SKM:తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమిస్తున్నాం - సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన
09-12-2021
ప్రజావ్యతిరేక, కార్పోరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం 15 నెలలుగా పోరాడుతున్న దేశ రైతాంగం తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, రైతుల ఇతర డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు సిద్దంగా ఉండటంతో రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా SKM ఈ నిర్ణయం తీసుకొంది.
ఈ మేరకు సంయుక్త్ కిసాన్ మోర్చా SKM విడుదల చేసిన మీడియా ప్రకటన....
378వ రోజు, 9 డిసెంబర్ 2021
నిరసన తెలుపుతున్న రైతుల అనేక డిమాండ్లను అంగీకరిస్తూ భారత ప్రభుత్వం వ్యవసాయం- రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ద్వారా సంయుక్త్ కిసాన్ మోర్చాకు అధికారిక లేఖను పంపింది. ప్రతిస్పందనగా ఢిల్లీ సరిహద్దులు, హైవేలు తదితర ప్రదేశాలలో నడుస్తున్న వివిధ మోర్చాలను తొలగిస్తున్నామని అధికారికంగా ప్రకటిస్తున్నాం - ఉద్యమం ప్రస్తుతానికి నిలిపివేయబడింది – పోరాటం గెలిచింది; చట్టపరమైన హక్కులను రక్షించుకోవడానికి, రైతుల హక్కులను బలపరచడానికి, ముఖ్యంగా రైతులందరికీ కనీస మద్దతు ధర MSP కోసం పోరాటం కొనసాగుతుంది.
పోరాటపు అద్భుతమైన, చారిత్రాత్మక విజయాన్ని లఖింపూర్ ఖేరీతో సహా సుమారు 715 మంది ఉద్యమ అమరవీరులకు అంకితం చేస్తున్నాం - అపూర్వమైన పోరాటం, ఉద్యమ అద్భుత విజయాన్ని సాధించినందుకు నిరసన తెలుపుతున్న రైతులు, పౌరులు, మద్దతుదారులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాం.
రైతాంగ ఐక్యత, శాంతి, సహనమే విజయానికి కీలకమని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అంతం చేయనివ్వబోమని రైతులు ప్రతిజ్ఞ చేస్తున్నారు
CDS బిపిన్ రావత్, అతని సహచరుల మరణానికి దేశం సంతాపం వ్యక్తం చేస్తున్నందున, రైతుల విజయానికి సంబంధించిన అన్ని వేడుకలను ఈ రోజు వాయిదా వేయాలని నిర్ణయించాం - ఇవాళ చేయాలనుకున్న వేడుకలు, విజయోత్సవ ర్యాలీలు డిసెంబర్ 11 న నిర్వహించి రైతులు తమ మోర్చా స్థలాలను వదిలివెళ్లనున్నారు.
నిరసన చేస్తున్న రైతులకు భారత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి SKM తదుపరి సమావేశం జనవరి 15న ఢిల్లీలో జరుగుతుంది.
సుదీర్ఘ ఆందోళన సమయంలో సహనాన్ని ప్రదర్శించి, మద్దతు ఇచ్చినందుకు మోర్చా స్థలాల స్థానికులకు ధన్యవాదాలు. వారికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం.
కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, ఈ ఉద్యమంలో రైతులతో కలిసి పోరాడిన యువత/విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, న్యాయ సహాయం చేసిన, ఐక్యమత్యాన్ని పెంపొందించిన న్యాయవాదులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అలుపెరగని సేవలందించిన వైద్యులు, లంగర్ ఏర్పాటు చేసి, నిరసనకారులకు, బేషరతుగా, నిరాటంకంగా ఆహారం అందించిన వివిధ ధార్మిక సంస్థలు, మానవ హక్కుల సంఘాలతోపాటు , మద్దతుగా నిలిచిన వివిధ ప్రగతిశీల సంస్థలు, నిరంతరం ఉద్యమంతో వున్న అనేక మంది కళాకారులు, SKM పిలుపుకు నిలకడగా, స్థిరంగా స్పందించిన అనేక సంస్థలు, హైవే దాబా యజమానులు, రైతుల ఉద్యమం తమ సంస్థాగత సమావేశాలను నిర్వహించడానికి స్థలం ఇచ్చిన ప్రజలు, NRIలు, అంతర్జాతీయ రైతు సంఘాలు సంఘీభావంగా వారి వారి ప్రదేశాలలో కార్యకలాపాలు చేపట్టిన వారు, స్వచ్ఛంద సేవ చేసిన వందలాది మంది, ఇతర శ్రేయోభిలాషులు అందరికీ SKM కృతజ్ఞతలు తెలియచేస్తున్నది.
ప్రకటన కర్తలు
బల్బీర్ సింగ్ రాజేవాల్,
డా. దర్శన్ పాల్,
గుర్నామ్ సింగ్ చదుని,
హన్నన్ మొల్లా,
జగ్జిత్ సింగ్ దల్లేవాల్,
జోగిందర్ సింగ్ ఉగ్రహన్,
శివకుమార్ శర్మ (కక్కా జీ),
యుధ్వీర్ సింగ్,
యోగేంద్ర యాదవ్
email: samyuktkisanmorcha@gmail.com
Keywords : farmers protest, samyukta kisan morcha, rakesh tikait, delhi, Farmers End 15-Month Protest, To Vacate Protest Sites At Delhi Border
(2025-01-17 00:07:47)
No. of visitors : 713
Suggested Posts
| అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు
- అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. |
| తీవ్రమైన రైతుల ఉద్యమం - రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చే |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని |
| దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన
ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖభారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని |