Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
25-10-2021
భీమా కోరెగావ్ కేసులో మొట్ట మొదట అరెస్టు చేసిన 70సంవత్సరాలున్న గౌతమ్ నవ్‌లఖాను 2021 అక్టోబర్ 12 న బ్యారక్‌ల నుండి ʹఅండా సర్కిల్ʹ (హై సెక్యూరిటీ) కి తరలించారు.
పైగా జైలులో భౌతిక ములాఖత్‌లు పునఃప్రారంభమయ్యాయనే సాకుతో నాతో, అతని న్యాయవాదులతో మాట్లాడేందుకు అతనికున్న ఏకైక ఆధారమైన టెలీఫోన్ సౌకర్యాన్ని నిలిపివేసారు.
నా వయస్సు 70 ఏళ్లు పైన ఉంటుంది. నేను ఢిల్లీలో నివసిస్తున్నాను. నవ్‌లఖాతో కలవడానికి జైలు అధికారులు అనుమతిచ్చే పది నిమిషాల వ్యవధిలో అతడిని కలవడానికి నవీ ముంబైలోని తలోజా జైలుకు ప్రయాణించడం నాకు చాలా కష్టం. ఇప్పటి వరకు గౌతమ్‌తో నాకు ఉన్న ఏకైక సంపర్క మార్గం, వారానికి రెండు సార్లు అనుమతించే ఫోన్ కాల్ మాత్రమే. దాని ద్వారానే అతనికి అవసరమైన మందులు, పుస్తకాలు సహా యితర వస్తువుల గురించి తెలుసుకొని పంపడానికి వీలుండేది. ఫోన్ కాల్‌లు నిలిపివేయడంతో, అతని అవసరాలు నాకు తెలియడానికి అతను రాసే ఉత్తరాలే ఆధారం. అవి నాకు అందడానికి కనీసం రెండు వారాల సమయం పడుతున్నది.
నాకు ఫోన్ చేయడమే కాకుండా, తన న్యాయవాదులకు రెగ్యులర్‌గా ఫోన్ చేయగలగడం అనేది విచారణా ఖైదీలకు అవసరమైన సౌకర్యం. న్యాయపరమైన సలహాలు, సహాయాన్ని పొందడం లేదా కుటుంబంతో మాట్లాడగలిగే ఉపయోగకరమైన, సమర్థవంతమైన సౌకర్యాన్ని విచారణా ఖైదీలకు లేకుండా చేయడం చాలా అన్యాయం.
కుటుంబానికి, న్యాయవాదులకు ఫోన్ కాల్ సౌకర్యాన్ని ఉపసంహరించుకోవడం వల్ల అసలే బలహీనంగా ఉన్న గౌతమ్ ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే, అతన్ని అండా సర్కిల్లో ఉంచి కాంక్రీట్ చేయని పచ్చటి ప్రదేశాలు, స్వచ్ఛమైన గాలిలో రోజువారీ నడకకు దూరం చేయడం వల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ అన్యాయమైన, తప్పుడు కేసుతో పోరాడటానికి తను జీవించాలంటే, ప్రత్యేక వైద్యం ఒక తప్పనిసరి అవసరం. ఢిల్లీలో వున్న నాకు, అతని న్యాయవాదులకు వారంవారం ఫోన్ చేయకుండా వుంటే అతని జీవితం, అతని రక్షణ తీవ్ర ప్రమాదంలో పడతాయి.
గౌతమ్ తన లేఖలో నాకు ఇలా రాశాడు, ʹఅండా సర్కిల్‌లో నిర్బంధించడం అంటే, సర్కిల్ బహిరంగ ప్రదేశంలో ఒక్క చెట్టు లేదా మొక్క కూడా లేదు కాబట్టి స్వచ్ఛమైన గాలి / ఆక్సిజన్ ఏ మాత్రం అందకుండా చేయడమే. మేము అండా సర్కిల్ వెలుపల అడుగు పెట్టడం నిషేధం…. మరో మాటలో చెప్పాలంటే, మేము 24 గంటలలో 16 గంటలు మా సెల్ లోపల, బయటికి పంపే 8 గంటలు చుట్టూ ఎత్తైన గోడలతో, సిమెంటు నేలపై మా రోజువారీ నడక కోసం 71/2ʹ x 72ʹ వరండాకు పరిమితమై ఉంటాము.ʹ
ఇటీవల, విషాదకర పరిస్థితులలో స్టాన్ స్వామి మరణించారు. పార్కిన్సన్స్ వ్యాధితో తీవ్రంగా బలహీనపడిన స్టాన్, తాగడానికి స్ట్రా, మరుగుదొడ్డికి వెళ్లడానికి సహాయం, వైద్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాల కోసం పోరాడాల్సి వచ్చింది. ఆరోగ్యం క్షీణిస్తున్న స్థితిలో రాంచీలోని ఇంట్లో చనిపోవడానికి అనుమతించాలి అనేది అతని చివరి సాధారణ కోరిక. వాస్తవానికి ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్లడం కంటే జైలులో చనిపోవడమే మంచిదని అతను కోర్టుకు చెప్పిన తర్వాత కూడా, కోర్టు ముందు అతని వినతి పెండింగ్‌లో వుండగానే, స్టాన్ స్వామి ముంబై ఆసుపత్రిలో మరణించాడు.
వీళ్ళు నిర్దిష్ట విశ్వాసాలు కలిగిన ఖైదీలు, అతిచిన్న అవసరాల కోసం అగౌరవాన్ని, అవమానాలను ఎదుర్కోవలసి వచ్చింది. జైలులో ప్రాథమిక గౌరవాల కోసం కోర్టులో పోరాటాలు చేయాల్సి వచ్చింది. గతంలో, నవ్‌లఖా కళ్ళజోడు కనిపించకుండా పోయినప్పుడు, మరో కళ్లజోడు అందించడం చాలా కష్టమైపోయింది.
న్యాయవాదులు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసే సౌకర్యం, కొంత స్వచ్ఛమైన గాలి కోసం రోజుకు ఒకటి లేదా రెండుసార్లు నడవాలనే సాధారణ సౌకర్యాలు అసాధ్యమైనవి కాదు.
గౌతమ్ తన అన్యాయమైన నిర్బంధాన్ని ధైర్యం, స్ఫూర్తిలతో ఎదుర్కొన్నాడు. తన అభిప్రాయాల కోసం ఇంకా ఎంతకాలం వేధింపులకు గురికాబోతున్నాడు? అతని స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయడానికి అధికారులు యింకా ఏం చేయబోతున్నారు?
సాబా హుస్సేన్
గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి
#FreeBK15
#FreeAllPoliticalPrisoners
(తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి)
Keywords : bhima koregao, BK16, BK 15, Gautam Navlakha, Gautam Navlakhaʹs health has worsened in jail, not being allowed phone calls, says his partner, Navi Mumbai, Taloja jail,Elgar Parishad, Sahba Husain
(2024-10-03 13:40:17)
No. of visitors : 1210
Suggested Posts
| bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ
భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని |
| భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది. |
| రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన
కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది. |
| UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన |
| భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. |
| స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలుభీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది. |
| Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన
భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది. |
| హనీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు
భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది. |
| Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర బీమా కోరేగాం ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయి జైలు నిర్భంధంలో ఉన్న హక్కుల సంఘాల నేతలు, మేధావులు మరో ప్రమాదకరమైన సవాలును ఎదుర్కోబోతున్నారు. వారిని తలోజా జైలునుంచి మహారాష్ట్రలోని వివిధ జైళ్లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. |
| కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది. |