ఫాదర్ స్టాన్ స్వామిది హత్యే... భీమా కోరేగావ్ కేసును వెనక్కి తీసుకోవాలి - మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రకటన‌

ఫాదర్


15-07-2021

(ఫాదర్ స్టాన్ స్వామి మరణం పై భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...)

బ్రాహ్మణీయ హిందుత్వ నిరంకుశ విధానాలకు బలయిన ఫాదర్ స్టాన్ స్వామికి విప్లవ జోహార్లు

దేశ దళిత అదివాసీ పీడిత ప్రజా సముదాయాల ప్రజలు తమ శ్రేయోభిలాషిని, ఒక నిజమైన ప్రజాస్వామికవాదినీ కోల్పోయారు. భారత దేశంలోని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తుల రాజ్య నిరంకుశత్వానికి 84 ఏళ్ల జిస్యూట్ ప్రీస్ట్ ఫాదర్ స్టానిస్లాస్ లూర్గుసామి బలైపోయారు.ముంబాయిలోని బాంద్రాలో గల హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో మే 28 నుండి చికిత్స పొందుతున్న ఫాదర్ సామి గుండెపోటుతో జులై 5నాడు మధ్యాహ్నం 1.30కు తుది శ్వాస విడిచారు. ఆయనకు మా పార్టీ కేంద్రకమిటీ వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు తెలుపుతోంది. ఆయన కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు, ఆయన నిర్వహించిన ʹబగైచాʹ (తోట-సామాజిక పరిశోధన శిక్షణా కేంద్రం) లోని సహవాసులకు, ఆయనను అమితంగా ప్రేమించిన ఆదివాసులకు ఆయన మరణం తీరని లోటు. వారికి సాంత్వన చేకూరాలని కోరుకుంటూ బగైచా వాసులంతా అయన ఆశయాల పరిపూర్తికి పునరంకితమవుతారనీ మా పార్టీ అశిస్తున్నది.

తమిళనాడులోని త్రిచి (తిరుచిరాపల్లి)లో ఎప్రిల్ 26, 1937 రోజు స్టానీ స్లాస్ లూర్గుసామి జన్మించారు. యూనివర్సిటీ అఫ్ మనీలాలో సోషియాలజీలో పీజీ చేశారు. బ్రసెల్స్ లో చదువుకుంటున్నపుడే అక్కడి క్రైస్తవ మత పెద్దల సాన్నిహిత్యంతో పేదల పట్ల సేవాభావాన్ని పెంచుకున్నారు. 1975 నుండి 1986 వరకు బెంగళూరులో ఇండియన్ సోషల్ ఇనిస్టిట్యూట్ కు డైరెక్టర్ గా పని చేశారు. ఆ తరువాత 1991లో ఝార్ఖండ్ కు చేరి బగైచా (తోట-సామాజిక పరిశోధన శిక్షణా కేంద్రం)ను ఏర్పాటు చేసుకొని గత మూడు దశాబ్దాలుగా అక్కడి ఆదివాసుల మధ్యనే పని చేస్తున్నారు. బగైచాలో అదివాసీ ప్రజావీరులు బిర్సా ముండా, తిలక్ మాజీ, సిద్దే కానోల స్థూపాలు నిర్మించి అడవి పై అదివాసుల హక్కుల కోసం వారి ఆశయాల వెలుగులో అవివాహిత ఫాదర్ కృషి చేయసాగారు. ʹజెంషడ్ పూర్ ప్రావిన్స్ అఫ్ ది జీసస్ʹలో చేరి ప్రీస్టుగా మారారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో వారి భూములను, భారీ డ్యాముల నిర్మాణానికి, గనులు తవ్వకానికి, టౌన్‌షిప్పుల కోసం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. అందుకే ఆయనను అదివాసులు అమితంగా ప్రేమిస్తారు,గౌరవిస్తారు, అనుసరిస్తారు. ఆయన మరణంతో దేశం పీడిత వర్గాల, ప్రత్యేక సామాజిక సముదాయాల నిస్వార్థ సేవకున్ని కోల్పోయింది.

ఈ దేశంలోని నిర్దోషులైన పీడిత దళిత, ఆదివాసీ జన సముదాయాలకు చెందిన వేలాది మందిపై పోలీసులు అనేక తప్పుడు కేసులు ఆరోపిస్తూ ఎంతగా వేధిస్తున్నారో తెలిసిందే. అలాంటి వారికి బెయిల్స్, త్వరిత విచారణ కోసం పని చేసే లక్ష్యంతో ʹశిక్షలు పడిన ఖైదీల సంఘీభావ కమిటీʹ (పీ.పీ.ఎస్.సీ) ఏర్పడి పనిచేస్తున్నది. ఫాదర్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థకు కన్వీనర్ గా పని చేస్తున్నారు. అయన ఝార్ఖండ్ లోని వివిధ జైళ్లలో సంవత్సరాల తరబడిగా మగ్గుతున్న దాదాపు 3,000 మంది ఆదివాసులను కలిసి మాట్లాడగా 97 శాతం విచారణలో ఉన్న ఖైదీలు తమను పోలీసులు తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టినట్టు చెప్పారంటూ స్వామి తన పరిశోధనా గ్రంధంలో రాశారు.

దళిత, ఆదివాసీ జన సముదాయాలకు చెందిన వారిని తమ హక్కుల గురించి జాగరూకులను చేయడం గిట్టని కేంద్ర నిఘా సంస్థలు ముఖ్యంగా ఎన్ ఐ ఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అయన్ని కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర చేసారంటూ తయారు చేసిన భీమా కోరేగాం తప్పుడు కేసులో ఇరికించి పాశవికమైన చట్టాల మాటున జైలు పాలు చేయడాన్ని మా పార్టీ సహ దేశంలోని అనేక మంది విద్యావేత్తలు, ఆదివాసీ శ్రేయోభిలాషులు, దేశభక్తులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ముందు నుండి ఖండిస్తున్నారు.

2018 జనవరి 1 నాడు భీమా కోరేగాంలో హిందుత్వ శక్తులు సృష్టించిన విధ్వంసాన్ని దేశంలోని ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవకర శక్తుల పైకి, సామాజిక రాజకీయ కార్యకర్తల పైకి నెట్టి 2018 మధ్య నుండి దేశవ్యాప్తంగా ముంబై పోలీసులు కొనసాగిస్తున్న అరెస్టుల పరంపరలో భాగంగా 83 సంవత్సరాల క్రైస్తవ ఫాదర్ స్వామిని 16వ వ్యక్తిగా 8 అక్టోబర్ 2020 రోజు ఏలాంటి వారంటు లేకుండానే ఆయనతో అతి దురుసుగా వ్యవహరిస్తూ బగైచాలో అరెస్టు చేశారు. అంతకు ముందు రాంచీలోని ఆయన నివాసం బగైచాపై రెండు సార్లు మొదట 28 ఆగస్టు 2018, తరువాత 12 జూన్ 2019 నాడు పోలీసులు దాడులు చేసి సోదాలు జరిపారు. 2019 జూలై 27-30 మధ్య 15 గంటలు కేంద్ర నిఘా సంస్థలు ఆయనను విచారించాయి. ఆ సందర్భంగా విచారణాధికారులు అయన కంప్యూటర్లో దొరికిన సమాచారంతో ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉ న్నాయన్న విషయం రూఢీ అవుతోందని చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితాలనీ, ఆ సమాచారమంతా వారు పేర్చిందేననీ వాటితో తనకెలాంటి సంబంధం లేదనీ ఫాదర్ తీవ్రంగా ఖండించారు.

2018 నుండి తనను అరెస్టు చేయడానికి అనేక విధాలుగా వెంటాడుతున్న ఎన్ ఐ ఏ తనను భీమా కోరేగాం కేసులో అనుమానితుడిగా పేర్కొనడంపై అయన 6 అగస్టు 2018 నాడు ఒక స్పష్టమైన ప్రకటనను విడుదల చేశారు. అందులో అయన కేంద్ర నిఘా సంస్థల కౌటిల్యాన్ని బయటపెడుతూ తనకు వామపక్ష ఉగ్రవాద మావోయిస్టులతో సంబంధాలున్నాయనే విషయాన్ని, రాంచీలోని నంకుంలో గల తన ʹబగైచాʹ మావోయిస్టులకు చెందినదేననే విషయాన్ని నిరూపించాలనే దుర్బుద్ధితోనే వారు తన అరెస్టుకు రంగం సిద్ధం చేశారన్నారు. ఆ రెండు నిరాధారమైన ఆరోపణలనీ వాటిని తను నిర్ద్వందంగా ఖండిస్తున్నానని స్వామి తన ప్రకటనలో స్పష్టం చేశారు.

అలాగే లాక్ డౌన్ సమయంలో 65 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు బయటకు రాకూడదనీ ఝార్ఖండ్ ప్రభుత్వ నియమం ఉన్నందున ఇకపై తన విచారణను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే జరుపాలని కూడ తేటతెల్లం చేశారు. ఒకవేళ కేంద్ర నిఘా సంస్థలు తనను ముంబాయిలో విచారణకు రావాలని కోరితే మాత్రం ఆ కారణాలతోనే తాను నిరాకరిస్తానని తెలిపారు. అయినప్పటికీ ఆయన పరిస్థితిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎన్ ఐ ఏ 83 ఏళ్ల సామిని అరెస్టు చేయడం అమానుషం.

23 అక్టోబర్ 2020 నుండి చివరి వరకు ఫాదర్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టులు పోలీసు వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ నిర్దాక్షిణ్యంగా నిరాకరించాయి. అందులో భాగంగా 21 మే 2021 నాడు తన బెయిల్ దరఖాస్తును పరిశీలిస్తున్న ముంబాయి కోర్టుకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తాను ʹప్రభుత్వ నిర్వహణలోని జేజే అసుపత్రికి వెళ్లడం కన్నా చావునే కోరుకుంటాననిʹ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వాకాన్ని నిరసించారు. 8 మాసాల క్రితం వరకూ అంటే అరెస్టుకు ముందు వరకు తాను తన పనులన్నీ ఎవరి సహాయం లేకుండానే చేసుకోగలిగే వాడిననీ కానీ తలోజా జైలు తనను క్రమంగా ఏ పనీ స్వంతంగా చేసుకోలేని దుస్థితికి చేర్చిందని ఆ ʹన్యాయమూర్తులకు చెప్పారు. జేజే అసుపత్రిలో ఇచ్చే మందు బిళ్లలకు తన ఆరోగ్యం కుదుటపడదనీ వైద్యులకూ చెప్పాడు.

ʹనేను ఆసుపత్రికి వెళ్లను, ఆదివాసుల మధ్యనే కన్ను మూస్తాను, బెయిలు ఇవ్వండి చాలుʹ అని అభ్యర్థించిన స్టాన్ సామి నిజమైన అదివాసీ శ్రేయోభిలాషి.

తీవ్రమైన అనారోగ్యంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఫాదరకు జైలు వైద్యుడు మామూలు జ్వరం, బలహీనతనే ఉందనడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుంది.ఎన్ ఐ ఏ కౌన్సిల్ కూడా ఆయన అనారోగ్యాన్ని లెక్కచేయకుండా స్వామి చాలా వరకు వార్ధక్య సమస్యలే ఎదుర్కొంటున్నాడనీ, ఆయనకు ఒక సహాయకుడిని సమకూర్చామనీ, పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని కోర్టుకు తప్పుడుగా నివేదించింది. తుదకు ఆయన అనారోగ్య స్థితి ఎంతగా దిగజారిందంటే పార్కిన్సన్ జబ్బుతో వణికే అవయవాలతో ఆహారం తీసుకోలేక పోతున్న ఆయనకు ఒక సిప్పరు, స్ట్రా అనుమతించడం గగనమైంది.

ఆయనను విడుదల చేయాలనీ అనేక మంది మేధావులు, రాజకీయ నాయకులు, దేశ విదేశాలలోని క్రైస్తవ మిషనరీ సంస్థలు ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ భారత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పార్కిన్సన్ జబ్బుతో పాటు రెండుసార్లు హెర్నియా శస్త్ర చికిత్స జరుగడంతో పాటు న్యూమోనియా సహ పలు వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్న స్టాన్ స్వామికి జైలులో మే 30 నాడు కొరోనా పాజిటివ్ బయటపడింది. ʹనేను జైలులో ఉన్నానని స్నేహితులు శ్రేయోభిలాషులు బాధపడవచ్చు కానీ ఏళ్ల తరబడి తామెందుకు జైల్లో ఉన్నామో తమ మీద ఆరోపణలేంటో తెలియని నిరుపేదలను అమాయకులను నేను చూశాను. వాళ్ల గురించి పట్టించుకునే వాళ్లే లేరుʹ అంటూ తపనపడిన ఫాదర్ ఆశయాలను కొనసాగించడానికి విశాల మిత్ర బృందం పూనుకుంటుందనీ మా పార్టీ పూర్తి విశ్వాసంతో ఉంది.

అయన మరణంపై దేశంలోని అనేక మంది విద్యావేత్తలు, దేశభక్తులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు, ఝార్ఖండ్, కేరళం, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ముఖ్యంగా గత మూడేళ్లుగా భీమా కోరేగాం కేసులో నిందితులుగానున్న వారి కుటుంబీకులు భావిస్తున్నట్టు ఆయన మరణం ఒక పథకం ప్రకారం జరిగిన హత్యేనని మా పార్టీ నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నది. నిస్సందేహంగా ఎన్ ఐ ఏ,ఎన్ హెచ్ ఆర్సీ, బీజేపీ, కేంద్రం, న్యాయవ్యవస్థ అన్నీ కట్టకట్టుకొని చేసిన హత్యే ఇది.

అయన మరణంపై దేశ విదేశాలలోని క్రైస్తవ మత సంస్థలు భారత ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తమ విచారాన్ని తెలిపాయి. అయన మరణం పట్ల అంతర్జాతీయంగా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తమైంది. తాను ఆసుపత్రిలో కానీ, గృహ నిర్బంధంలో కానీ కన్ను మూస్తే తాము చేయగలిగిందంతా చేశాం కానీ ఆపై తాము నిస్సాహాయులమనే ప్రభుత్వాలు ప్రకటిస్తాయనే విషయాన్ని కూడ ఫాదర్ ముందే వ్యాఖ్యానించడం గమనార్హం. అయన ఊహించినట్టుగానే భారతదేశ విదేశాంగ శాఖ ఫాదర్ మరణంపై వెంటనే జులై 6 నాడు స్పందిస్తూ అయన అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందనే నివేదిక విడుదల చేసింది.

భీమా కోరేగాం కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్న సామాజిక రాజకీయ కార్యకర్తలందరి విడుదలకు తక్షణం నడుం బిగించి భీమా కోరేగాం కేసును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని నినదించడమే స్టాన్ స్వామికి మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది. దేశ కనీస పౌర, ప్రజాస్వామిక హక్కులు ఉండాలంటే, మన దేశ ప్రజలకు ప్రధాన శతృవుగా నిలిచిన, సామ్రాజ్యవాదులు తమ దోపిడీని కొనసాగించేందుకు ముందుకు తెచ్చిన, దేశంలో కుళ్లిపోయిన అర్థవలస, అర్థభూస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలిచి, దాన్ని కాపాడుతున్న బ్రాహ్మణ హిందుత్వ శక్తులను ఓడించే దిశలో రచయితలు, కళాకారులు, గాయకులు, వకీళ్లు, పాత్రికేయులు, ప్రజాస్వామికవాదులు, దేశభక్తులు ముందుకు సాగాలని మా పార్టీ విజ్ఞప్తి చేస్తోంది.

అభయ్
అధికార ప్రతినిధి
కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : stan swamy, bhima koregaon, BK16, CPI Maoist, abhay
(2024-04-24 23:32:18)



No. of visitors : 1525

Suggested Posts


ఆదివాసీల సహవాసి వెళ్ళిపోయాడు!

గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించారు. ఆయన వయసు 84. మే నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి స్వామి తొమ్మిది నెలలు జైలులో ఉన్నారు . పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఆదివారం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చారు .

Stan Swamy death an institutional murder by Modi government - Maoist Party

rrest, the governments would announce that they did all the needed and were helpless. As he guessed, the Indian Foreign Minister immediately responded and issued a report that his arrest was legal.

ఫాదర్ స్టాన్ స్వామి జైలు కవిత

భయపెట్టే చెరసాల సింహద్వారం దాటగానే అతి కనీస అవసరాలు మినహా నీ సొంత వస్తువులన్నీ లాగేసుకుంటారు

స్టాన్ స్వామికి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీలు - నిరాకరించిన కోర్టు

భీమాకోరేగావ్ కేసులో జైల్లో ఉండి మరణించిన ఆదివాసీ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీల విఙప్తిని కోర్టు తిరస్కరించింది.

ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం

ఈ వార్తాపత్రిక సమాచారం ప్రభుత్వ ప్రణాళికను వివరిస్తుంది. రాష్ట్రంలోని ఆదిమ ఆదివాసీ సమూహాల యువతతో రెండు ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసి అడవుల్లోని మావోయిస్టులతో పోరాడటానికి అధునాతన గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇవ్వనున్నారు. తిరుగుబాటు నిరోధక చర్యలలో వారు భద్రతా దళాలకు సహాయం చేస్తారు.

bhima koregaon: స్టాన్ స్వామి చనిపోలేదు ‍- చంపబడ్డాడు

ఫాదర్ స్టాన్ స్వామి మరణం అనేకమందిని ధుంఖంలో ముంచింది. పీడితుల పక్షాన ఉన్నందుకే అతనిపై అబద్దపు కేసులు బనాయించి, జైల్లో వేధించి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా అతని మరణానికి

స్టాన్ స్వామి మృతి కలచి వేసింది, రాజకీయ ఖైదీలను విడుదల చేయండి ‍-ఐక్యరాజ్యసమితి

ఫాదర్ స్టాన్ స్వామి జైల్లోనే రిమాండు ఖైదీగా మృతి చెంద‌డం ప‌ట్ల‌ ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ‌హక్కుల హైక‌మిష‌న‌ర్ మైఖేల్ బ్యాచ్‌లెట్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

అతని మరణం ఒక‌ స‌త్య ప్ర‌క‌ట‌న -విరసం

అతను వెళ్లి పోయాడు. మనందరిని వదిలి సాగిపోయాడు. అతను భూగోళం ఖాళీ చేసాక దుఃఖ పడటం మన వంతయింది. అతను గౌరవ వీడ్కోలు తీసుకోలేదు. శిలువతో సెలవంటూ వెళ్లి పోయాడు.

వాళ్ళు ఈ నేలకు శాపం పెట్టారు ---- అరుంధతీ రాయ్

భారతదేశ ప్రజాస్వామ్యం క్రమేపీ పయనిస్తున్న ʹహత్యాపథంలోʹ స్టాన్ స్వామి హత్య ఒక పెద్ద పరిణామం. చూడటానికి చిన్నదిగా కనిపించినా, నిజానికి ఇది చాలా పెద్ద సంఘటన. విస్తృతంగా ప్రభావం వేసిన ఒక అత్యంత పెద్ద సంఘటన.

మమ్మల్ని మన్నించు సామీ! బ్రతుక్కి అర్థం తెలీనోళ్లం

బాగా చదువుకుని, రెండు చెవులూ సరిగా పనిచేయక, అవయవాలు సరిగా పనిచేయని పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ, వెన్నెముక కిందిబాగం పాడైపోయి సరిగా కూర్చోలేని స్తితిలో జనంలో బ్రతికే అదివాసీల తరపున మాట్లాడే ఒక 84 ఏళ్ల ముసలితనపు హక్కుల కార్యకర్త, ఎవరి హత్యకోసం? ఏ రకంగా కుట్ర పన్నాడో? ఆధారాలు లేకుండా, ఇలా జైలులో నిర్బంధించి, చావుకి ఎరవేయడాన్ని ఏమందాం?

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఫాదర్