పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం

పీఎల్‌జీఏ

15-10-2021

చైతన్యవంతమైన కార్యకలాపాలంటే పొరపాట్లను తగ్గించుకుని ఎక్కువ విజయాలను సాధించడమనే. ఇందుకనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆధారపడి నూతన ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఇందులో ఏ మాత్రం విసుగు చెందకూడదు.

ద్విదశాబ్ది వార్షికోత్సవాలను జరుపుకుంటున్న ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి విప్ల‌వాభివందనాలు. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన మార్క్సిస్టు భోదన గుర్తుకొస్తున్నది. నేను విప్లవోద్యమంలోకి వచ్చే ముందు నాకు సన్నిహితులైన చాలా మంది మధ్య తరగతి మేధావులు ఈ దేశం బుద్ధుడు, గాంధీలు పుట్టిన దేశమనీ, ఈ దేశ ప్రజలపై వారి ప్రభావం చాలా బలంగా ఉంటుందనీ, ఇక్కడి ప్రజలు హింసా మార్గాన్ని చేపట్టరనీ, వారు సాయుధులు కారనీ, ఇక్కడ సాయుధ పోరాటం జరగదని చర్చిస్తుండేవారు. ఇక నయా రివిజనిస్టులైన సీపీఎం వారైతే ప్రస్తుతం భారతదేశంలో ప్రజలు సాయుధులయ్యే పరిస్థితి లేదని వాదిస్తుండేవారు. ఆనాటికి వీరు చేస్తున్న చర్చంతా శుష్క పండిత చర్చేనని నాకు అనిపిస్తుండేది. ఎందుకంటే వారు ఒక భౌతిక సత్యాన్ని గ్రహించేందుకు ఆచరణలోకి వెళ్ళకుండా, దానిని సైద్ధాంతిక ప్రశ్నగా మార్చారు.

కానీ ఈ ప్రశ్నకు ఆచరణ మాత్రమే సమాధానం అంటూ మార్క్చిజం-లెనినిజం-మావోయిజం వెలుగులో కామ్రేడ్‌ చారు
మజుందార్‌ నేతృత్వంలో ఆనాటి సీపీఐ (ఎంఎల్‌) చేసిన కృషి ఫలితంగానే 1970, అక్టోబర్‌ 27న బీహార్‌లోని మాగుర్జాన్‌ రైతాంగ దళం పోలీసు పార్టీపై దాడి చేసి, ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. ఈ రైతాంగ దళం భవిష్యత్‌లో ఏర్పడనున్న పీఎల్‌జీఏ నిర్మాణానికి ప్రాదుర్భావ నిర్మాణంగా, అది చేసిన తొలి గెరిల్లాయుద్ధ చర్యగా చెప్పుకోవచ్చు. మన పార్టీ సంస్థాపక నాయకులు కామ్రేడ్‌ చారు మజుందార్‌, కామ్రేడ్‌ కన్హయ్‌ చటర్జీలు రూపొందించిన దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో, ఆ తదుపరి ఆ కృషి కొనసాగింపు ఫలితంగానే డిసెంబర్‌ 2, 2000లో పీఎల్‌జీఏ ఆవిర్భవించింది. మానవ ఆలోచన భౌతిక సత్యాన్ని గ్రహించగలదా అనేది సైద్ధాంతిక ప్రశ్న కాదనీ, అది ఆచరణ తేల్చే ప్రశ్న అని మార్చిస్టు భోదనను ఈ ఆవిర్భావం రుజువు చేసింది.

పీఎల్‌జీఏ ఏర్పడటమే కాదు, అది వురోగమిన్తున్నది. వురోగమించింది కూడా. 20 సంవత్సరాల క్రితం పీఎల్‌జీఏ ఒక
నిర్మాణంగా లేదు. కొద్దిమంది సాయుధులైన గెరిల్లాలు మాత్రవే ఉన్నారు. ఆయుధాలు చాలా ప్రాథమిక స్థాయిలో ఉండేవి. ఇంకా వెనక్కు వెళ్ళి 80ల నాటి పరిస్థితి చూస్తే నాటు రకం తపంచాలు ఉండేవి. పీడిత ప్రజలకు నిజమైన అధికారం నిర్దిష్టంగా నిర్మాణాత్మకంగా ఎక్కడా ఉండేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మార్క్చిజం- లెనినిజం-మావోయిజం సిద్ధాంత ఆయుధాన్ని దృఢంగా పట్టుకోవడం ద్వారానే పీఎల్‌జీఏను ఏర్పరిచింది.

అది కేవలం రూపంలో ఏర్పడటమే కాదు, గత 20 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతి పెద్ద విప్లవ ప్రతీఘాతుక రాజ్యాలలో ఒకటైన భారత రాజ్యంతో, దాని పోలీసు, పారా మిలటరీ బలగాలతో వీరోచితంగా పోరాడుతూ అనేక ఎత్తుగడలపరమైన విజయాలను సాధించింది. ఆధునిక ఆయుధాలతో సాయుధమైంది. దోపిడీ పాలక వర్గాలు పార్టీనీ, పీఎల్‌జీఏను ధ్వంసం చేయాలనే దుష్ట తలంపుతో చేస్తున్న ప్రతీఘాతుక ఎల్‌ఐసీ దాడిని దీటుగా ఎదుర్కొంటూ మరింతగా సంఘటితపడింది. పార్టీ నేతృత్వంలో అది చేసిన కృషి ద్వారా ప్రజల రాజ్యాధికార నిర్మాణాలైన ఆర్‌పీసీలు-గెరిల్లా బేస్‌లు ఏర్పడ్డాయి. విప్లవోద్యమ క్రమంలో సాధించిన ఈ అభివృద్ధికరమైన మార్పులన్నీ విష్లవోద్యమ పురోగమనాన్ని అందులో భాగంగా పీఎల్‌జీఏ పురోగమనాన్ని స్పష్టపరుస్తున్నాయి.

పీఎల్‌జీఏ ఈ స్థితిని నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకే పురోగమిస్తుంది కూడా. ఎందుకంటే దానిలో ఇమిడి ఉన్న అంశాలు అభివృద్ధికరమైనవి, విప్లవకరమైనవి. పీఎల్‌జీఏ ప్రజలు నిర్మిస్తున్న చరిత్రలో భాగమైంది. అది భారతదేశంలో శిథిలమవుతున్న అర్ధవలస, అర్ధ భూస్వామ్య సమాజాన్ని ధ్వంసం చేసి, వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఉన్న నూతన ప్రజాస్వామిక విప్లవంలో, దీర్హకాలిక ప్రజాయుద్ధంలో ప్రజల పక్షాన దృఢంగా నిలిచింది. శషభిషలు లేని ప్రజల పక్షపాతిగా తనను తాను నిరూపించుకుంది.

పురోగామి కార్మికవర్గ నాయకత్వంలో జరుగుతున్న సాయుధ వ్యవసాయ వివ్లవంలో అసంఖ్యాకంగా పాల్గొంటున్న పీడిత రైతాంగమే ప్రధానంగా పీఎల్‌జీఏకు జన్మనిచ్చింది. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులలో ప్రధానంగా విముక్తి కావలసిన పీడిత సామాజిక గ్రూపులైన దళిత, బహుజన, మహిళా, ఆదివాసీలలోని పీడిత వ్యవసాయ కూలీ పేద రైతాంగం దీనికి వెన్నెముకగా ఉండటం దాని పురోగమనానికి మరింతగా హామీనిస్తున్నది. కనుక పీఎల్‌జీఎలో నిబిడీకృతమై ఉన్న ఈ అభివృద్ధికరమైన, విప్లవకర లక్షణాలన్నీ దాని పురోగమనాన్ని నిర్దేశిస్తున్నాయి.

మరోవైపు భారతదేశంలో అభివృద్ధి నిరోధక, ప్రతీఘాతుక రాజ్యం, దాని సాయుధ బలగాలు ప్రస్తుత స్థితిలో ఎంత బలంగా ఉన్నప్పటికీ, అవి అభివృద్ధి నిరోధకమైనవి, అవినీతిమయమైనవి. అవి శిథిలమవుతున్న ప్రస్తుత అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థకు చెందినవి. కొద్దిమంది దోపిడీ వర్గాల ప్రయోజనాలకే అంకితమై, ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తున్నవి. అవి యథాతథ స్థితిని కాపాడేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నాయి. చరిత్ర పురోగమనాన్ని అడ్డుకునేందుకు నిస్పృహతో కూడిన విధ్వంసకర కృత్యాలకు పాల్పడుతున్నాయి.

అయితే వాటి వాటి తిరోగమన, పురోగమనాలను నిర్దేశించే భౌతిక అంశాలు వాటిలో ఉన్నప్పటికీ, ప్రస్తుత స్థితిలో అభివృద్ధి నిరోధక భారత రాజ్యం, దాని సాయుధ బలగాలు పీఎల్‌జీఏతో పోల్చినప్పుడు బలసంపన్నతలో అపారమైన తేడాను కలిగి ఉన్నాయి. అంతే కాదు, మొత్తం భారత విప్లవ పురోగమనాన్ని గురించి ఆలోచించినప్పుడు మనం అధిగమించాల్సిన అగడ్తలెన్నో ఉన్నాయని ప్రస్తుత పరిస్థితి స్పష్టపరుస్తున్నది. ఈ అగడ్తలను విప్లవోద్యమం అధిగమించడం సాధ్యమే. గమ్యం చేరడం కూడా సాధ్యమే.

అయితే నేటి ఉద్యమ గడ్డు పరిస్థితులలో చైతన్యవంతమైన కార్యకలాపాల ద్వారానే విజయాలు సాధించడం సాధ్యమవుతుంది. చైతన్యవంతమైన కార్యకలాపాలంటే పొరపాట్లను తగ్గించుకొని ఎక్కువ విజయాలను సాధించడమనే. ఇందుకనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆధారపడి నూతన ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఇందులో ఏ మాత్రం విసుగు చెందకూడదు. కేవలం ఒక విద్యుత్‌ బల్బ్‌ను తయారు చేయాడానికి థామస్‌ అల్వా ఎడిసన్‌ అనే శాస్త్రవేత్త పట్టు విడవకుండా 10 వేల సార్లు ప్రయోగాలు చేసాడట. అలాంటిది ఒక సామాజిక మార్పు అంత తేలికగా సాధించే విషయం కాదు. అందుకు మనం వేల పర్యాయాలే ఎత్తుగడలను మార్చుకుంటూ లక్ష్యసాధనకు కృషి చేయాలి.

ఈ లక్ష్యసాధనలో భాగంగా ముందుగా పీఎల్‌జీఏ పీఎల్‌ఏగానూ, గెరిల్లా యుద్ధం మొబైల్‌ యుద్ధంగాను అభివృద్ధి చెందాలి. ఈ మొత్తం విషయాలు మనల్ని దీర్ధక్రాలిక ప్రజాయుద్దాన్ని మరింత దృఢంగా, సృజనాత్మకంగా కొనసాగించాలని నిర్దేశిస్తున్నాయి. కనుక పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా అది కార్మికవర్గ నేతృత్వంలో పీడిత ప్రజల సైన్యంగా మరింత అభివృద్ధి చెందుతూ, విస్తరిస్తూ దీర్హకాలిక ప్రజాయుద్ధంలో తన వంతు పాత్రను నిర్వహిస్తూ భారతదేశ విముక్తికి పాటుపడాలని ఆకాంక్షిస్తూ...!
- సాకేత్

Keywords : RK, RamaKrishna, Haragopal, Saket, CPI Maoist, PLGA,
(2024-11-05 23:21:10)



No. of visitors : 4547

Suggested Posts


అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (63) అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. కామ్రేడ్ హరగోపాల్ కు అకస్మాతుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు.

చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం

ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి మౌలిక నమస్యకు పరిష్కారం చూపడంలో నక్సలైట్ల పాత్రను, 30 సంవత్సరాల పైబడిన వారి ఆచరణను వస్తుగతంగా

మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ

విప్లవోద్యమాన్నీ విప్లవ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ష్రచార దాడి చేసేందుకు వాళ్లకు సామ్రాజ్యవాదుల నుండి ఆదేశాలు వున్నాయి. వాళ్ళకు త్యాగాలు లేకుండా చరిత్ర పురోగమనం వుండదనే విషయం అర్ధం కాదు, అర్ధం చేసుకోరు కూడా. నిజమే వాళ్ళన్నట్లు మేము కొండను ఢీకొంటాం, పర్వతాలను తవ్వుతాం, ఏటికి ఎదురీదుతాం.

విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి

రెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది.

ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌

అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ @ RK సంస్మరణ సభ ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఆదివారంనాడు జరిగింది.

RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్

14 అక్టోబర్,2021 సాయంత్రం నుండి తెలుగు,చత్తీస్గఢ్ మీడియాలో, మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ అనారోగ్యంతో చనిపోయినాడని ,చత్తీస్గఢ్ పోలీసులు ధ్రువీకరించారని స్పెషల్ స్టోరీస్ తో పాటు బ్రేకింగ్ న్యూస్ లతో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

ఆర్కే పుస్తకావిష్క‌రణ సభను అడ్డుకున్న పోలీసులు...రేపు మీడియాసమావేశం ఏర్పాటు చేసిన ఆర్కే సహచరి శిరీష‌

అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు రామకృష్ణపై పుస్తకాన్ని ముద్రిస్తున్న హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ

ʹసాయుధ శాంతి స్వప్నంʹ : హైకోర్టు తీర్పు

రామకృష్ణ రచనల, ఆయన మీద సంస్మరణ రచనల సంకలనాన్ని ఆవిష్కరణకు ముందే జప్తు చేసి, కేసు పెట్టిన పోలీసుల చర్యను తప్పుపడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పీఎల్‌జీఏ