బస్తర్ లో మరో సిల్ గేర్...గంగులూరులో ఐదురోజులుగా వందలాది మంది ఆదివాసుల ప్రదర్శన‌


బస్తర్ లో మరో సిల్ గేర్...గంగులూరులో ఐదురోజులుగా వందలాది మంది ఆదివాసుల ప్రదర్శన‌

బస్తర్

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపును నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ అనేక గ్రామాలనుండి వచ్చిన వందలాది మంది ఆదివాసులు గంగులూరు వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గత ఐదు రోజులుగా సాగుతున్న ఈ నిరసన ప్రదర్శన లో, పోలీసులు ఆదివాసీ గ్రామాలపై దాడులు చేయడం కోసం ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని కూడా ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు. ఎడస్మెట్ట‌లో జరిగిన హత్యాకాండపై న్యాయ విచారణ నివేదిక వచ్చిన తరువాత, ఆ నివేదికను తమ కుటుంబాల ముందు చెప్పాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొంటున్న గ్రామస్తులు ఎడస్మెట్ట‌తో పాటు బస్తర్‌లో జరిగిన అన్ని మారణకాండల్లో చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి ఒక కోటి రూపాయలు, గాయపడినవారికి యాభై లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం యివ్వాలని డిమాండ్ చేశారు. .

పుస్నార్, మంకేలిలో కూడా భద్రతా దళాల శిబిరం, సిసి రోడ్డు ప్రతిపాదించబడినట్లు గ్రామస్తులు తెలిపారు. ʹʹఇక్కడ క్యాంప్ తెరిచి రోడ్డు నిర్మిస్తే, పోలీసులు ప్రతి గ్రామంలోకి ప్రవేశిస్తారు. గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తారు. అమాయక గ్రామస్తులను నక్సలైట్లు అని పేరు పెట్టి వారిని చంపుతారు లేదా అరెస్టు చేసి జైలులో పెడతారు. రోడ్డు, పోలీసు క్యాంప్ రెండూ మాకు అక్కర్లేదుʹʹ అని గ్రామస్తులు అంటున్నారు. ఇక్కడ పోలీసు క్యాంప్, రహదారిని నిర్మించవద్దని జిల్లా యంత్రాంగానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశాం, కానీ ఇప్పటి వరకు వాళ్ళు వినలేదు. గ్రామస్థులు ఇప్పుడు తమ డిమాండ్లకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌కు మెమోరాండం సమర్పించారు.

పుస్నార్, మంకెలి, గంగలూర్‌తో సహా సమీపంలోని డజన్ల కొద్దీ గ్రామాల నుండి వందలాది మంది గ్రామస్తులు ఉద్యమంలో పాల్గొనడానికి ఇక్కడికి చేరుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను సాధించేదాకా ఎన్ని రోజులైనా సరే అక్కడే ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించుకొని వచ్చిన ఆదివాసులు తమతో పాటు వంట‌ సామాగ్రి, పాత్రలను కూడా తెచ్చుకున్నారు. సీల్‌గేర్‌లో లాగా, ఇప్పుడు గంగలూర్ కూడా మరో ఉద్యమ కేంద్రం గా మారింది.

గ్రామస్తుల డిమాండ్లు

1‍ బీజాపూర్ జిల్లాలోని పుష్కర్‌లో కొత్త పోలీసు శిబిరాన్ని నిర్మించాలని ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలి.

2- బైలదిలా గనిని దోచుకోవడానికి పుస్నార్ లో జరుగుతున్న‌ సిసి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలి.

3-ఆదివాసీల నీరు, అటవీ, భూమిని లాక్కోవడం ఆపేయాలి.

4‍ పోలీసులు అమాయక ఆదివాసీ వృద్ధులను, విద్యార్థులను దారుణంగా కొట్టడం, మహిళలపై అత్యాచారాలు చేయడం, జైళ్ళలో పెట్టడం, చంపేయడం తక్షణం ఆపేయాలి.

5- పుస్నార్ లో కారం మంగ్లీ అనే మహిళను పోలీసులు బలవంతంగా గంగలూరు నుండి బీజాపూర్ ఆసుపత్రికి పంపించి, విషపు ఇంజెక్షన్‌తో హత్య చేసారు, ఇందులో టిఐ పవన్ వర్మ పాల్గొన్నాడు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరగాలి.

6-చెర్పాల్ లోని పోటా క్యాబిన్‌లో చదువుతున్న విద్యార్థులపై నక్సలైట్‌లుగా ముద్రవేసి పోలీసులు అరెస్టు చేశారు, వారిని వెంటనే విడుదల చేయాలి.

(janchowk.com సౌజన్యంతో )
తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి

Keywords : chattisgarh, bastar, adivasi, crpf, camp, silger, ganguluru
(2021-12-05 04:13:46)No. of visitors : 498

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్క‌రణ - భారీ బహిరంగ సభ

ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది.

బస్తర్ లో పెరిగిపోతున్న సీఆర్పీఎఫ్ క్యాంపులు - ఆదివాసుల్లో తీవ్రమవుతున్న ఆగ్రహం

అక్టోబర్ నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో కనీసం పన్నెండు నిరసనలు జరిగాయి. సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనడానికి సుదీర్ఘ ప్రయాణాలు చేసి వస్తున్న వేలాది మంది ఆదివాసీలకు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో, సుక్మా జిల్లాలోని సిల్‌గేర్ గ్రామం నెల రోజులుగా కేంద్రంగా మారింది.

Search Engine

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
SKM:ఉద్యమం కొనసాగుతుంది,నవంబర్ 29 నుండి పార్లమెంట్ మార్చ్ జరుగుతుంది -కిసాన్ మోర్చా ప్రకటన‌
more..


బస్తర్