతా జైళ్లలాగానే ఇక్కడ కనీస వైద్య సదుపాయాలు కరువు. ఈ జైలులో ఖైదీల ఆరోగ్య పరిస్థితులను చూసేందుకు దీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఇద్దరు ఆయుర్వేద వైద్యులున్నారు. ఈ పరిస్థితుల్లో ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయి వచ్చిన వారిలో ఎవరు అనారోగ్యం పాలైనా కనీస వైద్య సహాయం కోసం కోర్టు అనుమతితో హాస్పిటల్‌లో చేరి వైద్యం పొందుతున్న దుస్థితి ఏర్పడింది.
కరోనా మహమ్మారి భారత్‌ను ఆవహించక ముందే.. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జైలు నిర్బంధంలో ఉన్న వారిపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని, జైలు అధికారులు ఖైదీల రక్షణకు తగు విధమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జైలు నిర్బంధంలో ఉన్న వారి సంరక్షణకు ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి నిర్బంధంలో ఉన్నవారికి వైరస్ సోకకుండా తగు విధమైన రక్షణ చర్యులు తీసుకోవాలని సూచించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని జైళ్లలోని ఖైదీల సంఖ్యను సగానికి సగం తగ్గించుకోవాలి. 2400 మందికి మాత్రమే ఉండేందుకు వసతులు ఉన్న మహారాష్ట్ర జైళ్లలో రెట్టింపు ఖైదీలు నిర్బంధింపబడి ఉన్నారు. ఇలాంటి కోర్టు ఆదేశాలు ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నా మహారాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. ఖైదీల రక్షణకు ఏమాత్రం బాధ్యత వహించలేదు. కరోనా భయానక పరిస్థితుల్లో కూడా పరిమితికి మించి 24వేల మందికి మాత్రమే ఉండటానికి చోటున్న జైళ్లలో 34వేల మందిని నిర్బంధించి ఉంచారు.
ఎల్గార్ పరిషద్ కేసులో నిర్బంధింపబడి ఉన్న 16 మందిలో 80 ఏండ్ల విప్లవ కవి, రాజకీయ కార్యకర్త వరవరరావు ఒక్కరే బెయిల్‌పై ఉన్నారు. ఇది కూడా ఆయన కొవిడ్ బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలై, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన పరిస్థితుల్లో ఆయనకు బెయిల్ లభించింది. వరవర రావు 2018నుంచి ఈ కేసులో నిర్బంధంలో ఉన్నారు.
ఈ కేసులో వరవరరావు, స్టాన్‌స్వామితో పాటు.. ముంబాయికి చెందిన దళిత హక్కుల కార్యకర్త సుధీర్ ధవాలె; నాగపూర్‌కు చెందిన న్యాయవాది, యూఏపీఏ నిపుణుడు సురేంద్ర గాడ్లింగ్; గడ్చిరోలి ప్రాంతానికి చెందిన హక్కుల కార్యకర్త, నిర్వాసిత హక్కుల ఉద్యమకారుడు మహేష్ రౌత్; నాగపూర్ యూనివర్సిటీ ఆంగ్లభాషా అసిస్టెంట్ ప్రొఫెసర్ షోమాసేన్; ఢిల్లీకి చెందిన హక్కుల కార్యకర్త, ఖైదీల హక్కుల పోరాటకారుడు రోనా విల్సన్; న్యాయవాదులు హక్కుల కార్యకర్తలు అరున్ ఫెరైరా, సుధా భరద్వాజ్; సామాజిక కార్యకర్త వర్నన్ గొన్సాల్వెస్; యూనివర్సిటీ మేధావి పౌరహక్కుల కార్యకర్త ఆనంద్ తెల్‌దుంబ్లే; హక్కుల కార్యకర్త, జర్నలిస్టు గౌతమ్ నావల్ఖా; ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హాని బాబు; కబీర్ కళామంచ్ కు చెందిన కళాకారుడు సాంస్కృతిక కార్యకర్త సాగర్ గోర్కే రమేష్ గాయిచర్, జ్యోతి జగ్తాప్ తదితరులున్నారు.
మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్గార్ పరిషద్ కేసులో ఈ అరెస్టులు జరిగాయి. ఈ కేసును మొదట స్థానిక పూనే పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ మూడు పార్టీల ఐక్య సంఘటన మహావికాస్ అఘాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును ఎన్ఐఏ కు బదిలీ చేశారు. 2019లో మహావికాస్ అఘాది అధికారం చేపట్టిన వెంటనే సీనియర్ నాయకులు ఎల్గార్ పరిషద్ కేసులో వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్‌సీపీ నేత షరద్ పవార్ ఈ కేసుపై ప్రత్యేక సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేటివ్ టీమ్ )ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు అనేక మంది ఎన్‌సీపీ నేతలు కూడా బీమాకోరేగాం కేసులో అరెస్టు అయిన వారిపట్ల సానుకూలంగా మాట్లాడారు. ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న వారందరిదీ అక్రమనిర్బంధమని నిరసించారు.
ఏది ఏమైనా.. జైలులో ఉన్న వారిపట్ల చట్టబద్ధంగా మానవీయంగా వ్యవహరించాలి. చట్టబద్ధ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే వ్యవస్థల్లో ఇది తప్పనిసరి. జైలు నిర్బంధంలో ఉన్నవారి విషయం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. రాష్ట్ర హోమ్ డిపార్ట్‌మెంట్ నేరుగా నిర్బంధంలో ఉన్న వరి హక్కులు, సంరక్షణ విషయంలో బాధ్యత వహిస్తుంది. ఈ నేపథ్యంలో బీమా కోరేగాం కేసులో రెండేండ్లుగా నిర్బంధంలో ఉన్న హక్కుల సంఘాల నేతల భవిష్యత్తు మరింత భయానక పరిస్థితుల్లోకి నెట్టబడుతుండటం ఆందోళన కరం.
(thewire.in సౌజన్యంతో)
Keywords : bhima koregaon, Thaloja jail, Elgar Parishad Accused Could Soon Be Separated, Moved to Different Prisons Across Maharashtra
(2025-01-16 12:08:15)
No. of visitors : 1316
Suggested Posts
| bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ
భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని |
| భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది. |
| రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన
కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది. |
| UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన |
| భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. |
| స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలుభీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది. |
| Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన
భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది. |
| హనీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు
భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది. |
| కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది. |
| Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
నా వయస్సు 70 ఏళ్లు పైన ఉంటుంది. నేను ఢిల్లీలో నివసిస్తున్నాను. నవ్‌లఖాతో కలవడానికి జైలు అధికారులు అనుమతిచ్చే పది నిమిషాల వ్యవధిలో అతడిని కలవడానికి నవీ ముంబైలోని తలోజా జైలుకు ప్రయాణించడం నాకు చాలా కష్టం. |