Nagaland: అమాయక గ్రామస్థులపై సైన్యం కాల్పులకు వ్యతిరేకంగా గళం విప్పండి

Nagaland:

07-12-2021

(నాగాలాండ్ లో అమాయక గ్రామస్తులపై కాల్పులు జరిపి హత్య చేసిన సైన్యం దుశ్చర్యలను ఖండిస్తూ రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, పశ్చిమ బెంగాల్ యూనిట్ ఇచ్చిన ప్రకటన. తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)

ఈ మధ్య కాలంలో ఒకదాని తర్వాత మరొకటి జరిగిన సంఘటనలు, భారత రాజ్యం మెల్లమెల్లగా పోలీసు-మిలటరీ రాజ్యం వైపు ఎలా వెళుతుందో మనం చూడవచ్చు. ఇటీవలి ముఖాముఖి ఎన్‌కౌంటర్లు దీనికి మరొక ఉదాహరణ. ఇటీవల, ఉగ్రవాదాన్ని అణిచివేస్తామనే సాకుతో కాశ్మీర్, గడ్చిరోలీలలో జరిగిన ఎన్‌కౌంటర్లలో నలుగురు, 16 మంది మరణించడం మనం చూశాము. నాగాలాండ్‌లో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

మీడియా నివేదికల ప్రకారం, డిసెంబర్ 4, శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో, ఆర్మీ ప్రత్యేక విభాగం తిరు ప్రాంతం నుండి 15 కిలోమీటర్ల దూరంలోని ఓటింగ్‌ గ్రామం దగ్గర నిఘా వర్గాలు యిచ్చిన సమాచారం ప్రకారం సాయుధులైన వ్యక్తులు ప్రయాణం చేస్తున్నట్లుగా అనుమానించి, బొగ్గు గని కార్మికులను తీసుకువెళ్ళే వ్యాన్‌ లో ఉన్న వారిపై కాల్పులు జరిపారు. ఆ వ్యాన్‌లో వున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన జరిగిన ఒక గంట తర్వాత, ఈ సంఘటనలో తమ బంధువులను కోల్పోయిన కోపంతో ఉన్న గ్రామస్థులు నిరసన ప్రారంభించారు. వారిపై సైన్యం జరిపిన కాల్పుల్లో మరో ఎనిమిది మంది గ్రామస్థులు మరణించారు.

ఈ ఘటనలో ఓ సైనికుడు కూడా మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత చాలా మంది గ్రామస్తులు కూడా గాయపడ్డారు, ఇద్దరు గ్రామస్థులు కనిపించడం లేదు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా ఆదివారంనాడు నాగాలాండ్ అంతటా నిరసనలు జరిగాయి. ఆందోళన చెందిన 500 మందికి పైగావున్న జన సమూహం మాన్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసినప్పుడు, సైన్యం కాల్పుల్లో మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

వివిధ జాతుల స్వయం నిర్ణయాధికారం డిమాండ్లను రాజకీయ డిమాండ్లుగా గుర్తించడం ద్వారా భారత రాజ్యం ఎన్నడూ రాజకీయ పరిష్కారాన్ని కోరలేదు. నిజానికి కాశ్మీర్, ఈశాన్య భారతదేశంలోని ఏడుగురు అక్కచెల్లెళ్ల రాజ్యాలలో, జాతీయవాద ఉద్యమానికి సంబంధించిన సుదీర్ఘమైన, సంక్లిష్టమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ రాష్ట్రాలను భారత భూభాగంలో చేర్చలేదు. కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదం, 1947 తర్వాత భారత రాజ్యపు దూకుడు వైఖరి కారణంగా, అవి భారత భూభాగంలో చేర్చబడ్డాయి. పర్యవసానంగా, ఈ అన్ని రాష్ట్రాల జాతీయుల స్వయం నిర్ణయాధికారం కోసం ఉద్యమం ప్రస్తుత భారతదేశం పుట్టుకకు ముందే కొన్ని సందర్భాల్లో ప్రారంభమైంది. అయితే ఈ ఉద్యమాలను భారత ప్రభుత్వం తుపాకీతో అణచివేయాలని మొదటి నుంచీ ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం.

తీవ్రవాదం, రాష్ట్ర భద్రత పేరుతో కాశ్మీర్, ఈశాన్య భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో సైన్యానికి AFSPA బాధ్యతారహితమైన, ఏకపక్ష అధికారాలను ఇచ్చింది. AFSPA ద్వారా, భారత ప్రభుత్వం సైన్యానికి అనుమానం ఆధారంగా మాత్రమే కాల్పులు జరిపే హక్కును ఇచ్చింది. అమాయక పౌరులను ఆయుధాలతో చంపినట్లే, మహిళలను సైన్యం చట్టవిరుద్ధ హత్యలకు గురిచేస్తోంది.

ఇటీవల జరిగిన ఘటనలో, మిలిటెంట్‌లతో వెళ్తున్నట్లు భావించి ప్రమాదవశాత్తూ కార్మికుల పికప్‌ వ్యాన్‌పై కాల్పులు జరిపామని సైన్యాధికారులు అంటున్నారు. ఇక్కడ తలెత్తే సహజమైన ప్రశ్న ఏమిటంటే, అనుమానంతో ఎవరినైనా కాల్చే హక్కుతో ప్రజాస్వామ్య రాజ్యానికి చెందిన సైన్యం ఏమి చేసి ఉంటుంది? అంతేకాకుండా, ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించే ముందు వారిపై తీవ్రవాది అనే ముద్ర వేయడం వాస్తవానికి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది.

ఈ రాజ్య ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. సంఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. AFSPAతో సహా అన్ని అణచివేత చట్టాలను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే సమయంలో, ఇలాంటి ఘటనలు, ఎన్‌కౌంటర్‌లతో సహా అన్ని రకాల రాజ్య ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ గళాన్నెత్తాలని రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగానూ వున్న ప్రజాస్వామికవాదులకు, సంస్థలకు పిలుపునిస్తున్నాము.

- రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, పశ్చిమ బెంగాల్

Keywords : nagaland, army, killed, civilians, assam rifles,
(2024-04-28 02:10:43)



No. of visitors : 591

Suggested Posts


Touching letter by Naga girl to boyfriend before suicide. She was raped by Army personnel

In a world seeded with envy, our love shall never bloom together like those lovely flowers in the same stalk but we will bloom radiantly in that pure everlasting place of our true love. That I am leaving this world should not bereaved you to utter melancholy.....

Nagalandపౌరుల హత్య:సాక్ష్యాలను మార్చేందుకు సైన్యం ప్రయత్నాలు -వెల్లడించిన పోలీసు నివేదిక‌

నాగాలాండ్ లో 15 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న సైన్యం తమ హత్యలను కప్పిపుచ్చుకునేందుకు, సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని నాగాలాండ్ పోలీసులు తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.

నాగాలాండ్ లో 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సైన్యం

నాగాలాండ్ లో సైన్యం 13 మంది అమాయక పౌరులను కాల్చి చంపింది. అనంతరం ప్రజలు తిరగబడటంతో ఓ జవాను మరణించాడు. నాగాలాండ్ మోన్ జిల్లాలో ఓటింగ్, తిరు గ్రామాల మధ్య ఈ సంఘటన జరిగింది. ఓటింగ్ గ్రామంలోని మైనింగ్ కేంద్రంలో పని ముగించుకొని శనివారం రాత్రి

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


Nagaland: