నాకు ఈనాటి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదు: ప్రముఖ న్యాయవాది కామిని జైస్వాల్

నాకు

(కామిని జైస్వాల్, (70 సం.) భారతదేశంలో తీవ్రవాద సంబంధిత కేసులలో మానవ హక్కుల కోసం పని చేసే శక్తివంతమైన న్యాయవాదులలో ఒకరు. పార్లమెంటు దాడి, ఎర్రకోట దాడి, అక్షర్‌థామ్ పేలుడు వంటి డజన్ల కొద్దీ ఉగ్రవాద కేసులలో జైస్వాల్ నిందితులకు ప్రాతినిధ్యం వహించారు. ఆమె జరిపిన సుదీర్ఘ న్యాయ పోరాటాలలో చాలా మంది అమాయకులు నిర్దోషులుగా విడుదలయ్యారు.

జైస్వాల్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ కమిటీలో (న్యాయపర జవాబ్దారీ కమిటీ) సభ్యురాలు. ఈ కమిటీ, న్యాయమూర్తుల జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి పనిచేసే భారతదేశంలోని ప్రముఖ న్యాయవాదుల బృందం. జూలైలో, అనుభవజ్ఞురాలైన న్యాయవాది కామిని జైస్వాల్, మక్తూబ్ (maktoobmedia.com)కు చెందిన జర్నలిస్టు షాహీన్ అబ్దుల్లాతో న్యాయ సౌభ్రాతృత్వం మధ్య న్యాయం లభిస్తుందనే విశ్వాసం క్షీణించడం గురించి మాట్లాడిన కొన్ని అంశాలు...)

మీరు తీవ్రవాద సంబంధిత కేసులు చేయడం ఎలా మొదలైంది?

కామిని జైస్వాల్: పంజాబ్ అల్లర్ల సమయంలో టాడా (టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్) తో మొదటి కేసు, 80 ల చివరలో చేసాను. వాస్తవానికి, అందులో నేను నిందితుల తరఫున హాజరుకాలేదు, కేంద్రపాలిత చండీగఢ్ నన్ను బిమల్ కల్సా తరఫున ప్రాసిక్యూషన్ కోసం నియమించింది. అప్పుడు నా వయస్సు 27, 28 వుండచ్చు, నా వృత్తిని అప్పుడే ప్రారంభించాను.

అప్పుడు నెమ్మదిగా ప్రచారం మొదలైంది. చాలా సార్లు నాకు జైలు నుండి ఫోన్లు వచ్చేవి, అక్కడ కొంతమంది క్లయింట్లు వుండేవాళ్లు. కొంత మందికి అనుకూలమైన ఆర్డర్ వచ్చి ఉండవచ్చు లేదా నా సేవలతో సంతృప్తి చెంది వుండవచ్చు. అలా నేను ఈ కేసుల్లోకి ప్రవేశించాను. అప్పుడు ప్రాథమికంగా డిఫెన్స్ కౌన్సిల్‌ని కావడంతో, ఈ కేసులు రావడం మొదలైంది, నాకు గుజరాత్ నుండి ఎక్కువగా కేసులు వచ్చేవి.

కానీ అప్పుడు, కోర్టులు స్వేచ్ఛకు సంబంధించి మరింత ఉదారంగా వుండేవి కాబట్టి మాకు కొంత ఉపశమనం లభించేది. న్యాయమూర్తులు, కొన్ని సమయాల్లో, ʹమీ క్లయింట్ దోషి అని మాకు తెలుసు, కాని చట్టం మీకు అనుకూలంగా ఉందిʹ అని చెప్పడం నాకు గుర్తుంది. వారు కనీసం నిర్బంధం నుండి విడుదల చేసేవారు. విచారణ కొనసాగుతుంది కానీ మీరు వ్యక్తులను నిర్బంధించడానికి ఈ రకమైన చట్టపరమైన విషయాలను ఉపయోగించకూడదు.

గతంలో ఉగ్రవాద చట్టాలను సవాలు చేసే ప్రయత్నాలు జరిగాయా?

కామిని జైస్వాల్: టాడాను సవాలు చేసారు కాని కోర్టులలో కూడా రాజకీయాలు పని చేయడం ప్రారంభించాయి. టాడా వంటి చట్టాన్ని పక్కన పెట్టడానికి వారు చాలా భయపడ్డారు, అందువల్ల వారు రెండు వైపులవారు సంతోషంగా ఉండేలా కొన్ని నిబంధనలను చదివేవారు, అంతే.

వాస్తవానికి టాడాను కోర్టు ఎన్నడూ కొట్టివేయలేదు. టాడా వంటి నిబంధనను చట్టం శాశ్వతంగా అమలు చేయలేకపోవడం వల్ల అది ముగిసిపోయింది. అది రెండు సంవత్సరాలు ఉంటుంది, తరువాత దానిని పొడిగిస్తారు, మళ్ళీ పొడిగిస్తారు… అంతిమంగా టాడా పూర్తయింది, ఆ తరువాత వారు పోటాను ఉపయోగించారు. కొన్ని సవరణలు చేసి పోటాగా మారుస్తారు, తరువాత దానిని మళ్ళీ మార్పులు చేసి UAPA గా మార్చారు. ఈ విషయాలలో, ఇది పిల్లి-ఎలుక మధ్య ఆట. టాడా వచ్చింది, పోయింది, ఆపై పోటా వచ్చింది, తరువాత పోటా పోయింది. ఆపై యుఎపిఎ వచ్చింది. 90ʹ ల నుండి గుజరాత్ ప్రభుత్వం దానిని అత్యంత దుర్వినియోగం చేసింది. గుజరాత్‌లో ఈ చట్టాలను వారు ఎగతాళి చేశారు.

టాడాను చాలా మంది సవాలు చేశారు. సాధారణ ప్రజలు ఉగ్రవాదుల వైపు మొగ్గు చూపుతున్నారని నేను అనుకోను. కానీ మీరు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు, మీరు మీ ఇష్టానుసారం సామాజిక కార్యకర్తలు లేదా ఇతర వ్యక్తులపై ఉగ్రవాదులుగా ముద్రవేసినప్పుడు, ప్రజల ఆగ్రహం పెరుగుతుంది. దుర్వినియోగం కారణంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం ఎక్కువగా ఉందని నా అభిప్రాయం.

ఫాదర్ స్టాన్ స్వామి మరణాన్ని, ఇతర రాజకీయ ఖైదీలను మీరు ఎలా చూస్తారు?

కామిని జైస్వాల్: ఇందులో రాజ్యం హంతకుడు. ఇది రాజ్య ఉగ్రవాదం. కోర్టులు కూడా తమ పని చేయలేదు. ప్రతిసారీ రిమాండ్ కోసం కోర్టుకువెళ్ళాల్సిన అవసరం ఏముంది ? ఎందుకంటే కోర్టులు నిష్పక్షపాతంగా ఉంటాయని మీరు ఆశించారు కాబట్టి. పోలీసులు ఏమి చేస్తున్నారో కోర్టు పర్యవేక్షిస్తుంది. కానీ ఈ రోజు, కోర్టులు బెయిల్ ఉత్తర్వులను, బెయిల్ దరఖాస్తులను లేదా రిమాండ్ విషయాలు అన్నింటినీ, వేటినైనా సరే గుడ్డిగా తిరస్కరిస్తాయి, వారు తమ సంవేదనాశీలతను ఏ మాత్రం ఉపయోగించరు.

భీమా కోరెగావ్ గురించి ఆలోచించినప్పుడు నా హృదయం పరితపిస్తుంది. వీరంతా అక్కడ ఉండవలసిన అవసరం లేదు. చాలా కుటుంబాలు లేదా వ్యక్తులు సహజంగానే తమ తండ్రి, తల్లి అలాంటిదేమీ చేయకుండా ప్రతిఘటిస్తారు. ఇది వారిని మంచి పనులు చేయడాన్ని, సామాజిక క్రియాశీలతను నిరోధిస్తుంది. వారికి చిన్న పిల్లలు ఉంటే, ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. స్వేచ్ఛ, మానవ హక్కులను సమర్థిస్తూ న్యాయస్థానాలు వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరిస్తే ... కానీ అవి అలా చేయలేదు. స్టాన్ స్వామికి సిప్పర్ కావాలి, దానిని జైలు సూపరింటెండెంట్ మంజూరు చేసి ఉండాల్సింది. చాలా మంది జైల్లో ఉన్నారు, వారు ఒక రోజు కూడా ఉండాల్సిన అవసరం లేదు. సాక్ష్యాలను అస్తవ్యస్తం చేసినట్లు నివేదికలు ఉన్నప్పటికీ, ప్రతి స్థాయిలో, ప్రతి కోర్టు వారి బెయిల్ దరఖాస్తులను తిరస్కరించింది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం.

అణగారిన వర్గాలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారని మీరు అనుకుంటున్నారా?

కామిని జైస్వాల్: ఖచ్చితంగా. అవి (టెర్రర్ చట్టాలు) ముస్లింలు, మైనారిటీలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. చాలా బహిరంగంగా, వారు (ఉగ్రవాద చట్టాలు) వారిపై దుర్వినియోగం చేస్తున్నారని నేను చెప్పగలను. అంటే, ఎంత మంది? ఒక మనిషి 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఖైదులో ఉండడాన్ని ఊహించుకోండి, చివరికి కోర్టు అతన్ని అయిష్టంగానే నిర్దోషిగా ప్రకటిస్తుంది, కాని ఆ వ్యక్తి తన జీవితాన్ని కోల్పోతాడు. బయటకు వచ్చే సమయానికి అన్నీకోల్పోతాడు.
నాకు చాలా స్పష్టంగా గుర్తుంది, నేను అబ్దుల్ ఘని అనే వ్యక్తి కోసం ఒక పిటీషన్‌ వేశాను. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడడానికి బెయిల్ కావాలనుకున్నాడు. అతని తల్లి చనిపోతున్నందున నేను మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వచ్చాను. వారు దానిని ఆరు నెలలు, ఎనిమిది నెలలు పెండింగ్‌లో ఉంచారు, చివరికి దానిని తిరస్కరించారు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు. నా ఉద్దేశ్యంలో యిది చాలా అర్ధంలేనిది, అతను అప్పటికే 18 సంవత్సరాల నుంచి జైలులో ఉన్నాడు. నీకు ఏమి కావాలి? తన ఇరవైల వయసులో ఒక వ్యక్తి లోపలికి వెళ్లి 20 సంవత్సరాల తరువాత బయటకు వస్తాడు. ఇందువల్ల అతని జీవితం ముగిసిపోవడమే కాదు, అతని కుటుంబం మొత్తం విచ్ఛిన్నమైపోయింది.

ఒక పేలుడు ఘటన కేసులో, అదే సంఘటన, అదే సాక్ష్యంతో, గోవాలో ఒకటి, హైదరాబాద్‌లో ఒకటి, కర్ణాటకలో ఒకటి కేసులు పెట్టారు. గోవాలో డిశ్చార్జ్ అయ్యారు, హైదరాబాద్‌లో నిర్దోషులుగా ప్రకటించారు, తరువాత కర్ణాటక, హైకోర్టు ముందు మూడు అప్పీళ్లు వుంటే, రెండింటిలో నిర్దోషులు, కాని ఒకదానిలో శిక్ష పడింది. కాబట్టి 17,18 మంది పురుషులు 23 సంవత్సరాలపాటు జైలులో ఉంటారు.

మైనారిటీలు ఇరవై, ముప్పై సంవత్సరాలు జైల్లో వుంటారు. అక్షరధామ్ పేలుడు కేసులో, వారు 21 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు. నష్టపరిహారం కోసం వారు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ ఏమీ జరగలేదు. వారికి పైసా చెల్లించలేదు. మన దేశంలో న్యాయసంబంధమైన ఖర్చులను చెల్లించరు. ఇతర దేశాల్లో హానికరమైన ప్రాసిక్యూషన్ చేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి వుంటుంది. ఈ రకమైన జరిమానాలు విధించాలి. కానీ అందుకు బదులుగా, వారిని పట్టుకున్న పోలీసు అధికారులకు అవార్డులు లభిస్తాయి.

ప్రభుత్వాల ప్రతిక్రియ గురించి మీరు ఏమనుకుంటున్నారు?

కామిని జైస్వాల్: గౌరవనీయులైన మాజీ న్యాయ మంత్రి (అతని ఆత్మకు శాంతి కలగాలి), నాతో ʹకామిని మీరు ఒక ఉగ్రవాదిʹ అని అన్నారు. నేను పార్లమెంట్ దాడి కేసులో పనిచేస్తున్నప్పుడు ఇది జరిగింది. నేను పట్టించుకోను. జనాలు అనేదాన్ని గురించి నేను నిజంగా బాధపడితే, చాలా పనులు చేసి వుండేదాన్ని కాదు. నాకు బెదిరింపు కాల్స్ వస్తాయి, కాని నా వైఖరి ఏమిటంటే ఏమి జరగాలో అది జరుగుతుంది, నా పనిని కొనసాగిస్తాను.

నేను రాజ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నాను, కానీ రాజ్యం ఎన్నడూ ఈ నాటిలాగా ప్రతీకారం తీర్చుకోలేదు. ఇంతకు ముందు నిపుణులను నిష్పాక్షికంగా తమ వృత్తిని కొనసాగించడానికి అనుమతించేది. మేము కూడా వ్యవస్థపై పోరాడలేదు, చట్టం కోసం మాత్రమే పోరాడాము, అది కూడా వృత్తిపరంగా మాత్రమే.

మీరు చాలా దారుణమైన పనులు చేయాలనుకునే అంశాలు ఉన్నాయి. మీ ఫైళ్ళను న్యాయమూర్తులపై విసిరేయండి, ఏమైనా చేయండి. కానీ అంతిమంగా మీరు చాలా గాయపడ్తారు. వేదనను, సంకటాన్ని కలిగిస్తుంది. ఇది నా కేసు విషయంలో మాత్రమే కాదు, వారి కుటుంబం, పిల్లల గురించి కూడా ఆలోచిస్తూనే వుంటాను, బహుశా నేను ఎక్కువగా కల్పించుకుంటాను. కానీ ఇవన్నీ ఆలోచించినప్పుడు, చాలా దారుణంగా వుంటుంది, నాకు చాలా దు:ఖం కలుగుతుంది.

బిజెపి పాలనలో మాత్రమే ఉగ్రవాద చట్టాలు దుర్వినియోగం అయ్యాయని మీరు అనుకుంటున్నారా?

కామిని జైస్వాల్: ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించారు. కాంగ్రెస్,బిజెపి కూడా. వారిద్దరిలో బిజెపి చాలా చురుకుగా ఉపయోగిస్తుంది. కాంగ్రెస్ ఉదాసీనంగా ఉంది. ప్రజాభిప్రాయం గురించి వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉగ్రవాదులకు సహాయం చేస్తోంది లేదా చేస్తుంది, కానీ వారు ఈ విషయాన్ని విస్మరిస్తారు. బిజెపి ప్రభుత్వం ఏమైనా చేస్తుంది. ఎవరినీ లెక్క చేయదు.

కోర్టులో ప్రాసిక్యూటర్ వచ్చి 200 మంది మరణించారు, 20 మంది మరణించారు, 10 మంది మరణించారు అని చెప్పాల్సి వుంటుంది. వారు కనీసం కేసు వాస్తవాలను కూడా చూడరు. మీరు అడుగుతున్నది బెయిల్ మంజూరు కోసం మాత్రమే. బెయిల్ మంజూరు చేస్తే ఆ మనిషేమీ పారిపోడు. న్యాయస్థానాలు మానవ హక్కులు, స్వేచ్ఛలను మరింత తీవ్రంగా పరిగణించాలని నేను అనుకుంటున్నాను. అందరూ అలా భావిస్తున్నారు. న్యాయమూర్తులు కూడా రాజుల కంటే చాలా అనాలోచితంగా, అమానుషంగా లేదా మరింత విధేయులుగా ప్రవర్తిస్తారు.

పరిష్కారం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు?

కామిని జైస్వాల్: మన న్యాయస్థానాలు, రాజకీయ నాయకులు, కార్యనిర్వాహకులకు తమ విధుల పట్ల అవగాహన లేదు. హానికరమైన ప్రాసిక్యూషన్ లేదా ఎవరి పైన అయినా తప్పు ఆరోపణలు చేసినందుకు పోలీసు అధికారులను జవాబుదారీలుగా చేయకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది. పోలీసు సంస్కరణలు ఒక్కటే మార్గం అని నేను అనుకోను. పోలీసులు కూడా అదే విధంగా ఉంటారు. స్వతంత్ర పోలీసు అయినా, వారికీ యిచ్చే శిక్షణ ఎలాంటిదో నాకు తెలియదు? వారు ఎలాంటి మనుషులు? వారికీ కుటుంబాలు ఉన్నాయి. సాక్ష్యాలను పూర్తిగా పట్టించుకోకుండా వారెలా అంత నిర్లక్ష్యంగా ఉండగలరు?

మీ వృత్తి జీవితంలో మీరు ఏం ఆశిస్తున్నారు?

కామిని జైస్వాల్: నేను ప్రాక్టీసు మానేశాను. ఇక కేసులు చేయలేను. నా ప్రధాన, విభిన్న సున్నితత్వాల వల్ల ఇప్పుడు ఇవన్నీ నిజంగా భరించలేనని నేను అనుకుంటున్నాను. కానీ పెండింగ్‌లో ఉన్న కేసులు కొన్ని ఉన్నాయి, వీటిని నేను 10, 15 సంవత్సరాల క్రితం దాఖలు చేశాను, ఇంకా వినడానికి వేచి ఉన్నాను. నేను వారి కోసం ఏ పని అయినా చేస్తాను.

ʹనాకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేదు.ʹ

వేరే పని ఎంచుకొనే స్వేచ్చ లేకపోవడం వల్ల నేను కోర్టుకు వెళ్తాను. నేను ఎప్పుడూ ఫిర్యాదులను దాఖలు చేయను. నాకు ఈనాటి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదు. కానీ కనీసం ఒక వ్యక్తిఅయినా లోపల ఉంటే, కోర్టుకు వెళ్లడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను చేయకపోతే, మరొకరు చేస్తారు. వారికి వేరే మార్గం లేదు, కోర్టుకు వెళ్లక తప్పదు. ఈ దేశానికి, ఈ వ్యవస్థకు ఏమీ జరగదు. అన్నీ యిలానే ఉన్నప్పటికీ, కొనసాగుతుంది. నేను సొరంగం చివర ఎటువంటి కాంతిని చూడలేను. నిరాశావాదిగా అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ, నేను గొప్ప నిరాశావాదిని. ఎందుకంటే, ఇంతకు ముందు, ఈ ప్రధాన న్యాయమూర్తి వెళ్ళిపోతే లేదా మరొకరు వస్తే బాగుండేదని నేను భావించేదాన్ని. కానీ ఇప్పుడు ఈ రేఖా చిత్రం మరింత తక్కువ అయిపోతోంది, సున్నా కంటే కిందికి. ఇది చివరి ప్రధాన న్యాయమూర్తి గోగోయితో మారింది.
(maktoobmedia.com సౌజన్యంతో...)
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : Kamini Jaiswal, judiciary,human rights, Committee on Judicial Accountability,UAPA, TADA, Today, I have no faith in judiciary: Veteran lawyer Kamini Jaiswal
(2024-04-24 23:26:53)



No. of visitors : 829

Suggested Posts


bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ

భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ ‍ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది.

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన‌

కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది.

UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి

భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన

భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?

భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న‌16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు.

స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది.

Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌

భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది.

Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర

బీమా కోరేగాం ఎల్గార్ ప‌రిష‌ద్ కేసులో అరెస్ట‌యి జైలు నిర్భంధంలో ఉన్న హ‌క్కుల సంఘాల నేత‌లు, మేధావులు మ‌రో ప్ర‌మాద‌క‌ర‌మైన స‌వాలును ఎదుర్కోబోతున్నారు. వారిని త‌లోజా జైలునుంచి మ‌హారాష్ట్ర‌లోని వివిధ జైళ్ల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

హ‌నీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది.

కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా

ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నాకు