విశ్వ మానవుల కోసం సరిహద్దుల గట్లు తెంచుకుని ప్రేమై పోటెత్తడం నీకే సొంతం


విశ్వ మానవుల కోసం సరిహద్దుల గట్లు తెంచుకుని ప్రేమై పోటెత్తడం నీకే సొంతం

విశ్వ

10-10-2021

విశ్వ మానవుల కోసం సరిహద్దుల గట్లు తెంచుకుని ప్రేమై పోటెత్తడం నీకే సొంతం


నిస్తేజం మది నిండా
నిరాశ చీకట్లను వెదజల్లుతుంటే
నిన్ను ఆవాహన చేసుకుంటే చాలు
ఉత్తేజం ప్రవహించి
వెయ్యి ఓల్టుల విద్యుత్ ప్రసరణ నర నరాల్లో !
.
నిస్సత్తువ నిలువెల్లా పాకి
మృతప్రాయంగా మేం పడుంటే
నీ చురకత్తుల చూపు చాలు
దిగ్గున లేచి చైతన్యం పొందడానికి !
.
నిరాశ నిస్పృహలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
నీ నెత్తిన మెరిసే అరుణతార చాలు
అసువులొడ్డిన అమరుల
ఆశయాల జెండా అందుకోవడానికి !
.
గమ్యం గమనం తెలియని ఆవేశానికి
నీ ఆలివ్ గ్రీన్ యూనిఫాం చాలు
దారి చూపే దీప శిఖగా నిలవడానికి !
.
విశ్వ మానవుడా
చే...!
ఎందెందు వెదికినా కనిపించే
నీ రూపు చాలు
మనిషిగా మిగిలేందుకు
మరణంలో జీవించేందుకు
.
- క్రాంతీపద్మ
09-10-21

Keywords : che guevara, cuba, Argentine Marxist revolutionary, La Higuera, Bolivia
(2023-09-28 09:48:47)



No. of visitors : 1261

Suggested Posts


0 results

Search Engine

అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
more..


విశ్వ