ప్రజాయుద్ధాలను తీవ్రతరం చేయడమే గొంజాలోకు నిజమైన నివాళి - మావోయిస్టు పార్టీ ప్రకటన


ప్రజాయుద్ధాలను తీవ్రతరం చేయడమే గొంజాలోకు నిజమైన నివాళి - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజాయుద్ధాలను

26-09-2021

జైల్లో మరణించిన పెరూ కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ అభిమేల్ గుజ్మన్ కు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రెడ్ సెల్యూట్స్ తెలిపింది. 29 ఏళ్ళు జైల్లో ఉంచి, అనారోగ్యపాలైనప్పటికీ ఆయనకు చికిత్స అందించక అమెరికా ఆడేశాలతో ఆయనను హత్య చేసిన పెరూ ప్రభుత్వం చర్యల పట్ల మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకటన పూర్తి పాఠం....

పీడిత ప్రజల గొప్ప నాయకుడు పెరూ విప్లవ నాయకుడు కామ్రేడ్ అభిమేల్ గుజ్మన్ కు రెడ్ సెల్యూట్స్!

దాదాపు మూడు దశాబ్దాల నికృష్ణ జైలు జీవితంలో తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్న ఎనభై ఆరు సంవత్సరాల పెరూ విప్లవ కమ్యూనిస్టు పార్టీ (పీసీపీ) నాయకుడు కామ్రేడ్ అభిమేల్ గుజ్మన్ (గొంజాలో)ను అమెరికా ఆదేశాల పై పెరూ ప్రభుత్వం సరైన చికిత్స అందకుండా చేసి అంతిమంగా కల్లావో నేవల్ బేస్ ఆస్పత్రిలో హత్య చేసింది. పెరూ ప్రభుత్వ వైఖరిని మా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ అమరుడు కామ్రేడ్ గొంజాలోకు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. ఆయన నాయకత్వం వహించిన పెరూ కమ్యూనిస్టు పార్టీకి, ఆయన కుటుంబానికి, మిత్రులకూ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నది. ఆయనను హతమార్చడానికి అమెరికా సామ్రాజ్యవాదంతో కుమ్మక్కైన పెరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీసీపీ దృఢంగా తుది వరకు పోరాడి అమరుడు గొంజాలో ఆశయాలను మున్ముందుకు తీసుకుపోతుందనీ మా పార్టీ పూర్తిగా విశ్వసిస్తోంది.

1992 సెప్టెంబర్ 12వ తేదీన అరెస్టయిన కామ్రేడ్ గొంజాలో సరిగ్గా 29 సంవత్సరాల తరువాత 2021 సెప్టెంబర్ 11వ తేదీన పెరూ ప్రభుత్వ నిర్బంధంలో అమరులయ్యారు. అయన మొక్కవోని విప్లవ స్ఫూర్తి, దృఢత్వం ప్రపంచవ్యాప్త విప్లవ కమ్యూనిస్టులకు ఆదర్శం. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగమైన పెరూ విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడంలో ఆయన చేసిన అన్ని రకాల కృషిని త్యాగాన్ని భాకపా (మావోయిస్టు) కేంద్ర కమిటీ స్మరించుకుంటున్నది.

కామ్రేడ్ మావో, చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెట్టుబడిదారీ మార్గేయులకు వ్యతిరేకంగా సాగిన గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవంతో ప్రేరణ పొందిన కామ్రేడ్ గొంజాలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను చేపట్టి పెరూ సామాజిక పరిస్థితులకు గొప్పగా అన్వయిస్తూ 1981లో సాయుధ పోరాటాన్ని అరంభించాడు. కొద్ది కాలంలోనే పెరూలో ప్రజా యుద్ధం గొప్ప గొప్ప అంగలతో అభివృద్ధి చెందింది. అమెరికా సామ్రాజ్యవాదులకూ, దాని తొత్తు పెరూ ప్రభుత్వానికి అది ఒక పెద్ద సవాల్ గా మారింది. దానితో పెంటగన్, సీఐఏ రంగంలోకి దిగి పెరూ ప్రజా యుద్ధాన్ని అంతమొందించడానికి ఫాసిస్టు సైనిక అణచివేత చర్యలతో పాటు అనేక కుట్రలకు కుహకాలకు పూనుకున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే పెరూ ప్రజాయుద్ధం (లీప్స్ అండ్ బౌండ్స్) పురోగమించసాగింది.

పెరూ కమ్యూనిస్టు పార్టీకి, దాని సైన్యం ʹషైనింగ్ పాథ్ʹకూ నాయకత్వం వహించిన కామ్రేడ్ గొంజాలో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మృత్యుంజయునిగా నిలిచిపోతాడు. ఆయన రివిజనిజాన్ని చాలా బలంగా వ్యతిరేకించాడు. గోర్బచేవ్ ముందుకు తీసుకువచ్చిన పెస్త్రాయికాకు వ్యతిరేకంగా పోరాడాడు. పార్టీలో తలెత్తిన రెండు పంథాల మధ్య పోరాటం, ʹఅతిʹ, మితవాద పెడధోరణులు, బహిరంగ, రహస్య పని మొదలయిన అనేక విషయాలపై మావోయిస్టు అవగాహనతో విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తూ మొత్తంగా ఫాసిజం పరిణామం, ప్రత్యేకించి పెరూ ఫాసిజం గురించి నొక్కి చెబుతూ దానికి వ్యతిరేకంగా పోరాడడంలో ఆయన అపార కృషి చేశాడు. ఆ కృషిని వర్తమాన పెరూ కమ్యూనిస్టు పార్టీ మున్ముందుకు కొనిపోతుందనీ మాపార్టీ పూర్తిగా నమ్ముతోంది.

ప్రపంచవ్యాప్త సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమాలతో కలత చెందుతున్న సామ్రాజ్యవాదులు అమలు చేస్తున్న ఫాసిస్టు అణచివేత విధానాల ఫలితం కామ్రేడ్ గొంజాలో మరణం. తాము రూపొందించుకున్న చట్టాలను తామే ఉల్లంఘిస్తూ ఎక్కడికక్కడే దోపిడీ పాలక వర్గాలు విప్లవకారులను తుదముట్టించడానికి ఎడతెరిపి లేని కుట్రలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే అమెరికా సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో పెరూ రాజ్యం అయనపై అత్యంత క్రూరమైన నిర్బంధాన్ని అమలు చేసింది.కామ్రేడ్ గొంజాలోను లొంగదీసుకోవడానికి వారు అనేక వివల ప్రయత్నాలు చేశారు. ఆయన అమరత్వమే వారికి జవాబునిచ్చింది. అది విప్లవ దృఢత్వం,మార్క్సిజం-లెనినిజం-మావోయిజం సిద్ధాంత, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ శక్తి, సంబద్ధతలను, సోషలిజం-కమ్యూనిజం భవిష్యత్తునూ ఎత్తిపడుతోంది. కామ్రేడ్ గొంజాలో అజరామరుడు.

మాలెమా, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ సిద్ధాంత అచరణలను ఎత్తిపట్టి, ఈ భూమి మీద సామ్రాజ్యవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేందుకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమాలను మరింత బలంగా పురోగమింపచేద్దాం. అర్దవలస, నయా వలసలలో కొనసాగుతున్న ప్రజాయుద్ధాలను తీవ్రతరం చేద్దాం. దీర్ఘకాల ప్రజా యుద్ధ మార్గంలో మన ద్విగుణీకృత కృషే కామ్రేడ్ గొంజాలోకు నిజమైన నివాళి.

అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : peru, cpp, Abimael Guzman , Gonzalo, Communist Party of Peru, CPI Maoist, Abhay
(2021-12-05 04:26:12)



No. of visitors : 447

Suggested Posts


ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలి -మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి

ప్రపంచ కార్మిక సంఘాలు, ప్రగతిశీల-ప్రజాస్వామ్య శక్తులు, మానవ హక్కుల సంస్థలకు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలని సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేస్తూంది.

CPI (Maoist) demands release of veteran leader Gonzalo

he CPI (Maoist) Central Committee appealed to the world trade unions, progressive-democratic forces and human rights organisations to stage agitations for the release of a veteran Communist leader Abhiman Guzman alias Gonzalo.

పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌

పెరూ మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు-అంతర్జాతీయంగా మావోయిజాన్ని విశ్వజనీన స్థాయిలో ప్రతిష్టించిన సైద్ధాంతిక వేత్తలలో అగ్రగణ్యుడు అయిన అభిమైల్ గుజ్ మెన్ (గుంజాలో) ఈ నెల 11, 2021న 86 సంవత్సరాల వయస్సులో అమరులైయ్యారు.

Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman

Central Committee, CPI (Maoist) pays itʹs humble homage to 86 year old Comrade Manuel Ruben Abimael Guzman Reynoso (Gonzalo), founder leader and ex-Chairman of Communist Party of Peru – Shining Path who martyred on 11th September in the high security centre

ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం

పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ సృష్టికర్త, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు కామ్రేడ్‌ గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది.

Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru

The political prisoners and prisoners of war of the Communist Party of Perú before the physical departure of Dr Abimael Guzmán Reinoso, our beloved and respected Chairman Gonzalo, with unyielding revolutionary conviction, we forever reaffirm ourselves in: Learn from Chairman Gonzalo! and Incarnate Gonzalo Thought!, serving the people wholeheartedly.

Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !

CPI (ML)-New Democracy pays homage to revolutionary memory of Com. Abimael Guzman (popularly known as Comrade Gonzalo), leader of revolutionary movement of Peru, who died on September 11, 2021 at the Callao naval base near capital Lima.

చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు

చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం శ్రామికవర్గ, ప్రపంచ ప్రజల ఆలోచనలో, హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా వుంటుంది.

Search Engine

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
SKM:ఉద్యమం కొనసాగుతుంది,నవంబర్ 29 నుండి పార్లమెంట్ మార్చ్ జరుగుతుంది -కిసాన్ మోర్చా ప్రకటన‌
more..


ప్రజాయుద్ధాలను