Nagalandపౌరుల హత్య:సాక్ష్యాలను మార్చేందుకు సైన్యం ప్రయత్నాలు -వెల్లడించిన పోలీసు నివేదిక
06-12-2021
నాగాలాండ్ లో 15 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న సైన్యం తమ హత్యలను కప్పిపుచ్చుకునేందుకు, సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని నాగాలాండ్ పోలీసులు తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.
డిశంబర్ 4వ తేదీన ఓటింగ్ గ్రామంలో పనులుముగించుకొని తమ ఇళ్ళకు వాహనంలో వస్తున్న బొగ్గు గని కార్మికులపైకి కాల్పులు జరిపి హత్య చేసిన అస్సాం రైఫిల్స్ కు చెందిన జవాన్లు మృతదేహాలపై ఉన్న దుస్తులను మార్చి ఖాకీ దుస్తులు వేయడానికి ప్రయత్నించారని బిజెపి మోన్ జిల్లా అధ్యక్షుడు న్యావాంగ్ కొన్యాక్ పత్రికలకు చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ పోలీసు నివేదికను ʹది వైర్ʹ సంపాదించింది.
డిసెంబర్ 5న ప్రత్యక్ష సాక్షులు మరియు స్థానికులతో మాట్లాడిన తర్వాత నాగాలాండ్ కమీషనర్ రోవిలాటువో మోర్ , రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ T. జాన్ లాంగ్‌కుమర్ దాఖలు చేసిన ʹక్లుప్త నివేదికʹ ఇలా పేర్కొంది, ʹతుపాకీ కాల్పుల శబ్దం విన్న గ్రామస్థులు భయాందోళనలకు గురై సంఘటనా స్థలానికి పరిగెత్తుకెళ్ళారు. అక్కడికి వీళ్ళు వెళ్ళే సరికి స్పెషల్ ఫోర్స్ సిబ్బంది ఆరుగురు గ్రామస్తుల మృతదేహాలను పాల్తీన్లలో చుట్టి వారి వాహనం నుండి మరొక పికప్ ట్రక్కులో (టాటా మొబైల్) లోడ్ చేసి, మృతదేహాలను వారి బేస్ క్యాంప్ కు ఎత్తుకెళ్ళాలనే ఉద్దేశ్యంతో టార్పాలిన్ కింద దాచడానికి ప్రయత్నించారు." అది చూసిన గ్రామస్తులు సైన్యంతో వాగ్వివాదానికి దిగారు అనంతరం సైన్యానికి , గ్రామస్తులకు మధ్య యుద్ద వాతావరణం నెలకొంది.
"ఫలితంగా, ఆగ్రహానికి గురైన గ్రామస్థులు స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందికి చెందిన మూడు వాహనాలను తగులబెట్టారు."
ʹ ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది మళ్లీ గ్రామస్థులపై కాల్పులు జరిపారు, ఇది మరో ఏడుగురు గ్రామస్థుల మరణానికి దారితీసింది. ప్రజలు సంఘటనా స్థలం నుండి అస్సాం వైపు పారిపోతుండగా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బంది జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, దారిలో ఉన్న బొగ్గు గని గుడిసెలలో కూడా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు ధృవీకరించారు.ʹʹ
ʹమొత్తం, ఆ రోజున 13 మంది పౌరులు మరణించారు, 14 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు, ఎనిమిది మంది పౌరులు స్వల్పంగా గాయపడ్డారు . తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరిని భద్రతా బలగాలు స్వయంగా అస్సాం వైపు తీసుకువెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక నివేదికలోని వివరాలు స్థానిక బిజెపి నాయకుడు కోన్యాక్ డిసెంబర్ 6 ఉదయం హార్న్‌బిల్ టివికి చేసిన ప్రకటనతో సరిపోలాయి. ఈ హత్యా సంఘటనపై కోన్యాక్ సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భద్రతా దళాలు అతని కారుపై కూడా కాల్పులు జరిపాయి.
ఇందులో అతనితో పాటు ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు; తరువాత, ఒక వ్యక్తి మరణించాడు
డిసెంబరు 5న, కొన్యాక్ తన వాహనంపై భద్రతా బలగాలు కాల్పులు జరపడం గురించి Scroll.inతో మాట్లాడాడు.
రాష్ట్ర పోలీసులు డిసెంబరు 6న ఈ హత్యలపై సుమోటోగా కేసు నమోదు చేశారు. 21 పారా స్పెషల్ ఫోర్స్‌పై టిజిట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. భద్రతా దళాలు గ్రౌండ్ రూల్స్‌ను ఉల్లంఘించాయని ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. మిలిటెంట్ ల పై సైన్యం ఆపరేషన్ సందర్భాల్లో స్థానిక పోలీసులకు తెలపకపోవడం, స్థానిక పోలీసులను గైడ్ లగా ఉంచుకోకపోవడం తదితర కారణాలు ఈ ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు పోలీసులు.
ది వైర్ కు అందిన ఎఫ్‌ఐఆర్ ఇలా పేర్కొంది, ʹసంఘటన సమయంలో పోలీసు గైడ్ లేడని గమనించాలి. తమ ఆపరేషన్ కోసం పోలీసు గైడ్‌ను అందించమని పోలీసు స్టేషన్‌కు భద్రతా బలగాలు అభ్యర్థించలేదు. అందువల్ల భద్రతా బలగాల ఉద్దేశం పౌరులను హత్య చేయడం మరియు గాయపరచడం అని స్పష్టంగా తెలుస్తుంది. ʹ అని పోలీసులు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు.
(thewire.in సౌజన్యంతో)
Keywords : Nagaland, army, Civilian Killings, Police Report
(2025-01-16 11:58:05)
No. of visitors : 826
Suggested Posts
| Touching letter by Naga girl to boyfriend before suicide. She was raped by Army personnelIn a world seeded with envy, our love shall never bloom together like those lovely flowers in the same stalk but we will bloom radiantly in that pure everlasting place of our true love. That I am leaving this world should not bereaved you to utter melancholy..... |
| నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం
నాగాలాండ్ లో సైన్యం 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపింది. అనంతరం ప్రజలు తిరగబడటంతో ఓ జవాను మరణించాడు. నాగాలాండ్ మోన్ జిల్లాలో ఓటింగ్, తిరు గ్రామాల మధ్య ఈ సంఘటన జరిగింది. ఓటింగ్ గ్రామంలోని మైనింగ్ కేంద్రంలో పని ముగించుకొని శనివారం రాత్రి |
| Nagaland: అమాయక గ్రామస్థులపై సైన్యం కాల్పులకు వ్యతిరేకంగా గళం విప్పండిఈ మధ్య కాలంలో ఒకదాని తర్వాత మరొకటి జరిగిన సంఘటనలు, భారత రాజ్యం మెల్లమెల్లగా పోలీసు-మిలటరీ రాజ్యం వైపు ఎలా వెళుతుందో మనం చూడవచ్చు. ఇటీవలి ముఖాముఖి ఎన్‌కౌంటర్లు దీనికి మరొక ఉదాహరణ. |