తొలి తరం విప్లవ యోధురాలు కన్నుమూత !


తొలి తరం విప్లవ యోధురాలు కన్నుమూత !

తొలి

తొలి తరం విప్లవ యోధురాలు ద్రోణవల్లి అనసూయమ్మ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో, మృత్యువుతో పోరాడుతూ ఆమె గురువారంనాడు మధ్యాహ్నం విజయవాడలో మరణించారు.
జీవితమంతా విప్లవాన్ని శ్వాసించిన అనసూయమ్మ 1930 లో కృష్ణాజిల్లా మేడూరులో జన్మించారు. ఆమెకు అక్క,చెల్లెల్లు అన్నదమ్ములు కలిసి ఆరుగురు. ఆమె చిన్నాన్న యలమంచిలి వెంకట కృష్ణయ్య కాంగ్రెసు కార్యకర్త . అనసూయమ్మను తొమ్మిదోయేట నుంచే ఆయన జాతీయ కాంగ్రెస్ సభలకు తీసుకొని వెళ్ళేవారు. ఈమె మేనత్త భర్త జాతీయోద్యమంలో జైలుపాలయి అక్కడే చనిపోయారు. ఈనేపధ్యంలో ఆమె చిన్ననాటి నుండే అభ్యుదయ భావాలవైపు ఆకర్షితురాలయినారు. చిన్నతనం నుండి
ఊరి గ్రంధాలయంలో చదివిన రష్యన్ సాహిత్యం కమ్యూనిస్టు రాజకీయాలవైపు మలిచింది.
1946 లో ఆమె కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలయింది. 1945 డిశంబర్ లో చురుకయిన కమ్యూనిస్ట్ కార్యకర్త సత్యప్రసాద్ తోవివాహమయింది. ఇది ఆ ప్రాంతంలో తొలి ఆదర్శవివాహం. అప్పటి నుండి దంపతులిద్దరు, ఉద్యమంలో భాగమైనారు. 1945 ను౦డి1952 వరకు రహస్యోద్యమంలో తన సహచరునితో కలిసి గెరిల్లా దళ సభ్యురాలిగా పని చేసింది. 1950 ఆగష్టు5న ఆమెభర్త సత్యప్రసాదును పోలీసులు కాల్చి చంపారు.1953 లో ఆమె పార్టీ తాలూక కమిటీ సెక్రటేరియట్ సభ్యురాలయింది. ఆ తర్వాత ఆమె నక్సలైటు రాజకీయాల వైపు వచ్చారు. పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో 1984లో ఐలూరు ,గురివింద పల్లె, పెద వేగిలలో జరిగిన భూపోరాటాలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. 1984 లోఎపి రైతు కూలీ సంఘం రాష్ఱ్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఆమె తాను నమ్మిన విప్లవ రాజకీయాలలో కొనసాగారు. అనసూయమ్మ నిరంతర అధ్యయనశీలి..
చొరవ పట్టుదల సిద్ధాంత నిబద్ధత కలిగిన వ్యక్తిత్వం. ఆమె ఉద్యమ సహచరులను కన్నబిడ్డల్లా ప్రేమించింది. ఆ ప్రేమను కడదాకా పెంచింది. ఆ కమ్యూనిస్టు యోధురాలికి విప్లవరచయితల సంఘం, ఇతర విప్లవ ప్రజా సంఘాలు నివాళులు అర్పించాయి
.. విప్లవ రచయితల సంఘం

Keywords : Naxalite, Anusuyamma, Revolutian, Krishana
(2019-05-19 01:24:30)No. of visitors : 724

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


తొలి