కరోనా కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల ఎవ్వరూ చనిపోలేదట! -పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
20-07-2021
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కాలంలో ఆక్సీజన్ కొరత వల్ల రోగులు మరణించలేదని కేంద్రం ప్రకటించింది. అలా చనిపోయినట్టు రాష్ట్రాలనుంచి కానీ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కానీ సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది.
అయితే కరోనా ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ సమయంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ మునుపెన్నడూ లేనంత పెరిగిందని పేర్కొంది. ఫస్ట్ వేవ్ సమయంలో 3,095 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉండేదని, ఇది సెకండ్ వేవ్ లో 9,000 మెట్రిక్ టన్నులకు పెరిగిందని తెలిపింది. దీంతో కేంద్రమే స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రాలన్నిటికీ సమానంగా మెడికల్ ఆక్సిజన్ పంపిణీ జరిగేవిధంగా చూసినట్లు వివరించింది.
కరోనా సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కోవిడ్ రోగులు మెడికల్ ఆక్సిజన్ కొరత కారణంగా రోడ్లపైనా, ఆసుపత్రుల్లోనూ ప్రాణాలు కోల్పోయారా? అనే ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. వైద్య, ఆరోగ్యం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అంశమని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయన్నారు.
మరణాలను నివేదించవలసిన విధానంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు. దీని ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసులు, మరణాల వివరాలతో కూడిన నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపినట్లు పేర్కొన్నారు. అయితే ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలంటూ నిర్దిష్టంగా తెలియజేయలేదన్నారు.
Keywords : corona, covid 19, oxygen, deaths,No deaths due to lack of oxygen specifically reported by states, UTs during second Covid wave: Centre
(2023-03-27 04:01:46)
No. of visitors : 1014
Suggested Posts
| కరోనా వల్ల నిమిషానికి 7గురు చనిపోతే ఆకలి వల్ల 11 మంది చనిపోతున్నారుప్రపంచవ్యాప్తంగా, ఆకలి వల్ల ప్రతి నిమిషానికి 11 మంది మరణిస్తున్నారని, గత ఒక సంవత్సరంలో కరువు లాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారి సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని ఆక్స్‌ఫామ్ అనే సంస్థ ʹది హంగర్ వైరస్ మల్టీప్లెక్స్ʹ అనే తాజా నివేదికలో పేర్కొంది. |
| దేశంలో కరోనా కల్లోలం..గంటకు 62 మంది మృతి, 10 వేల మందికి పైగా పాజిటీవ్ !దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న వేగం జనజీవితాన్ని కకావికలం చేస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో స్మశానాలు శవాలతో నిండి పోతున్నాయి. నిమిషానికి 181 మందికి, గంటకు 10,895 మందికి కరోనా సోకుతోందంటే ఆ మహమ్మారి |
| Corona Vaccination: వ్యాక్సిన్ విషయంలోనూ స్త్రీల పట్ల వివక్షదేశంలో స్త్రీల పట్ల అన్ని రంగాల్లోనూ వివక్ష కొనసాగుతోంది. వేల ఏండ్లుగా కొనసాగుతున్న ఈ వివక్ష ఈ ఆధునిక కాలంలోనూ తప్పడం లేదు. చివరకు కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ ఈ వివక్ష కొనసాగుతున్నది. |
| బీజేపీ ఎంపీ ప్రచార యావ... కోవిడ్‌తో చనిపోయిన వారిని స్మశానానికి తరలించే వాహనం ముందు ఫోటోలకు పోజులుమధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ బీజేపీ ఎంపీ అలోక్ శర్మ కోవిడ్‌తో చనిపోయిన వారిని శ్మశానానికి తరలించే ʹముక్తి వాహనంʹ ముందు నిలబడి ఫోటోలకు పోజిచ్చారు. పైగా తన ఫోటో షూట్ కోసమే వాహనాలను చాలా సేపు ఆపారంటూ ఆరోపణలు |
| COVID19 : ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలి - మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలుదేశంలో కోవిడ్ -19 ను వ్యాప్తి చేయడానికి భారత ఎన్నికల కమిషన్ దే ఏకైక బాధ్యత అని మద్రాస్ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. |
| ʹమోడీ గారూ, మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారుʹ అని పోస్టర్లు -15 మంది అరెస్టుʹమోడీ గారూ, మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారు?ʹʹ అని రాసున్న పోస్టర్లను ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో గోడలకు అతికించారు. నిజాన్ని ఇలా బహిరంగంగా చెప్పినందుకు మహా ఘనత వహించిన ఈ దేశ చక్రవర్తులవారికి కోపం తెప్పించింది. |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ! |
| సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు |
| పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC |
| పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్ |
| దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక
|
| విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
|
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
|
| ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
| ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
|
| ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
|
| ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
more..