ఆదివాసీ ముఖ్యమంత్రి పాలనలో ఆదివాసీ కార్మిక నాయకుడిపై అక్రమ కేసులు

ఆదివాసీ

26-09-2021

2021 సెప్టెంబర్ 13 న, జిల్లా పరిపాలన జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని జోరపోఖర్ హైస్కూల్ కాలనీలో నివసిస్తున్న జార్ఖండ్ కామ్‌గార్ మజ్దూర్ యూనియన్, అఖిల భారత క్రాంతికారి ఆదివాసీ మహాసభ కేంద్ర అధ్యక్షుడు జాన్ మీరన్ ముండాపై క్రైమ్ కంట్రోల్ యాక్ట్ CCA ని విధించింది. అతని కార్యక్షేత్రమైన ఝీంక్‌పానీలో వున్న టోంటో పోలీస్ స్టేషన్‌లో కాకుండా, అతని ఇంటికి 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న జారైకెలా పోలీస్ స్టేషన్‌లో ప్రతిరోజూ 12:30 కి హాజరు కావాలని ఆదేశాన్నిచ్చారు.

జాన్ మీరన్ ముండాపై కేసులకు నిరసనగా అతని భార్య పుష్ప సింకు అఖిల్ భారతీయ క్రాంతికారి ఆదివాసీ మహాసభ సహచరులతో పాటు సెప్టెంబర్ 21 నుండి సదర్ సబ్ డివిజనల్ కార్యాలయం ముందు 48 గంటల పాటు నిరాహార దీక్షలో కూర్చున్నారు. సబ్ డివిజనల్ ఆఫీసర్ ద్వారా జార్ఖండ్ గవర్నర్‌కు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు పంపిన లేఖలో ఆమె తన భర్త జాన్ మీరన్ ముండాపై విధించిన సిసిఎ పైనా, ఝీంక్‌పానీ, టోంటో పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపైనా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

ఆదివాసీ కార్మిక నాయకుడు జాన్ మీరన్ ముండా భార్య పుష్ప సింకు మాట్లాడుతూ "పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో ఉంటారు. ఖనిజ సంపద సమృద్ధిగా ఉంది. కానీ ఆ ప్రాంత ఆదివాసీల పరిస్థితి దయనీయంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన 74 సంవత్సరాల తర్వాత కూడా ఆదివాసీ సంఘం కలప, పళ్ళు తోముకొనే పుల్లలు, ఆకులు, హడియ (స్థానిక మద్యం) మొదలైన వాటిని అమ్ముకొని బతకాలి, లేదంటే ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వుంటుంది. ధనిక జిల్లాలోని ప్రజలు ఎందుకు పేదవారుగా వున్నారు అనేది నా భర్త అడుగుతున్న ప్రశ్న. స్వాతంత్య్రం తర్వాత కూడా ఆదివాసీల ప్రయోజనాలను పరిరక్షించడానికి 5 వ షెడ్యూల్ చట్టం ఎందుకు అమలు చేయడంలేదు? ఇంతవరకు గనుల రంగంలో సమతా తీర్పు ఎందుకు అమలు చేయడంలేదు? ఇంకా రైతుల పొలాలకు నీరు ఎందుకు చేరడంలేదు? ఈ ప్రశ్నల గురించి నా భర్త ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పుడు, అతని గొంతుని అణచివేయడానికి అబద్ధపు కేసు నమోదు చేసి, జిల్లా యంత్రాంగం CCA సెక్షన్‌లు విధించింది.ʹ అని అన్నారు.

భారత ప్రజాస్వామ్యంలో దోపిడీకి వ్యతిరేకంగా గొంతెత్తే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పుడు దోపిడీకి వ్యతిరేకంగా తన గొంతెత్తిన నా భర్తని జిల్లా యంత్రాంగం ఎందుకని అపఖ్యాతి చెందిన నేరస్థుడిలా అవమానిస్తున్నారు? అని పుష్ప ప్రశ్నిస్తోంది.

ʹఒకవేళ నా భర్త ఒక కుఖ్యాత నేరస్థుడే అయితే, అతనిపై జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసు నమోదై ఉండాల్సింది, కానీ కేవలం ఝీంక్‌పానీ, టోంటో పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయడం వెనుక ACC యాజమాన్యం ఉంది. ఎందుకంటే ACC కంపెనీ ఝీంక్‌పానీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉంది, ACC సిమెంట్ తయారీలో ఉపయోగించే సున్నపురాయి టోంటో పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజంకా, డోకట్టా మొదలైన వాటి నుండి వస్తుంది.

ACC యాజమాన్యం లీజును పొడిగించి F-3 బ్లాక్ లీజు తీసుకోవడమే నా భర్తపై CCA విధించడానికి ప్రధాన కారణం. F-3 బ్లాక్ లీజు తీసుకోవడంలో ఏ సమస్యా వుండకూడదని ప్రణాళికాబద్ధంగా CCA సెక్షన్ల క్రింద ఝీంక్‌పానీ, టోంటో పోలీస్ స్టేషన్ ప్రాంతానికి 102 కి.మీ దూరంలో ఉన్న జారైకెలా పోలీస్ స్టేషన్‌లో రోజువారీ హాజరు యివ్వాలని ఆదేశం ఇచ్చారు. తద్వారా ACC యాజమాన్యం ఆదివాసీల భూమిని మళ్లీ చౌకగా కొల్లగొడుతుంది. కుటుంబానికి 102 కి.మీ దూరంలో ఉన్న జారైకెలా పోలీస్ స్టేషన్‌కు ప్రతి రోజూ హాజరవ్వమని ఆదేశమివ్వడంతో నా భర్త మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దయనీయంగా మారింది. నా భర్తను 6 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉంచడం అంటే నా కుటుంబాన్ని ఆకలితో అలమటించేట్లు చేసే కుట్రʹ అని పుష్ప సింకు చెప్పారు

ʹస్థానిక JMM ఎమ్మెల్యే దీపక్ బిరువా, ACC మేనేజ్‌మెంట్ ఆదేశాల మేరకు జార్ఖండ్ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నన్ను గూండాగా ప్రకటించాయి, నాపై 6 నెలలు CCA విధించాయి. జింక్‌పానీ, టోంటో పోలీస్ స్టేషన్‌లలో నాపై దాఖలైన 29 కేసులు CCA ఆధారంగా రూపొందించారు, అయితే కేవలం ఉద్యమం చేయడం వల్లనే ACC యాజమాన్యం, స్థానిక పరిపాలనలు నాపై ఈ కేసులన్నీ నమోదు చేయించాయి. ప్రభుత్వం నన్ను గూండా అని పిలుస్తుంది, నేను 2009 నుండి నమోదు అయిన కార్మిక సంస్థ ʹజార్ఖండ్ కామ్‌గార్ మజ్దూర్ యూనియన్ʹ కేంద్ర అధ్యక్షుడిగా ఉన్నాను, దీని నమోదు సంఖ్య 144/07. అలాగే, 2010 నుండి, నేను అఖిల్ భారతీయ క్రాంతికారి ఆదివాసీ మహాసభకు కేంద్ర అధ్యక్షుడిని కూడా. నేను 2014 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో చైబాసా అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్రుడిగా పోటీ చేశాను. అందులో నాకు మూడో స్థానం వచ్చింది. 2014 లో, నేను ఫార్వార్డ్ బ్లాక్ తరపున చైబాసా లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేశాను.ʹ అని ఆదివాసీ కార్మిక నాయకుడు జాన్ మీరన్ ముండా చెప్పారు.

1991 నుండి 2014 వరకు, ACC సిమెంట్ కంపెనీ సుమారు 900 కోట్ల విలువైన సున్నపురాయిని అక్రమంగా తవ్వింది. హైకోర్టు ఆదేశం మేరకు 48 కోట్ల జరిమానా కూడా చెల్లించింది. కానీ ఆదివాసీలందరికీ ఉపాధి లేక సరైన పరిహారం అందలేదు. F-2 బ్లాక్ కింద సుమారు 280 ఎకరాల భూమిని సేకరించింది, ఇప్పుడు F-2 బ్లాక్‌లో గనుల తవ్వకం సాధ్యం కాదు, కాబట్టి కంపెనీ F-3 బ్లాక్ కింద సుమారు 100 ఎకరాలను సేకరించాలనుకుంటోంది. మొదట ఎఫ్ -2 బ్లాక్‌లో నిర్వాసితులైనవారికి ఉద్యోగమూ పరిహారం యిచ్చిన తర్వాత మాత్రమే భూమిని ఎఫ్ -3 బ్లాక్ కింద సేకరించనిస్తాం అని స్థానిక ప్రజలు అంటున్నారు. కానీ అధికార పార్టీ JMM MLA, ACC యాజమాన్యం స్థానిక గ్రామ ప్రధాన్‌లకు (మాన్‌కి, ముండా) కోట్లాది రూపాయలు ఇవ్వడం ద్వారా ఆదివాసీ ప్రజల భూమిని చౌక ధరలకు కొల్లగొట్టాలనుకుంటున్నారు. .

ʹఉద్యోగాలు, న్యాయమైన పరిహారం కోసం మా ఉద్యమం తీవ్రతరమైనప్పుడు, క్రితం నెలలో అంటే ఆగస్టులో, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వచ్చి 45 మందికి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు, ఇద్దరు వ్యక్తులకు నియామక పత్రాలను కూడా ఇచ్చారు, కానీ వాటిలో ʹతాత్కాలిక ప్రణాళికʹ కింద అని రాసి వుంది. అయితే, F-3 బ్లాక్‌లో తవ్వకాలు ప్రారంభించిన తర్వాత ఉద్యోగం ఇస్తామని, F-3 బ్లాక్ కోసం జరిగే భూ సేకరణలో ప్రజలు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు అనే షరతు కూడా వుంది. ఇది ఆదివాసీ ప్రజలకు తీరని అన్యాయం కాబట్టి మేము కూడా దీనికి వ్యతిరేకంగా నిరసన ప్రారంభించాము, ఈ నిరసనను అణచివేయడానికి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కాకుండా 102 కి.మీ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని నాకు చెప్పారు. జరాయికెలా పోలీస్ స్టేషన్ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఆనందపూర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నాను. అక్కడ నుండి ప్రతిరోజూ పోలీస్ స్టేషన్‌కు హాజరవుతున్నాను. అయితే ప్రతిరోజూ 4 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో ఆపుతున్నారు. అయితే అలా CCA ఆర్డర్‌లో ఎక్కడా నమోదు చేయలేదు. అందుకు నిరసన తెలియచేస్తే , పై నుండి ఆర్డర్ ఉందని స్టేషన్ ఇన్‌ఛార్జ్ చెప్పారు.

మూడు సార్లు నాపై CCA విధించారు, మొదటిసారి 2013 లో. ఒక సంవత్సరం పాటు జైలులో బంధించారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ వున్నారు. రెండవసారి 2018 లో CCA విధించారు, 6 నెలల పాటు 14 రోజులకు ఒకసారి కోర్టులో హాజరుకావాల్సి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన రఘువర్ దాస్ ఉన్నాడు. యిప్పుడు మూడవసారి. నేను ఇప్పటివరకు 10 సార్లు జైలుకు వెళ్లాను, దాదాపు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాను.ʹ

ఆదివాసీలు, కార్మికుల కోసం వేలాది సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ, నేను వెనక్కి తగ్గను, మరింత శక్తితో కార్మికులతో గొంతు కలుపుతాను అంటారు 39 ఏళ్ల ఆదివాసీ కార్మిక నాయకుడు జాన్ మీరన్ ముండా.

ʹమీరు ఇప్పుడు ఏమి చేస్తారుʹ అని అడిగితే, త్వరలో CCA ని హైకోర్టులో సవాలు చేస్తానని, సెప్టెంబర్ 27నాడు జరగబోయే భారత్ బంద్‌లో తమ డిమాండ్లను జోడించి వీధుల్లోకి వస్తామని చెప్పారు.

తనపై విధించిన CCA ని ఇప్పటివరకు ఏదైనా ట్రేడ్ యూనియన్ వ్యతిరేకించిందా అని అడిగినప్పుడు, ఇప్పటి వరకు ఏ వామపక్ష ట్రేడ్ యూనియన్ నాయకుడు కూడా తనను పలకరించకపోవడం విచారకరమని ఆయన అన్నారు.

Keywords : jharkhand, CCA, Crime Control Act, john meeran munda, arrest, wife, cca imposed on tribal leader meeran munda in jharkhand
(2024-04-25 21:27:42)



No. of visitors : 564

Suggested Posts


వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌, లతేహర్ జిల్లాలోని గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకూ-పిరీ అడవిలో వేట కోసం వెళ్ళిన‌ ఆదివాసీ యువకుల పై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిరి నివాసి 23 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు, అదే గ్రామానికి చెందిన దీనానాథ్ సింగ్ గాయపడ్డాడు.

ʹమావోయిస్టు నాయకులను జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారుʹ

సీనియర్ మావోయిస్టు నాయకులు ప్రశాంత్ బోస్ @ కిష‌న్ దా, అతని సహచరి షీలా మరాండీలమి జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు రవి అమరత్వం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం.

అవును నేను మావోయిస్టునే..!

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి.

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు....

ఆ ఆదివాసీ యువకుడిది ఎన్ కౌంటర్ కాదు హత్యే, సీఆర్పీఎఫ్ అధికారే దోషి - 9 ఏండ్ల తర్వాత తేల్చిన సీఐడి

గ్రామానికి చేరుకున్న వెంటనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు 20-22 మంది గ్రామస్తులను పట్టుకుని అందరి చేతులను వెనక్కు విరిచికట్టేసి, తమ వెంట తీసుకెళ్లి ఆ రాత్రి వారందరినీ వూరి బయట మైదానంలో వుంచి మర్నాడు జూన్ 29న తమ సామాన్లను బహదా అడవికి మోయించుకెళ్లారు. అక్కడ నుండి యింకా ముందుకు సామాను తీసుకెళ్లడానికి నిరాకరించడంతో మంగల్ హోన్‌హాగ్‌ను కాల్చి చంపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆదివాసీ