సిల్‌గేర్ ఉద్యమానికి 100 రోజులు - దృఢంగా పోరాడుతున్న ఆదివాసీలు
22-08-2021
గ్రామసభ అనుమతి లేకుండా గ్రామంలోని వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన పోలీసు శిబిరానికి నిరసనగానూ , తమ గ్రామ ప్రాథమిక సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేయడానికి సిల్‌గేర్ ఉద్యమం మే 12 న ప్రారంభమై నేటికి 100 రోజులు పూర్తయ్యాయి. మే 17న జరిగిన మారణహోమంలో నలుగురు యువకులు, పుట్టబోయే బిడ్డ మరణాలు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి.
దేశవ్యాప్తంగా ఉద్యమ స్వరాన్ని ప్రతిధ్వనించే ప్రయత్నం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ మీడియా సిల్‌గేర్ ఉద్యమానికి ఎక్కువ స్థలాన్ని ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని చూసి ఎంతగా భయపడ్డాయంటే, కరోనా, సెక్షన్ 144, సెక్షన్ 188 సాకుగా చూపి, జర్నలిస్టులు, ప్రజా సంఘాలతో సంబంధం ఉన్న వ్యక్తులు సిల్‌గేర్‌కు వెళ్లకుండా అన్ని రహదారులు మూసివేసాయి.
బస్తర్ లోని ప్రసిద్ధ సామాజిక కార్యకర్త సోనీ సోరికి సిల్‌గేర్ కు వెళ్లడానికి అనుమతించాక , ఆమె నాయకత్వంలో, స్థానిక పరిపాలన, ముఖ్యమంత్రిల మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగాయి, కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. ప్రభుత్వం నిరంతరాయంగా మెజిస్టీరియల్ విచారణను జరుపుతానని మాత్రమే చెబుతోంది.
మే 17 మారణకాండ జరిగిన వెంటనే, స్థానిక పరిపాలన ఒక మెజిస్టీరియల్ విచారణను ప్రకటించి, ఒక నెలలోపు తన నివేదికను అందజేస్తామని హామీ కూడా ఇచ్చింది.
8 మంది ఎమ్మెల్యేలు, ఒక MP బృందం ఉద్యమ స్థలానికి చేరుకున్నప్పుడు సోనీ సోరి నాయకత్వంలో మూల్ నివాసి బచావో మంచ్‌లోని 10 మందితో కూడిన కమిటీ ముందు మళ్లీ అదే వాగ్దానం పునరావృతమైంది. ఇంతలో, జూన్ 10 న, సిల్‌గేర్ ఆదివాసీలులు ఆందోళనను విరమించుకోవాలని లేదా సిల్‌గేర్ కు బదులుగా సుక్మా జిల్లా కేంద్రంలో ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నట్లు పుకారు వచ్చింది. దీనిని మూల్ నివాసి బచావో మంచ్ తిరస్కరించి ఉద్యమం క్యాంప్ లోనే కొనసాగుతుందని తెలియజేసింది, ఇది ఇప్పటి వరకు కొనసాగుతోంది.
ఈ మధ్యకాలంలో, అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోనీ సోరి నేతృత్వంలోని, మూల్ నివాసి బచావో మంచ్ కార్యకర్తలు, ఆదివాసీ సముదాయ నాయకులు ముఖ్యమంత్రిని కలవడానికి రాయ్‌పూర్ చేరుకున్నారు. అంతకుముందు, బీజాపూర్ జిల్లా కేంద్రం నుండి, వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడారు. దీనికి విరుద్ధంగా, ముఖ్యమంత్రి దర్యాప్తును ఒక నెలలో పూర్తి చేస్తామనే ప్రకటనను 6 నెలలకు పొడిగించారు. భాష్ప వాయువు, లాఠీ దెబ్బలు, కాల్పులకు గురి అయిన సిల్‌గేర్ ఆందోళనకారులను ఖాళీ చేతులతో వెనక్కు పంపారు.
ఈ రోజు, ఉద్యమం యొక్క వందవ రోజు జ్ఞాపకార్థం, భారీ జనసమూహంతో, శిబిరం ముందు ఒక ప్రదర్శన జరిగింది, ఇందులో వేలాది మంది సమీప గ్రామస్తులు పాల్గొన్నారు, సామాజిక కార్యకర్త సోనీ సోరి కూడా తన వంతు పాత్ర పోషించారు. కానీ మరోవైపు, ప్రభుత్వం ఈరోజు సిల్‌గేర్ ఆందోళనకు సంబంధించి ముందుగానే తయారు చేసిన కుట్రను బయటపెట్టింది. సిల్గర్ ఉద్యమం మావోయిస్టుల ప్రభావంలో ఉందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి రవీంద్ర చౌబే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ మార్కంలు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మారణకాండ విచారణ కోసం ఏర్పాటు చేసిన మేజిస్ట్రేట్ విచారణ కమిటీ, పూర్తిగా పాలనా యంత్రాంగ, పోలీసుల ఒత్తిడికి లొంగిపోయి ఇప్పటికే పోలీసులు ఆందోళన సమయంలో పట్టుకొని చిత్రహింసలు పెట్టి తమవైపు తిప్పుకొన్నవారితో ఏకపక్ష ప్రకటనలిప్పించడం ఈ వాస్తవాన్ని రుజువు చేస్తోంది.
భూమ్ కాల్ సమాచార్‌కి అందిన మెజిస్టీరియల్ విచారణ జరిపి సేకరించిన ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలాలలో ఒకటి రామా పునెం, తండ్రి బక్క పునెం, నివాసి టెకల్‌గూడ (ప్రస్తుత నివాసం - హీరాపూర్ పోలీస్ స్టేషన్). ఉద్యమం జరుగుతున్నప్పుడు పోలీసులు వెంటబడి పట్టుకున్న డజన్ల కొద్దీ వ్యక్తుల్లో యితను ఒకడు. ఈ వార్తను భూమ్‌కాల్ సమాచార్ ఇంతకు ముందే ప్రచురించింది.
రెండవ వాంగ్మూలం సిల్‌గేర్ గ్రామానికి చెందిన నర్సింగ్‌ది, తండ్రి కోర్సా బుద్ర. ఇతను ప్రస్తుతం తర్రెమ్ పోలీస్ స్టేషన్‌లో అప్రకటితంగా ఉన్నాడు. ఇద్దరి స్టేట్‌మెంట్‌లు ఒకేలా ఉన్నాయి, వారిద్దరి స్టేట్‌మెంట్‌లు సంఘటన జరిగిన ప్రదేశంలో కాక మరోచోట తీసుకున్నారు. అయితే, ఘటనా స్థలంలో మాత్రమే మేజిస్ట్రేట్ దర్యాప్తు చేయాలని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే, అందుకు ప్రభుత్వం అంగీకరించింది కూడా.
సునీత పొట్టామి, రఘు మిడియామి, భీమ సోధి, దుల్లా రామ్ కవాసి, సురేష్ అవలంలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి పెద్ద పాత్ర పోషించారు. అదే సమయంలో, కలెక్టర్‌ను కలవడానికి వెళ్ళిన బృందంలోనూ, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసిన బృందంలోనూ కూడా వారున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి కూడా వెళ్ళారు. కానీ ఇప్పుడు మేజిస్ట్రేట్ దర్యాప్తును ఒక ఆయుధంగా చేసుకుని ప్రభుత్వం వారిని నక్సలైట్‌గా నిరూపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. సునీత పోటామి ప్రముఖ మానవ హక్కుల సంస్థ PUCL ఏర్పాటు చేసిన నిజనిర్థారణ బృందంలో సభ్యురాలు కూడా.
మొత్తంమీద , సిల్‌గేర్ మారణకాండ కేసులో ఆదివాసీలకు న్యాయం చేసే బదులు ఆందోళనకారులను జైల్లో పెట్టడమే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఉద్దేశం.
Bhumkal Samachar సౌజన్యంతో
తెలుగు అనువాదం: పద్మకొండిపర్తి
Keywords : chattis garh, bhijapur, CRPF Camp, Silger, firng, protest, adivasi
(2025-01-16 12:01:41)
No. of visitors : 1094
Suggested Posts
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటనఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన |
| మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి. |
| ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహంచత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. |
| హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు. |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులుచత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. |
| ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. |
| పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటనజూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. |