ఫాదర్ స్టాన్ స్వామి జైలు కవిత


ఫాదర్ స్టాన్ స్వామి జైలు కవిత

ఫాదర్

05-07-2021

ఫాదర్ స్టాన్ స్వామి జైలు నుంచి రాసిన కవితను వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ తెలుగులోకి అనువదించారు. తన ఫేస్ బుక్ వాల్ నుండి

స్టాన్ జైలు నుంచి రాసిన కవితను సరిగ్గా ఆరు నెలల కింద డిసెంబర్ 24న ఈ ఫేస్ బుక్ వాల్ మీద మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొకసారి అంతులేని దుఃఖంతో....

ఆదివాసుల కోసం జీవితమంతా వెచ్చించిన ఎనబై మూడు సంవత్సరాల వృద్ధుడు, జెసూయిట్ ఫాదర్ స్టాన్ స్వామి గతంలో ఎప్పుడైనా కవిత్వం రాశారో లేదో తెలియదు. ఇప్పుడు మాత్రం తన సహ జెసూయిట్ ఫాదర్ జోసెఫ్ గ్జేవియర్ కు తలోజా జైలు నుంచి రాసిన ఉత్తరంలో ఈ కవిత రాశారు. చూడండి:

జైలు జీవితం మహా సమవర్తి
స్టాన్ స్వామి

భయపెట్టే చెరసాల సింహద్వారం దాటగానే
అతి కనీస అవసరాలు మినహా
నీ సొంత వస్తువులన్నీ లాగేసుకుంటారు
ప్రతి నోటా మొదట వచ్చే మాట ʹమీకుʹ
ఆ తర్వాతే వెలువడుతుంది ʹనాకుʹ
ప్రతి ఒక్కరూ పీల్చే గాలి ʹమనదిʹ
నాదంటూ ఏమీ లేదు
నీది కూడ ఏదీ లేదు
ప్రతి ఒక్కటీ మనందరిదీ
మిగిలిపోయిన ఆహారం పారవేయడం జరగదిక్కడ
అదంతా ఆకాశంలో గిరికీలు కొట్టే పక్షులతో పంచుకునేదే
అవి గబుక్కున దిగి, కడుపు నింపుకుని, సంతోషంగా ఎగిరిపోతాయి
ఎందరెందరో యువకుల ముఖాలు చూసి దిగులువేస్తుంది
ʹఎందుకొచ్చారిక్కడికి?ʹ అని అడుగుతాను
తడబాటు లేకుండా తమ గాథలు వినిపిస్తుంటారు
ప్రతి ఒక్కరూ శక్తి కొద్దీ పనిచేయాలి
ప్రతి ఒక్కరికీ అవసరం కొద్దీ అందుతుంది
సోషలిజం అంటే అదే గదా
ఓహ్, ఈ సమష్టితత్వం బలవంతాన రుద్దబడింది
మనుషులందరూ స్వేచ్చగా, ఇష్టంగా ఇది అందుకుంటే
మనందరమూ నిజంగా భూమితల్లి బిడ్డలమే అయిపోమూ...

తెలుగు: ఎన్ వేణుగోపాల్

Keywords : stan swamy, bhimakoregaon, elgar parishad
(2023-03-27 01:44:31)



No. of visitors : 1286

Suggested Posts


ఆదివాసీల సహవాసి వెళ్ళిపోయాడు!

గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించారు. ఆయన వయసు 84. మే నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి స్వామి తొమ్మిది నెలలు జైలులో ఉన్నారు . పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఆదివారం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చారు .

Stan Swamy death an institutional murder by Modi government - Maoist Party

rrest, the governments would announce that they did all the needed and were helpless. As he guessed, the Indian Foreign Minister immediately responded and issued a report that his arrest was legal.

ఫాదర్ స్టాన్ స్వామిది హత్యే... భీమా కోరేగావ్ కేసును వెనక్కి తీసుకోవాలి - మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రకటన‌

దేశ దళిత అదివాసీ పీడిత ప్రజా సముదాయాల ప్రజలు తమ శ్రేయోభిలాషిని, ఒక నిజమైన ప్రజాస్వామికవాదినీ కోల్పోయారు. భారత దేశంలోని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తుల రాజ్య నిరంకుశత్వానికి 84 ఏళ్ల జిస్యూట్ ప్రీస్ట్ ఫాదర్ స్టానిస్లాస్ లూర్గుసామి బలైపోయారు.

స్టాన్ స్వామికి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీలు - నిరాకరించిన కోర్టు

భీమాకోరేగావ్ కేసులో జైల్లో ఉండి మరణించిన ఆదివాసీ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీల విఙప్తిని కోర్టు తిరస్కరించింది.

ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం

ఈ వార్తాపత్రిక సమాచారం ప్రభుత్వ ప్రణాళికను వివరిస్తుంది. రాష్ట్రంలోని ఆదిమ ఆదివాసీ సమూహాల యువతతో రెండు ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసి అడవుల్లోని మావోయిస్టులతో పోరాడటానికి అధునాతన గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇవ్వనున్నారు. తిరుగుబాటు నిరోధక చర్యలలో వారు భద్రతా దళాలకు సహాయం చేస్తారు.

bhima koregaon: స్టాన్ స్వామి చనిపోలేదు ‍- చంపబడ్డాడు

ఫాదర్ స్టాన్ స్వామి మరణం అనేకమందిని ధుంఖంలో ముంచింది. పీడితుల పక్షాన ఉన్నందుకే అతనిపై అబద్దపు కేసులు బనాయించి, జైల్లో వేధించి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా అతని మరణానికి

స్టాన్ స్వామి మృతి కలచి వేసింది, రాజకీయ ఖైదీలను విడుదల చేయండి ‍-ఐక్యరాజ్యసమితి

ఫాదర్ స్టాన్ స్వామి జైల్లోనే రిమాండు ఖైదీగా మృతి చెంద‌డం ప‌ట్ల‌ ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ‌హక్కుల హైక‌మిష‌న‌ర్ మైఖేల్ బ్యాచ్‌లెట్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

అతని మరణం ఒక‌ స‌త్య ప్ర‌క‌ట‌న -విరసం

అతను వెళ్లి పోయాడు. మనందరిని వదిలి సాగిపోయాడు. అతను భూగోళం ఖాళీ చేసాక దుఃఖ పడటం మన వంతయింది. అతను గౌరవ వీడ్కోలు తీసుకోలేదు. శిలువతో సెలవంటూ వెళ్లి పోయాడు.

వాళ్ళు ఈ నేలకు శాపం పెట్టారు ---- అరుంధతీ రాయ్

భారతదేశ ప్రజాస్వామ్యం క్రమేపీ పయనిస్తున్న ʹహత్యాపథంలోʹ స్టాన్ స్వామి హత్య ఒక పెద్ద పరిణామం. చూడటానికి చిన్నదిగా కనిపించినా, నిజానికి ఇది చాలా పెద్ద సంఘటన. విస్తృతంగా ప్రభావం వేసిన ఒక అత్యంత పెద్ద సంఘటన.

మమ్మల్ని మన్నించు సామీ! బ్రతుక్కి అర్థం తెలీనోళ్లం

బాగా చదువుకుని, రెండు చెవులూ సరిగా పనిచేయక, అవయవాలు సరిగా పనిచేయని పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ, వెన్నెముక కిందిబాగం పాడైపోయి సరిగా కూర్చోలేని స్తితిలో జనంలో బ్రతికే అదివాసీల తరపున మాట్లాడే ఒక 84 ఏళ్ల ముసలితనపు హక్కుల కార్యకర్త, ఎవరి హత్యకోసం? ఏ రకంగా కుట్ర పన్నాడో? ఆధారాలు లేకుండా, ఇలా జైలులో నిర్బంధించి, చావుకి ఎరవేయడాన్ని ఏమందాం?

Search Engine

అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
more..


ఫాదర్