పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు


పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు

పార్టీ

08-09-2021

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17 వ ఆవిర్భావ వారోత్సవాలను విప్లవ వాతావరణంలో ఘనంగా నిర్వహించండి

విప్లవ ప్రతీఘాతక‌ వ్యూహాత్మక ʹసమాథాన్ ప్రణాళికను ఓడించండి పార్టీని పరిరక్షించి దేశ విముక్తికై పోరాడండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17 వ పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోబోతున్నది. మా పార్టీ కేంద్రకమిటీ దాదాపు నెల రోజుల క్రితమే సవివరమైన విప్లవ సందేశాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ తరపున యావత్ పార్టీ శ్రేణులకు; పీఎల్‌జీఏ కమాండర్లకు, యోధులకు; విప్లవ ప్రజా నిర్మాణాల నాయకులకు, కార్యకర్తలకు; విప్లవ ప్రజా కమిటీల నాయకులకు, కార్యకర్తలకు; దేశంలోని వివిధ జైళ్లలో అనేక తప్పుడు ఆరోపణలపై శిక్షలను భవిస్తున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు; దేశంలోనూ విదేశాలలోనూ భారత విప్లవోద్యమ రక్షణ, వికాసాలకు అహర్నిశలు అలుపెరుగని కృషి సలుపుతున్న కామ్రేడ్స్ కు, మితృలకు కేంద్ర కమిటీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ముందుగా మన పార్టీ సంస్థాపక నాయకులు కామ్రేడ్స్ చారుమజుందార్, కన్హయ్ చటర్జీలకు, మన భారత విప్లవ విజయానికై తమ నులివెచ్చని నెత్తుర్లను ధారపోసిన గడచిన కొద్ది నెలలలో అమరులయిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పూర్ణేందు శేఖర్ ముఖర్జీ, కామ్రేడ్ యాపా నారాయణలతో సహా మన ప్రియమైన అమర సహచరులందరికీ పేరు పేరునా వినమ్రంగా విప్లవ జోహార్లర్పిస్తున్నాం. వారి ఆశయాల సాధనకై తుదివరకూ పోరాడుతామని విప్లవ ప్రతిన బూనుతున్నాం.

భారత విప్లవోద్యమ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంధా గత 54 సంవత్సరాలుగా అనేక ఓటములను, విజయాలను; అటు-పోట్లను; ఎగుడు-దిగుళ్లను; మలుపులను-మెలికలను; వెనుకంజలను ఎదుర్కొంటూ, మన పార్టీ సంస్థాపకులు, ఉపాధ్యాయులు కామ్రేడ్స్ చారు మజుందార్, కన్హయ ఛటర్జీలు అందించిన సిద్ధాంత, రాజకీయ, సైనిక అవగాహనలను మరింత అభివృద్ధిపరుచుకుంటూ మన పార్టీ పీల్ జీఏను నిర్మించుకొని దేశంలో విప్లవ ప్రజల ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక అధికారాన్ని నెలకొల్పుతూ విప్లవ మార్గాన్ని ప్రశస్తం చేస్తోంది. ఆ మార్గం నెత్తుటి త్యాగాలతో సదా ప్రకాశిస్తుందనీ అది విజయ పథం అని నిరూపిస్తున్నది.

గత కొద్ది సంవత్సరాలుగా భారత దోపిడీ పాలక వర్గాల, వారి సామ్రాజ్యవాద ప్రభువుల కనుసన్నలలో ముమ్మరంగా కొనసాగుతున్న అన్ని రకాల ఫాసిస్టు దాడుల నుండి భారత విప్లవోద్యమాన్ని కాపాడుకోడానికి పార్టీ దృఢ సంకల్పంతో పోరాడుతోంది. ఆ దాడుల పరాకాష్టగా ఏప్రిల్ 19 నాడు దండకారణ్యంలోని (ఛత్తీస్ గఢ్) సుక్మా జిల్లా (దక్షిణ్ బస్తర్) బొత్తలంక గ్రామ పరిసరాలలో డ్రోన్ దాడులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత తమ డ్రోన్ దాడులను కప్పిపుచ్చుకోవడానికి వరుసగా ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర పోలీసులు కౌంటర్ గా మావోయిస్టులు డ్రోన్ సర్వేలు జరుపుతున్నారంటూ గోబెల్స్ ప్రచారానికి దిగారు. ఇవన్నీ అతి త్వరలో పాల్పడనున్న నూతన ఫాసిస్టు దాడి ప్రహార్-3కు సన్నాహాలే. గత నాలుగేళ్లుగా సమాధాన్ దాడిని ఎదుర్కొంటూ దానిని తిప్పికొడుతున్న ప్రజా ఉద్యమాలను, ప్రజాయుద్ధాన్ని నిర్మూలించేందుకై వేగిరపడుతున్న చర్యలే. ఈ చర్యలన్నింటినీ మరింత దృఢంగా, మరింత సమన్వయంతో, ద్విగుణీకృత విప్లవోత్సాహంతో తిప్పికొట్టకుండా, ఓడించకుండా, అంతిమంగా వారి విప్లవ ప్రతిఘాతుకత్వాన్ని కూకటివేళ్లతో సహ పెళ్లగించి నిర్మూలించలేం.

ఈ సమూల మార్పు రాకుండా దేశంలో యావత్తు పీడిత వర్గాల, జాతుల ప్రజలు దోపిడీ పీడనల నుంచి విముక్తం కారు. నేటి బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు పాలక వర్గాలు కనీసమైన ప్రశ్నలను కూడా సహించకుండా సాయుధ విప్లవకారుల నుంచి సాధారణ ప్రజల వరకూ తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయి. ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఈ పరిస్థితులలో పార్టీ దేశ యావత్తు ప్రజల విముక్తికి మార్గం సుగమం చేస్తున్నది. మన పార్టీ సముపార్జించిన వీరోచిత విప్లవ సంప్రదాయాలను నిలబెడుతూ మొక్కవోని ధైర్యంతో దేశ విముక్తికై పాటు పడతామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం.

పార్టీ నాయకత్వంలో పీఎల్ జీఏ, విప్లవ నిర్మాణాలు, విప్లవ ప్రజలు అపూర్వ స్థాయిలో బహుముఖ శతృ క్యాంపెయిన్లతో తలపడుతున్నారు. మన పార్టీపై, విప్లవోద్యమంపై జరుగుతున్న శత్రు బహుముఖ దాడుల పట్ల వామపక్ష, ప్రగతిశీల, లౌకిక, అదివాసీ హితోభిలాషులు, దేశభక్త శక్తులు, మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మత మైనారిటీలు, మహిళలు పెచ్చరిల్లుతున్న హిందుత్వ దాడులను ప్రతిఘటిస్తున్నారు. మోదీ ప్రభుత్వ సామ్రాజ్యవాద, రియాక్షనరీ హిందుత్వ అనుకూల విధానాలను బట్టబయలు చేస్తున్నారు.

2020 నవంబర్ 26 నుండి ఈనాటి వరకు భారత రైతులు రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నారు. బస్తర్ ప్రాంతంలో సిలింగర్ లో ఆదివాసీ ప్రజలు మే 12 నుండి ఈ రోజు వరకు కార్పొరేటీకరణకు, కార్పెట్ సెక్యురిటీకీ వ్యతిరేకంగా అవిరామంగా పోరాడుతున్నారు. ఈ పోరాటానికి మద్దతుగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల, సెక్షన్ల ప్రజలు సంఘీభావ పోరాటాలు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో గిరిడి జిల్లా పీలాండ్ బ్లాక్ లో ప్రజలు, ముఖ్యంగా మహిళలు పోలీసు క్యాంపుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దేశంలో షాహీన్ బాగ్, సింఘీ, టిక్రీ, గాజీపుర్, కడియమెట్ట వంటివి ప్రజా పోరాటాలకు నమూనాలయ్యాయి. అస్థిత్వ, ఆత్మగౌరవం కోసమూ, విస్థాపనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేసేందుకు పార్టీ కృషి చేస్తున్నది. ఈ పోరాటాలు ʹఅజాదీ కా అమృత్ మహోత్సవ్ʹ పేరుతో మోదీ ప్రభుత్వం అకాశానికి ఎత్తుతున్న బూటకపు స్వాతంత్ర్యాన్ని వెల్లడి చేస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా పెంపొందుతున్న విప్లవానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడానికి ఉక్కు క్రమశిక్షణతో అత్యంత రహస్యంగా శతృవుకు అభేద్యమైన రీతిలో పార్టీని పటిష్టం చేయవలసిన సమయం ఇది. మావోయిస్టు కార్యశైలిని, కార్యపద్ధతిని ఖచ్చితంగా అనుసరించవలసిన సమయమిది. ఈ పరిస్థితులలో విప్లవోద్యమాన్ని పురోగమింపజేసేందుకు కేంద్ర కమిటీ రెండేళ్ల పాటు పార్టీ కన్సాలిడేషన్ కేంపెయిన్ నిర్వహించవలసిందిగా పిలుపునిచ్చింది. ఈ కెంపెయిన్ మంచి ఫలితాలు సాధిస్తోంది. పార్టీ కన్సాలిడేషన్లో భాగంగా నూతన దస్తావేజుల తయారీ నుండి నూతన నాయకత్వ శక్తుల ఎన్నిక వరకు అనేక కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రజా యుద్ధ చర్యలను, సమరాలను, ప్రజా పోరాటాలను, ప్రజల అధికారాన్ని మేళవిస్తూ పార్టీ మరింత నైపుణ్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నది.

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తులు కేంద్రంలో అధికారాన్ని చేపట్టి ఒకవైపు సామ్రాజ్యవాదులకు సేవ, దళారీతనం చేస్తూ, మరోవైపు జాతీయోన్మాదాన్నీ/బూటకపు దేశభక్తిని వ్యాపింపజేస్తూ భారతదేశాన్ని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు భారత్ గా మార్చే ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నాయి. దీనికి అనుగుణంగా నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి. స్వావలంబన పేరుతో దేశ ప్రజల బతుకులను దర్భరం చేస్తున్నాయి. నిరసనగా పెగిలే గొంతుకలను అణగదొక్కుతున్నాయి, జైళ్లలో కుక్కుతున్నాయి, వారిని హత్య చేస్తున్నాయి. ఈ న్యూ ఇండియా నిజానికి హిందూ మతోన్మాదంతో, కరుడుగట్టిన హిందుత్వంతో, పీడక కులాల ఆధిపత్యంతో, దేశ వైవిధ్యాన్ని అంతమొందించేందుకు, వేర్వేరు జాతుల ఉనికిని తుడిచిపెట్టేందుకు, వర్గపోరాటాన్ని అంతమొందించేందుకు, ప్రస్తుత దోపిడీ పాలకవర్గాల దోపిడీని, పాలనను కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంది.

ఇది దళితులకు, ఆదివాసులకు, వెనుకబడిన కులాలకు, మత మైనారిటీలకు, మహిళలకు వ్యతిరేకమైనది. హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా యావత్తు ప్రజాస్వామిక, ప్రగతిశీల, మార్సిస్టు-లెనినిస్టు పార్టీలు, సంఘాలు, శక్తులు ఐక్యమై విశాల ఐక్యసంఘటనను నిర్మించి వివిధ ఆందోళనా రూపాలను చేపట్టి పోరాటాన్ని కొనసాగించాలి. ఈ వేదికల్లో ప్రజాపక్షం వహించే, ప్రగతిశీల, ప్రజాస్వామిక రచయితలు, కళాకారులు, చరిత్రకారులు, మానవ శాస్త్రజ్ఞులు మొదలైన మేధావులు భాగం కావాలి. నయా భారత్ అంటే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు భారత్ కాదు, నూతన ప్రజాస్వామిక భారత్ అని చాటి చెప్పాలి.
సామ్రాజ్యవాదులు, మోదీ వంటి వారి దళారీలు సృష్టించిన కొరోనా మహమ్మారీ కుట్ర రాజకీయాలను, టీకాల వ్యాపారాన్ని భారత ప్రజలు అడుగడుగునా ప్రతిఘటిస్తున్నారు. ఇవన్నీ పాలక వర్గాల సంక్షోభ సుడిగుండపు సూచికలు. మన విప్లవోద్యమ పురోగమనానికి హామీనిచ్చే అనుకూలాంశాలు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ నూతన ఉత్సాహంతో పట్టుదలతో భారత విప్లవోద్యమ పురోగమనానికి నడుం బిగిద్దాం.

పార్టీ 17వ అవిర్భావ వేడుకలసందర్భంగా విప్లవానికి అనుకూల పరిస్థితులను వినియోగించుకుని దోపిడీ పీడనల నుంచి విముక్తి చెంది ప్రజల రాజ్యాధికారం కోసం ముందడుగు వేయవలసిందిగా కేంద్ర కమిటీ యావత్తు పీడిత వర్గాల, సెక్షన్ల ప్రజలకు పిలుపునిస్తున్నది.

అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)


Keywords : CPI Maoist, 17th anniversary, abhay, narendra modi, bjp
(2021-10-26 00:38:32)No. of visitors : 704

Suggested Posts


అభయ్ పేరిట విడుదలైన ప్రకటనకు జంపన్న జవాబు

రెండు రోజుల క్రితం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో వచ్చిన ఓ ప్రకటనలో జంపన్నపై కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై జంపన్న స్పంధించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన‌

14 ఆగస్టు, 2021 మనం కొద్ది రోజులలో జరుపుకోబోతున్న మన పార్టీ అవిర్భావ వారోత్సవాల ఉత్సాహభరిత రాజకీయ వాతావరణంలో అత్యంత విషాదకర వార్తను వినాల్సి వస్తోంది. ఇటీవలే మా యువ సీసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యాప నారాయణ అమరత్వ వార్త నుండి మనమింకా పూర్తిగా తేరుకోక ముందే మేం వెటరన్ కామ్రేడ్ అంబర్ ను కోల్పోయాం.

Celebrate grandly the 17th Anniversary of CPI (Maoist) in revolutionary atmosphere!

CPI (Maoist) is about to celebrate its 17th Anniversary. The CC of our party gave a detailed revolutionary message almost one month back. On the occasion the CC conveys revolutionary

Search Engine

Solidarity statement by Democratic Studentsʹ Association for Comrade Tipu Sultan
పెగాసస్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు
Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
UP: లఖింపూర్ రైతుల హత్య కేసు.... యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా
#StandwithVV #StandwithBK15
ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌
ఉద్యమ రైతుల ఆకలి తీరుస్తున్న‌ ఓ NRI ని ఇండియాలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
100 కోట్ల వ్యాక్సినేషన్ పచ్చి అబద్దం - శివసేన
UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌
భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదు - సుప్రీం కోర్టు
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం
గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు
UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.
UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది
విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి
మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ
పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం
అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్
more..


పార్టీ