మమ్మల్ని మన్నించు సామీ! బ్రతుక్కి అర్థం తెలీనోళ్లం

మమ్మల్ని

07-07-2021

తుపాకి పట్టుకుని, సరిగ్గా మాట్లాడడం కూడా తెలియని ఆదివాసీల కోసం పోరాడితే, ఎదురుపడిన చోటనే చంపేయాలనే ఎన్‌కౌంటర్" బావుందనుకుందాం!

మరి బాగా చదువుకుని, రెండు చెవులూ సరిగా పనిచేయక, అవయవాలు సరిగా పనిచేయని పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ, వెన్నెముక కిందిబాగం పాడైపోయి సరిగా కూర్చోలేని స్తితిలో జనంలో బ్రతికే అదివాసీల తరపున మాట్లాడే ఒక 84 ఏళ్ల ముసలితనపు హక్కుల కార్యకర్త, ఎవరి హత్యకోసం? ఏ రకంగా కుట్ర పన్నాడో? ఆధారాలు లేకుండా, ఇలా జైలులో నిర్బంధించి, చావుకి ఎరవేయడాన్ని ఏమందాం?

మొన్న నోరులేని కోళ్ల కాళ్లకు, కత్తులు కట్టి ఆడే పందేలాటద్వారా సంప్రదాయాల్ని, బీదలు, కిందికులాల పిల్లలచేత తెలుగు మీడియం చదివిస్తూ భాషా సంస్కృతిని కాపాడుతూ, ప్రజలు దాచుకున్న బ్యాంకులకు కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన ఒక పెద్దమనిషి కోసం, సెసెన్స్ కోర్టు, ప్రత్యేక కోర్టు, హైకోర్టు, చివరికి సుప్రీంకోర్టు పోటీలు పడి గంట గంటకూ తీర్పులిచ్చి, న్యాయం నిలబెట్టిన న్యాయ వ్యవస్థ వున్న దేశంలో, ఈ 84ఏళ్ల ముసలాయన "అయ్యా, వొణికే చేతితో నోట్లో ముద్ద నోటికి తీసుకోలేకున్నా, జ్యూసు చేసుకుని పైపుద్వారా తాగే సిప్పర్ ఇప్పించండి" అని ఇదే కోర్టుని అడిగినప్పుడు, నానాటికీ నా ఆరోగ్యం క్షీణిస్తోంది, నన్ను నా అదివాసీలుండే చోట చనిపోయే అవకాశం ఇప్పించండి అని అడిగినప్పుడు, కొంచెం కొంచెంగా తినే తిండి తగ్గుతూ చావుకు దగ్గరవుతున్నానని అడిగినప్పుడు.. ఇదే న్యాయం ఎక్కడికి పోయింది? అవును వుంది, అది ఈ రోజు, ప్రగాఢ సంతాపం తెలపడానికి మాత్రమే పనికివచ్చింది.

చదువుకుని, నాగరిక సమాజపు నగరాల్లో, వేలాదిమంది గొంతుక కూర్చుంటే తప్ప, కనీస స్పందనలేని రాజ్య వ్యవస్థ, ఎక్కడో మారుమూల అడవుల్లో, తమ హక్కులు తెలియని అదివాసీలను తరిమేసి, మైన్స్ తవ్వుకునే క్రమంలో పత్రికల్ని, వ్యక్తులని, వ్యవస్థల్ని మేనేజ్ చేసే పెట్టుబడిదారులైన టాటా, బిర్లా, జిందాల్, అంబానీ, అదానీలను ఆదర్శంగా చూసే మన తెలివి తక్కువ తనానికి ఇంకా ఎందరు బలికావాలో.

రండి, ఎవరే జైలులో, ఏ కారణం చేత, ఎన్నేళ్ళు మగ్గి చస్తే మనకేం? మన పక్క మనిషి పడిపోతేనే పట్టించుకునే సమయంలేనప్పుడు, అడవులదాకా నడవడం ఎందుకు? మన పెట్టుబడిదారులు సృష్టించిన వస్తువులు, సంపాదించుకునే సంస్కృతిలో తరిద్దాం. కాసుల రేసులో తగ్గకుండా పరిగెడదాం. ఎక్కువ సంపాదించుకుందాం, ఎక్కువ కొనుక్కుందాం, ఎక్కువ కూడబెట్టుకుందాం.

మమ్మల్ని మన్నించు సామీ! మీలాంటివాళ్లు పోయినప్పుడెల్లా రెండు కన్నీటి బొట్లు వదిలేసి, ఒక రోజంతా మనసు ముక్కలుగా విరగ్గొట్టుకోవడం మాత్రమే వచ్చు. మరుసటి రోజు అంతా మామూలే, కన్నీళ్లు తుడిచేసుకుని, ముక్కల్ని అతికించుకుని మళ్ళీ డబ్బు, వస్తువులు, మర్యాదలు, హోదాల కోసం పెరిగెత్తడం రొప్పుతూ, రోజుతూ.
మమ్మల్ని మన్నించు సామీ! బ్రతుక్కి అర్థం తెలీనోళ్లం.

- సిద్దార్థి సుభాశ్ చంద్రబోస్

Keywords : stanswamy, bhimakoregaon, BK16, NIA, Death
(2024-07-16 04:20:53)No. of visitors : 1134

Suggested Posts


ఆదివాసీల సహవాసి వెళ్ళిపోయాడు!

గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించారు. ఆయన వయసు 84. మే నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి స్వామి తొమ్మిది నెలలు జైలులో ఉన్నారు . పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఆదివారం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చారు .

ఫాదర్ స్టాన్ స్వామి జైలు కవిత

భయపెట్టే చెరసాల సింహద్వారం దాటగానే అతి కనీస అవసరాలు మినహా నీ సొంత వస్తువులన్నీ లాగేసుకుంటారు

Stan Swamy death an institutional murder by Modi government - Maoist Party

rrest, the governments would announce that they did all the needed and were helpless. As he guessed, the Indian Foreign Minister immediately responded and issued a report that his arrest was legal.

ఫాదర్ స్టాన్ స్వామిది హత్యే... భీమా కోరేగావ్ కేసును వెనక్కి తీసుకోవాలి - మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రకటన‌

దేశ దళిత అదివాసీ పీడిత ప్రజా సముదాయాల ప్రజలు తమ శ్రేయోభిలాషిని, ఒక నిజమైన ప్రజాస్వామికవాదినీ కోల్పోయారు. భారత దేశంలోని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తుల రాజ్య నిరంకుశత్వానికి 84 ఏళ్ల జిస్యూట్ ప్రీస్ట్ ఫాదర్ స్టానిస్లాస్ లూర్గుసామి బలైపోయారు.

స్టాన్ స్వామికి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీలు - నిరాకరించిన కోర్టు

భీమాకోరేగావ్ కేసులో జైల్లో ఉండి మరణించిన ఆదివాసీ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీల విఙప్తిని కోర్టు తిరస్కరించింది.

ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం

ఈ వార్తాపత్రిక సమాచారం ప్రభుత్వ ప్రణాళికను వివరిస్తుంది. రాష్ట్రంలోని ఆదిమ ఆదివాసీ సమూహాల యువతతో రెండు ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసి అడవుల్లోని మావోయిస్టులతో పోరాడటానికి అధునాతన గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇవ్వనున్నారు. తిరుగుబాటు నిరోధక చర్యలలో వారు భద్రతా దళాలకు సహాయం చేస్తారు.

స్టాన్ స్వామి మృతి కలచి వేసింది, రాజకీయ ఖైదీలను విడుదల చేయండి ‍-ఐక్యరాజ్యసమితి

ఫాదర్ స్టాన్ స్వామి జైల్లోనే రిమాండు ఖైదీగా మృతి చెంద‌డం ప‌ట్ల‌ ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ‌హక్కుల హైక‌మిష‌న‌ర్ మైఖేల్ బ్యాచ్‌లెట్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

bhima koregaon: స్టాన్ స్వామి చనిపోలేదు ‍- చంపబడ్డాడు

ఫాదర్ స్టాన్ స్వామి మరణం అనేకమందిని ధుంఖంలో ముంచింది. పీడితుల పక్షాన ఉన్నందుకే అతనిపై అబద్దపు కేసులు బనాయించి, జైల్లో వేధించి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా అతని మరణానికి

అతని మరణం ఒక‌ స‌త్య ప్ర‌క‌ట‌న -విరసం

అతను వెళ్లి పోయాడు. మనందరిని వదిలి సాగిపోయాడు. అతను భూగోళం ఖాళీ చేసాక దుఃఖ పడటం మన వంతయింది. అతను గౌరవ వీడ్కోలు తీసుకోలేదు. శిలువతో సెలవంటూ వెళ్లి పోయాడు.

వాళ్ళు ఈ నేలకు శాపం పెట్టారు ---- అరుంధతీ రాయ్

భారతదేశ ప్రజాస్వామ్యం క్రమేపీ పయనిస్తున్న ʹహత్యాపథంలోʹ స్టాన్ స్వామి హత్య ఒక పెద్ద పరిణామం. చూడటానికి చిన్నదిగా కనిపించినా, నిజానికి ఇది చాలా పెద్ద సంఘటన. విస్తృతంగా ప్రభావం వేసిన ఒక అత్యంత పెద్ద సంఘటన.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మమ్మల్ని