పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

పోలీసు

27-12-2021

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) మరణించినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. బీహార్ కు చెందిన చింత దాను అరెస్టు చేసిన పోలీసులు తీవ్ర చిత్రహింసలకు గురి చేశారని, పోలీసుల చిత్రహింసల కారణంగా ఆయన మూడుసారు మెంటల్ షాక్ కు గురయ్యారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జైలు నుండి విడుదల తర్వాత కూడా ఆయన తీవ్ర్ అనారోగ్యంతో కోమాలోకి వెళ్ళిపోయారని చివరకు 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారని అభయ్ తన ప్రకటనలో తెలిపారు.

అభయ్ ప్రకటన పూర్తి పాఠం...

కేంద్ర కమిటీ సభ్యులు అమరులు కామ్రేడ్ చింతన్ దాకు రెడ్ సెల్యూట్స్!

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయన బీహార్ రాష్ట్రంలో తూర్పు చంపారన్ జిల్లా, కేసరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఆయనకు ఒక సోదరి ఉన్నారు. ఆయన అవివాహితులు.

పోలీసుల తీవ్రమైన చిత్రహింసలతో సుదీర్ఘకాలం అనారోగ్యంగా ఉంటూ, కోమాలోకి వెళ్లి తుదకు 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచిన కామ్రేడ్ చింత దాకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ వినమ్రంగా విప్లవ జోహార్లర్పిస్తున్నది. అయన ఆశయాలను పరిపూర్తి చేస్తుందని శపథం చేస్తోంది.

స్వగ్రామంలోనే ఆయన ప్రాథమిక విద్య పూర్తి చేసారు. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు . హిమాలయ ప్రాంతంలో బిహార్-నేపాల్ సరిహద్దున తెరాయి ప్రాంతంలో నివసించే థారూ అదివాసీ ప్రజలపై అయన పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. పీహెచ్ డీ చేసిన తర్వాత ఆయన ఉద్యోగం చేయాలని భావించలేదు. దోపిడీకి తావులేని సమాజ స్థాపనకై పీడిత ప్రజలలో కృషి చేయనారంభించారు. చదువుకునేటప్పుడే అయన మార్క్సిజం-లెనినిజం-మావోయిజం వైపు ఆకర్షితులయ్యారు. దానిని విస్తారంగా అధ్యయనం చేసారు. విద్య పూర్తి చేసుకున్న తర్వాత దిల్లీలో కార్మికుల మధ్య పని ఆరంభించారు. దిల్లీలో జనరల్ వర్కర్స్ యూనియన్ స్థాపకులలో అయన ఒకరు. ఈ యూనియన్లో కార్మికులను సంఘటితం చేసారు.

ఈ కాలంలో, 1998-99 మధ్య అయన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) సభ్యులకు పరిచయం అయ్యారు. 2001లో అయన బిహార్ పార్టీలో భాగమయ్యారు. ఎంసీసీ కార్యకర్తగా అయన గ్రామాలలో రైతాంగాన్ని సంఘటితం చేయసాగారు.

ఆయన పరిశోధన చేసే కాలంలో పశ్చిమ చంపారన్ జిల్లాలో థారూ, ఒరాన్ అదివాసుల, దళితుల, భూమిలేని రైతుల దుర్భర పరిస్థితులను చూసి కదిలిపోయారు. అక్కడి రైతాంగం భూస్వామ్యం నుంచే కాకుండా బందిపోటు దొంగల నుంచి కూడా పీడనను ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకున్నారు. దాంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో ఉండేవారు.

ఆ ప్రాంతానికి అయన వెళ్లగానే ʹజన్ శిక్షా కేంద్ʹ (ప్రజా విద్యా కేంద్రం) పేరుతో నాలుగు స్కూళ్లను ప్రారంభించారు. అందులో దళిత, ఆదివాసీ పిల్లలకు విద్యను అందించనారంభించారు. ఆ స్కూళ్లలో స్కూల్ విద్యతో పాటు సామాజిక మార్పు గురించిన విద్యను కూడా అందించారు. ఆ స్కూళ్లలో చదివిన కొంతమంది విద్యార్థులు తర్వాతి కాలంలో వర్గ పోరాటంలో సైతం భాగమయ్యారు.

ఆ కాలంలో బిహార్‌లో విముక్తి ప్రాంతాల పర్ స్పెక్టివ్ తో విప్లవోద్యమ కృషి కొనసాగుతున్నది. ఆయన ఆ ప్రాంత ప్రజల మధ్య విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేశారు. ప్రజాపునాదిని అభివృద్ధి చేసారు. క్రాంతికారీ కిసాన్ కమిటీలను, గెరిల్లా దళాలను ఏర్పరచారు. ఆయన విప్లవ కృషి ప్రారంభించిన తొలిరోజుల్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. బందిపోటు దొంగలు సుందర్పుర్ స్కూల్ కు పక్కనున్న ఒక మైనారిటీకి చెందిన కుటుంబంపై దాడి చేసారు. ఆ ఇంటి పురుషులు ఆ సమయంలో పనికి వెళ్లారు. ఇద్దరు ఆడపిల్లలు, తల్లి మాత్రమే ఉన్నారు. బందిపోట్లు వారిపై లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆ మహిళలు కేకలు పెట్టారు. ఆ కేకలు విని కామ్రేడ్ అశోదా ఒక కర్ర పట్టుకుని తన తోటి విద్యార్థులు, ఆ పరిసరాల్లోని ప్రజలతో కలిసి ఆ ఇంటి వైపుగా వెళ్లారు. దౌర్జన్యాన్ని ఆపమని బందిపోట్లను హెచ్చరించారు. దానితో అక్కడ నెలకొన్న వాతావారణంలో ఒక ఎర్ర సైనికుని శక్తివంతమైన గర్జనతో, గ్రామ ప్రజల ప్రతిఘటనతో బందిపోట్లు కలవరపడి పరుగు లంకించుకున్నారు. ఆయన ఆ కుటుంబాన్ని అదే రోజు రాత్రి స్కూల్‌కు తీసుకొచ్చి చాలా రోజుల పాటు అక్కడ ఆశ్రయం కల్పించారు.

ఈ సంఘటన అక్కడి ప్రజలను సంఘటితం చేయడానికి, వారిని పోరాటాలలో కదిలించడానికి తోడ్పడింది. పశ్చిమ చంపారన్లోని ఈ అటవీ ప్రాంతం గెరిల్లాజోన్ గా అభివృద్ది చెందింది. అక్కడ పెంపొందిన విప్లవోద్యమంతో దోపిడీ భూస్వాముల వద్ద గల అక్రమ భూములు, ఆయుధాలు ప్రజల స్వాధీనమయ్యాయి. విచక్షణా రహితంగా భూస్వాములు,ప్రభుత్వాలు కొనసాగించే అడవుల నిర్మూలనను ప్రజలు అడ్డుకొని వాటిని సంరక్షించారు. ప్రజలకు బెడదగా మారిన బందిపోట్లను తరిమికొట్టారు. ప్రజలపై తరచుగా దాడులకు దిగుతున్న పోలీసులపై, పోలీసు క్యాంపులపై గెరిల్లా దాడులు చేసారు. వారి నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎంసీసీ ఉత్తర బిహార్ కమిటీ ఏర్పడిన వెంటనే, కామ్రేడ్ చింతన్ దా అందులో సభ్యుడయ్యారు.

ఆ తరువాత జరిగిన ఉద్యమ విస్తరణలో భాగంగా ఏర్పడిన 3యు (ఉత్తర బిహార్-ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్) స్పెషల్ ఏరియా కమిటీ లో సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో ఎంసీసీఐ, సీపీఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) విలీనమైనప్పుడు ఐక్యపార్టీ కేంద్రకమిటీ సభ్యుడయ్యారు. ఆ క్రమంలోనే కేంద్ర కమిటీ ఏర్పరచిన ఉత్తర రీజినల్ బ్యూరో (ఎస్ఆర్)లో భాగమయ్యారు. కానీ, 2011 తరువాత ఉత్తర్ రీజియన్‌లో పార్టీకి ఎదురైన నష్టాలతో అ బ్యూరో రద్దవడంతో అంతిమ శ్వాస వదిలే వరకు చింతన్ దా సీసీఎంగా కొనసాగారు.

కామ్రేడ్ చింతన్ దా స్కూల్ విద్యను మాత్రమే కాకుండా, మార్క్సిజాన్ని కూడా బోధించే ఒక మంచి టీచర్. ఆయన పార్టీ కేడర్లకు విద్య గరిపే బాధ్యతలు తీసుకున్నారు. ఉద్యమ ప్రాంతాలలో కేడర్లకు మార్పిస్టు తత్వశాస్త్రం, మార్పిస్టు అర్థశాస్త్రం, విప్లవ రాజకీయాలు బోధించారు. ఆయన బోధనా పద్ధతి సరళంగా, సహజంగా ఉండేది. జటిల విషయాలను సరళంగా వివరించేవారు. ఆయన మార్ఫిజాన్ని ఆచరణకు అన్వయిస్తూ వర్తమాన ఉదాహరణల ద్వారా వివరించేవారు. ఆయనకు ఇంగ్లీషు, హిందీ భాషలలో మంచి పట్టు ఉండేది. ఆ రెండు భాషల్లో వ్యాకరణం బోధించేవారు. .

కామ్రేడ్ చింతన్ దా ఉత్తర బిహార్‌లో మూడు సార్లు అరెస్టయ్యా రు. మొదట 2005లో ఉత్తర బిహార్‌లో, చివరగా 2010లో ఉ త్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలైన వెంటనే ప్రతిసారీ అయన్ని తిరిగి అరెస్టు చేసారు. కాన్పూర్‌లో ఆయన అరెస్టు మరింత భయానకమైంది. అక్కడ తీవ్రమైన చిత్రహింసలకు గురయ్యారు. ఆయనను ఆ పాశవిక చిత్రహింసలు శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేశాయి. పోలీసుల చిత్రహింసల కారణంగా ఆయన మూడుసారు మెంటల్ షాక్ కు గురయ్యారు. 2010 నాటికి ఒక చెవి వినికిడి శక్తి కోల్పోయారు. జైలులో ఉన్నప్పుడు బోన్ (ఎముకలు) టీబీ వచ్చింది. అంతేకాకుండా అయనకు బీపీ, హెర్నియా, పైల్స్ జబ్బులు కూడా ఉండేవి. 2014లో విడుదల అయిన తరువాత ఇక గురుతరమైన బాధ్యతలేవీ చేపట్టలేకపోయారు. క్రమంగా తన శరీరంపైనా, మెదడుపైనా అదుపు కోల్పోయారు. పోలీసులు, జైలు అధికారుల పీడన అయన శరీరాన్ని మరింతగా క్షీణింపజేసింది. మానసిక సంతులనం కోల్పోయారు. చికిత్స జరిగినప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోయారు. తుదకు కామ్రేడ్ చింతన్ దా అనారోగ్యం నుండి బయటపడలేకపోయి 2020 జనవరి 6వ తేదీన ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. భౌతికంగా ఇక ఆయన మనకు లేరు.

ఇవాళ కామ్రేడ్ చింతన్ దా మన మధ్య లేరు. కానీ అయన జ్ఞాపకాలు, ఆదర్శాలు, ఆశయాలు మనకు ఉన్నాయి. ఆయన రాజకీయ కృషి, త్యాగం, అంకితత్వం, సాహసం మనకు ఎల్లప్పుడూ ప్రేరణను, మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ఉంటాయి. అయన స్మృతులు మనకు బలాన్నిస్తాయి. అయన అద్భుతమైన, అవిస్మరణీయమైన అనుభవాన్ని స్మరించుకుందాం.

కాన్పూర్ జైలు నుంచి విడుదల అయిన తరువాత కామ్రేడ్ చింతన్ దా బిహార్-ఝార్ఖండ్ సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అర్థసైనిక బలగాలతో ఎదురుకాల్పులు జరిగాయి. ఫైరింగు, షెల్లింగు జరిగాయి. కానీ అయన భయపడలేదు, నిరాశపడలేదు. శారీరకంగా బలహీనంగా ఉన్నారే కానీ అయన గొంతు మహా శక్తిమంతంగా ఉన్నది. నిబ్బరంగా, వీరోచితంగా సమరంలో పురోగమించారు. పీఎల్ ఏ యోధులను ఉత్సాహపరుస్తూ శత్రువుపై దాడిలో పాల్గొన్నారు. ʹ

కామ్రేడ్స్! అర్థసైనిక బలగాలు సింహాలు కాదు. పీఎల్‌జీఏ యోధులు బతికి ఉన్న పులులు. చిరకాలం వర్ధిల్లుతారు. స్నేహితులారా, ముందుకు ఉరకండి, వారిని తుడిచిపెట్టివేయండిʹ. ఈ ప్రేరణను అందుకున్న పీఎల్ఏ యువ యోధులు శత్రువుపై దునుమాడారు. అర్థసైనిక బలగాలు వెనకడుగు వేయక తప్పలేదు.

కామ్రేడ్ చింతన్ దా సరైన పద్ధతిలో స్వయం విమర్శ చేసుకునేవారు. తన వైపు నుంచి తప్పు జరిగిందని అర్థమయిన తరువాత దాన్ని అంగీకరించడానికి, సరిదిద్దుకోవడానికి ఏ మాత్రం వెనుకాడేవారు కాదు. రోజువారీ జీవితంలో కచ్చితమైన క్రమశిక్షణ పాటించేవారు. తన తోటి కామ్రేడ్స్ తో మంచిగా వ్యవహరించేవారు. జైలులోనూ, చివరికి స్పృహ లేని పరిస్థితి ఏర్పడే వరకు కూడా ఎంతో క్రమశిక్షణాయుతంగా ఉన్నారు. అవిశ్రాంతంగా చదివే,రాసే, మాట్లాడే శక్తిని మానసిక షాక్ వల్ల కోల్పోయారు. ఆయన జీవితం నుంచి కొన్ని ఉల్లేఖనలు, గుణపాఠాలు

1. కామ్రేడ్ చింతన్ దోపిడీ కులంలో పుట్టి పెరిగి పీడిత ఆదివాసీ, దళిత, వెనుకబడిన శ్రామిక కులాల పక్షాన నిలబడ్డారు. విప్లవం కోసం తన యావత్ జీవితాన్ని అర్పించారు. దోపిడీ కుల అహంకారాన్ని ఈషణ్మాత్రం కూడా ప్రదర్శించేవారు కాదు. ఉత్తమ లక్షణాలు ఉ న్న మంచి కమ్యూనిస్టు.

2. దేశంలో ప్రతిష్టాకరమైన విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఏ విశ్వవిద్యాలయం లోనైనా ఆచార్యులు కాగలిగేవారు. కానీ సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి విప్లవ కమ్యూనిస్టుగా మారారు. కార్మికునిగా కార్మికవర్గానికి సేవ చేసారు. ఆయన త్యాగం, అంకితభావం అదర్శవంతమైనవి, అభినందనీయమైనవి.

3. భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేయడానికి ఏదీ అడ్డం రాకూడదని ఆయన భావించాడు. చివరి నిముషం వరకు సాయుధ పోరాట మైదానంలో దృఢంగా నిలబడ్డారు.

4. పదవి, డబ్బు ఆశ విప్లవానికి శత్రువులు. వీటి పట్ల ఆయన జాగరూకత కలిగి ఉండేవారు. తన వారసత్వ ఆస్తిని వదిలివేసి పార్టీలో, ప్రజలలో కార్మికునిగా జీవించారు. తన ఇంటిని, కుటుంబాన్ని త్యాగం చేసి సహచర కామ్రేడ్స్ నే తన కుటుంబంగా భావించారు. వారి మధ్యనే ప్రాణాలు వదిలారు. కష్టకాలంలో తన కామ్రేడ్స్ వద్దకు వెళ్లారే తప్ప కుటుంబం వద్దకు వెళ్లలేదు. తన పరిస్థితులు, లక్ష్యాలకు అనుగుణంగా జీవించారు. పార్టీ బయట ఎవ్వరితో రాజీ పడలేదు.

5. మనం జీవించి ఉండకపోయినా ఈ ప్రపంచం మారుతుంది. మన జీవిత కాలంలోనే విప్లవం పరిపూర్తి కావాలని లేదు. అయితే దాన్ని పరిపూర్తి చేయవలసిన బాధ్యత మనకు ఉన్నది. మిగిలిన పనిని భవిష్యత్తు తరం నెరవేరుస్తుంది. ఆయన ఈ విషయాన్ని ఆకళింపు చేసుకుని తన యావత్తు జీవితం అమలు చేసారు.

6. నైజీరియా కవి, నాటక రంగ ప్రముఖుడు బోల్ షోయెంకా చెప్పిన మాటను అయన నిజం చేసారు. రెండు సంవత్సరాలకు జైలు నుంచి విడుదల అయిన తరువాత షోయెంకా తన జైలు జీవితం గురించి ఇలా అన్నారు - ʹజైలుకు వెళ్లే ముందు దేన్నైతే నమ్ముతామో విడుదల అయిన తరువాత కూడా అదే నమ్ముతాం. అయితే ఈ నమ్మకం ఇంకా బలపడుతుందిʹ. మూడు సార్లు అరెస్టై, చిత్రహింసలకు గురి అయ్యి కూడా కామ్రేడ్ చింతన్ దా నిరాశపడిపోలేదు, లొంగిపోలేదు, భయపడలేదు. ప్రాణం కన్న మిన్నగా పార్టీ రహస్యాన్ని కచ్చితంగా కాపాడారు. అయన వల్ల పార్టీకి ఏ రకమైన నష్టం కానీ జరిగినట్టుగా ఏ రాష్ట్రం నుంచి కూడా రిపోర్లు లేవు. విడుదల అయిన ప్రతిసారీ అయన మరింత రాటుదేలి నిశ్చయంగా వర్గ పోరాటంలో, ప్రజా యుద్ధంలో భాగం అవుతూ వచ్చారు.

7. ఆయన జీవితంలో ఒక ప్రత్యేక లక్షణం ఉన్నది. అత్యంత కష్టతరమైన పరిస్థితులలో విప్లవంలో, ప్రజలలో నమ్మకం నిలబెట్టుకున్నారు. పార్టీ అధికారిక పంథాను అంటిపెట్టుకుని ఉన్నారు. వర్గ పంథా-ప్రజా పంథాపై, మార్క్సిజం-లెనినిజం-మావోయిజంపై బలంగా నిలబడ్డారు.

కామ్రేడ్ చింతన్ దా గొప్ప ఉపాధ్యాయుడు, జనరంజకమైన ఉపన్యాసకుడు, ఉన్నత విద్యావంతుడు, అలుపెరుగని కార్యకర్త. ఆయనలో ఉన్న కార్మికవర్గ లక్షణాలు అయనను బలమైన కమ్యూనిస్టుగా, నిశ్చయమైన మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టుగా నిలబెట్టాయి. మన ప్రియతమ కామ్రేడ్, సహచర యోధుడు, ఉపాధ్యాయునికి కేంద్రకమిటీ కన్నీటి నివాళి అర్పిస్తున్నాది. ఆయన ఆశయాన్ని పరిపూర్తి చేస్తామని శపథం చేస్తున్నది. కామ్రేడ్ చింతన్ దా జీవితం నుంచి అవిరామ విప్లవ కృషిని, చొరవను, పట్టుదలను, నిబద్ధతను విప్లవశ్రేణులన్నీ నేర్చుకోవాలి. ఆయన అమరత్వం కలిగించిన ఆవేదనను శక్తిగాను, కన్నీటిని దోపిడీ రాజ్యంపై క్రోధంగాను మార్చుకోవాలి. అమరవీరుల ఆశయాలను పరిపూర్తి చేస్తామని మళ్లీ మళ్లీ శపథం చేద్దాం,

ʹకామ్రేడ్, చేతిలో ఎర్రజెండాతో, గుండెల్లో మీ జ్ఞాపకాలతో ముందడుగు వేస్తుంటాం
మీ అమరత్వం కలిగించిన దుఖాన్ని దిగమింగుతూ మునుముందుకీ సాగుతాంʹ.

అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : chintan daa, narendra singh, bihar, CPI Maoist, abhay
(2024-04-20 16:17:33)No. of visitors : 2601

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍

ఉత్తర తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లో వర్గపోరాట ప్రభావంతో, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల అమలుతో వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో జరిగిన మార్పులను 2008 నుండి 2012 మధ్య విస్తారంగా, లోతుగా అధ్యయనం చేసి ఆ ప్రాంత వ్యవసాయ రంగంలో వక్రీకరించిన పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు ఏర్పడ్డాయని విశ్లేషించారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పోలీసు