ఎన్‌కౌంటర్‌ జరిగింది మహారాష్ట్రలో కాదు...సంఘటనా స్థలం నుండి ఓ జర్నలిస్టు ప్రత్యక్ష కథనం


ఎన్‌కౌంటర్‌ జరిగింది మహారాష్ట్రలో కాదు...సంఘటనా స్థలం నుండి ఓ జర్నలిస్టు ప్రత్యక్ష కథనం

ఎన్‌కౌంటర్‌

15-11-2021

(శనివారం నాడు జరిగిన 26 మంది మావోయిస్టులు మరణించిన సంఘటన‌కు సంబంధించి, సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి, స్థానికులతో మాట్లాడి హిందీ వెబ్ సైట్ janchowk.com ప్రతినిధి తామేశ్వర్ సిన్హా రాసిన వార్తా కథనం. తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)

రెండు రోజుల క్రితం బుల్లెట్ల ధాటికి కంపించిన అడవిలో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. చెట్లపై బుల్లెట్ గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇక్కడ భారీ బుల్లెట్ల వర్షం కురిసిందని నేలపై పడ్డ చెట్ల పెచ్చులు చెబుతున్నాయి. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌ స్థలాన్ని పరిశీలించేందుకు ʹజన్‌చౌక్ʹ ప్రతినిధి తామేశ్వర్ సిన్హా ఆ అడవి ప్రాంతానికి వెళ్లారు. ఆ స్థలం స్వయంగా ఎన్‌కౌంటర్ కథను చెబుతోంది. నక్సలైట్ల రోజువారీ సామాగ్రి అడవిలో చెల్లాచెదురుగా పడి వుంది.

బండరాళ్ళను రక్షణగా తీసుకొని దాక్కున్న నక్సలైట్లకు తగిలిన బుల్లెట్ల సాక్ష్యాలు ఇప్పటికీ రక్తపు మరకల రూపంలో ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు ఎండిపోయి నల్లగా మారాయి. నక్సలైట్లు పేల్చిన దేశీయ రాకెట్ లాంచర్ల షెల్స్‌ ఎన్‌కౌంటర్‌లోని తీవ్రతని తెలియజేస్తున్నాయి. ఆ ప్రదేశం చూస్తే నక్సలైట్లు గుడిసెలు వేసుకుని వుంటున్నట్లు అనిపించింది. వాళ్ళు ఇంకా నిద్రలోంచి లేవకముందే పోలీసులు వారిపై దాడి చేసారు. గుడిసెలలో ఆహార పదార్థాలు పడి ఉన్నాయి.

హిడ్కోటోలా గ్రామం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుండి 147 కి.మీ, మొహ్లా తహసీల్ నుండి 20 కి.మీ దూరంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉంది. ఈ ఎన్‌కౌంటర్ హిడ్కోటోలా గ్రామం వెనుకవైపు 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరేవా కొండలో జరిగింది. కానీ మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు మాత్రం మహారాష్ట్రలోని ధనోరా పరిధిలోని గ్యారహ్‌పత్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోవున్న మర్దింటోలా గ్రామంలోని అడవిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని అంటున్నారు. గ్యారహ్‌పత్తి - కోట్‌గుల్‌కు మధ్య దూరం 168 కి.మీ. వుంటుంది. ఆ రహదారిలో 10 నుండి 15 కి.మీ యివతల సోన్‌పూర్-పిటేసూర్ నుంచి ఎలోండి దగ్గర నదికి ఆవల హిడ్కోటోలా గ్రామం ఉంది. గ్యారహ్‌పత్తిలో పోలీస్ స్టేషన్ వుంటుంది. గ్యారహ్‌పత్తి - కోట్‌గుల్ మధ్య మధ్య సోన్‌పుర్-పిటేసుర్ నుంచి ఎలోండి వైపు నదికి అవతల హిడ్‌కొటోలా గ్రామం వుంది. యిది ఛత్తీస్ గఢ్ సరిహద్దు గ్రామం. ఈ గ్రామానికి చెందిన పరేవా అడవిలో ఎన్‌కౌంటర్ జాడలు ఉన్నాయి. కానీ, గడ్చిరోలి పోలీసులు మాత్రం మార్డింటోల అడవిలో ఎన్ కౌంటర్ జరిగినట్టు చెబుతున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న తరువాత, నేను సమీప గ్రామాల గ్రామస్థులను కలుసుకుని సంఘటన గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాను. అయితే, హిడ్‌కోటోలా గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురై ఏమీ చెప్పలేకపోతున్నారు. కానీ ఆచూకీ తీస్తే, మహారాష్ట్రలోని మర్డింటోలా అడవుల్లో జరిగినట్లు గడ్చిరోలి పోలీసులు చెబుతున్న నక్సల్స్ ఎన్‌కౌంటర్, వాస్తవానికి ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా పరిధిలోని మోహాలా బ్లాక్ కు చెందిన హిడ్కోటోలా- పరేవా గ్రామం మధ్య ఉన్న కొండ ప్రాంతంలో జరిగింది.

అంటే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర పోలీసులు చత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించి 26 మంది మావోయిస్టులను హతమార్చడమే కాకుండా, నక్సలైట్లందరి మృతదేహాలను కూడా తమతో పాటు మహారాష్ట్రకు తీసుకెళ్లి తమ విజయాన్ని సంబరాలు చేసుకుంటున్నారు. మరో వైపు చత్తీస్ గడ్ పోలీసులు తమ కార్యక్షేత్రంలో జరిగిన ఘటనకు మూగ ప్రేక్షకులుగా వున్నారు. పరేవా-హిడ్కోటోలా గ్రామం మధ్య ఉన్న కొండ పైన వున్న గుర్తులు ఛత్తీస్‌గఢ్‌లోనే ఎన్‌కౌంటర్ జరిగిందని చెబుతున్నాయి. కాల్పుల శబ్దం విన్న, ఎన్‌కౌంటర్ సమయంలో పరిస్థితిని చూసిన మోహ్లా బ్లాక్ గ్రామస్థులు కూడా, ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లోని హిడ్కోటోలా- పరేవా మధ్య కొండలోలో జరిగిందని, మహారాష్ట్రలోని మర్డింటోలా అడవిలో కాదని చెప్పారు. .

అంతే కాదు, మోహ్లా బ్లాక్‌లోని హిడ్కోటోలా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత రక్తం గుర్తులు, పోలీసులు వదిలిన ఇతర సామాగ్రి కూడా ఈ సంఘటన మొహ్లా ప్రాంతంలోనే జరిగినట్లు చెబుతున్నాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

తెల్లవారుజామున నక్సలైట్లు నిద్రిస్తున్నారని, సైనికులు అకస్మాత్తుగా తమ మాటు నుంచి బయటకు వచ్చి వారిపై దాడి చేశారని ఘటనా స్థలం స్పష్టంగా చెబుతోంది. ఉదయం 6 గంటలకు ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని గడ్చిరోలి పోలీసుల పత్రికా ప్రకటన కూడా తెలిపింది. ఎన్‌కౌంటర్ జాడలు ఉన్న ప్రాంతం చాలా దట్టంగానూ, అన్ని వైపులా కొండలతోనూ ఉంటుంది. నీటి కోసం చిన్న కాలువ ఉంది. నక్సలైట్ల వసతి కోసం ఇది చాలా సముచితమైన స్థలమని చెప్పాలి.

గడ్చిరోలి పోలీసుల వివరణ

నవంబర్ 13న, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఉన్న సి 60 కమాండో యూనిట్ ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో 26 మంది నక్సలైట్లను హతమార్చడంలో విజయం సాధించింది. జవాన్లు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన స్థలానికి క్షేత్ర స్థాయి నివేదిక కోసం జన్‌చౌక్ ప్రతినిధి వెళ్లారు. మహారాష్ట్రలోని ధనోరా పరిధిలోని గ్యారహ్‌పత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్డింటోలా గ్రామంలోని అటవీప్రాంతంలో గడ్చిరోలి పోలీసు సి 60 యూనిట్, పోలీసు సూపరింటెండెంట్ సౌమ్య ముండే నేతృత్వంలోని ప్రత్యేక బృందం సిబ్బంది నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు పేర్కొన్నారు. నవంబర్ 13న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు 90 నుంచి 100 మంది మావోయిస్టులు పోలీసు పార్టీని చూసి దాడి చేశారు. ప్రతీకార దాడిలో 26 మంది నక్సలైట్లు మరణించారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారు, 26 మంది నక్సలైట్లు మరణించారు, ఇందులో 6 గురు మహిళలు, 20 మంది పురుషులు ఉన్నారు. నక్సలైట్ల నుంచి 29 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో AK-47, INSAS రైఫిల్ మరియు SLR మొదలైనవి ఉన్నాయి.

(janchowk.com సౌజన్యంతో....)
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : encounter, maharashtra, chattisgarh, maoists, 26 deaths
(2022-01-20 19:42:58)



No. of visitors : 5706

Suggested Posts


దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ తాలుకా నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణి అనే అగ్రకులానికి చెందిన యువతి దళితుడైన మంగేష్ ప్రేమించుకొని ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు.

గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్

అవి కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్లని 44 మందితో కూడిన నిజనిర్థారణ కమిటీ తేల్చి చెప్పింది. మూడు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాలు చేసిన నిజనిర్దారణలో ఈ విషయం తేలినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.

ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..

తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు తమ చేతనైన రీతిలో ముంబై నగరం నడుం బిగించింది..

NO ENCOUNTER HAPPENED IN GADCHIROLI ON APRIL 22ND 2018

The killings of at least 37 Maoists by the combined force of the CRPF and the C-60, the elite unit of the Gadchiroli Police, on 22nd and 23rd April 2018 raises some very disturbing questions

Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai

Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ...

ఇంద్రావతిలో విషాద ఘోష - పాణి

నదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్‌ విషాదం.

Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report

ʹThe C-60 police and CRPF surrounded the Maoists on all sides and opened fire indiscriminately by using sophisticated weapons like Under Barrel Grenade Launchers (UBGL) with an intention to kill them. As such it is a cold-blooded mass murder,ʹ says the report.

మహారాష్ట్రలో ʹఎన్ కౌంటర్ʹ - 13 మంది మావోయిస్టులు మృతి !

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కోట్మి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించారు.

మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే

నాతో పాటు నిందితులైన మరో తొమ్మిదిమంది ఇప్పటికీ జైలులో ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియల వేధింపులకు గురవుతున్నారు. మీ అందరి సహకారమూ మద్దతూ కోరే అవకాశం నాకు వచ్చిన విధంగా వారికి రాలేదు. మీరు ఇప్పుడు నాకు అండగా నిలిస్తే

రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !

ఎర్రటి ఎండలో విరామమెరుగక నడుస్తూ ఎముకలు కొరికే చలిలో రొడ్డు పక్కనే సగం నిద్ర పోయి. జనం పెట్టింది తింటూ అర్దాకలితో... పాదాలు బొబ్బలెక్కి, చర్మాలు ఊడిపోయి నెత్తురోడే కాళ్ళతో, మహిళలు, వృద్దులు చేసిన పోరు యాత్రకు మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్ దిగిరాక తప్పలేదు....

Search Engine

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం
విప్లవ సాంస్కృతికోద్యమ నాయకులు రాజ్ కిశోర్ కు అరుణాంజలి -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా
జిందాల్ గో బ్యాక్.... ధింకియా రైతుల‌పై పోలీసుల క్రూరమైన దాడిని ఖండించండి !
ఇది మ‌న పోరాటం ఎందుకు కాలేదు? -పాణి
ఇది మరో జైభీం మూవీ...దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళితుడిని కొట్టి చంపిన పోలీసులు
రోహిత్‌ వాళ్లమ్మ....మనకు ఆమె కళ్లలోకి చూసే ధైర్యం ఉందా ? -ఎస్.ఏ.డేవిడ్
పుస్తకాలు భద్రతకు ముప్పుట - కేరళ జైలు ఉత్తర్వులు
రోహిత్ వేముల రాసిన చివరి లేఖ !
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
బీజేపీకి ఓటు వేయకండి, ఈ నెల 31 న ʹద్రోహదినంʹ పాటించండి -SKM పిలుపు
ప్రొఫెసర్ సాయిబాబాకు ప్రాథమిక హక్కులను ఎందుకు తిరస్కరించారు?
chattisgarh: పోలీసు క్యాంపులు కాదు, విద్య, ఆసుపత్రి, తాగునీరుకావాలి - ఏడు జిల్లాల్లో తీవ్రమైన ఉద్యమం
నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి - నాగేశ్వరాచారి
విద్వేష ప్రసంగాల గురించి అడగ్గానే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన యూపీ మంత్రి - వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ కమిటీ పై నమ్మకం లేదన్న పంజాబ్ - విచారణ‌ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు - విచారణకు సుప్రీం కోర్టు అంగీకారం
ప్రొఫెసర్ సాయిబాబాకు మళ్ళీ కోవిడ్ - ఆస్పత్రికి తరలించాలని సహచరి డిమాండ్
నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల‌ చరిత్ర ʹసైరన్ʹ నవల
ప్రధాని గారూ... ద్వేషంతో నిండిన స్వరాలకు మీ మౌనం ధైర్యాన్నిస్తుంది
రేపు,ఎల్లుండి విరసం మహాసభలు
బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన‌ నిందితుడి అరెస్టు
మీ భజనజేయాలే... లేకుంటే జైల్లుండాలె
SKM: ప్రధాని ప్రాణాలకు ముప్పు అనేది కల్పితం,దుష్ప్రచారం - సంయుక్త కిసాన్ మోర్చా
ఉద్యోగుల విభజన: 317 జీవోను వెంటనే రద్దు చేయాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
more..


ఎన్‌కౌంటర్‌