కరోనా వల్ల నిమిషానికి 7గురు చనిపోతే ఆకలి వల్ల 11 మంది చనిపోతున్నారు


కరోనా వల్ల నిమిషానికి 7గురు చనిపోతే ఆకలి వల్ల 11 మంది చనిపోతున్నారు

కరోనా


10-07-2021

ప్రపంచవ్యాప్తంగా, ఆకలి వల్ల ప్రతి నిమిషానికి 11 మంది మరణిస్తున్నారని, గత ఒక సంవత్సరంలో కరువు లాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారి సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని ఆక్స్‌ఫామ్ అనే సంస్థ ʹది హంగర్ వైరస్ మల్టీప్లెక్స్ʹ అనే తాజా నివేదికలో పేర్కొంది. కోవిడ్ -19 ఫలితంగా ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న ఏడుగురు వ్యక్తుల కంటే 36 శాతం ఎక్కువ. బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా వంటి మధ్య ఆదాయ దేశాలలో కూడా ఆకలి తీవ్రమైంది, ఇవి అత్యధిక సంఖ్యలో కోవిడ్ -19 సంక్రమణను ఎదుర్కొన్నాయి.

ప్రపంచంలో 155 మిలియన్ల మంది ప్రజలు ఆహార అభద్రత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ఈ సంఖ్య గత సంవత్సరం గణాంకాల కంటే 20 మిలియన్లు ఎక్కువ అని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. వీరిలో మూడింట రెండొంతుల మంది ఆకలితో బాధపడుతున్నారు, యిందుకు కారణం వారి దేశాలలో కొనసాగుతున్న సైనిక వివాదం.

ఆకలితో మరణించిన వారి సంఖ్య, కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్యను మించింది. కోవిడ్ -19 కారణంగా, ప్రపంచంలో ప్రతి నిమిషానికి సుమారు ఏడుగురు మరణిస్తున్నారు.

మాక్స్మన్ తన నివేదికలో ఇలా చెప్పాడు - ʹకోవిడ్ -19 ఆర్థిక ప్రభావం, క్రూరమైన ఘర్షణలు, తీవ్రతరం అవుతున్న వాతావరణ సంక్షోభం 5,20,000 మందికి పైగా ప్రజలను ఆకలి అంచుకు నెట్టివేసింది. ప్రపంచవ్యాప్త కరోనా విపత్తును ఎదుర్కోవటానికి బదులుగా, శత్రు వర్గాలు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి, చివరికి వాతావరణ సంబంధిత విపత్తులు, ఆర్థిక పర యిబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది ప్రజలను ప్రభావితం చేస్తాయి.

అదే సమయంలో, కోవిడ్ -19 ఆర్థిక పతనం, పేదరికం, అసమానతలను తీవ్రతరం చేసింది. 400 కి పైగా వాతావరణ సంబంధిత విపత్తులు ప్రజలను ఆకలికి గురి చేశాయి. ఆహార ఉత్పత్తిని తీవ్రంగా దెబ్బతీసింది ప్రపంచ ఆహార ధరలలో 40 శాతం పెరుగుదలకు దారితీసింది, ఇది ఒక దశాబ్దంలో అత్యధిక పెరుగుదల.

కరోనా వైరస్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సైన్యాలపై చేసే ఖర్చు 51 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న మొత్తం ఆకలిని అంతం చేయడానికి ఐక్యరాజ్యసమితికి అవసరమైన డబ్బు కంటే కనీసం ఆరు రెట్లు ఎక్కువ. ఈ నివేదికలో, "ఆకలితో ఎక్కువగా ప్రభావితమైన" జాబితాలో వున్న ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా మరియు యెమెన్ వంటి దేశాలన్నింటిలో ఘర్షణలు జరుగుతున్నాయి.

తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి

Keywords : Oxfam report, corona, covid 19, hunger,Eleven people die of hunger each minute
(2023-09-28 09:48:15)No. of visitors : 1021

Suggested Posts


కరోనా కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల ఎవ్వరూ చనిపోలేదట! -పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల రోగులు మరణించలేదని కేంద్రం ప్రకటించింది. అలా చనిపోయినట్టు రాష్ట్రాలనుంచి కానీ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కానీ సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది.

దేశంలో కరోనా కల్లోలం..గంటకు 62 మంది మృతి, 10 వేల మందికి పైగా పాజిటీవ్ !

దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న వేగం జనజీవితాన్ని కకావికలం చేస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో స్మశానాలు శవాలతో నిండి పోతున్నాయి. నిమిషానికి 181 మందికి, గంటకు 10,895 మందికి కరోనా సోకుతోందంటే ఆ మహమ్మారి

Corona Vaccination: వ్యాక్సిన్ విషయంలోనూ స్త్రీల పట్ల వివక్ష‌

దేశంలో స్త్రీల పట్ల అన్ని రంగాల్లోనూ వివక్ష కొనసాగుతోంది. వేల ఏండ్లుగా కొనసాగుతున్న ఈ వివక్ష ఈ ఆధునిక కాలంలోనూ తప్పడం లేదు. చివరకు కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ ఈ వివక్ష కొనసాగుతున్నది.

బీజేపీ ఎంపీ ప్రచార యావ... కోవిడ్‌తో చనిపోయిన వారిని స్మ‌శానానికి తరలించే వాహనం ముందు ఫోటోలకు పోజులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్ బీజేపీ ఎంపీ అలోక్‌ శర్మ కోవిడ్‌తో చనిపోయిన వారిని శ్మశానానికి తరలించే ʹముక్తి వాహనంʹ ముందు నిలబడి ఫోటోలకు పోజిచ్చారు. పైగా తన ఫోటో షూట్ కోసమే వాహనాలను చాలా సేపు ఆపారంటూ ఆరోపణలు

ʹమోడీ గారూ, మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారుʹ అని పోస్టర్లు -15 మంది అరెస్టు

ʹమోడీ గారూ, మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారు?ʹʹ అని రాసున్న పోస్టర్లను ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో గోడలకు అతికించారు. నిజాన్ని ఇలా బహిరంగంగా చెప్పినందుకు మహా ఘనత వహించిన ఈ దేశ చక్రవర్తులవారికి కోపం తెప్పించింది.

COVID19 : ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి - మద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు

దేశంలో కోవిడ్ -19 ను వ్యాప్తి చేయడానికి భారత ఎన్నికల కమిషన్ దే ఏకైక బాధ్యత అని మద్రాస్ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.

Search Engine

అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
more..


కరోనా