దళిత యువకుడిని దారుణంగా కొట్టి మూత్రం తాగించిన అగ్రకుల మూక‌

దళిత

30-01-2022

ఈ వారం ప్రారంభంలో Rajasthan రాజస్థాన్‌లోని చురు జిల్లాలో Jat community జాట్ కమ్యూనిటీకి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు 25 ఏళ్ల Dalit Youth దళిత యువకుడు రాకేష్​ మేఘ్వాల్ ను అపహరించి, దాడి చేసి, అతనితో వారి మూత్రం తాగించారు. జనవరి 26న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Churu district చురు జిల్లాలోని రుఖాసర్ గ్రామానికి చెందిన Rakesh Meghwal రాకేష్ మేఘ్వాల్ ఇంటికి 26వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన జాట్ వర్గానికి చెందిన రాకేష్, రాజేష్, ఉమేష్, తారాచంద్, అక్షయ్, దినేష్, బిడాదిచంద్ బీర్బల్ లు వచ్చి రాకేష్ మేఘ్వాల్ ను కిడ్నాప్ చేసి కారులో పొలాల్లోకి తీసుకెళ్ళారు. అక్కడ అతన్నికర్రలతో, తాళ్ళతో దారుణంగా కొట్టారు. బలవంతంగా మద్యం తాగించారు. ఖాళీ అయిన మద్య బాటిల్ లో నిందితులందరూ మూత్రం పోసి రాకేష్ తో బలవంతంగా తాగించారు.

అనంతరం స్పృహ కోల్పోయిన రాకేష్ మేఘ్వాల్ ను చనిపోయాడనుకొని అతని ఇంటికి దగ్గరలో పడేసి, అతని మొబైల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోయారు.

అనంతరం అతన్ని చూసిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు పిర్యాదు చేశారు.

"రాకేష్ జాట్ , రాజేష్ మద్యం బాటిల్ తీసి నన్ను బలవంతంగా తాగించారు మరియు బాటిల్ ఖాళీ అయిన తర్వాత, రాకేష్, రాజేష్, ఉమేష్, తారాచంద్, అక్షయ్, దినేష్, బిడాదిచంద్ మరియు బీర్బల్ ఆ బాటిల్‌లో మూత్ర విసర్జన చేసి నన్ను తాగించారు అందరూ నన్ను కర్రలు, తాళ్లతో సుమారు అరగంట పాటు కొట్టారు, దీని ఫలితంగా నా శరీరం మొత్తం గాయపడిన గుర్తులు ఉన్నాయి"అని రాకేష్ మేఘ్వాల్ తన పిర్యాదులో పేర్కొన్నారు.

జాట్ కమ్యూనిటీని ఎదిరించే "ధైర్యం" చేసినందుకు (దళితులకు) మీకు సరైన గుణపాఠం చెబుతామంటూ తనను కులపరమైన తిట్లను తిట్టారని, దళితులను కించపరిచే పదాన్ని ఉపయోగించి దుర్భాషలాడారని మేఘవాల్ తన పిర్యాదులో పేర్కొన్నారు.

చురులోని రతన్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో మేఘవాల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.ఉమేష్​, బీర్బల్​ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ʹʹనిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మేఘ్వాల్‌పై దాడి చేశారన్న ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా తేలింది. నిందితులంతా మేఘ్వాల్‌తో సమాన వయస్సు గల వారని, వారి మధ్య ఏడాది క్రితం వివాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో శత్రుత్వం ఏర్పడిందని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం. మేఘ్వాల్ వీపుపై చాలా గాయాలు ఉన్నాయి, ఇది తాళ్లతో చేసినట్లు కనిపిస్తుంది, ʹఅని రతన్‌గర్ సర్కిల్ అధికారి హిమాన్షు శర్మ అన్నారు.

Keywords : rajastan, Dalit man, assaulted, Jat community, In Rajasthan, Dalit man assaulted, made to drink urine; 8 booked: Police
(2024-04-24 22:47:04)



No. of visitors : 913

Suggested Posts


నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !

పసివాళ్ళన్న జాలి...పిల్లలతో పని చేయించకూడదన్న ఇంగిత ఙానం లేని దుర్మార్గులు.... పసివాళ్ళపై అమానుషంగా ప్రవర్తించారు. బట్టలిప్పేసి కొట్టడమే కాకుండా రెండు కిలోమిటర్ల దూరం నగ్నంగా నడిపించారు. పైగా ఆ మొత్తం సంఘటనను వీడియో తీసి షాడిస్టుల్లా ప్రవర్తించారు

ఆ హంతకుడే తమ రాముడంటూ ఊరేగించిన మతోన్మాదులు

దేశమంతా అసహ్యించుకునే ఓ హంతకుడిని వాళ్ళు దేవుడిలాగా రథంపై ఊరేగించారు. లవ్ జీహాదీ పేరుతో ఓ అమాయకుడిని హత్య చేసి జైల్లో ఉన్న వ్యక్తికి జై జైలు కొడుతూ అతనే మా రాముడంటూ ఊరంతా ఊరేగించారు....

చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం

రాజస్తాన్ లోని బండి జిల్లా హరిపుర గ్రామంలో ఓ ఐదేండ్ల బాలిక రెగర్‌ కమ్యూనిటీకి చెందిన వారు ʹపవిత్రంగా భావించేʹ టైటిహరి అనే పక్షి గుడ్డును పొరపాటున పగులకొట్టింది. ఈ పక్షి గుడ్డును పగులకొడితే.. వర్షాలు పడవని వారి నమ్మకమట.

రాజస్తాన్ లో అమెరికా లాంటి ఘటన....వ్యక్తిని కిందపడేసి మోకాలితో తొక్కిన పోలీసులు

జార్జ్ ఫ్లాయిడ్ ను చంపిన పోలీసు లాగానే ఓ వ్యక్తి పట్ల ఇక్కడి పోలీసులు ప్రవర్తించారు. రాజస్తాన్ లో మాస్క్ ధరించకుండా రోడ్డు మీదికి వచ్చాడని ఓ వ్యక్తిపై పోలీసులు దారుణంగా దాడి చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


దళిత