ఆర్కే పుస్తకావిష్కరణ సభను అడ్డుకున్న పోలీసులు...రేపు మీడియాసమావేశం ఏర్పాటు చేసిన ఆర్కే సహచరి శిరీష
13-11-2021
అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు రామకృష్ణపై పుస్తకాన్ని ముద్రిస్తున్న హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రెస్ యజమాని రామకృష్ణ రెడ్డి, ఆయనసహచరి సంధ్యల పై కేసు నమోదు చేశారు.
అమరుల బందు మిత్రుల సంఘం ప్రచురిస్తున్న ʹసాయుధ శాంతి స్వప్నంʹ అనే ఆ పుస్తకం రేపు (ఆదివారం) హైదరాబాద్ లోని సుందరయ్య విఙాన కేంద్రం లో ఆవిష్కరణ జరగాల్సి ఉంది. అయితే సుందరయ్య విఙాన కేంద్రం యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చిన పోలీసులు ఆ సమావేశం జరగకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ సహచరి శిరీష, ఇతర బంధుమిత్రులు రేపు సోమాజీ గూడా ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ మేరకు ఆర్కే సహచరి శిరీష విడుదల చేసిన ప్రకటన:
ఇటీవల మృతి చెందిన మావోయిస్టు నాయకుడు,నా భర్త ఆర్కే స్మృతిలో ఒక పుస్తకాన్ని ప్రచురించి 14 వ తేదీ ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరణ సభ జరపాలని అనుకున్నాను. కానీ తెలంగాణా పోలీసులు ప్రెస్ పై దాడి చేసి పుస్తకాలను తీసుకెళ్లి ప్రెస్ యజమాని పై కేసు నమోదు చేశారు సభ జరగవలసిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారిపై ఒత్తిడి తెచ్చిసభను అడ్డుకున్నారు
ఈ అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఇందులో ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ పద్మజాషా, వేములపల్లి వెంకటరామయ్య, అరుణోదయ విమల, సాధినేని వెంకటేశ్వరరావు, లక్ష్మీ దేవి, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొంటారు.
ఇట్లు
శిరీష
బంధుమిత్రులు.
హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకోవడంపై మానవహక్కుల సంఘం విడుదల చేసిన ప్రకటన:
హైదరాబాద్ లో నవ్య ముద్రణాలయం పై పోలీసుల దాడి చట్ట విరుధ్ధమైన చర్య.
హైదరాబాద్ లోని నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు దాడి చేసి ముద్రణలో ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకోవడం ఏ రకంగా చూసినా చట్టవిరుద్ధమైన చర్య. తెలంగాణ పబ్లిక్ సెక్యురిటి చట్టం కింద ప్రెస్ యజమాని రామకృష్ణ రెడ్డి మరియు ఆయన సతీమణి సంధ్య గార్ల పై కేస్ పెట్టడం కూడా పోలీసుల అత్యుత్సాహక చర్యనే. మనం బతుకుతున్నది ప్రాథమిక హక్కులను సమున్నతనంగా నిలబెట్టే రాజ్యాంగం అమలు అవుతున్న నాగరిక సమాజం లోనేనా అనే సందేహం వస్తోంది. పుస్తకాలను ముద్రించడం ఏ చట్టం ప్రకారం నేరం? పోలీసుల చట్ట విరుద్ధ చర్యలను మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.
ఒక నిషిద్ధ పార్టీలో సభ్యత్వం కలిగి ఉంటే చట్ట ఉల్లంఘన అయితే కావచ్చు కానీ చనిపోయిన తరువాత కూడా ఆ వ్యక్తిని చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వ్యక్తిలా పరిగణించాలని చట్టం ఎక్కడా అనదే. మరి పోలీసులకు చట్టం అలా ఎందుకు అర్థం అవుతున్నదో? ఒక పుస్తకం ముద్రణ పూర్తి చేసికుని బయటకు వచ్చిన తర్వాత పుస్తకంలోనో విషయాన్ని బట్టి అది నిషేధార్హమా కాదా అని తేల్చాలి కానీ ముద్రణలో ఉండాగానే పోలీసులు ఎలా నిర్థారిస్తారు?
తెలంగాణా పోలీసుల విచిత్ర ప్రవర్తనకు, చట్ట విరుద్ధ చర్యలకు నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై నిన్న అనగా 12.11.2021 నాడు చేసిన దాడి తాజా చేర్పు. రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించే ఇలాంటి చర్యలను తెలంగాణా పోలీసులు ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది.
పోలీసుల చర్య భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడి గా మా సంస్థ భావిస్తుంది. ప్రజలకు గల సమాచార హక్కుపై దాడి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్య. పోలీసులు నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై చేసిన దాడిని మానవ హక్కుల వేదిక ఖండిస్తోంది.
13 నవంబర్ 2021
హైదరాబాద్
ఎస్. జీవన్ కుమార్,
సభ్యులు,
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయ కమిటీ,
మానవ హక్కుల వేదిక
గొర్రెపాటి మాధవరావు,
అధ్యక్షులు,
మానవ హక్కుల వేదిక
తెలంగాణ రాష్ట్ర కమిటీ
డాక్టర్ ఎస్. డాక్టర్. తిరుపతయ్య,
ప్రధాన కార్యదర్శి,
మానవ హక్కుల వేదిక
తెలంగాణ రాష్ట్ర కమిటీ
CPI(M.L) న్యూ డెమాక్రసీ ప్రకటన:
నవ్య ప్రింటింగ్ ప్రేస్ పై అక్రమ దాడికి,RKR ను అరెస్టు చేయడాన్ని ఖండించoడి..... సాధినేని.
ఈ రోజున మద్యాహ్నం హైదరాబాదులోని నవ్య ప్రింటర్స్ పై పోలీసులు సుమారు 100 మంది అక్రమంగా చొరబడి ప్రెస్ లో ఉన్న వర్కర్ల ఫోన్ లన్ని స్వాధీనం చేసుకుని ప్రేస్ కు సంబంధించిన కంప్యూటర్లను,డిస్కులను తీసుకెళ్లారు.ప్రింటింగ్ లో ఉన్న ఇతర సామగ్రిని తీసుకెళ్లారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ప్రెస్ పై సోదాచేయడం,యాజమాని రామకృష్ణారెడ్డిని నిర్బంధించటo అప్రజాస్వామికం.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు నాయకుడు రామకృష్ణ(R.K) పేరున RK సహచరి జ్ఞాపకాలతో కూడిన పుస్తకాన్ని అమరుల బంధుమిత్రుల సంఘం పేరుతో వేస్తున్న పుస్తకాలను ముద్రిస్తున్నారనే సాకును పోలీసులు చూపుతున్నారు.
పుస్తకాలను ప్రింట్ చేయడం నేరంకాదు. పుస్తకాలలో ఉన్న అంశాలు దినపత్రికలు,TV లలో ఇప్పటికే ప్రచురితమైనవి.ఒకవేళ పుస్తకంలో అభ్యంతరకరమైన విషయాలు ఉంటే పరిశీలించి చట్టప్రకారం వెళ్లవచ్చు. కానీ 40 ఏండ్లుగా ప్రింటింగ్ రంగంలో ఉన్న నవ్య ప్రింటింగ్ ప్రేస్ పై దాడిచేసిన పోలీసులు ప్రేస్ వర్కర్స్ అందరి సెల్ ఫోన్ లను గుంజుకొవడం,కార్మికులను భయబ్రాంతులకు గురిచేయటం ప్రింటింగ్ లో ఉన్న మెటీరియల్ ను, ఇతర పుస్తకాలను తీసుకెళ్లటం అప్రజాస్వామికమైనది.
ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. అక్రమంగా తమవెంట తీసుకోని పోవటం చట్ట వ్యతిరేకమైనదని సిపిఐ(ఎం.ఎల్ )న్యూడెమోక్రసీ భావిస్తున్నది.
అక్రమంగా నిర్బంధంలో ఉంచిన రామకృష్ణారెడ్డిని వెంటనే విడుదల చేయాలని, ప్రింటింగ్ ప్రెస్ నుండి తీసుకెళ్ళిన పుస్తకాలను, కంప్యూటర్లను వెంటనే ఇవ్వాలని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేస్తున్నది.
సాధినేని వెంకటేశ్వరరావు.
తెలంగాణ కార్యదర్శి.
CPI(M.L(న్యూడెమోక్రసి.
Keywords : ramakrishna, book, release, police, shirisha
(2025-03-15 15:44:52)
No. of visitors : 1290
Suggested Posts
| పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం చైతన్యవంతమైన కార్యకలాపాలంటే పొరపాట్లను తగ్గించుకుని ఎక్కువ విజయాలను సాధించడమనే. ఇందుకనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆధారపడి నూతన ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఇందులో ఏ మాత్రం విసుగు చెందకూడదు. |
| అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన
కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (63) అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021 ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడు. కామ్రేడ్ హరగోపాల్ కు అకస్మాతుగా కిడ్నీల సమస్య మొదలైంది. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడైనాడు. |
| చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసంఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి మౌలిక నమస్యకు పరిష్కారం చూపడంలో నక్సలైట్ల పాత్రను, 30 సంవత్సరాల పైబడిన వారి ఆచరణను వస్తుగతంగా |
| మేము ఏటికి ఎదురీదుతాం - రామకృష్ణ ఇంటర్వ్యూవిప్లవోద్యమాన్నీ విప్లవ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దుష్ష్రచార దాడి చేసేందుకు వాళ్లకు సామ్రాజ్యవాదుల నుండి ఆదేశాలు వున్నాయి. వాళ్ళకు త్యాగాలు లేకుండా చరిత్ర పురోగమనం వుండదనే విషయం అర్ధం కాదు, అర్ధం చేసుకోరు కూడా. నిజమే వాళ్ళన్నట్లు మేము కొండను ఢీకొంటాం, పర్వతాలను తవ్వుతాం, ఏటికి ఎదురీదుతాం. |
| విప్లవంలో శాంతి నిర్వచనం -పాణిరెండు రోజులుగా ఆయన కోసం సమాజం దు:ఖిస్తున్నది. ఆయన్ను తలపోసుకుంటున్నది. ఆయనలాంటి వీరోచిత విప్లవకారులెందరినో ఆయనలో పోల్చుకుంటున్నది. ఉద్విగ్న విషాదాలతో తల్లడిల్లుతున్నది. |
| ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ
అనారోగ్యంతో మరణించిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ @ RK సంస్మరణ సభ ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఆదివారంనాడు జరిగింది. |
| RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్14 అక్టోబర్,2021 సాయంత్రం నుండి తెలుగు,చత్తీస్గఢ్ మీడియాలో, మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ అనారోగ్యంతో చనిపోయినాడని ,చత్తీస్గఢ్ పోలీసులు ధ్రువీకరించారని స్పెషల్ స్టోరీస్ తో పాటు బ్రేకింగ్ న్యూస్ లతో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. |
| ʹసాయుధ శాంతి స్వప్నంʹ : హైకోర్టు తీర్పురామకృష్ణ రచనల, ఆయన మీద సంస్మరణ రచనల సంకలనాన్ని ఆవిష్కరణకు ముందే జప్తు చేసి, కేసు పెట్టిన పోలీసుల చర్యను తప్పుపడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు |