సూదికొండను కాపాడుకుందాం - ప్రజల జీవించే హక్కుకై పోరాడ‌దాం


సూదికొండను కాపాడుకుందాం - ప్రజల జీవించే హక్కుకై పోరాడ‌దాం

సూదికొండను

11-07-2021

శ్రీకాకుళం జిల్లా పలాస, కాశిబుగ్గ జంటనగరాల జీవన సమతుల్యన్నీకాపాడుతున్న చారిత్రాత్మక భూభాగం సూదికొండ (నెమలికొండ) ను నాశనం చేస్తున్నారు పాలకులు. కొందరు పెద్దల లాభాల కోసం పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు పాలకులు. ఈ నేపథ్యంలో సూది కొండను కాపాడుకుందాం అనే నినాదంతో ప్రజా సంఘాలు పోరాటం ప్రారంభించాయి. ʹసూది కొండ పరిరక్షణ పోరాట కమిటీʹ ని ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాయి ఆ క్రమంలో పలాస ప్రజలు, కమిటీ నాయకులు శ్రీకాకుళం కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా సూది కొండ పరిరక్షణ పోరాట కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

పలాస కాశిబుగ్గ జంటనగరాల జీవన సమతుల్యాన్నికాపాడుతున్న చారిత్రాత్మక భూభాగం సూది కొండ .నెమలికొండ.!!

ఈరోజు సూదికొండ కొంతమంది పెద్దల సంపద కై తవ్వకాలతో కనుమరుగు అవుతుంది. ప్రజల అనుమతి లేకుండానే అక్రమంగా సంపాదించుకున్న అనుమతులతో కొందరి కారణంగా సూది కొండ రోజురోజుకి కరిగిపోతున్నది. ఈరోజు సూదికొండ నెమలి కొండ ప్రాంతంలో సుమారు వెయ్యి కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కుటుంబాలన్నీ కడు పేదరికంలో ఉన్న కుటుంబాలు. ఈ కొండ తవ్వకాలతో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.

నీరు మనిషి జీవనాధారం. ఆ జీవనాధార మే కనుమరుగైతే ఇక ఆ ప్రాంతం విడిచి పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ తవ్వకాలను ఆపాలనే ఆందోళన చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో జీవావరణం పై జరుగుతున్న ఈ దోపిడీని ప్రశ్నిద్దాం..!! అద్భుతమైన జీవ వైవిధ్యం పచ్చని ప్రకృతి. జీవ సంపద ఉన్న ఈ కొండను పరిరక్షించుకుందాం. జీవించే హక్కు కే పోరాడదాం.

ఇది కేవలం సూది కొండ కొండ దగ్గర ఉన్న ప్రజల సమస్య కాదు పలాస, కాశిబుగ్గ జంటనగరాల ప్రజల సమస్య కూడా. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మునుపుట కంటే 3,4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరిగాయి . ఈ కొండను కూడా గ్రావెల్ పేరుతో అమ్మేస్తే మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అంతేకాదు ఈ కొండ కనుమరుగైతే వర్షపాతం కూడా ఈ ప్రాంతంలో తగ్గిపోతుంది. అందుకే జంటనగరాల ప్రజలరా, పర్యావరణ ప్రేమికులారా... బుద్ధి జీవులారా పర్యావరణాన్ని కాపాడుకుందాం..!!
సూది కొండ ప్రజల పోరాటానికి మద్దతు తెలుపుదాం..!!
ఇట్లు
సూది కొండ పరిరక్షణ పోరాట కమిటీ.

ఈరోజు సూది కొండ ప్రజలతో కలిసి శ్రీకాకుళం కలెక్టర్ ను కలిసిన వారిలో పౌరహక్కుల సంఘం (CLC) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పత్తిరి దానేష్, పి డి ఎం జిల్లా అధ్యక్షుడు సాలీన వీరస్వామి, అమరుల బంధుమిత్రుల సంఘం జోగు కోదండం, పీకేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొర్రయి నీలకంఠం. ఉత్తరాంధ్ర మహిళా సంఘం పోతనపల్లి అరుణ, పోతనపల్లి నాగమణి తోపాటు
పి వైకుంటం, డొక్కరె దానయ్య. గంగయ్య. లక్ష్మణ్ త‌దితరులు ఉన్నారు.

Keywords : srikakulam, andhrapradesh, sudikonda, nemalikonda, Environment
(2021-09-22 04:21:03)No. of visitors : 507

Suggested Posts


50 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు!

1969, మే 27న మొట్టమొదటి బూటకపు ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఆరుగురు కామ్రేడ్స్ పంచాది కృష్ణ మూర్తి, తామాడ చినబాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాల్ రావు, రామచంద్ర ప్రధానో, నిరంజన్ సాహు, శృంగవరపు నర్సింహ మూర్తి అమరులయ్యారు.

చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదు

సరిగ్గా యాబై సంవత్సరాల కింద ఈ రోజున శ్రీకాకుళ విప్లవోద్యమ నిర్మాతలు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసంలను పోలీసులు కాల్చిచంపారు.

శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం

ఖైదీల కిచెన్‌ హాల్‌, అధికారుల కిచెన్‌ హాల్‌ వేరు వేరుగా ఉండడం వల్ల అధికారులకు రోజు విందు భోజనాలు, ఖైదీలకు మాత్రం పశువులు కూడా తినని ఆహారం పెడుతున్నారు. ఇంటర్య్వూ సమయంలో బంధువులు తెచ్చిన తినే వస్తువులు కూడా అడ్డగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీదెబ్బలే కాక, సింగిల్‌ లాకాప్‌లో మాగ్గాల్సిందే. జైళ్లో పేషెంట్లు సైతం స్వెట్టర్లు, చెప్పులు వేసుకోవడానికి అనుమ

రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే

సర్వం కోల్పోయిన ప్రజలను నిర్లక్ష్యంగా వాళ్ల చావుకు వాళ్లను వదిలేసింది. ప్రజాద్రోహానికి పాల్పడింది. మనం ప్రజల పక్షాన నిలబడదాం. ఇదే రాజద్రోహమయ్యేటట్లయితే అభ్యంతరమెందుకు..? రండి రాజద్రోహం చేద్దాం.

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!

సీనియర్ విప్లవ కమ్యూనిస్టు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మ గారు ఈరోజు (23-9-2020) రాత్రి 7 గం. కు విశాఖలో అమరులయ్యారు. ఆమె గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు.

చెదరని విశ్వాసం... సడలని ఆచరణ... శ్రీకాకుళ పోరాట పంథాలో కా. చంద్రమ్మ

యాభై ఏళ్లుగా మడమ తిప్పని విప్లవాచరణకు ప్రతిరూపం కా. చంద్రమ్మ. విప్లవంలో ఆమె నిండు జీవితాన్ని గడపడం గర్వకారణం. కరోనా బారిన పడి అమరురాలు కావడం విషాదం. శ్రీకాకుళ పోరాట పంథాలో చంద్రమ్మ వెనుతిరిగి చూడలేదు.

Search Engine

300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు
more..


సూదికొండను