భూముల స్వాధీనం కోసం ఆదివాసులపై దాడి చేసిన పోలీసులు... తరిమికొట్టిన ఆదివాసులు


భూముల స్వాధీనం కోసం ఆదివాసులపై దాడి చేసిన పోలీసులు... తరిమికొట్టిన ఆదివాసులు

భూముల

21-07-2021

చత్తీస్ గడ్ బస్తర్‌లోని దంతెవాడ జిల్లాలోని ఫుల్‌పదర్ గ్రామంలోని ఆదివాసుల భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళిన పోలీసులకు గ్రామస్తుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేయడం కోసం ఆదివాసుల భూములను అక్రమంగా, పెసా చట్టం, అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా ఆక్రమించడానికి రెవెన్యూ సిబ్బంది తమతో పోలీసుల‌ను తీసుకువచ్చి భూమిని కొలవడం మొదలుపెట్టారు. దీనిని గమనించిన‌ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అయినా రెవెన్యూ అధికారులు తమ పని కొనసాగించడంతో అక్కడికి చేరుకున్న అనేక మంది మహిళలు, పురుషులు అధికారులను అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆదివాసులను తరిమేసే ప్రయత్నం చేశారు. ఓ పోలీసు అధికారి ఆదివాసీ మహిళను తన్నాడని ఆదివాసులు ఆరోపించారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆదివాసులు గొడ్డళ్ళు, కర్రలతో రెవెన్యూ, పోలీసుల బృందాన్నిచుట్టుముట్టారు. పరిస్థితిని గ్రహించిన సిబ్బంది అక్కడి నుండి పారిపోవాల్సి వచ్చింది. మహిళలు, పురుషులు కలిసి పోలీసులను పరిగెత్తించారు.

నిజానికి, ఆదివాసీ గ్రామస్తుల నుండి ఫుడ్ పార్క్ పేరిట భూమిని బలవంతంగా తీసుకొని ఈ ప్రాంతంలో పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేయడానికి పరిపాలనా యంత్రాంగం సన్నాహాలు చేస్తోందని, చిన్న పరిశ్రమ పెడుతున్నామని గ్రామస్తులను తప్పుదారి పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము తరతరాలుగా ఈ ప్రదేశంలో నివసిస్తున్నామని, ఈ ప్రదేశంలో వ్యవసాయం చేస్తున్నామని, అయినా తమ‌ పొలాలను పరిశ్రమ శాఖకు చెందినవని చెప్పి రెవెన్యూ విభాగం వారు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అని వారు ఆరోపిస్తున్నారు.

బస్తర్ ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తుంది. అందువల్ల ఇక్కడ పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి అనేక రాజ్యాంగ చట్టాలు వర్తిస్తాయి, ఇక్కడ సాంప్రదాయ గ్రామ సభ అనుమతి లేకుండా భూమిని తీసుకోకూడదు. అయినప్పటికీ ప్రభుత్వమూ, పరిపాలనా యంత్రాంగమూ కూడా ఇలాంటి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి, ఆదివాసీల నుండి భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

(janchowk.com కోసం రికేశ్వర్ రానా నివేదిక)
తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి

Keywords : chattis garh, adivasi, police, bastar, dantewada, on the matter of land acquisition big fight taken place between police and tribals in bastar
(2021-09-22 04:16:40)



No. of visitors : 548

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్క‌రణ - భారీ బహిరంగ సభ

ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది.

బస్తర్ లో పెరిగిపోతున్న సీఆర్పీఎఫ్ క్యాంపులు - ఆదివాసుల్లో తీవ్రమవుతున్న ఆగ్రహం

అక్టోబర్ నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో కనీసం పన్నెండు నిరసనలు జరిగాయి. సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనడానికి సుదీర్ఘ ప్రయాణాలు చేసి వస్తున్న వేలాది మంది ఆదివాసీలకు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో, సుక్మా జిల్లాలోని సిల్‌గేర్ గ్రామం నెల రోజులుగా కేంద్రంగా మారింది.

Search Engine

300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు
more..


భూముల