మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ

మేము


16/10/2021

(2016 అక్టోబ‌ర్ లో ఏఓబీలో జ‌రిగిన రాంగూడ ఎన్ కౌంట‌ర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ సంఘ‌ట‌న‌పై సీపీఐ(మావోయిస్టు) కేంద్ర క‌మిటీ స‌భ్యులు రామ‌కృష్ణ ఇంట‌ర్వ్యూ)

1. సి.పి.ఐ. (మావోయిస్టు) చరిత్రలో రాంగూడ ఘటన అతి పెద్ద ఘటన కదా! ఎలా జరిగింది?


జ : నిజమే మీరన్నట్లు రాంగూడ ఘటన మా పార్టీ చరిత్రలో జరిగిన అతి పెద్ద ఘటనగా చెప్పవచ్చు. కొన్ని బూర్జువా పత్రికలు ఈ దాడిని, ప్రభుత్వం మా పై చేపట్టిన ʹసర్జికల్‌ (స్టైక్‌ʹగా వర్ణించడం మీరు గమనించే వుంటారు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గ్రేహౌండ్స్‌, ఎస్‌.ఓ.జీ. కమాండో బలగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పారా మిలిటరీ బలగాలు కూడ పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ డి.జి.పి. ఇచ్చిన ప్రకటన ప్రకారం 800 బలగాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. అక్టోబర్‌ 24, 2016 ఉదయం 6 గంటలకు, మేము రోల్‌కాల్‌లో వున్నప్పుడు వాళ్లు మమ్మల్ని చుట్టుముట్టారు. అప్పుడు ప్రభుత్వ సాయుధ బలగాలకు, మా పి.ఎల్‌.జి.ఎ. బలగాలకు మధ్య 45 నిల నుండి 1గంట వరకు హోరాహోరిగా కాల్పులు జరిగాయి. ఈ పోరాటంలో మాకు పెద్ద నష్టమే జరిగింది. మా వైపు 31 మంది కామ్రేడ్స్‌ అమరులైనారు. వీరిలో స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యులు ఇద్దరు. డివిజనల్‌ కమిటీ సభ్యులు ఇద్దరు, ఏరియా కమిటీ సభ్యులు పన్నెండు మంది, పార్టీ సభ్యులు ఆరుగురు, వివిధ ప్రజాసంఘాలకూ, మిలీషియాకు చెందిన వారు 9 మంది వున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బలగాలలో ఒక సీనియర్‌ కమాండో చనిపోవడంతో పాటు మరొకరికి తీవ్రమైన గాయాలయ్యాయి. మరో నల్లురికి స్వల్బంగా గాయాలయ్యాయి.

ఈ ఘటనను అర్థం చేసుకోవాలంటే మరికొన్ని విషయాలను కూడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ దాడి ప్రధానంగా మా పార్టీ పై స్థాయి నాయకత్వ కామ్రేడ్స్ లక్ష్యంగా చేసుకొని జరిగింది. ఇటువంటి ప్రయత్నాలు జనవరి 2015 నుండి ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మూడవ దశ పేరుతో ముమ్మరం చేసారు. ఇటువంటి దాడులే జనవరి 2015 న ʹబెజ్జి పాకెట్‌లో, ఆగస్టు 2015న ʹజంత్రి పాకెట్‌లో, డిసెంబర్‌ 2015న ʹనందపూర్‌ʹ పాకెట్‌లో మా పై జరిగాయి. ఈ మూడు సందర్భాలలో కూడ నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకొన్నారు. వందలాది ప్రభుత్వ సాయుధ బలగాలు అత్యంత పకడ్బందీ పథకాలతో ఈ దాడులు నిర్వహించారు. అయినప్పటికీ మా పి.ఎల్‌.జి.ఎ. బలగాలు ఈ దాడులను వీరోచితంగా తిప్పికొట్టాయి.

ఈ వైఫల్యాల నుండి వాళ్లు గుణపాఠాలు తీసుకున్నారు. ఈ సారి మరింత రహస్యంగా, మరింత కుట్ర పూరితంగా పథకం రూపొందించారు. ఈ పథకాన్ని జరుగుతున్న మార్పులను మేం లోతుగా అర్ధం చేసుకోలేకపోయాం. 28 ఉదయమే మా బలగాలన్నీ రాంగూడ మకాంకు చేరాయి. అప్పటిదాకా మా సంస్థాగత పనులు పూర్తి చేసుకొన్నాం. దీంతో బాహ్య వలయంలో వున్న రక్షణ బలగాలను కూడ వెనక్కి పిలిపించాము. ఆ రోజు జమైన మా బలగాలతో మాట్లాడి, పనులు ప్లాన్‌ చేసుకొని సాయంత్రమే విడి పోవాలనుకున్నాం. ఆ రోజు మేము ఎంపిక చేసుకొన్న రాంగూడ డేరా, రక్షణరీత్యా, బలహీనమైందనే విషయం మా దృష్టిలో వుంది. దానికి రెండు వైపుల ʹఎల్‌ ఆకారంలో నది ప్రవహిస్తూ వుంటుంది. ఆ డేరానే కాదు, మొత్తంగా ఆ పాకెట్‌ గ్రామాల పరిస్థితి అదే. ఆ పాకెట్‌ నుండి బయట పడాలంటే నదిని దాటకుండా బయటపడలేము. ఇదొక అనివార్య పరిస్థితి. ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకొనే 23 సాయంత్రానికి పనులు పూర్తి చేసుకొని పాకెట్‌ను ఖాళీ చేయాలనుకున్నాం. కానీ ఆ రోజు మా బలగ్గాల్లో కొన్ని బ్యాబీలు మకాంకు ఆలస్యంగా చేరడంతో మేమనుకున్నట్లు 28 సాయంత్రానికి పనులు పూర్తి కాలేదు. దీంతో ఆ పూట అక్కడే వుండి 24 సాయంత్రానికి మకాం ఖాళీ చేద్దామనుకున్నాము. ఇదే సందర్భంగా శత్రు సమాచారాన్ని వాకబ్‌ చేసాము. మా పరిసర ప్రాంతాల్లో శత్రు కదలికలు లేవనే విషయం తెలిసింది. ఈ సమాచారం కూడ, మేము ఆ రోజు అక్కడే వుండాలని తీసుకున్న నిర్ణయానికి ఊతమిచ్చింది.

మేము అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అదే రాత్రి 7 గంటలకు మాకు దక్షిణాన వున్న కొండపై రెండు లైట్లు వెలిగి ఆరిపోయాయి. కానీ వాటిని లైట్లని నిర్ధారించుకోలేక పోయాము. రాత్రిపూట చుక్కలు అప్పుడప్పుడు అలా కన్పిస్తుంటాయని సరిపుచ్చుకొన్నాము. అదే రోజు ఉదయం రాంగూడకు చెందిన ఇన్‌ఫార్మర్‌ తల్లి చిత్రకొండకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే, ప్రజలు ఆమెను అడ్డుకొన్నారు. ఆమె మాత్రం మనుమరాలిని పంపి తను వాపసు వచ్చింది. ఈ విషయాన్ని ప్రజలు మాకు తెలియ చేసినప్పటికీ మేం ప్రమాదాన్ని శంకించలేక పోయాము. కొద్ది రోజుల ముందు ఒక విలేఖరికి పని చెప్పాము. అతన్ని 22 సాయంత్రం కలిసేందుకు వేరే గ్రామంలో అపాయింట్‌మెంట్‌ పెట్టాము. కానీ అతను 22 సాయంత్రానికి రమ్మన్న స్థలానికి రాకుండా, మా గురించి వాకబ్‌ చేస్తూ 28 రాత్రి 10 గంటలకు రాంగూడ గ్రామానికి వచ్చి మమ్మల్ని కలిసాడు. ఈ విషయం కొంత అసహజంగా వున్నప్పటికీ, సీరియస్‌గా తీసుకోలేదు. వాస్తవంగా 23 ఉదయం నుండి రాత్రి 10 గంటల దాక మా దృష్టికి వచ్చిన ఈ మూడు విషయాలు ప్రమాదాన్ని సూచించే సంకేతాలే. ఈ సంకేతాలను క్రోడీకరించుకున్నట్లయితే మేము అదనపు జాగ్రత్తలు తీసుకునే వాళ్లమే. కానీ క్రోడీకరించుకోలేదు. అదే మా వైఫల్యం.

ఇక మరో వైఫల్యమేమంటే 24 ఉదయం నుండి కొన్ని బలగాలు విడిపోవాల్సి రావడంతో రక్షణ ఏర్పాట్లు సడలించబడుతూ వచ్చాయి. సెంట్రీలు, పెట్రోలింగ్స్‌ నిర్వహణ, సైనిక నియమానుసారం జరగలేదు. మా ఈ వైఫల్యం శత్రువుకు మరింత కలిసి వచ్చింది. దీంతో రాత్రికి రాత్రే, ప్రజలెవరి కంట బడకుండా మేమున్న పాకెట్‌లోకి ప్రవేశించిన బలగాలు ఉదయం 6 గంటల కల్లా మేమున్న మకాంను చుట్టుముట్టి, ఒక బ్యాచ్‌ నేరుగా మా మకాంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో మేం రోల్‌కాల్‌ చేస్తున్నాం. అయితే మా కామ్రేడ్స్‌ ముందుగా పోలీసులను గమనించి, కొంత సర్‌ʹప్రైజ్‌కు గురి అయినప్పటికీ, వెంటనే తేరుకొని ఫైరింగ్‌ ప్రారంభించారు. అయితే అప్పటికే డేరాను పోలీసులు చుట్టుముట్టి వుండటంతో, మా బలగాలు అక్కడే ఎక్కువ సేపు ప్రతిఘటన ఇవ్వకుండా, రాత్రి లైట్లు కనబడిన కొండవైపుకు రిట్రీట్‌ అయ్యారు. ఆ క్రమంలోనే కొండపై నుండి పోలీసులు కాల్పులు ప్రారంభించారు. దీనిని బట్టి రాత్రి కనిపించిన లైట్లు పోలీసులవని నిర్ధారణ అయింది. పై నుండి వస్తున్న కాల్పులను తిప్పికొడుతూనే మా బలగాలు మరో వైపు కొండ కింది దిశగా వెళ్లాయి. అప్పటికే మా బలగాలను చుట్టుముట్టిన పోలీసు బలగాలు అన్ని వైపుల నుండి కాల్పులు ప్రారంభించారు. ఈ పరిస్థితిలో పోలీసు వలయాన్ని గండికొట్టి బయటపడే క్రమంలో ఎక్కువ మంది కామేద్స్‌ వీరోచితంగా పోరాడుతూ అమరులైనారు. ఈ సందర్భంగా గాయపడిన కామ్రేడ్స్‌ను పోలీసులు పట్టుకొని క్రూరంగా చిత్ర హింసలకు గురిచేసి, అప్పుడే కాల్చి చంపారు. 25వ తేది ఉదయం, గాయపడి తుప్పల్లో దాక్కున్న నలుగురు నిరాయుధ మిలీషియా కామేద్స్‌ను పట్టుకొని కాల్చి చంపారు. 26వ తేదీ తీవ్రంగా గాయపడి రిట్రీట్‌ కాలేక ఒక గొయ్యిలో దాక్కున్న మహిళా కామేడ్‌ను హత్య చేశారు.

27వ తేదీ, గాయపడి అక్కడ నుండి బయటపడ లేని మరో ఇద్దరు కామేడ్స్‌ను పట్టుకొని కాల్చి చంపారు. మొత్తంగా ఈ హత్యాకాండ 24వ తేది నుండి 27వ తేది వరకు నాలుగు రోజుల పాటు జరిగింది. ఈ నాలుగు రోజుల పాటు హెలికాష్టర్‌లలో పాత బలగాల స్థానంలో నూతన పోలీసు బలగాలను దింపుతూ వచ్చారు. ఏ.పి. డి.జి.పి.తో పాటు పలువురు పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి, మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీసులు రాంగూడ గ్రామాన్ని కూడ చుట్టుముట్టి కాల్పులు జరిపారు. భయంతో చిన్న చిన్న డొంగల (పడవ)లో పారిపోతున్న ప్రజలపై కూడా కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ఒక రైతు గాయపడ్డాడు. ఈ ఘటన సందర్భంగా మా బలగాలు 85 మంది వున్నారు. అయితే వీరిలో 30 మంది నిరాయుధులైన ప్రజా సంఘ నిర్మాణాలకూ, మిలీషియాకు చెందినవారు. ఈ సందర్భంగా 54 మంది కామ్రేద్స్‌ సురక్షితంగా బయటపడ్డారు.

2. ఇంత భారీ సంఘటన ఎందుకు జరిగిందనుకుంటున్నారు?


జ : ఇక్కడ అసలు విషయం వుంది. వాళ్ళు (పోలీసులు) మమ్ముల్ని ʹశాంతి భద్రతలకుʹ విఘాతం కల్గించే వాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ʹశాంతి భద్రతలను కాపాడేందుకు మా పై దాడి చేసామంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. ప్రజలెవరూ ఈ విషయాన్ని నమ్మరు. నమ్మటం లేదు కూడ. వాస్తవంగా ఈ దాడి వెనుక ఈ దోపిడీ ప్రభుత్వాలకు ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు వున్నాయి. ఈ దేశ పాలకవర్గాలైన దళారీ నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గాలు సామ్రాజ్యవాదులకు దళారీలుగా పని చేస్తున్నాయి. వీళ్ళు ఈ దేశ సంపదను సామ్రాజ్యవాదులకు దోచి పెట్టడమే కాకుండా తమ బొక్కసాలు కూడ నింపుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థలో సంక్షోభం తీవ్రతరమైన తర్వాత అందులో నుండి బయటపడేందుకు ఈ దోపిడీని మరింత తీవ్రతరం చేసారు. ʹసంస్మరణల ముసుగులో ఈ నయా వలస దోపిడీ దేశ ప్రజలపై విచ్చలవిడిగా కొనసాగుతున్నది. వాళ్ళిప్పుడు ఖనిజ సంపదను దోచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలలో పెద్ద ఎత్తున బాక్సైట్‌ తవ్వకాలు మొదలు పెట్టి ఆదివాసీ ప్రజలను నిర్జాక్షిణ్యంగా విస్తాపితుల్ని చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న ఈ బందిపోటు ప్రయత్నాలను మా పార్టీ నేతృత్వంలో ప్రజలు సమరశీల పోరాటాలతో ఎదుర్కొంటున్నారు. ʹజల్‌, జంగల్స్‌ జమీన్‌ʹ మావే అనే నినాదంతో తమ సంపదను తామే కాపాడుకొనేందుకు ఈ దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సంఘటితపడుతున్నారు. ఈ పరిణామాలు ఈ దోపిడీ ప్రభుత్వాలకు మింగుడు పడటం లేదు. ఆర్థికంగా, రాజకీయంగా ప్రజల నుండి ఎదురవుతున్న ఈ ప్రతిఘటనను, పాలకవర్థాలు ఏ మాత్రం సహించలేకపోతున్నారు. అందుకే వాళ్లు ఫాసిస్టు అణిచివేతను ప్రధాన పరిష్కారంగా ఎంచుకున్నారు. ఈ ఫాసిస్టు అణిచివేతను ఇప్పుడు గ్రీన్‌ హంట్‌ మూడవదశ పేరుతో అత్యంత క్రూరంగా నిర్వహిస్తున్నారు. ఈ దాడి ద్వారా మా పార్టీనీ, పి.ఎల్‌.జి.ఎ.ను విప్లవ ప్రజానీకాన్ని పూర్తిగా దెబ్బతీసి తమ దోపిడీకి మార్గం సుగమం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ లక్ష్యంలో భాగంగానే రాంగూడ దాడి జరిగింది. ఈ కారణాల రీత్యానే ఈ దాడికి ఆపరేషన్‌ ఆల్‌ ఔట్‌ 2 అనే పేరు పెట్టారు.

3. ఈ ఘటన ప్రజలపై ఎలాంటి ప్రభావం వేసిందనుకుంటున్నారు?


జ: ప్రజలు చరిత్రను నిర్మిస్తారు. అయితే ఈ ప్రయాణం సీదా సాదాగా ఉండదు. అనేక బాధాకరమైన అనుభవాల గుండా, తిరోగమనాలు, పురోగమనాలతో ఈ ప్రయాణం సుదీర్ధంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే వాళ్ళు రాటుదేలుతారు. ప్రస్తుతం కట్‌ ఆఫ్‌ ఏరియా ప్రజలు కూడా విప్లవ యుద్ధంలో రాటుదేలుతున్నారు. నిర్దిష్టంగా ఈ సంఘటన గురించి చెప్పాలంటే వాళ్లు, పార్టీనీ, పి.ఎల్‌.జి.ఎ.నీ, ప్రజా నిర్మాణాలను రక్షించుకొనేందుకు చాల బాధ్యతగా వ్యవహరించారు. ఎన్‌కౌంటర్‌కు ముందు పోలీసుల కదలికలను ఒకే గ్రామ ప్రజలు చూసారు. వాళ్లు మాకు సమాచారం ఇచ్చేందుకు వేగంగా వస్తుంటే, వాళ్లను పోలీసులు గమనించి పట్టుకొని కొట్టి వెనక్కి పంపారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత తప్పుకొన్న మా బలగాలను కాపాడటం కోసం వాళ్లు చేయని ప్రయత్నం లేదు. వాళ్ల సహకారమే లేకపోతే పార్టీ అక్కడ నిలదొక్కుకోవటం కష్టం. ఈ సందర్భంగా వాళ్ల భాగస్వామ్యానికి సహకారం అనటం చిన్న మాట కూడ అవుతుంది. వాళ్లు తమ నేతలను, సొంత బిడ్డలను కోల్పోయి దుఃఖంలోనూ, ఆందోళనలోనూ ఉన్నప్పటికీ, సాధించుకున్న విజయాలను వదులు కొనేందుకు సిద్ధంగా లేరు. తిరిగి వర్గ పోరాటాన్ని పురోగమింప చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయమేమిటంటే, పట్టణ, మైదాన ప్రాంత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు వాళ్లకు అండగా నిలబడటం వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేసింది.

4. ఈ ఘటన మీ పార్టీ క్యాడర్‌పై ఎలాంటి ప్రభావం వేసిందనుకుంటున్నారు?


జ : గతంలో ఇటువంటి పెద్ద సంఘటనలు జరిగినప్పుడు కొంతమంది అధైర్యపడి దిగజారిపోతుండేవాళ్ళు. ప్రస్తుతం ఈ సంఘటన సందర్భంగా ఒక్కరు కూడ దిగజారిపోలేదు. దీన్ని బట్టి పార్టీ దృఢ పడిందనే అనుకుంటున్నాము. ఈ మధ్య కాలంలో మేము పార్టీ సైన్యం, ఐక్య సంఘటనలలో బోల్నివీకరణ క్యాంపెయిన్‌ నిర్వహించాము. ఈ క్యాంపెయిన్‌ వల్ల పార్టీ సిద్ధాంతపరంగా, రాజకీయంగా, ʹసైనికపరంగా మెరుగుదల సాధించింది. కనుక ఈ సంఘటన పార్టీ గ్రేణులపై పెద్దగా నకారాత్మక ప్రభావాన్ని చూపదనే అనుకుంటున్నాము.

5. దేశ వ్యాపితంగా ఈ ఘటనకు వ్యతిరేకంగా ప్రజలు, మేధావులు ఏ విధంగా స్పందించారు?


జ : గతంలో వలె ఈ సారి కూడ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ʹప్రభుత్వు దమనకాండను పెద్ద ఎత్తున నిరసించారు. సమాజంలో పెరుగుతున్న ప్రజాస్వామిక వాతావరణానికి ఈ కదలిక ఒక మంచి ప్రతీకగా వుంది. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే దేశ వ్యాపితంగా 12 యూనివర్సిటీల నుండి విద్యార్థులు సంఘటనా స్థలానికి వచ్చి, ఆదివాసీ రైతాంగాన్ని కలిసి నిజ నిర్ధారణ నివేదిక ద్వారా వాస్తవాలను ప్రకటించడమే గాకుండా, వారికి అండగా నిలిచారు. ఇంకా పౌరహక్కుల సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు విడతలు, విడతలుగా సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రజలను కలిసి వాస్తవాలను బహిర్గత పరచడమే కాకుండా స్థానిక ప్రజలకు మద్దతుగా నిలిచారు.

6. కొద్ది మంది మేధావులు పి.ఎల్‌.జి.ఎ. అంటే చావు సైన్యమనీ, మీ పార్టీకి ప్రజల మద్దతు లేదని రకరకాలుగా వ్యాఖ్యానించారు కదా! వాటి మీదమీ స్పందన ఏమిటి?


జ : విప్లవోద్యమాన్నీ విప్లవ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ష్రచార దాడి చేసేందుకు వాళ్లకు సామ్రాజ్యవాదుల నుండి ఆదేశాలు వున్నాయి. వాళ్ళకు త్యాగాలు లేకుండా చరిత్ర పురోగమనం వుండదనే విషయం అర్ధం కాదు, అర్ధం చేసుకోరు కూడా. నిజమే వాళ్ళన్నట్లు మేము కొండను ఢీకొంటాం, పర్వతాలను తవ్వుతాం, ఏటికి ఎదురీదుతాం. ఇటువంటి సంకల్పం, కార్యాచరణ లేకుండా వట్టి పోచికోలు కబుర్లతో కరుడు గట్టిన ఈ దోపిడీ వ్యవస్థను ఎవరు మార్చలేరు. వాళు ఉద్దేశపూర్వకంగా మాపై దాడి చేయాలనుకుంటున్నారు. కనుక విప్లవోద్యమం సమాజంలో తీసుకొచ్చిన మార్పులనూ, విషప్లవోద్యమానికి పెరుగుతున్న ప్రజల మద్దతును చూడ నిరాకరిస్తారు. అజేయమైన ప్రజా సైన్యం వాళ్ళకు చావు సైన్యంలా కనిపిస్తుంది. అది వాళ్ళ అత్యాశ మాత్రమే. వాళ్ళెప్పుడో రాజకీయ నిబద్ధతను కోల్పోయారు. వాళ్లు వృత్తిపరమైన అవకాశవాదులు. తమ స్వార్ధ, సంకుచిత ప్రయోజనాల కోసం, కుతర్మంతో తమ ʹతెలివి తేటలిను దోపిడీ పాలకవర్దాలకు ఉపయోగపెడ్డుంటారు. దేశంలో ఒక వైపున సామ్రాజ్యవాద గ్లోబలీకరణ ఆర్థిక విధానాలు మరో వైపున రాజకీయంగా ఫాసిస్టు విధానాలు అమలవుతున్న నేటి పరిస్థితుల్లో తమ స్వార్థ ప్రయోజనాలకు, డబ్బు సంచులకు అమ్ముడు పోయే మేధావుల సంఖ్య పెరుగుతున్నట్లు మనం గమనించవచ్చు. నేటి ఈ పరిస్థితి విప్లవ, కుహన మేధావుల మధ్య ఖచ్చితమైన విభజన రేఖను గీస్తుంది. స్పష్టమైన పోలరైజేషన్‌ను మన ముందుంచుతుంది.

7. ఈ ఘటనకు సంబంధించిన ఏ ఏ లోపాలు గుర్తించారు? ఏమి గుణ పాఠాలు తీసుకుంటున్నారు?


జ : యుద్ధమన్న తర్వాత త్యాగాలు అనివార్యం. అయితే అనవసర త్యాగాలు చేయకూడదనేది మా విధానం. రాంగూడ సంఘటనలో మా వైపు నుండి లోపాలు జరిగాయి. ఆ సందర్భంగా శత్రువు శక్తిని తక్కువగా అంచనా వేసాము. గెరిల్లా యుద్ధ నియమాలను పాటించడంలో కొంత అలసత్వం కూడ చోటు చేసుకుంది. మా ఈ లోపాలే శత్రువుకు విజయావకాశాలుగా మారాయి. మాకు భారీ నష్టం జరిగింది. మేము ఆ తప్పులు చేయకుండా వుంటే కొంత మేరకు నష్టాలను నివారించుకోగలిగే వాళ్లం. యుద్ధ పరిస్థితిలో రోజు రోజుకు మార్పు వస్తున్నది. భారత పాలక వర్గాలు మమ్మల్ని తుడిచిపెట్టి వాళ్ల దోపిడీని తీవ్రతరం చేసేందుకు మా పై దాడిని పూర్తి స్థాయిలో కేంద్రీకరించారు. ఈ దాడిని గ్రీన్‌ హంట్‌ మూడవ దశ అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ దాడిని ఓడించేందుకు మేము మరింతగా ప్రజలను అంటి పెట్టుకొని వుంటాము. ఈ యుద్ధంలో ఇదే మా అసలు బలం. అలాగే కార్మిక వర్గ క్రమశిక్షణను చైతన్యవంతంగా అమలు చేయడంతో పాటు నేడున్న కఠిన పరిస్థితులలో సైతం ఎంతటి కష్టాలకైన సిద్ధపడి గెరిల్లా యుద్ధ నియమాలను అమలు చేస్తాం. ఈ విధానాలే మమ్మల్ని గెలుపు వైపు నడిపిస్తాయి. గతంలో ఇటువంటి గడ్డు పరిస్థితుల్ని అధిగమించిన అనుభవం మా పార్టీకి వుంది.

8. ఏ.ఓ.బీ. ఉద్యమానికి కోలుకోలేని దెబ్బతీశామని ప్రభుత్వం, పోలీసులు ప్రచారం చేస్తున్నారు కదా! మీరేమంటారు?


జ: ఇటువంటి దుష్ప్రచారాన్ని పోలీసులు ఒక కళగానే అభ్యసించారు. ఎల్‌.ఐ.సి.లో భాగంగానే వాళ్లు ఇటువంటి దుష్ప్రచారానికి పాల్పడి, ప్రజల మనో స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. వాస్తవంగా ఇది మాకు భారీ నష్టమే అయినప్పటికీ మా అమరులు లేని లోటును పూడ్చేందుకు మా కామేడ్స్‌ అంతా వాళ్ల పనిలో రెట్టింపు కష్టానికి సిద్ధపడ్డున్నారు. మాకున్న గాఢమైన విప్లవకర ప్రజా పునాది నుండి నూతన శక్తులు ఎదిగి వస్తున్నారు. ఈ నష్టం మా సుదీర్హ ప్రయాణంలో, లక్ష్య సాధనలో చిన్న అవరోధమే.

9. నిర్దిష్టంగా ఈ ప్రాంతంపై శత్రు దాడి పెద్ద ఎత్తున అమలు కావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?


జ: వాళ్ల మొదటి ప్రాధాన్యత, పై స్థాయి నాయకత్వాన్ని నిర్మూలించడం. ఇందుకనుగుణంగా, ఆ ప్రాంతంలో మా నాయకత్వ కదలికలుండటంతో వాళ్లను నిర్మూలించేందుకే ఆ ప్రాంతంపై ఇంత పెద్ద దాడి చేసారు. ఇక ఆ సరిహద్దు ప్రాంతమంతా బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజల సమరశీల పోరాటాలు జరుగుతున్నాయి. నిర్దిష్టంగా కట్‌ ఆఫ్‌ ఏరియాలో సాయుధ వ్యవసాయ విప్లవం ఊపందుకొని, స్థానిక ఆదివాసీ రైతాంగం భూస్వాములకు వ్యతిరేకంగా మిలిటెంట్‌ పోరాటం చేపట్టి, వందలాది ఎకరాల భూములు ఆక్రమించడంతో పాటు సాయుధులవుతూ రాజ్యాధికార నిర్మాణాల దిశగా పురోగమిస్తున్నారు. ఈ కారణాల రీత్యానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రాంతంపై ప్రత్యేకంగా కేంద్రీకరించారు.

10. ఈ ఘటన ఏ.పీ రివైవల్‌ పై ఎటువంటి ప్రభావం వేస్తుంది?


జ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అగ్ని పర్వతాల్లాంటివి. ఆ రెండు రాష్ట్రాలలో ప్రజల ఆగ్రహం అనే లావా ఉడుకుతున్నది. అక్కడి ప్రజలకు సుదీర్ధమైన వర్గ పోరాట చరిత్ర ఉంది. త్యాగాల చరిత్ర వుంది. వాళ్ళు విప్లవంలోని ఆటు పోట్లను చూసారు. వాళ్ళు ఇటువంటి సంఘటనలు జరిగినపుడు ఏ మాత్రం నిరాశపడరు. ఇటువంటి సంఘటనలను సైతం ఆసరా చేసుకొని పాలక వర్ణాలకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటాన్ని ఎక్కుపెడ్దారు. ఇప్పుడు వాళ్లు రాంగూడ సంఘటనలో పాలక వర్షాలు, వాళ్ల హంతక కిరాయి పోలీసులు విప్లవకారులపైన, ప్రజలపైన అనుసరించిన అమానుషమైన, పాశవికమైన పద్ధతులను బహిర్గతం చేస్తూ, విమర్శిస్తూ పలు రూపాల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక పోతే మనం రివైవల్‌ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రెండు రాష్ట్రాలలో విప్లవ ప్రవాహం ఆగిపోలేదు. వేరు వేరు రూపాలలో అప్పటి నుండి కొనసాగుతూనే వుంది. ఆ ప్రజా విప్లవ ప్రవాహం మరో ప్రజా వెల్లువను తనదైన రీతిలో, వినూత్న పద్ధతుల్లో సృష్టిస్తోంది. అది బద్దలైన అగ్ని పర్వతం నుండి విరజిమ్మే లావాలా ఉంటుంది.

11. సాయుధ శిక్షణ, బలాబలాల్లో పెద్ద తేడాను చూపి పోలీసు అధికారులు చేస్తున్న వాదనలో నిజం వున్నదా?


జ: వాళ్ల వాదనలో పస లేదు. పెద్ద బలగాలు, సాయుధ శిక్షణ యుద్ధంలో అంతిమ విజయాన్ని చేకూర్చవు. ఏ యుద్ధంలోనైనా ప్రజల క్రియాశీలక పాత్ర నిర్ణయాత్మక మవుతుంది. చరిత్రలో వియాత్నం, కొరియా దేశాలు మొదలుకొని నేటి మధ్య ప్రాచ్య దేశాల వరకు ఈ విషయాన్నే రుజువు చేసాయి, చేస్తున్నాయి కూడ. ఆయా దేశాల ప్రజలు సామ్రాజ్యవాదాన్ని కాగితపు పులిగా తేల్చేశారు. అయితే ప్రజలు సాధించే అంతిమ విజయాలు అనేక కష్టాలతోనూ, కడగండ్ల తోనూ, బాధకరమైన అనుభవాలతోను కూడుకొని సుదీర్థమైన క్రమాన్ని తీసుకొంటుంది. ఈ క్రమంలో ఇరు పక్షాల బలాబలాల్లో కూడ తేడా వస్తుంది. ఇప్పుడు వాళ్లకున్న బలం, స్థితి ఎల్లకాలం అలాగే వుండదు. ఒక క్రమంలో ప్రజా సాయుధ శక్తులు అన్ని విషయాలలో పై చేయి సాధించి పరిస్థితిని తలకిందులు చేస్తాయి.

(అమ‌రుల బంధుమిత్రుల సంఘం ప్ర‌చురించిన త్యాగాల దారి పుస్త‌కంలోంచి)


Keywords : rk, Ramakrishna, Maoist, aob
(2024-04-26 02:09:07)



No. of visitors : 2299

Suggested Posts


పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం

చైతన్యవంతమైన కార్యకలాపాలంటే పొరపాట్లను తగ్గించుకుని ఎక్కువ విజయాలను సాధించడమనే. ఇందుకనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆధారపడి నూతన ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఇందులో ఏ మాత్రం విసుగు చెందకూడదు.

అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (63) అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. కామ్రేడ్ హరగోపాల్ కు అకస్మాతుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు.

చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం

ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి మౌలిక నమస్యకు పరిష్కారం చూపడంలో నక్సలైట్ల పాత్రను, 30 సంవత్సరాల పైబడిన వారి ఆచరణను వస్తుగతంగా

విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి

రెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది.

RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్

14 అక్టోబర్,2021 సాయంత్రం నుండి తెలుగు,చత్తీస్గఢ్ మీడియాలో, మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ అనారోగ్యంతో చనిపోయినాడని ,చత్తీస్గఢ్ పోలీసులు ధ్రువీకరించారని స్పెషల్ స్టోరీస్ తో పాటు బ్రేకింగ్ న్యూస్ లతో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌

అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ @ RK సంస్మరణ సభ ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఆదివారంనాడు జరిగింది.

ఆర్కే పుస్తకావిష్క‌రణ సభను అడ్డుకున్న పోలీసులు...రేపు మీడియాసమావేశం ఏర్పాటు చేసిన ఆర్కే సహచరి శిరీష‌

అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు రామకృష్ణపై పుస్తకాన్ని ముద్రిస్తున్న హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ

ʹసాయుధ శాంతి స్వప్నంʹ : హైకోర్టు తీర్పు

రామకృష్ణ రచనల, ఆయన మీద సంస్మరణ రచనల సంకలనాన్ని ఆవిష్కరణకు ముందే జప్తు చేసి, కేసు పెట్టిన పోలీసుల చర్యను తప్పుపడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మేము