14 ఏళ్ళ దుర్మార్గ జైలు జీవితం... అమరుడైన‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తాపస్ దా

14

19-01-2022

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు పతిత్ పావన్ హల్ దార్ (తాపస్ దా) మరణించినట్టు ఆ పార్టీ ఆలస్యంగా ప్రకటించింది. 2019 సెప్టెబర్ 4న తాపస్ దా అమరుడైనప్పటికీ తమకు ఆ వార్త ఆలస్యంగా తెలిసిందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అభయ్ ప్రకటన పూర్తి పాఠం...

సీపీఐ (మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు, అమరుడు కామ్రేడ్ పతిత్ పావన్ హల్దార్ (తాపస్ దా)కు
వేనవేల ఎర్రవందనాలు!

ʹజీవితం మనిషికి ఎంతో ప్రియమైన అస్తి. దీనిని సంపాదించుకోగలుగుతాం. జీవితాన్ని ఉత్తమమైన లక్ష్యం కోసం, శ్రమజీవుల విముక్తి కోసం పోరాడుతూ నేను జీవించాను, శ్రమజీవుల రక్తంతో తడిసిన ఎర్రజెండాలో నా రక్తం కూడా ఒక బొట్టు ఉంది, అని మృతి చెందేనాటికి చెప్పగలిగేలా జీవించాలి.ʹ

ఈ చైతన్యంతో జీవించి 57 ఏళ్ల వయసులో మన కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ పతిత్ పావన్ హల్ దార్ (తాపస్ దా) మన మధ్య లేకుండా వెళ్లాడు. అందరికీ ప్రియమైన కామ్రేడ్ తాపస్ 2019 సెప్టెబర్ 4న చివరి శ్వాస విడిచాడు. ఈ అతి దుఖఃదాయకమైన వార్త మాకు చాలా ఆలస్యంగా తెలిసినందువల్ల, చాలా ఆలస్యంగానే అయినా ఈ ప్రకటనను విడుదల చేయాల్సి వస్తోంది. భారత విప్లవ నాయకుడు కామ్రేడ్ పతిత్ పాపన్ హల్ దార్ కు మా కేంద్రకమిటీ వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తోంది. అయన ఆశయాల పరిపూర్తి చేసేందుకు ప్రతిజ్ఞ చేస్తోంది.

కామ్రేడ్ తాపస్ దా పశ్చిమ బంగ్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లా, పీయాసాడా ప్రాంతంలోని రాంచంద్రపూర్ గ్రామంలో 1962 ఫిబ్రవరి 8న ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతను అవివాహితుడు. నక్సల్బరీ ఎర్రమంటలు పశ్చిమ బంగ్ తో సహా భారతదేశ నలుమూల్లోని విద్యార్థి, యువజనుల హృదయాల్లో జ్వలింపజేసాయి. మీరు బానిస బతుకులు బతుకుతారా లేదా సంకెళ్లను బద్దలుకొట్టి ప్రపంచాన్ని జయించేందుకు ముందుకు దూకుతారా అని నిలదీసాయి. ఇది యువ తాపస్ హృదయాన్ని జ్వలింపజేసింది. ఆయన కేవలం 18, 14 ఏళ్ల వయసులోనే బానిస సంకెళ్లను తెంచుకోవాలని కలలు గంటూ ముందడుగు వేసాడు. యుక్త వయసులోనే విద్యార్థి, యువజనులు ప్రశ్నించడం నేర్చుకోకపోతే మనకు బానిస బతుకే శరణ్యమని గుర్తుచేశాడు. అతిచిన్న వయసులోనే కామ్రేడ్ కాన్హాయ్ ఛటర్జీ సంబంధాల్లోకి వచ్చాడు. గతితార్కిక భౌతికవాదంతో పాటు మార్కిస్టు మౌలిక సిద్ధాంతాన్ని అధ్యయనం చేయనారంభించాడు. మావోయిస్టు రాజకీయాలతో మమేకమైనాడు. అ రాజకీయాల కోసం తన జీవితాన్ని అర్పించాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో ఆయనకు స్కూల్ విద్య అవసరం లేకుండా పోయింది. యుక్త వయస్సులోనే ఆయన హుగ్లీ జిల్లాలోని జనాయి, బేగంపూర్, అపూర్, బారుయీ పాడా, శిఖాలా, భీంపూర్, పెరో తదితర హుగ్లీ సుదూర ప్రాంతాల్లో వ్యవసాయ విప్లవ ప్రచార అందోళన కార్యక్రమాలను ప్రారంభించాడు. ఆ సమయంలో మునుపటి ఎమ్ సీసీ నాయకత్వంలో హుగ్లీ, హౌరా జిల్లాలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటల పని, వేతనపెంపుదల, పితృస్వామిక హింస, ఆసుపత్రుల్లో సరియైన చికిత్స, నీటిపారుదల, పంటలకు గిట్టుబాటు ధరలు, రోడ్డు మరమత్తు తదితర డిమాండ్లతో ఆందోళనలు జరిగాయి. అయన ఈ అందోళనలలో భాగమయ్యాడు.

హుగ్లీ జిల్లాలో బేగమ్ పూర్ ప్రాంతంలో చేనేత కార్మికులకు వ్యతిరేకంగా కొందరు ధనికులు ప్రారంభించిన పవర్‌లూమ్ కు వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాన్ని నిర్మించాడు. ఈ ఆందోళనల ప్రభావంతో ముందుకు వచ్చిన కొంతమంది కార్యకర్తలతో దళం ఏర్పడింది. దీంతో పాటు ఈ ప్రాంతాలంతటా ఎన్నికల బహిష్కరణ కార్యక్రమం కూడా ప్రజల్లో మంచి ప్రభావాన్ని వేసింది. ఈ కార్యక్రమాలపై ఆధారపడి హౌరా-హుగ్లీ-మేదినీపూర్ జోనల్ కమిటీ నిర్మాణమైంది. 1980-90 దశకాల్లో వ్యవసాయ విప్లవాన్ని నిర్మించడంలో కామ్రేడ్ తాపస్ పాత్ర చెప్పుకోదగినది. ఆయన అనాటి బిహార్-బెంగాల్ స్పెషల్ ఏరియా కమిటీ నాయకత్వంలో ప్రజాసైన్యం, విముక్తి ప్రాంతాల నిర్మాణం చేసే ప్రక్రియ ద్వారా సంపాదించుకున్న యావత్తు అనుభవాలను, వివిధ పోరాటాలలోని ప్రత్యేకతలను అధ్యయనం చేయడానికి తీవ్రంగా కృషి చేసాడు.

సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. 20వ శతాబ్దం చివరి దశాబ్దం చివరిలో ఎమ్ సీసీ కేంద్రకమిటీ ఒక తీవ్రమైన సంక్షోభాన్ని చవిచూసింది. పార్టీలో ఒక చిన్న అవకాశవాద ముఠా పార్టీలో రెండు పంథాల మధ్య పోరాటం పేరుతో ఎంసీసీమౌలిక పంథాకు వ్యతిరేకంగా కుట్రపూరిత కార్యక్రమాన్ని ప్రారంభించింది. పార్టీ ఈ ముఠాకు ʹబ-భʹ ముఠాగా పిలిచింది. ఈ అవకాశవాద ముఠా పశ్చిమ బెంగాల్ తో పాటు బిహార్, ఝార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాలలో కామ్రేడ్ కేసీ నాయకత్వంలో ఎంసీసీ నెలకొల్పిన మావోయిస్టు పంథాకు వ్యతిరేకంగా అవకాశవాద, వర్గసంకర పంథాను ముందుకు తీసుక వచ్చింది. ఎంసీసీ నాయకత్వం, విప్లవ ప్రజలు సమైక్యంగా విప్లవ సంకల్పంతో పోరాటాన్ని సాగించి, కొద్ది కాలంలోనే ఈ ముఠాను పక్కకు నెట్టివేసారు. పార్టీలో జరిగిన ఈ అంతర్గత పోరాటం ఫలితంగా బా-భ ముఠాలో కొందరు పోలీసు ఏజెంట్లుగా మారారు. మరికొందరు రాజకీయంగా దిగజారిపోయారు. ప్రస్తుతం వాళ్లు అప్పుడప్పుడు సీపీఐ (మావోయిస్టు) నాయకత్వంలో కొనసాగుతున్న విప్లవోద్యమాన్ని సమర్థించే పాత్రలో కనపడతుంటారు. ఎంసీసీ అంతర్గత పోరాట సమయంలో కామ్రేడ్ తాపస్ దా నిర్వహించిన పాత్ర ఎంతో సకారాత్మకమైనది, చెప్పుకోదగినది.

ఆయన పశ్చిమ బెంగాల్ లో పార్టీని పునర్నిర్మించే బాధ్యతను స్వయంగా తన భుజస్కందాలపైన వేసుకున్నాడు. అయన మహత్తర నాయకత్వంలో హౌరా-హుగ్లీ-మేదినీపూర్ జోన్ తిరిగి వ్యవసాయ విప్లవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోయే పథకాన్ని రూపొందించుకుని ముందడుగు వేసింది. కోల్‌కతా టౌన్ కమిటీ పునర్నిర్మించారు. ఉత్తర బెంగాల్ జోనల్ కమిటీ కూడా నిర్మాణమైంది. బీబీఎమ్ జోన్లో తిరిగి పోరాటాలు బద్దలయ్యాయి. సంక్షోభం, వర్గ పోరాట అభివృద్ధి క్రమంలోనే నాయకత్వం పరీక్షకు గురవుతుంది. ఈ దశంలో కామ్రేడ్ తాపస్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన నాయకత్వంలోనే హౌరా-హుగ్లీ-కోల్ కతా-ఉత్తర బెంగాల్-బీర్భూం తదితర పోరాట ప్రాంతాల్లో పునర్నిర్మాణం జరిగింది. నాయకత్వ కమిటీల సమీక్షలు, మహాసభల ద్వారా తిరిగి పోరాట పథంలో ఆ
ప్రాంతాలు పురోగమించాయి. బా-భ మురా కుట్రలను బహిర్గతం చేసాయి. దాన్ని పోరాటానికి అవరోధంగా గుర్తించాయి. ఆ సమయంలో అంటే మునుపటి ఎమ్ సీసీఐ నుండి బా-భ ముఠాను బహిష్కరించిన తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహాసభలో ఏర్పడిన రాష్ట్ర కమిటీలో ఆయనను సభ్యునిగా ఎన్నుకున్నారు.

ఆ సమయంలో కామ్రేడ్ తాపస్ నాయకత్వంలో పశ్చిమ బంగ్ రాష్ట్ర కమిటీ పోరాట కార్యక్రమాన్ని చేపట్టింది. గెరిల్లా దళాలను నిర్మించే కర్తవ్యాన్ని తీసుకుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనేక సాయుధ ప్రతిఘటనా చర్యలు నిర్వహించింది. అయన నాయకత్వంలోకి వచ్చిన నూతన కామ్రేడ్లతో కలిసిపోయేవాడు. ఎన్నడూ కోపాన్ని ప్రదర్శించేవాడు కాదు. సమస్య మూలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించేవాడు. మార్క్సిస్టు పద్దతిలో సమస్యలను పరిష్కరించడం గురించి వక్కాణించేవాడు. కామ్రేడ్ తాపస్ దా నేను నాయకున్ని అని ఏనాడు తన కింది కామ్రేడ్స్ తో ʹ అహంభావంతో వ్యవహరించేవాడు కాదు. కామ్రేడ్ తాపస్ దా ఎల్లప్పుడూ కామ్రేడ్ మావో వ్యాసమైన సరియైన భావాలు ఎక్కడి నుండి వస్తాయి? అంటే ఉత్పత్తి కోసం పోరాటం, వర్గపోరాటం, శాస్త్రీయ ప్రయోగాల నుండి వస్తాయనే బోధనను అమలు చేసేవాడు. దీని ద్వారా ఒక సమస్య ఏ దిశలో సాగుతున్నదనే విషయాన్ని చెప్పగలిగేవాడు.

ఆయన చాలా సాదా సీదా జీవనశైలిని ఆచరించేవాడు. శ్రమజీవులను ఎంతో గౌరవించేవాడు. సాధారణంగా ఆయన భూమిలేని రైతుల ఇళ్లలోనే షెల్టర్ తీసుకునేవాడు. అయన వేషభాషలు సాధారణంగా ఉండేవి, సాధారణ వాహనాలనే ఉపయోగించేవాడు.

1970వ దశకంలో సీపీఐ (ఎమ్ఎల్) వేరు వేరు గ్రూపులుగా చీలిపోయిన తర్వాత స్థితిని దృష్టిలో ఉంచుకుని, ఎంసీసీ, సీపీఐ (ఎంఎల్)లలోని ఉన్నతస్థాయి విప్లవకారులు సమైక్యమై తప్పకుండా ఐక్య కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేస్తారని కామ్రేడ్ కన్హాయ్ ఛటర్జీ అనేవారు. కామ్రేడ్ కేసీ చెప్పే ఈ విషయాన్ని కామ్రేడ్ తాపస్ దా సదా తన దృష్టిలో ఉంచుకునేవాడు, కమ్యూనిస్టు విప్లవకారుల మధ్య ఐక్యత సాధించేందుకు ప్రాముఖ్యత ఇచ్చేవాడు. 1980 దశకం నుండి వివిధ ఎమ్ఎల్ గ్రూపులతో ఐక్యతా చర్చల సమయంలో ఆ సమావేశాలు విజయవంతంగా కావడానికి ఆయన సమర్థవంతమైన పాత్రను నిర్వహించేవాడు. బా-భ ముఠాను బహిష్కరించిన తర్వాత కామ్రేడ్ తాపస్ నాయకుడిగా వివిధ విప్లవ గ్రూపులతో సమాన హోదాతో చర్చలు నిర్వహించేవాడు. కేంద్రకమిటీ నాయకత్వంలో ఐక్యతా పార్టీ స్థాపనా కృషిలో విశేషమైన పాత్ర నిర్వహించారు. ఈ విషయంలో ఆయన విశాల వైఖరితో వ్యవహరించేవాడు. ఒంటెత్తుపోకడ, అహంభావాన్ని ఎపుడూ దరిచేరనీయలేదు. అయన జీవితమంతా నిజమైన కమ్యూనిస్టు విప్లవకారుడిగా జీవించాడు.

2004 సెప్టెంబర్ 21న సీపీఐ (ఎమ్ఎల్) (పీపుల్స్ వార్), ఎమ్ సీసీఐల మధ్య చారిత్రాత్మక ఐక్యతా ప్రక్రియ ద్వారా ఒక నూతన, ఐక్య పార్టీ - సీపీఐ (మావోయిస్టు)ను ఏర్పరచినప్పుడు కూడా అయన విశేషమైన పాత్ర నిర్వహించాడు. అయనను ఆ సమయంలో నూతనంగా ఏర్పరచిన కేంద్రకమిటీ సభ్యుడుగా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో కొనసాగిన ఐక్యతా ప్రక్రియలో భాగంగా ఐక్యతా పార్టీకి చెందిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఆయన విజయవంతంగా వివిధ జోన్లను ఐక్యం చేసాడు. కార్మికవర్గ సిద్ధాంతం ఆధారంగా వివిధ జోన్లను నిర్మాణం చేసే కృషిని కొనసాగించాడు.

ఐక్య మావోయిస్టు పార్టీ ఏర్పడిన కేవలం 8 నెలలకే 2005 మే నెలలో హుగ్లీ జిల్లాలో కొన్నగర్ ప్రాంతంలో అమరుడు కామ్రేడ్ బరుణ్ దా (సుశీల్ రాయ్)తో పాటు అరెస్టయ్యాడు. 14 ఏళ్లు సుదీర్ఘ జైలు జీవితం గడిపాడు. జైలులో కూడా పోరాటాల్లో ముందువరుసలో ఉండేవాడు. కేవలం ఏడు నెలల్లో విచారణ ప్రహసనాన్ని నడిపి ముగ్గురు కామ్రేడ్ల‌ కు కోర్టు శిక్ష విధించింది. ఇందులో కామ్రేడ్ తాపస్ దా, కామ్రేడ్ సంతోష్ దేవనాథ్ లకు జీవిత ఖైదు విధించింది. సుదీర్ఘ జైలు జీవితంలో కూడా ఆయన పార్టీ పట్ల, విప్లవం పట్ల అచంచల విశ్వాసంతో ఉన్నాడు. ఎలాంటి అవకాశవాదాన్ని ఆయన తన దరిచేరనీయలేదు. తేనెలాంటి పలుకుల ముందు ఎన్నడూ తల వంచలేదు. జైలులో ఆయన యావతు కామ్రేడ్స్ కు ఆప్తుడిగా ఉంటూ వారి సంక్షేమాన్ని పట్టించుకునేవాడు. రోజువారీగా అవసరమయ్యే వస్తువులను ఇచ్చి వారికి సహాయాన్ని అందించేవాడు.

కామ్రేడ్ తాపస్ కార్మికవర్గ సిద్ధాంతాన్ని, ఆదర్శాలను, పార్టీ బోధనలను ఎపుడూ నొక్కి వక్కాణించేవాడు. జైలులో కామ్రేడ్ తాపస్ మన పార్టీ కామ్రేడ్ల‌కే కాక, యావత్తు పీడిత వర్గాలకు చెందిన ఖైదీలకు, ఇతర సంఘాలకు చెందిన రాజకీయ ఖైదీలకు కూడా వివిధ రకాలుగా సహాయాన్ని అందించేవాడు. బెయిల్ పై బయటకు వెళ్లే పేద ఖైదీలకు తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు దారి ఖర్చుల కోసం ఇచ్చేవాడు.

అయితే ఫాసిస్టు రాజ్యం జైలు జీవితం గడిపిన 14 యేళ్లలో అయనను పలు రకాలుగా వేదించి హత్య చేసేందుకు ప్రయత్నించింది. జైలు జీవితం అనుభవించే క్రమంలో ఆయనకు తీవ్రమైన వ్యాధులు సోకినా, గుండెపోటు వంటి సీరియస్ వ్యాధితో బాధపడినా అధికారులు సరైన వైద్య సదుపాయాలు కల్పించలేదు. అందించిన వైద్య సదుపాయాలు కూడా ఆయనకు వైద్యం చేయాలనే డిమాండ్ లో జైలులోని ఖైదీలు నిర్వహించిన ఆందోళనల ఫలితంగానే కల్పించారు. అందువల్ల సుదీర్ఘ జైలు జీవితం గడిపిన తర్వాత కోల్ కతా హైకోర్టు ఆయనను విడుదల చేసింది. విడుదలైన రెండు నెలలకే ఆయన ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లారు.

గత పదేళ్లలోనే ఈ విధంగా అనేక మంది కమ్యూనిస్టు విప్లవకారులు జైలు నుంచి విడుదలైన 6-10 నెలల్లోనే మరణించారు. కమ్యూనిస్టు విప్లవకారులకు వ్యతిరేకంగా ఈ రకమైన దాడి వెనుక అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సీఐఏ, ఇజ్రాయిల్ కు చెందిన మొసాద్, భారత్ కు చెందిన ʹరాʹ వంటి ఇంటెలిజెన్స్ సంస్థల కుట్ర ఉంది. నిజానికి ఇలాంటి మరణాలు సామ్రాజ్యవాదుల, దళారీ పాలకవర్గాల కుట్ర తప్ప మరేమీ కాదు. ఇలాంటి కుట్రలను ప్రతిఘటనా పోరాటం ద్వారానే సీపీఐ (మావోయిస్టు) నాయకత్వంలో విప్లవ ప్రజా పోరాటాలను, ప్రజాసైన్యం, ఎర్ర విముక్తి ప్రాంతాలు స్థాపిస్తూ ఉన్నత-నూతనస్థాయికి అభివృద్ధి అవుతాయి. దేశంలో సామ్రాజ్యవాదాన్ని, భూస్వామ్యాన్ని నిర్మూలిస్తాయి.

కామ్రేడ్ తాపస్ చూపిన మార్గంలో, సాదా జీవితాన్ని, ఉన్నత భావాలను అలవరుచుకోవడం ద్వారానే భారత కమ్యూనిస్టు విప్లవకారులు పురోగమిస్తారు. మహత్తర భారత నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమవుతుంది. ప్రపంచంలో ఏ శక్తీ ఈ చారిత్రక గతిని అపలేదు. కామ్రేడ్ తాపస్ మన యావత్తు కమ్యూనిస్టు విప్లవకారులకు, సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక శక్తులకు ప్రేరణగా నిలుస్తాడు. అమరుడు తాపస్ శత్రువు పాలిట సదా సింహస్వప్నంగానే నిలిస్తాడు. ఆయన అందించిన ప్రేరణతో విప్లవకారులు సామ్రాజ్యవాదాన్ని, భూస్వామ్యాన్ని, రివిజనిజాన్ని, అన్ని రకాల అభివృద్ధినిరోధకులను కూకటివేళ్లతో పెలికిస్తారు.

అభయ్,
అధికార ప్రతినిధి,
లేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)




Keywords : west bengal, bihar, jarkhand, CPI Maoist, Deth, Martyr, abhay
(2024-04-24 22:49:59)



No. of visitors : 895

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


14