పెగాసస్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు


పెగాసస్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు

పెగాసస్

27-10-2021

దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన‌ పెగాసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై తామే కమిటీ వేస్తామన్న కేంద్రం అభ్యర్తనను సుప్రీం తిరస్కరించింది. రిటైర్డ్ జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో అలోక్‌ జోషి, సందీప్‌ ఒబెరాయ్ సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా సుప్రీం కేంద్రం పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రతి దానికి జాతీయ భద్రతకు ముడిపెట్టడంపై అసంత్రుప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష బాధితులని పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వురినియోగంపై పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడాన్ని సహించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిఘాతో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని ధర్మాసనం పేర్కొంది. పౌరులపై నిఘాలో విదేశీ ఏజెన్సీల ప్రమేయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమక్త వుతుందని తెలిపింది. పెగాసస్‌వ్యవహారంలో గోప్యత హక్కుఉల్లంఘన జరిగిందా లేదా అనేది కమిటీ పరిశీలిస్తుం దని తెలిపింది. క‌మిటీ పనితీరును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తుంద‌ని వెల్లడించింది.

"2019 నుండి పెగాసస్ దాడికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ఈ కోర్టు కేంద్రానికి తగినంత సమయం ఇచ్చింది. అయితే కేంద్రం పరిమితమైన అఫిడవిట్ మాత్రమే దాఖలుచేసింది. కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తే మాపై భారం తగ్గేది" అని పేర్కొన్నారు ప్రధాన న్యాయమూర్తి.

"నేటి ప్రపంచంలో, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి, జాతీయ భద్రతను పరిరక్షించడానికి అవసరమైనప్పుడు మాత్రమే గోప్యతపై ఆంక్షలు విధించబడతాయి. కానీ జాతీయ భద్రతా సమస్యలను లేవనెత్తడం ద్వారా రాజ్యం ప్రతిసారీ ఫ్రీ పాస్‌ను పొందజాల‌దు." అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా పెగాసస్ స్పై వేర్ ద్వారా దేశంలోని ప్రతిపక్ష నాయకుల, మేదావుల, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారం నుండి తప్పించుకోవడానికి అనేక ఎత్తుగడలు వేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి వ్యవస్థలు సహకరిస్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Keywords : pegasus, supreme court, NV Ramana, Supreme Court Forms Pegasus Probe Panel
(2021-12-04 07:03:43)No. of visitors : 145

Suggested Posts


తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్

2015 నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో సెక్షన్ 66(ఏ)ను ఇప్పటికే తొలగించగా, 22 మందిని ఈ చట్టం కింద ప్రాసిక్యూట్ చేశారని పీయూసీఎల్

ʹఉగ్రవాద సంస్థలో సభ్యుడుగా ఉండటం, మద్దతు యిచ్చినంత మాత్రాన UAPA నేరం కిందికి రాదుʹ: సుప్రీం కోర్టు ఆదేశం

ఒక తీవ్ర‌వాద సంస్థలో సభ్యుడిగా వుండడమూ లేదా ఇతరత్రా మద్దతు ఇచ్చినంత మాత్రాన UAPA కింద నేరంగా పరిగణించడానికి సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఈ విధంగా స్పష్టం చేసింది

Search Engine

నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం
తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
more..


పెగాసస్