UPలో రైతుల హత్యలపై మండిపడ్డ మావోయిస్టు పార్టీ ... బీజేపీని ఓడించాలని పిలుపు
10-10-2021
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపై కారు ఎక్కించి నలుగురిని హత్య చేసిన సంఘటనపై సిపీఐ మావోయిస్టు తీవ్రంగా మండిపడింది. దేశ రైతాంగం చేస్తున్న పోరాటాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆ పార్టీ మధ్య రీజినల్ బూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. దేశంలో జరుగుతున్న అన్ని పోరాటాలకు సంయుక్త కిసాన్ మోర్చా మద్దతుగా నిల్బడాలని ప్రతాప్ తన ప్రకటనలో కోరారు.
ప్రతాప్ ప్రకటన పూర్తి పాఠం....
పోరాడేవారిని హత్యలు భయయెట్టలేవు శాహీన్ బాగ్, సిలింగేర్, కసార్, తికునియాలు హిందుత్వ పాలకుల హత్యాకాండకు సంకేతాలు.
ʹʹమీరందరు 500-1000 మందితో గ్రూపులుగా ఏర్పడండి. కర్రలు తీసుకొని సిద్ధంగా ఉండండి. జైలుకు వెళ్లినా ఇబ్బంది లేదు. అక్కడ ఆరు నెలలకంటే ఎక్కువ ఉండరు. తరువాత మీరు పెద్ద నాయకులవుతారు.ʹʹ ఇది చండీగఢ్ లో బీజేపీ కిసాన్ మోర్చాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఉపన్యాసం. శాహీన్బాగ్ ప్రజా ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి హిందుత్వ నాయకులు తుక్డే తుక్డే గ్యాంగులను కాల్చి పారేయండి అనే వరకు రెచ్చగొట్టి 58 మందిని బలిగొన్నారు. సెప్టెంబర్ 27న భారత్ బందు సమర్దనగా ఎవరూ ముందుకు రాకూడదనీ దండకారణ్య ప్రజలను పోలీసు ఐజీ సుందర్ రాజ్ పీ హెచ్చరిస్తున్నాడు. సిలింగేర్ లో పోరాడుతున్న మూలవాసులను ఐదుగురిని కాల్చి చంపారు. ఇలాంటి మాటలతో, చర్యలతో లంపెన్ శక్తులను రెచ్చగొట్టి, పోలీసులతో కాల్పులు జరిపించి ఉద్యమాలను విఛ్ఛిన్నం చేయజూస్తున్న వారికి ఉద్యమాలను ఉర్రూతలూగిస్తూ బుద్ది చెప్పండి. వారి దర్యాప్తులు, న్యాయ విచారణలు వాస్తవాలను తలకిందులు చేసి అధికారంలో ఉన్న దోషులను కాపాడే ప్రక్రియలు, తప్ప న్యాయాన్ని చేసేవి కావు కాబట్టి వాటి వలలో పడకండి అని కూడ మా పార్టీ కోరుతోంది.
ఇటీవల హర్యానాలోని బహాదుర్ గఢ్ లో జూన్ 17 నాడు కసార్ గ్రామానికి చెందిన ముకేశ్ సింగ్ అనే రైతును సజీవంగా దహనం చేసి చంపారు. ఐదు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరీ జిల్లా తికునియాలో సెప్టెంబర్ 8నాడు సాగు చట్టాల రద్దుకై పోరాడుతున్న రైతుల నిరసన ప్రదర్శనపైకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా కారును పరుగెత్తించడంతో నలుగురు రైతులు దల్జీత్ సింగ్, నక్షత్ర సింగ్, గుర్వీందర్ సింగ్, లవ్ ప్రీత్ సింగ్ లు అక్కడికక్కడే మరణించారు. ఈ హత్యలను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.
కళ్ల ముందు జరిగిన హత్యలకు ఏ పోస్టుమార్టం అవసరం లేదనీ శవాలను ముందు పెట్టుకొని వేలాది రైతాంగం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మిశ్రా తక్షణం రాజీనామా చేయాలని ధర్నాకు దిగారు. కానీ, యోగీ ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపిస్తామంది. మంత్రి కుమారుడిపై హత్యా కేసు పెట్టి మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామంది. సంబంధీకులకు ఉద్యోగం ఇస్తామనీ గాయపడిన వారికి రూ.10 లక్షలు చెల్లిస్తామని అనేక హామీలిచ్చి రైతులను వెనక్కి పంపింది. కానీ, ప్రభుత్వ దర్యాప్తులు, పోస్టుమార్టంలు అధికారంలో ఉన్న వ్యక్తులను కాపాడే తెలివైన మార్గాలు. సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో కారణాలను దర్యాప్తు చేయపూనుకున్న న్యాయమూర్తి జస్టిస్ లోయా హఠాన్మరణానకి గురైతే అత్యున్నత న్యాయస్థానంతోనే సహజమరణం అన్పించిన బ్రాహ్మణవాదులకు దల్జీత్ సింగ్, నక్షత్ర సింగ్, గుర్వీందర్ సింగ్, లవ్ ప్రీత్ సింగులు ఏ లెక్కలోకి వస్తారు? అవి హత్యలనడానికి అంతర్జాలంలో భద్రంగా ఉన్న చిత్రాలు చాలు. కాబట్టి దర్యాప్తులను, నష్టపరిహార డబ్బులను బహిష్కరించి దోషులను శిక్షించేవరకు పోరాడాలని మా పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. యూపీ సహ ఆరు రాష్ట్రాలలో జరుగనున్న విధానసభల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఓడించాలనీ, సాగు చట్టాలను సమర్థించేవారందరినీ సామాజిక బహిష్కరణ చేసి శిక్షించాలనీ మరోసారి కోరుతోంది.
ప్రభుత్వ సాగు చట్టాలకు వ్యతిరేకంగా యేడాదికి పైగా రైతాంగం పోరాడుతోంది. పది మాసాలకు పైగా దిల్లీ కేంద్రంగా రైతుల ధర్నా జరుగుతోంది. ఆ పోరాటాలకు అండగా దేశం పోరాడుతోంది. రైతాంగ పోరాటాలతో భారతీయ జనతా పార్టీ ఖంగు తింటోంది. రాష్ట్రాల విధానసభల ఎన్నికలలో అది ఓటమి పాలవుతోంది. దీనితో ఆ పార్టీ, దాని అనుబంధ సంఘాలు, దాని మాతృ సంస్థ సంఘ్ మరియు దాని ʹపరివారీకులుʹ ఎక్కడికక్కడే రైతాంగ ఉద్యమకారులపై విరుచుకుపడుతున్నారు. రైతు నాయకులపై భౌతిక దాడులకు పూనుకుంటున్నారు. వారిని అప్రతిష్ట పాలు చేయడానికి ఉద్యమంతో సంబంధం లేని విషయాలను ముందు పెట్టి గోదీ మీడియా దుష్ప్రచారం చేస్తున్నది. ఈ దుశ్చర్యలన్నిటిని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.
మోదీ పాలనా కాలంలో వ్యవసాయ అదాయం రెట్టింపు కావడం దేవుడెరుగు కానీ, అది 8.9 శాతం క్షీణించిపోవడంతో భారతీయ రైతు సాధారణ కూలీ కంటే ఘోరమైన పరిస్థితులలో జీవిస్తున్నాడు. కార్పొరేటు వర్గాల ప్రయోజనాలనే మిన్నగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమాన్ని విరమించుకోవాలని హెచ్చరిస్తున్నది. దాడులకు దిగుతున్నారు. కొరోనా మహమ్మారీని సాకుగా చూపి రైతుల సంఘటితత్వాన్ని, సమైక్యతను దెబ్బ తీసి ధర్నాను విచ్ఛిన్నం చేయాలని చూశారు. కానీ ఈ వెరుపు చర్యలు వారిలో మరింత పోరాట పట్టుదలనే పెంచుతాయి.
రండి, మనమంతా పోరాడుదాం. సమైక్యంగా పోరాడుదాం. సంయుక్త కిసాన్ మోర్చా దేశంలో జరుగుతున్న సమస్త పోరాటాలకు తన సంఘీభావాన్ని అందించాలి. రైతాంగం పీడిత ప్రజా ఉద్యమాలతో మమేకం కావాలి. తద్వారనే బలమైన దేశవ్యాప్త ఉద్యమం పెంపొందుతుంది. న్యాయమైన డిమాండ్లు నెరవేరుతాయి. కార్పొరేటు శక్తుల దోపిడీని అంతం చేసేవరకు వివిధ రూపాలలో దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం సాగుతుందనీ, సంఘీభావ ఉద్యమాలు పెంపొందుతాయనీ మా పార్టీ స్పష్టం చేస్తోంది. ఆ సమస్త ప్రజా ఉద్యమాల వెంట మా పార్టీ ఉంటుందనీ, నాయకత్వం అందిస్తుందనీ మరోసారి స్పష్టం చేస్తోంది.
ప్రతాప్,
అధికార ప్రతినిధి,
మధ్య రీజినల్ బూరో,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : uttar pradesh, lakhimpur, farmers protest, bjp, maoists
(2023-09-27 21:53:02)
No. of visitors : 1061
Suggested Posts
| అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు .... |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుగతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా |