మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు రవి అమరత్వం -మావోయిస్టు పార్టీ ప్రకటన
13-11-2021
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మావోయిస్టు నాయకుడు రవి ఎలియాస్ జైలాల్ ప్రమాదవశాత్తు మరణించినట్టు సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. రవి జూన్ 25, 2020న ఉదయం 11 గం||లకు మరణించినట్టు తెలిపిన మావోయిస్టు పార్టీ ఏడాదిన్నర కాలం ఆలస్యంగా ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నామని ప్రకటించింది.
మావోయిస్టు పార్టీ ప్రకటన పూర్తి పాఠం....
కామ్రేడ్ రవి (జైలాల్) అమర్ రహే!
కామ్రేడ్ రవి (జైలాల్) ఆశయాలను కొనసాగిద్దాం!
ప్రియమైన ప్రజలారా!
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం. మీ-మా రవి అమరత్వ వార్త మీకు కలిగించే అపార దు:ఖం, వేదన, బాధలో పాలుపంచుకుంటూ, కేంద్రకమిటీ కామ్రేడ్ రవి తల్లితండ్రులు బుచ్చమ్మరమణయ్యలకు, కుటుంబ సభ్యులందరికీ, బంధుమిత్రులందరికి ప్రగాఢ సంతాపాన్నీ, సానుభూతిని తెలియజేస్తున్నది. కామ్రేడ్ రవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా.
శతృవు కొనసాగిస్తున్న విప్లవ ప్రతీఘాతుక వ్యూహాత్మక దాడి ʹసమాధాన్ʹను ఎదుర్కోవడానికి పార్టీ నాయకత్వంలో పీఎల్ జీఏ నిర్వహిస్తుండిన ఎత్తుగడలపరమైన ఎదురుదాడుల క్యాంపెయిన్‌లో భాగంగా, ఝార్ఖండ్‌లోని కొల్హాన్ అటవీ ప్రాంతంలో తను అభివృద్ధి చేసిన బాణం బాంబును పరీక్షించే క్రమంలో జరిగిన ప్రమాదంలో కామ్రేడ్ రవి జూన్ 25, 2020న ఉదయం 11 గం||లకు తీవ్రంగా గాయపడి అమరుడయ్యాడు. ఆకస్మికంగా, అనూహ్యంగా జరిగిన కామ్రేడ్ రవి అమరత్వం(జైలాల్)తో అక్కడి పీఎల్జీఏ క్యాంపులోని నాయకత్వం, పీఎల్జీఏ కమాండర్లు, యోధులు, ప్రజలు తీవ్ర ధిగ్ర్భాంతికి లోనయ్యారు.
తమ ప్రియతమ సహచరుడు నిపుణుడైన,యోగ్యుడైన టెక్నిషియన్, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ పర్సన్, కంప్యూటర్ ఆపరేటర్, అత్యంత విశ్వసనీయుడైన అమరుడు కామ్రేడ్ రవి (జైలాల్)కి జూన్ 26న చివరి వీడ్కోలు చెప్పి, శ్రద్ధాంజలి అర్పించి, విప్లవ లాంచనాలతో అంతిమ క్రియలు నిర్వహించారు. ʹకామ్రేడ్ రవి (జైలాల్) అమర్ రహే! కామ్రేడ్ రవి ఆశయాలను తుదకంటా కొనసాగిస్తాం! శతృ ʹసమాధాన్ʹ దాడిని ఓడిద్దాంʹ అంటూ నినాదాలిస్తూ శపథం చేసారు.
విప్లవోద్యమం గర్వించే కామ్రేడ్ రవి లాంటి ఉత్తమ పుత్రున్ని కని, విద్యాబుద్ధులతోపాటు, విప్లవ రాజకీయాలను చిన్నప్పటినుండే నేర్పిస్తూ, పెంచి పెద్దచేసి, దేశ విప్లవోద్యమానికి అంకితం చేసిన తల్లిదండ్రులు ధన్యజీవులు.
భారత విప్లవోద్యమానికి తమ ప్రాణాలను ధారపోసిన వేనవేల అమరుల త్యాగాల స్ఫూర్తితో విప్లవోద్యమంలోకి అడుగిడిన కామ్రేడ్ రవి (జైలాల్) పార్టీ ఇచ్చిన వివిధ పనులను బాధ్యాతాయుతంగా నిర్వహిస్తూ వచ్చాడు. ఆ తర్వాత పార్టీ నిర్ణయాన్ని అమలు చేస్తూ, 2014లో గెరిల్లా జోన్లలో బాధ్యతలు నిర్వహించడానికి వెళ్ళిన కామ్రేడ్ రవి (జైలాల్) అప్పటినుండి, తన అమరత్వం దాకా ఝార్ఖండ్ లో ఈఆర్బీ స్టాఫ్ గా పని చేసాడు.
వివిధ నైపుణ్యాలు కలిగిన కామ్రేడ్ రవి, కంప్యూటర్ ఆపరేటర్ గా, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ పర్సన్ గానే కాక, ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ ను అభివృద్ధి చేస్తూ, ప్రజాయుద్ధాన్ని పెంపొందించడంలో పీఎల్ జీఏకు కొత్త ఆయుధాలు అందించే టెక్నిషియన్ గా వివిధ రూపాల్లో విప్లవోద్యమానికి తన సేవలను అందించాడు. ఈ క్రమంలో డివిజనల్ కమిటీ స్థాయికి ఎదిగాడు. నాయకత్వం, క్యాడర్లు, ప్రజలతో సన్నిహితంగా కలిసి, మెలసి ఉంటూ, అందరికి తలలో నాలుకయ్యాడు. కామ్రేడ్ రవి అమరత్వం విప్లవోద్యమానికి ప్రత్యేకించి బీహార్-ఝార్ఖండ్ ఉద్యమానికి వెంటనే పూడ్చుకోలేని తీవ్రమైన లోటు. విప్లవోద్యమం ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకుంటుంది. కామ్రేడ్ రవి అమరత్వపు దు:ఖం నుండి మీరు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుతూ, కోలుకుంటారని ఆశిస్తున్నది. అది అంత సులువైనది కాదనేది వాస్తవమే అయినప్పటికీ, విప్లవకారుల మరణం మనలో మరింత వర్గకసిని, లక్ష్యం కోసం పోరాడే తెగింపును చివరి శ్వాస వరకు ఉద్యమంలో నిలబడాలన్న దృఢసంకల్పాన్ని ఇనుమడింపజేస్తుంది.
అత్యున్నతమైన కామ్రేడ్ రవి ప్రాణత్యాగం మనకు ఆదర్శం. ఆ ఆదర్శాన్ని ఎత్తిపడుతూ, ఆయన ఆశయాలైన భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్నీ, సోషలిస్టు విప్లవాన్నీ, అంతిమంగా కమ్యూనిజాన్ని సాధించే లక్ష్యంతో తుదకంటా పోరాడదామని మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నది.
విప్లవాభివందనాలతో,
కేంద్రకమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : ravi, jailal, cpi maoist, martyr, jharkhand
(2024-12-02 04:20:05)
No. of visitors : 2371
Suggested Posts
| వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు జార్ఖండ్, లతేహర్ జిల్లాలోని గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకూ-పిరీ అడవిలో వేట కోసం వెళ్ళిన ఆదివాసీ యువకుల పై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిరి నివాసి 23 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు, అదే గ్రామానికి చెందిన దీనానాథ్ సింగ్ గాయపడ్డాడు. |
| ʹమావోయిస్టు నాయకులను జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారుʹసీనియర్ మావోయిస్టు నాయకులు ప్రశాంత్ బోస్ @ కిషన్ దా, అతని సహచరి షీలా మరాండీలమి జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. |
| అవును నేను మావోయిస్టునే..!అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి. |
| Bajrang Dal activists killed my husband: Widow of man lynched in JharkhandThe wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told.... |
| Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSCPersecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi. |
| Jharkhand: Tribals hold police, district officials hostage in late-night dramaThousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night..... |
| Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probeThe opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life..... |
| ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావుజార్ఖండ్లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్ సరుకులే దిక్కు.... |
| ఆ ఆదివాసీ యువకుడిది ఎన్ కౌంటర్ కాదు హత్యే, సీఆర్పీఎఫ్ అధికారే దోషి - 9 ఏండ్ల తర్వాత తేల్చిన సీఐడి గ్రామానికి చేరుకున్న వెంటనే సిఆర్పిఎఫ్ జవాన్లు 20-22 మంది గ్రామస్తులను పట్టుకుని అందరి చేతులను వెనక్కు విరిచికట్టేసి, తమ వెంట తీసుకెళ్లి ఆ రాత్రి వారందరినీ వూరి బయట మైదానంలో వుంచి మర్నాడు జూన్ 29న తమ సామాన్లను బహదా అడవికి మోయించుకెళ్లారు. అక్కడ నుండి యింకా ముందుకు సామాను తీసుకెళ్లడానికి నిరాకరించడంతో మంగల్ హోన్‌హాగ్‌ను కాల్చి చంపారు. |
| demanding the immediate release of Damodar TuriWe strongly condemn the unlawful arrest of Damodar Turi (Central Convenor Committee member of Visthapan Virodhi Jan Vikas Andolan) by Jharakhand Police on 15 February 2018. And demand for immediate release for him. |