ఆదివాసీ, పీడిత ప్రజల గుండె ధైర్యం కామ్రేడ్.హరిభూషణ్ -అలెండి

ఆదివాసీ,

04-072021


ఆదివాసీ, పీడిత, తాడిత ప్రజానీకానికి జూన్ 21, 2021 తీవ్రమైన దుఃఖాన్ని కలిగించిన రోజు. ఆదివాసీ, పీడిత ప్రజల ప్రియమైన నాయకుడు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ @ హరిభూషణ్ మననుండి భౌతికంగా దూరమయ్యారు. ఈ చేదు వార్తన కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు శ్రేయోభిలాషులు, ఉద్యామ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
కామ్రేడ్ హరి భూషణ్ అమరత్వం గోదావరి నది పరివాహక ప్రాంతాలైన తెలంగాణ, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా ఆదివాసీ పీడిత తాడిత ప్రజలకు అపారమైన నష్టం. ఆదివాసి సంస్కృతిలో భాగంగా 4-7- 2021 కామ్రేడ్ హరి భూషణ్ స్వగ్రామమైన మడగూడెం (మహబుబాద్ జిల్లా)లో స్మార‌క స‌భ జరుగుతున్న సందర్భంగా ఆయ‌న‌తో యాదిని, దుఃఖాన్ని పంచుకుంటున్నాను.

కామ్రేడ్ హరి భూషణ్ సేవ‌లు ప్ర‌జ‌ల గుండెల్లో శాశ్వ‌తంగా నిలిచి పోతాయి. సామాన్య ఆదివాసీ యువ‌కుడైన హరిభూష‌ణ్‌ను ఒక ఉత్త‌మ పౌరుడిగా, విప్ల‌వోద్య‌మ నాయ‌కుడిగా ప్రజలు విప్లవోద్యమమే, యాప నారాయణను కామ్రేడ్ హరి భూషణ్ గా తీర్చిదిద్దాయి. ఆదివాసీ కోయ తెగ నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడుగా ఎదగడం సాధార‌ణ‌ విషయమేమీ కాదు. కఠినమైన వర్గ పోరాటంలో రాటుదేలాడు. స‌హ‌జంగా విప్లవోద్యమం ఈ విధంగానే త‌మ నాయకులను సృష్టించుకుంటుంది. తిరిగి ఆ నాయకులే విప్లవోద్యమాలను విజయ పథంలో నడిపిస్తారు. చ‌రిత్ర క్ర‌మం ఇదే.

విప్లవోద్యమంలో త్యాగాలు అనివార్యమే. ఇటువంటి పరిణామానికి అవసరమైన ప్రాతిపదికను కామ్రేడ్ హరి భూషణ్ తన సైద్ధాంతిక, రాజకీయ కృషి ఆచరణ ద్వారా ఏర్పరిచారు. సూరప నేని జనార్దన్ అమరత్వం.. రాడికల్ విద్యార్థిసంఘంలో అమరత్వం పొందిన అనేక మంది విప్ల‌వ విద్యార్థుల‌ ఆదర్శం, అమ‌ర‌త్వం.. విప్లవ విద్యార్థి ఉద్య‌మాన్ని బ‌లోపేతం చేసింది. అలాగే విప్ల‌వోద్య‌మంలో అమ‌ర‌త్వం పొందిన వేలాది మంది కామ్రేడ్స్ త్యాగాలు ఇవ్వాళ దండ‌కార‌ణ్యంలో జ‌న‌త‌న స‌ర్కార్‌ల‌లో వెలుగు బాట‌లై ప్ర‌జ‌లను న‌డిపిస్తున్నాయి.

ప్ర‌త్యామ్నాయ అభివృద్ధి న‌మూనాతో దోపిడీ పాల‌క వ‌ర్గాల అధికారాన్నిస‌వాల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో అమ‌రులైన వారిలో.. కామ్రేడ్ ఆజాద్‌,కామ్రేడ్ కిష‌న్‌జీ, కామ్రేడ్ సూర్యం ,కామ్రేడ్ మంగన్న, కామ్రేడ్ ప్రసాదన్న, కామ్రేడ్ యాదన్న , కామ్రేడ్ సోమన్న, కామ్రేడ్ సుధాకరన్న, కామ్రేడ్ పుష్పక్క ,కామ్రేడ్ దయ లాంటి ఎంద‌రో ఎంద‌రెంద‌రో తోటి సహచర కామ్రేడ్స్ ఎదురుకాల్పుల్లో అమరత్వం పొందినా గుండె చెదరకుండా అడవికే, ఆదివాసీలకే అండగా వారి చట్టాలకు రక్షణగా సాయుధంగా ఆదివాసీలకు అండగా నిలబడ్డాడు.

భూములు, కూడు, గూడు కోసం పోరాడాడు. భూస్వాములు, పెత్తందారుల ఆగడాలను కళ్లెం వేశాడు. ఫారెస్టు అధికారుల వేధింపులతో భూములు లేక ఏం చేయాలో పాలుపోని ఆదివాసీలకు రక్షణగా నిలిచి భూముల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హరితహారం పథకానికి అడ్డుగా నిలిచాడు.

కామ్రేడ్ హరి భూషణ్ మూడున్నర దశాబ్దాల విప్లవోద్యమ చరిత్ర మొత్తం ఆదివాసీల కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం సాగింది. గత ముప్పై ఐదు సంవత్సరాల్లో ప్రత్యేకంగా పార్టీ రాజకీయ పంథా అభివృద్ధిలో, పార్టీ, ప్రజా సైన్యం, ప్రజా సంఘాల అభివృద్ధిలో, ఉద్యమ విస్తరణలోకామ్రేడ్ హరిభూషణ్ సైద్ధాంతిక రాజకీయ కృషి ఆచరణ కీలక పాత్ర పోషించాయి.

ఉద్యమంలో ఎన్ని ఆటు పోట్లు, కష్ట నష్టాలు ఎదురైనా చెదరని నిబ‌ద్ద‌త‌తో, ఎనలేని త్యాగ నిరతితో నిలిచిన వాడు హ‌రిభూష‌ణ్‌. విప్లవ లక్ష్యం కోసం ప్రజల ప్రయోజనాల కోసం అవిశ్రాంతంగా పోరాడాడు. అమోఘమైన అధ్యయన శీలత, జరుగుతున్న పరిణామాలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ అధ్యయనం చేయడం ప్రజలను అంటి పెట్టుకోవడం వంటి ఎన్నో గొప్ప కార్మికవర్గ ఆదర్శాలు కలిగిన ఆదివాసి ముద్దుబిడ్డ కామ్రేడ్ హరి భూషణ్ గా ఎదిగి హఠాన్మరణం పొందడం విప్లవకారుల అందరికీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర యువతరానికి విద్యార్థులకు నష్టదాయకం బాధాకరం.

కామ్రేడ్ హరిభూషణ్ కుటుంబ నేపథ్యం చూస్తే.. ఆదివాసీ కుటుంబం. తల్లి యాప కొమ్మక్క తండ్రి యాప రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో పెద్దవాడైన హరి భూషణ్ విప్లవోద్యమంలో చివరి దాకా కొనసాగి కరోనాతో అమరత్వం పొందారు. మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్లు సాధార‌ణ విప్ల‌వాభిమానులుగా ఉండ‌గా.., ఒక చెల్లె సరస్వతి అనారోగ్యంతో మృతి చెందింది. మిగిలిన ఐదుగురు వ్యవసాయ పనులతో పేదరికంతో నిజాయితీగా బ‌తుకుతున్నారు. కామ్రేడ్ హరిభూషణ్ ఉత్తేజ‌క‌ర‌మైన‌ విప్లవ జీవితం విద్యార్థి దశ త్యాగ‌నిరతితో, నిబ‌ద్ధ‌త‌తో సాగడమే అందుకు ఆదర్శం.

అంతేకాకుండా పోలీసుల‌ నుంచి నిత్యం కుటుంబానికి వేధింపులు బెదిరింపులు నిత్యకృత్యంగా ఉండేది. ముఖ్యంగా తన చిన్న తమ్ముడు అశోక్ అయితే ఎన్ని చిత్రహింసలు అనుభవించాడో లెక్క లేదు. మీ అన్న హరిభూషణ్ నీతో మాట్లాడుతాడు అంటూ మానసికంగా వేధించిన ఘటనలు అనేకం. గ్రామస్తులను భయాందోళనకు గురి చేసిన సందర్భాలున్నాయి. ఇల్లు శోధించడం కొత్త వ్యక్తులు గ్రామంలోకి వస్తే విచారించడం పోలీసుల నుంచి ఆ ప్రాంత ప్రజలు ఎన్నో వేధింపుల‌ను ఎదుర్కొన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించిన అనంతరం పోలీసు ఆగడాలు వారి కుటుంబం పై ఎక్కువయ్యాయి.

పాతతరం తెలంగాణ విప్ల‌వ నాయకత్వం వివిధ ఎన్‌కౌంట‌ర్ల‌లో అమ‌ర‌త్వం పొంద‌గా, తెలంగాణ ప్రాంతంలో మిగిలిన నాయకత్వం నిర్బంధం వల్ల దండకారణ్యం కు తరలి వెళ్ళడంతో.. సీనియర్ కామ్రేడ్‌గా హరి భూషణ్ మిగలడం తెలంగాణ రాష్ట్రానికి కార్యదర్శిగా ఎద‌గ‌డం, మిలటరీ ఆపరేషన్ల‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌టంతో కామ్రేడ్ హరి భూషణ్ పోలీసులకు ప్రభుత్వానికి టార్గెట్ అయ్యాడు. దీంతో కామ్రేడ్ హరి భూషణ్ కుటుంబానికి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతోపాటు ఎక్కడ ఎన్‌కౌంట‌ర్‌ జరిగినా కామ్రేడ్ హరి భూషణ్ చనిపోయాడనే వార్తలు కావాలని సృష్టించే వారు పోలీసులు.

ఈ పరిణామాలతో కామ్రేడ్.హరిభూషణ్ నిజంగానే కరోనా తో అమరత్వం పొందాడని మావోయిస్టు పార్టీ ప్రకటించాల్సి రావ‌టం తీర‌ని విషాదం. ఈ దుఖ స‌మ‌యంలో ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు బంధువులు వారి దుఃఖాన్ని పంచుకుందాం. ఆ కుటుంబానికి బరోసాగా నిలబడదాం.

సమ్మక్క, సారక్క , జంపన్న, పగిడిద్దరాజు , కొమురం భీం వారసత్వం కామ్రేడ్ హరి భూషణ్ ది. నక్సల్బరి శ్రీకాకుళ పోరాటాలకు, 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటానికి, మలి తెలంగాణ విప్లవోద్యమ జగిత్యాల జైత్రయాత్ర, 1996 ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ పోరాట అవగాహనతో కూడిన భారత విప్లవోద్యమ అమరుల మార్గం అతను. తెలంగాణ స్వపరిపాలన, మా ఊళ్లో మా రాజ్యం అన్న కొమురం భీం వారసుడు కామ్రేడ్ హరి భూషణ్. కవ్వాల్ టైగర్ జోన్ రద్దుకై తుడుందెబ్బ హ‌రిభూష‌ణ్‌. బయ్యారం ఉక్కు ఆదివాసీలకే హ‌క్కు అని చాటి చెప్పిన వాడు హ‌రిభూష‌ణ్‌.

ఆదివాసీలను ముంచే పోలవరం ప్రాజెక్టు రద్దు కోసం అనేక పోరాటాలకు మార్గ నిర్దేశం చేశాడు. ఆపరేషన్ గ్రీన్హంట్ ఉద్దేశాన్ని ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తూ పార్టీ వైఖరిని ప్రజలకు అందించడానికి విశేషంగా కృషి చేశాడు. కామ్రేడ్ హరి భూషణ్ ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి వెళ్లినా, ఏ కామ్రేడ్ ను కలిసిన ఉద్యమ అనుబంధాన్ని ప్రతిబింభింప చేసేవాడు. కామ్రేడ్ హరి భూషణ్ సదా స్నేహానికి ప్ర‌తీక‌గా నిలిచాడు.

ఉద్యమ సమస్యలు చర్చిస్తుండేవాడు. అత‌ను ఎల్ల‌ప్పుడూ ఓ రాజ‌కీయ పాఠ‌శాల‌గా ఉండేవాడు. ఆయన అమరత్వంతో ఆదివాసీ, పీడిత ప్రజానీకం తమ కష్టాలలో,కన్నీళ్లలో , విజయాల్లో, ఓటముల్లో తోడు నిలిచిన ప్రియమైన శ్రేయోభిలాషిని, నేతను కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ దుఃఖ‌మ‌య స‌మ‌యంలో.. ప్ర‌జ‌లంతా ఆయ‌న ఆశ‌య సాధ‌న కోసం.. ఆయ‌న చూపిన మార్గంలో ప‌య‌ణిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేస్తున్నారు. ఎత్తిన జెండా దించ‌బోమ‌ని ప్ర‌తిన బూనుతున్నారు. జ‌త‌న‌త‌న స‌ర్కార్‌ల సంర‌క్ష‌ణ కోసం చేస్తున్న‌ ప్ర‌తిఘ‌ట‌నా పోరాటంలో ప్ర‌జ‌లు, ఆదివాసులు, విప్ల‌వాభిమానులు కామ్రేడ్ హ‌రిభూష‌ణ్‌ను చూసుకుంటున్నారు.

కామ్రేడ్ హ‌రిభూష‌ణ్ అమ‌ర్ ర‌హే..
అమ‌ర వీరుల ఆశ‌యాల‌ను కొన‌సాగిస్తాం..
ప్ర‌జ‌ల‌దే అంతిమ విజ‌యం..
భార‌త క‌మ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్ట్ మావోయిస్టు) పార్టీ వ‌ర్ధిల్లాలి..

-అలెండి
Date : 02-07-2021

Keywords : haribhushan, corona, covid 19, cpi maoist
(2024-12-02 00:16:54)



No. of visitors : 3159

Suggested Posts


అమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలి

అమరుడు కామ్రేడ్ హరిభూషణ్ పై పాట రిలీజ్ చేసిన జననాట్యమండలి

వాళ్ళ అమరత్వంలోంచి అడవి చిగురిస్తున్నట్లుగానే ఉంటుంది

మావోయిస్టు పార్టీ నాయకులు హరిభూషన్, భారతక్క మరణం అనేక మందిని కలిచివేసింది. వాళ్ళతో పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేకున్నా వాళ్ళ గురించి విన్నవాళ్ళు అనేక విధాలుగా సపంధించారు. సోషల్ మీడియాలో అనేక మంది తమ భావాలను పంచుకున్నారు. కొందరు ఆ అమరులపై కవితలు రాశారు.

అస్తిత్వ ప‌రిధులు దాటి కార్మిక‌వ‌ర్గ ప్ర‌తినిధులై.. -పాణి

విషాదం కూడా రోమాంచితంగా ఉంటుందా? మామూలుగానైతే అంగీకరించలేం. కానీ అదీ అనుభవంలోకి వస్తుంది. అప్పుడే తెలుస్తుంది.. విషాద రేఖకు కూడా ఒక మెరుపు అంచు ఉంటుందని. అదే దు:ఖం నుంచి తెప్పరిల్లే ఓదార్పు గీతమవుతుంది. అదే నడచి వచ్చిన దారిని రక్త కాంతులతో దేదీప్యమానం చేస్తుంది. తెరచాప వలె భవిష్యత్తులోకి లాక్కెళుతుంది.

హరిభూషణ్ భార్య శారదక్క చనిపోలేదు... అసత్య‌ ప్రచారాలను ఖండించిన మావోయిస్టు పార్టీ

పోలీసులు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని నమ్మకండి. కా ,శారద, కా. హిడ్మా ఆరోగ్యంగానే వున్నారు. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే ఉద్ద్యేశ పూర్వకంగా దుష్ప్ర‌చారం చేస్తున్నారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆదివాసీ,