మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన‌


మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన‌

మావోయిస్టు

28-08-2021

55 ఏళ్ళపాటు విప్ల‌వం కోసం జీవించిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ ఈ నెల 7వ తేదీన అనారోగ్యంతో మరణించారు. ఆ కామ్రేడ్ కు నివాళులు అర్పిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

సీపీఐ( మావోయిస్టు) కేంద్ర కమిటీ వెటరన్ సభ్యుడు కామ్రేడ్ పూర్ణేందు శేఖర్ ముఖర్జీ అమర్ రహే!

14 ఆగస్టు, 2021 మనం కొద్ది రోజులలో జరుపుకోబోతున్న మన పార్టీ అవిర్భావ వారోత్సవాల ఉత్సాహభరిత రాజకీయ వాతావరణంలో అత్యంత విషాదకర వార్తను వినాల్సి వస్తోంది. ఇటీవలే మా యువ సీసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యాప నారాయణ అమరత్వ వార్త నుండి మనమింకా పూర్తిగా తేరుకోక ముందే మేం వెటరన్ కామ్రేడ్ అంబర్ ను కోల్పోయాం. సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ పూర్ణేందు శేఖర్ ముఖర్జీ (అంబర్ దా) శనివారం 7 అగస్టు 2021 ఉదయం అనారోగ్యంతో దక్షిణ కొలకతాలోని బన్స్ డ్రోని ఏరియాలో తుదిశ్వాస విడిచారు. ఆయన చాలాకాలంగా సీఓపీడీతో బాధపడుతున్నారు. నక్సల్బరీ తరానికి చెందిన ఒక వెటరన్ మావోయిస్టు విప్లవకారున్ని భారత విప్లవోద్యమం కోల్పోయింది. ఆయన మరణం మా పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఆయన దాదాపు గత 55 సంవత్సరాల విప్లవ జీవితంలో అనేక ఒడిదొడుకులను చూశాడు. విప్లవోద్యమ పురోగమనానికి అహర్నిషలు అలుపెరుగని కృషి చేసి తుదివరకూ నమ్మిన ఆశయాల కోసం పాటుపడిన విప్లవకారుడాయన.

నేడు దేశం ఎదుర్కొంటున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పరిస్థితులలో అపార అనుభవ సుసంపన్నుడైన కామ్రేడ్ ముఖర్జీని కోల్పోవడం మా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆయన మా పార్టీలో కామ్రేడ్ అంబర్ దా, గగన్ దాగా కేడర్ల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు. పశ్చిమ బంగాలో అయన అనేక చోట్ల వివిధ పేర్లతో ప్రజల మధ్య విప్లవ నిర్మాణానికి కృషి చేసి వారి ఆదరాభిమానాలను చూరగొన్న ప్రజా నాయకుడు. ఆ నాయకుడికి మా పార్టీ కేంద్రకమిటీ వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లర్పిస్తోంది. ఆయన నమ్మిన ఆశయాల కోసం తుదివరకూ పోరాడి తీరుతుందనీ శపథం చేస్తోంది.

కామ్రేడ్ పూర్ణేందు విద్యార్థి దశలోనే వామపక్ష విద్యార్థి సంఘంలో చురుగ్గా పనిచేశాడు. ఆ తరువాత ఆయన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పటికీ వామపక్ష రాజకీయాలను అంటి పెట్టుకొనే ఉన్నాడు. 1960ల చివర దేశ యువతను తీవ్రంగా ఆలోచింపచేసిన నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటంతో ఆయన విప్లవ రాజకీయాల పక్షం చేరాడు. మొదట ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, ఆ పిదప మార్క్సిస్టు పార్టీ అనుసరించిన రివిజనిస్టు రాజకీయాలతో తెగతెంపులు చేసుకొని 1969లో కామ్రేడ్ కన్హయ ఛటర్జీ, అమూల్య సేన్ ల‌ నాయకత్వంలో అవిర్భవించిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ తో సమైక్యమయ్యాడు. అప్పటినుండి ఆయన చివరివరకూ భారత నూతన ప్రజాతంత్ర విప్లవ పరిపూర్తికై అత్యంత అంకితభావంతో వివిధ స్థాయిలలో పనిచేశాడు. ఆయన అనేక రకాల అణచివేత చర్యలను ఎదుర్కొన్నాడు. దేశంలో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితులలో అయన జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆ తరువాత పార్టీ, ఉద్యమం ఎదుర్కొన్న అనేక ఆటుపోటులలో, మెలికలు మలుపులలో భాగమై ఉద్యమ పురోగమనానికి కృషి చేశాడు. అయన ఎన్నడూ విప్లవ రాజకీయాల నుండి మడ‌మ తిప్పలేదు.

1998 నుండి దాదాపు మూడేళ్ల కాలం దేశంలోని రెండు ప్రధాన విప్లవ స్రవంతులకు చెందిన పార్టీల నడుమ ఉత్పన్నమైన ఘర్షణలతో విచలితుడై మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ నుండి బయటికి వెళ్లాడు. విప్లవ క్యాంపుకు చెందిన కామ్రేడ్స్ తో, మితృలతో కలిసి ఘర్షణల నివారణకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ సమయంలో విప్లవ కమ్యూనిస్టు సెంటర్ (ఆర్సెసీ) (మావోయిస్టు)ను ఏర్పర్చిభారత విప్లవోద్యమంలో తలెత్తిన అవాంఛనీయ ఘర్షణలను నివారించి వాటి మధ్య ఐక్యతను పెంపొందింపచేయడానికి సోదర కమ్యూనిస్టు పార్టీలతో కలిసి చాలా కృషి చేశాడు. తాను ఆశించిన దిశలో రెండు పార్టీల మధ్య ఐక్యతా వాతావరణం పెంపొందుతున్న తరుణంలో కామ్రేడ్ ముఖర్జీ తిరిగి యంసీసీఐలో చేరాడు. వారందరి కృషి ఫలితమే రెండు పార్టీల మధ్య చీకటి అధ్యాయం ముగిసి భారత నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమ పురోగమనానికి నూతన దారులు తెరుచుకొని రెండు పార్టీలు విలీనమై 2004 సెప్టెంబర్ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అవిర్భవించింది.

ఆ పార్టీలో కామ్రేడ్ ముఖర్జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత కేంద్రకమిటీ ఏర్పర్చిన తూర్పు మధ్య రీజియన్ బ్యూరోలో భాగమై ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల ఉద్యమాలను సంఘటితం చేయడానికి ప్రత్యేక కృషి సలిపాడు. ఆ రెండు ప్రాంతాలకున్న పలు విశిష్టతల నేపథ్యంలో కామ్రేడ్ అంబర్ దా కేంద్రీకరించి పని చేశాడు. ఆ బ్యూరోకు బాధ్యులుగా ఉన్న కామ్రేడ్ నారాయణ సన్యాల్ 2005లో అరెస్టయ్యాక ఇక ఆ ప్రాంత ఉద్యమ నిర్మాణంలో కామ్రేడ్ అంబర్ దా మరింత చురుగ్గా పాల్గొన్నాడు.
కామ్రేడ్ ముఖర్జీ 2007లో జరిగిన పార్టీ ఐక్యతా కాంగ్రెస్ తొమ్మిదవ కాంగ్రెస్ లో కేంద్రకమిటీ సభ్యుడిగా తిరిగి ఎన్నికై తుది వరకూ ఆ బాధ్యతలలోనే కొనసాగాడు. ఆయన దేశంలోని విప్లవ శక్తులను సమైక్యం చేయడానికి చాలా కృషి చేసి పలు నూతన సంబంధాలను విప్లవ నిర్మాణంలోకి తెచ్చి సంఘటితం చేశాడు. దేశంలో తీవ్రతరమవుతున్న ఫాసిస్టు నిర్బంధ పరిస్థితుల మధ్య నిలబడి పని చేయడానికి అనేక నూతన యువ శక్తులను సమీకరించి సంఘటితం చేశాడు. పార్టీ కాంగ్రెస్ చేపట్టిన కేంద్ర కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడానికి బీజే, డీకేలను విముక్తి ప్రాంతాలుగా మలచడానికి కార్మిక వర్గం సహ ఇతర అనేక సెక్షన్ ప్రజల ముఖ్యంగా పట్టణ ప్రజల మద్దతును కూడగట్టడానికి ఎంతో నేర్పుతో పని చేశాడు.

కామ్రేడ్ అంబదా 2011లో ప్రమాదవశాత్తు శతృవు చేత చిక్కి 2015 చివరి వరకు దాదాపు నాలుగేళ్ల కాలం అయన అనేక తప్పుడు ఆరోపణలపై విచారణ‌ ఖైదీగా దేశంలోని వివిధ జైళ్లలో మగ్గాల్సి వచ్చింది. ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు.
జైలు జీవతం ఆయన అనారోగ్యాన్ని మరింత తీవ్రం చేసింది. క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితులను అర్థం చేసుకొని తన మరణం తదుపరి తన పార్థివ శరీరాన్ని వైద్య కళాశాలకు అప్పగించాలని భాగల్పూర్ జైలు నుండి కోరాడు. బెయిల్ పై విడుదలైన కామ్రేడ్ అంబర్ దా గత ఆరేళ్లుగా అనేక విప్లవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు. నక్సల్బరీ 50 వసంతాల వేడుకలలో చాలా ఉ త్సాహంగా పాల్గొన్నాడు. ఆయన సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా వేదికలో భాగమై తన కార్యకలాపాలను కొనసాగించాడు.

ప్రస్తుతం దేశ వ్యాప్త విప్లవోద్యమం వెనుకంజ స్థితిలో ఉంది. భారత విప్లవోద్యమాన్ని తుదకంటా నిర్మూలించడానికి భారత పాలక వర్గాలు వెంపర్లాడుతున్నాయి. చుట్టుముట్టి మట్టుబెట్టే దాడులను ముమ్మరం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదులు, వారి తాబేదార్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ద్రవ్య సంక్షోభ పరిస్థితుల మధ్య భారత పాలక వర్గాలు భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి నడుం బిగించాయి. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సంక్షోభ భారం వారిని అనివార్యంగా విప్లవోద్యమం వైపు ఆలోచింప చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో దేశంలో ప్రత్యామ్నాయ విప్లవ శక్తిగా ఎదిగివచ్చిన మన పార్టీని ప్రజలకు వారి పోరాటాలలో నాయకత్వం వహించకుండా చేయడానికి దోపిడి పాలక వర్గాలు దేశ అంతరంగ భద్రతకు పెను ముప్పుగా మన పార్టీని ప్రకటించి మట్టుబెట్టు దాడులకు పాల్పడుతున్నాయి.

దేశంలో పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రజాస్వామిక, విప్లవ శక్తులను ఎంత మాత్రం సహించకుండా వారిని కటకటాల పాలు చేస్తున్నారు లేదంటే వారి అడ్డు తొలగించుకోవడానికి తుదకు హత్యలకు పాల్పడుతున్నాయి. దేశ ప్రజలలో భయ బీభత్స వాతావరణాన్ని కల్గించడానికి అనేక ఫాసిస్టు పద్దతులను అనుసరిస్తున్నాయి. ఆకాశ దాడులకు కూడ రంగం సిద్ధం చేస్తున్నారు. డ్రోన్లతో దాడులు సలుపుతున్నారు. ప్రహార్ 3కు పథకం రూపొందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో బలహీనమైన విప్లవ శక్తులు గుండెజారి దిగజారిపోతూ విప్లవ క్యాంపు నుండి వైదొలగుతూ శతృవు పక్షం చేరి విప్లవోద్యమంపై అవాకులు చవాకులతో చౌకబారు దాడులకు పూనుకుంటున్నారు.

ఇలాంటి అనేక రకాల సవాళ్లను పార్టీ ఎదుర్కొంటున్న సమయంలో మొక్కవోని ధైర్యంతో విప్లవోద్యం పురోగమనానికై తుది వరకు పాటుపడిన కామ్రేడ్ పూర్ణేందు అమరత్వం ఎంతో లోటును మిగిల్చింది. కానీ, భారత విప్లవోద్యమం ఎంత మంది ఉత్తమ కార్మిక వర్గ పుత్రులను, పుత్రికలను, నాయకులను కోల్పోతున్నప్పటికీ అజేయమైన మావోయిజం ఆయుధంతో ప్రజాయుద్ధాన్ని పురోగమింపచేస్తూ ప్రజలలో నుండి అనేక నూతన శక్తులను సమీకరించుకుంటూ అమరవీరుల ఆశయాల పరిపూర్తికై పాటుపడుతోంది. అదే మా పార్టీ అమరులకు అందించే నిజమైన నివాళి.

అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : CPI Maoist, purnendu shekhar mukarjee, bengal, bihar, martyr
(2022-12-02 08:25:01)No. of visitors : 1597

Suggested Posts


జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విప్లవకర పరిస్థితిని ఉపయోగించుకోవడం, విధ్వంసక సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడం, యుద్ధాలకు తావు లేని సోషలిజాన్ని స్థాపించడం ప్రపంచ శ్రామికవర్గం, మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ శక్తుల తక్షణ కర్తవ్యం

పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17 వ పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోబోతున్నది. మా పార్టీ కేంద్రకమిటీ దాదాపు నెల రోజుల క్రితమే సవివరమైన విప్లవ సందేశాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ తరపున యావత్ పార్టీ శ్రేణులకు; పీఎల్‌జీఏ కమాండర్లకు, యోధులకు; విప్లవ ప్రజా నిర్మాణాల నాయకులకు, కార్యకర్తలకు; విప్లవ ప్రజా కమిటీల నాయకులకు, కార్యకర్తలకు; దేశం

Celebrate grandly the 17th Anniversary of CPI (Maoist) in revolutionary atmosphere!

CPI (Maoist) is about to celebrate its 17th Anniversary. The CC of our party gave a detailed revolutionary message almost one month back. On the occasion the CC conveys revolutionary

Search Engine

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
more..


మావోయిస్టు