UP: దొంగతనం ఆరోపణ చేసి దళిత యువకుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌


UP: దొంగతనం ఆరోపణ చేసి దళిత యువకుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌

UP:

25-07-2021

గోదుమలు దొంగతనం చేశాడని ఆరోపిస్తూ ఓ అగ్రకుల మూక దళిత యువకుడిని కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నగరియా భూద్ గ్రామంలో రవీంద్ర అనే దళిత యువకుడు చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటాడు. తన దుకాణం పనుల నిమిత్తం రవీంద్ర బుధవారం నాడు దగ్గర్లో ఉన్న జలాలీ పట్టణంకి వెళ్ళి తిరిగి వచ్చి తన ఇంటి దగ్గర బైక్ పార్క్ చేస్తున్నప్పుడు అగ్రకులానికి చెందిన రాజ్‌బహదూర్, అతని కుమారుడు అనురాగ్ సింగ్, మేనల్లుడు షిబ్బూ లు తమ ఇంటి నుంచి 40 కిలోల బ్యాగ్ గోధుమలను రవీంద్ర దొంగిలించాడ‌ని ఆరోపిస్తూ అతని మీద దాడి చేసి కొట్టడం మొదలు పెట్టారు. కర్రలతో రాడ్లతో తీవ్రంగా కొట్టడుతూ రవీంద్ర షర్ట్ ను అతని గొంతుకు బిగించి చంపేశారు.

ʹʹవాళ్ళు కులం పేరుతో తిడుతూ నా కొడుకుపై దాడి చేశారు. మేమెంత బతిమిల్శాడినా విడిచిపెట్టలేదు. వాళ్ళు నాకొడుకును దారుణంగా కొడుతూ ఉంటే చుట్టూ చాలా మంది జనం నిలబడి చూశారు తప్ప ఎవ్వరూ అడ్డుకోలేదు. ʹʹ అని రవీంద్ర తండ్రి రాంపాల్ సింగ్ మీడియాతో చెప్పారు.

బాధితుడి అన్నయ్య ప్రేమ్ కిషోర్ మాట్లాడుతూ ʹʹ రవీంద్ర జలాలీ పట్టణానికి వెళ్తున్నప్పుడు గోధుమలను దొంగిలించిన వారు లిఫ్ట్ అడిగారు. వారిలో ఒకరు గోధుమలను పిండి మిల్లుకు తీసుకెళ్లడానికి లిఫ్ట్ ఇవ్వమని కోరారు. అయితే వాళ్ళు దొంగలని గోదుమలను దొంగతనం చేశారని రవీంద్రకు తెలియదుʹʹ అని తెలిపారు.

అనేక మంది గ్రామస్తుల ఎదుట ఈ దాడి జరిగిందని, అయితే ఎవరూ జోక్యం చేసుకోలేదని ప్రేమ్ కిషోర్ తెలిపారు. అనంతరం ఆజాద్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని, మృతుల కుటుంబం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) శుభం పటేల్ తెలిపారు. "ప్రధాన నిందితుడు రాజ్ బ‌హదూర్ పట్టుబడ్డాడు. మేము హత్య ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నాము. గోధుమ సంచిని దొంగిలించారనే ఆరోపణలు ఈ సంఘటనకు రెచ్చగొట్టే అవకాశం ఉంది, కాని ఇది ఇంకా నిరూపణ కాలేదు. బహుశా వారు కూడా త్రాగి ఉండవచ్చు. పోస్ట్ మార్టం నివేదిక కోసం మేము ఎదురు చూస్తున్నాము, ʹఅని పటేల్ ది హిందూతో అన్నారు.

Keywords : uttarpradesh, Upper Caste men , dalit, murder
(2021-09-23 05:43:50)



No. of visitors : 210

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల‌ బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా

Search Engine

300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు
more..


UP: