హక్కుల కార్యకర్తను మావోయిస్టుగా మార్చే ప్రయత్నం చేసిన పోలీసులు

హక్కుల

04-02-2022

ʹసివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు ఇద్దరు నన్ను గట్టిగా పట్టుకుంటే మరొకరు, నా నడుముకి రివాల్వర్‌ ఎక్కుపెట్టి బొలెరోలోకి లాగినప్పుడు, నేను చాలా భయపడ్డాను. వీళ్ళు నన్ను థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురి చేయడమో లేదా, ఎన్‌కౌంటరే చేసేస్తారేమోననిపించింది.ʹ- జార్ఖండ్‌కు చెందిన 21 ఏళ్ల యువ ఆదివాసీ హక్కుల కార్యకర్త బల్దేవ్ ముర్ము తన అనుభవాన్ని వివరించారు.

హజారీబాగ్ పోలీసుల అక్రమ కస్టడీలో 54 గంటలు గడిపిన తర్వాత బల్దేవ్ ముర్ము జనవరి 31 రాత్రి తన ఇంటికి చేరుకున్నాడు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం, హజారీబాగ్ జిల్లా కేంద్రానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోవున్న విష్ణుగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్కిఖుర్ద్‌కు చెందిన రోహనియన్ టోలాకు వెళ్ళిన ఈ వ్యాస రచయిత గ్రామమంతా భయం నీడలో వుండడాన్ని గమనించారు. దాదాపు 4 డజన్ల మంది సంథాల్ ఆదివాసీ ప్రజలు బల్దేవ్ ముర్ము ఇంటి దగ్గరికి వచ్చారు. వీరిలో సాంప్రదాయక గ్రామ పెద్ద మాంఝీ హదమ్‌తో సహా మహిళలు, పిల్లలు, యువకులు, పెద్దలు ఉన్నారు.

బాల్దేవ్ ముర్ము ఆదివాసీ-మూల్‌వాసీ వికాస్ మంచ్ కార్యకర్త. ఆ మంచ్ ఇటీవల ఏర్పడిన జార్ఖండ్ జన్ సంఘర్ష్ మోర్చాలో భాగస్వామ్య సంస్థ. బలదేవ్ ముర్మును విష్ణుగఢ్ పోలీస్ స్టేషన్ పోలీసులు జనవరి 29 ఉదయం 11 గంటలకు ఎటువంటి వారెంట్ లేకుండా అతని గ్రామం నుండి అదుపులోకి తీసుకున్నారు.
ʹమా పొరుగున వుండే 12 ఏళ్ల రాకేష్ మరాండి, నేనూ ఉదయం 11 గంటల సమయంలో వాకిట్లో కూచుని రేగి పళ్ళు తింటున్నాం. ఇంటిముందు ఆగిన ఒక బొలెరో లోంచి దిగిన ఇద్దరిలో ఒకతను నన్ను పిలిచి నా పేరు ఏమిటని అడిగితే, మరొకతను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరయిన యిల్లును చూడటానికి తమతో రావాలన్నాడు. మా వూరి పెద్దాయనతో మాట్లాడాక వెళ్దాం అని, నార్కి పంచాయతీ సర్పంచ్ బేబీ దేవి భర్త కులదీప్ రవిదాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్తుండగా ఒకతను నా మొబైల్ లాక్కుని, నడుము దగ్గర రివాల్వర్ ఎక్కుపెట్టి మేం పోలీసులం నడు అంటూ ఈడ్చుకెళ్లి బొలెరోలోకూచోబెట్టి ఒక మఫ్లర్‌ను నడుముకు కట్టేశాడు. ఇదంతా చూసిన ఊరిలో కుర్రాడు ఇంట్లోకి పరుగెత్తుకెళ్ళి చెప్పాడు.

ʹబొలెరోను నేరుగా 25 కి.మీ దూరంలో వున్న విష్ణుగఢ్ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి తీసుకెళ్లి నన్ను లాకప్‌లో పెట్టారు. ఒక గంట తర్వాత, లాకప్ నుంచి బయటికి తీసి, స్టేషన్ ఇన్‌చార్జి లేకపోవడంతో, పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ మిశ్రా నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అప్పటికే నా మొబైల్‌ని క్షుణ్ణంగా చెక్ చేసారు. జనవరి 25-26 తేదీల్లో ఎక్కడ వున్నావు అని అడిగితే, గిరిడి జిల్లాలోని నౌకానియన్ గ్రామంలో ఉన్నానని చెప్పాను, అప్పుడు అతను కాదు, నువ్వు జనవరి 25 రాత్రి ఖార్కిలో నల్ల జెండా ఎగురవేసి మొబైల్ టవర్ పేల్చివేశావని, నువ్వు మావోయిస్టు నాయకుడు దుర్యోధన మహతో కోసం పని చేస్తావని అన్నాడు.

పదే పదే అంటున్న ఆ విషయాన్ని నేను నిరాకరించడంతో ఒకటి, రెండు సార్లు లాఠీతో కొట్టాడు, ఆ తరువాత నా బంధువు, ఆదివాసీ-మూల్‌వాసీ వికాస్ మంచ్ కార్యదర్శి విజయ్ ముర్ము గురించి అడిగాడు. అతను వారం రోజుల క్రితమే హైదరాబాద్‌ టవర్‌లో పనికి వెళ్లాడని చెప్పాను. ఎప్పుడూ గ్రామంలోనే రోజు కూలీగా పనిచేసే విజయ్ ముర్మును మావోయిస్టు అన్నాడు. ఆదివాసీ-మూల్‌వాసీ వికాస్ మంచ్ అధ్యక్షుడు అర్జున్ ముర్ము, మెహనత్కష్ మహిళా సంఘర్ష్ సమితి, జార్ఖండ్ క్రాంతికారి మజ్దూర్ యూనియన్, జార్ఖండ్ జన్ సంఘర్ష్ మోర్చా నేతృత్వంలో వున్నమా అత్త సుమిత్రా ముర్మును గురించి అడగడం ప్రారంభించారు. సుమారు గంటపాటు జరిగిన విచారణలో నల్లజెండా ఎగురవేయడంలో, టవర్‌ పేల్చివేతలో పాల్గొన్నానని చెప్పించడానికి ప్రయత్నించారు. కానీ నేను పూర్తిగా నిరాకరించాను. తర్వాత మళ్లీ లాకప్‌లో పెట్టారు. రోజంతా తినడానికి ఏమీ ఇవ్వలేదు, రాత్రి 8 గంటలకు 3 లిట్టీలు, చోఖా (గోధుమ పిండితో చేసే వంటకం, నంచుకోడానికి అలుగడ్డతో చేసే కూర-) మాత్రమే ఇచ్చారు.ʹ

అరెస్ట్ అయిన సీపీఐ(మావోయిస్టు) పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రశాంత్‌బోస్‌, కేంద్ర కమిటీ సభ్యురాలు షీలా మరాండీలను చిత్రహింసలపాలు చేయడానికి వ్యతిరేకంగా, జైల్లో సరైన వైద్యం అందకపోవడం, ఇద్దరికీ రాజకీయ ఖైదీల హోదా కల్పించడం తదితర అంశాలపై జనవరి 21 నుంచి 27 వరకు ʹనిరసన వారం ʹ చేపట్టిన సంగతి తెలిసిందే. ʹఅందులో భాగంగా జనవరి 26న ʹబ్లాక్ డేʹ, జనవరి 27న బీహార్-జార్ఖండ్ బంద్ చేయాలని ప్రకటించారు. జనవరి 25-26 రాత్రి, బాల్దేవ్ ముర్ము గ్రామానికి 9-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖట్కీ గ్రామంలోని పాఠశాలలో CPI (మావోయిస్ట్)లు నల్ల జెండాను ఎగురవేశారు, జియో టవర్ కార్యాలయాన్ని పేల్చేసారు.

ʹజనవరి 29న గంటసేపు విచారించిన తర్వాత, జనవరి 30న రోజంతా ఎలాంటి విచారణ జరగలేదు. అమ్మ పగటిపూట ఇంటి నుండి తెచ్చిన, అన్నం తిన్నాను. రాత్రి 8 గంటలకు తిన్నాక, రెండు బృందాలు నన్ను విడివిడిగా విచారించాయి, మా కుటుంబ వివరాలు తెలుసుకున్నారు, మావోయిస్టు సంఘటనలో నా ప్రమేయాన్ని అంగీకరించమని ఒత్తిడి చేశారు. నేను ప్రతిసారీ నిరాకరించాను. ఆ తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో మొదటిసారిగా నా చేతికి సంకెళ్లు వేసి, బొలెరోలో కూర్చోబెట్టి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో హజారీబాగ్‌లో వున్న బహుశా DSP కార్యాలయానికి తీసుకెళ్ళారు.

ఇక్కడ కూడా మొదట లాకప్‌లో బంధించారు. కాసేపటి తర్వాత నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లారు. రాంచీకి చెందిన ప్రత్యేక బృందంతో సహా 5 మంది అధికారులు ఉన్నారు. ఆ వ్యక్తులు కూడా నన్ను మావోయిస్టుని చేయాలనే లక్ష్యంతో తీవ్రంగా ప్రయత్నించారు. నేను ససేమిరా కాదన్నాను. అప్పుడు ఒక అధికారి అందరం కలిసి భోజనం చేద్దాం అంటే, యాపిల్స్, ద్రాక్ష, జీడిపప్పులాంటివి ప్లేటులో తెచ్చి నన్ను కూడా తినమన్నారు. నేను భయంతో తినేసాను. జార్ఖండ్ జన్ సంఘర్ష్ మోర్చాతో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తుల ఫోటోలను ఒక అధికారి నాకు చూపించాడు, నేను తెలిసిన అందరి పేర్లను చెప్పేసాను.
నేను గుర్తించలేని చాలా మంది వ్యక్తుల ఫోటోలను చూపిస్తే నాకు తెలియదన్నాను.

ఒక పోలీసు అధికారి ʹనువ్వు ఢోలకట్టకు ఎందుకు వెళ్తావు?ʹ అని అని అడిగితే మా అక్క వూరు కాబట్టి వెళ్తాను అంటే, అయితే, మీ బావ నిన్ను తప్పకుండా మావోయిస్టులతో కలిపి ఉంటాడని అన్నాడు. అప్పుడు ఓ వ్యక్తి సంథాలిలో ʹనీకు మావోయిస్టులతో సంబంధం ఉందని అంగీకరిస్తే, ఏమీ చేయం, వదిలేస్తాంʹ అన్నాడు. డీఎస్పీ (యితని చొక్కాకున్న బ్యాడ్జ్ మీద ఊరాన్ అని రాసి వుండడాన్ని నేను చదవగలిగాను) ʹఅంతా నిజం అని అంగీకరించు, లేకపోతే మొత్తం జీవితం నాశనం చేసుకుంటావుʹ అన్నాడు. ఒక అధికారి ఫేస్‌బుక్ పోస్ట్ చదవడం ప్రారంభించి, ʹనువ్వు చాలా పెద్ద నాయకుడివైపోయావు అందుకే అందరూ నీ గురించి రాస్తున్నారుʹ అన్నాడు.

జార్ఖండ్ జన్ సంఘర్ష్ మోర్చా నిధుల గురించి అడిగితే, మేము వూళ్ళు తిరిగి విరాళం సేకరిస్తామని, దానికి రశీదు కూడా ఉందని నేను స్పష్టంగా చెప్పాను. వారి బెదిరింపులకు నేను లెక్కచేయకపోవడంతో, నన్ను మళ్లీ లాకప్‌లో బంధించారు. జనవరి 31 ఉదయం, రెండు బృందాలు నన్ను మళ్లీ విచారించాయి. నా ఫోటోలు కూడా తీశారు. అలాగే తెల్ల కాగితంపై మొత్తం పది వేలిముద్రలు తీసుకున్నారు. అల్పాహారం ఇచ్చి 11 గంటలకు మళ్లీ లాకప్‌లో బంధించారు.

అలసటగా ఉండడంతో నిద్రలోకి జారుకున్నాను. సాయంత్రం 4 గంటలకు నన్ను పోలీసులు నిద్రలేపారు, ఆపై నా చేతికి సంకెళ్లు వేసి ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ మిశ్రా నన్ను బొలెరోలో కూర్చోబెట్టారు. దారిలో, ʹనువ్వు ఇప్పుడు సరిగా వుండాలిʹ అని చెప్పి నా చేతి సంకెళ్లు తీసేసి సీటుకింద దాచాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో, సర్పంచి భర్త కులదీప్ రవిదాస్‌తో, నాతో ఒక కాగితంపై సంతకం చేయించుకొని వదిలిపెట్టారు. ఆ కాగితంపై ఏమి రాసి ఉందో, నేను పూర్తిగా చదవలేకపోయాను, కానీ నన్ను సురక్షితంగా యితనికి అప్పచెబుతున్నారనే విషయం చదవగలిగాను. నా మొబైల్, గ్లామర్ బైక్ కాయితాలు యివ్వమని అడిగితే రెండు రోజుల్లో పంపిస్తామని చెప్పాడు.ʹ

DVC బొకారో థర్మల్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా ఉన్న ఆదివాసీ-మూల్‌వాసి వికాస్ మంచ్ అధ్యక్షుడు అర్జున్ ముర్ము చెప్పిన వివరాలు - ʹనేను జనవరి 29 న డ్యూటీలో ఉన్నప్పుడు, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నాకు ఫోన్‌లో విషయం చెప్పాడు. నేను వెంటనే మా సంఘ సభ్యులకు ఫోన్ చేసాను. మేమంతా తెల్లవారుజామున 2 గంటలకు పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాము. పోలీస్ స్టేషన్‌లో నేను ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ మిశ్రాతో ʹబాల్దేవ్ ఏం నేరం చేశాడు?త్వరగా వదిలేయండిʹ అనడంతో కోపంతో ʹమీ అందరినీ కూడా లోపలేస్తాంʹ అని అరవడం మొదలుపెట్టాడు. చాలా తర్జనభర్జనల తర్వాత ఎస్పీ ఆదేశాల మేరకు పట్టుకున్నామని, రాత్రికి ఆయన వచ్చి విచారిస్తాడని మమ్మల్ని మర్నాడు 10 గంటలకు రమ్మన్నాడు.

మేము మర్నాడు, జనవరి 30వ తేదీ ఉదయం 10 గంటలకు నార్కి పంచాయతీ సర్పంచి బేబీ దేవి, ఆమె భర్త కులదీప్ రవిదాస్, వార్డు మెంబర్ దేవంతి దేవి, ఆమె భర్త మోతీ రవిదాస్, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నాయకుడు దశరథ్ రాయ్, అలాగే మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు సహా మొత్తం 40-50 మంది దాకా వెళ్లాము. రాత్రి ఎస్పీ రాలేదని, ఆరోజు రాత్రి వస్తాడని ఇన్ స్పెక్టర్ చెప్పాడు. ఇది విని నాకు కోపం వచ్చి 24 గంటల కంటే ఎక్కువ లాకప్‌లో ఉంచే హక్కు నీకు లేదన్నాను. దాంతో కోపం వచ్చిన ఇన్‌స్పెక్టర్‌, ʹఎంతకాలం కావాలంటే అంతకాలం వుంచుకుంటాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈరోజు దాడిలో దొరికిన క్యాన్ బాంబును ఈ కేసులో పెడతాంʹ అని అరవడం మొదలుపెట్టాడు. జనవరి 30వ తేదీ సాయంత్రం వరకు అక్కడే ఉండి స్థానిక మీడియా (హిందూస్థాన్, దైనిక్ జాగరణ్, ప్రభాత్ ఖబర్, దైనిక్ భాస్కర్) జర్నలిస్టులకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలియచేసాము.

మేం చెప్పిన విషయం విని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి వచ్చిన జర్నలిస్ట్‌లలో ఒకరు, బాల్దేవ్‌పై ఈ పోలీస్ స్టేషన్‌లో కేసు లేదని, బహుశా వేరే జిల్లాకు చెందిన కేసు ఉండవచ్చని ఇన్స్పెక్టర్ అంటున్నాడని నాతో చెప్పాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు జనవరి 31న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, లాకప్‌ ఖాళీగా కనిపించింది. ఆ సమయంలోనే బాల్దేవ్ తల్లి మంజలి దేవి తన లాయర్ ద్వారా రాంచీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ-మెయిల్ పంపి తన కుమారుడి ప్రాణాలను కాపాడాలని వేడుకుంది.
సాయంత్రం 5 గంటలకు బాల్దేవ్ ను వదిలివేశారు, పోలీస్ స్టేషన్‌కి రండి అని నాకు ఫోన్ వచ్చిందిʹ.
ఈ మొత్తం ప్రకరణలో తాము చాలా విషయాలు నేర్చుకున్నామని, అర్జున్ ముర్ము అంటున్నారు. మూడు రోజులుగా మా సంఘ కార్యకర్త అక్రమ కస్టడీలో ఉన్నాడు, మేము ఎప్పటికప్పుడు జరిగే విషయాలు చెప్పినప్పటికీ స్థానిక మీడియా ఒక వాక్యం కూడా వేయలేదు. అలాగే వారెంట్ లేకుండా ఓ గిరిజనుడిని పోలీసులు ఎలా ఎత్తుకెల్తారు, ఎలా ఇంటిపై దాడి చేస్తారు, అనేది కూడా చూసాం.

బాల్దేవ్ ముర్మును అదుపులోకి తీసుకున్న గంట తర్వాతనే, పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి, ఆదివాసీ-మూల్‌వాసి వికాస్ మంచ్ రిజిస్టర్, బ్యానర్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, ఈ-శ్రమ్ కార్డ్, SBI ATM కార్డ్ మొదలైనవాటిని ఎత్తుకెళ్ళారు. జనవరి 30న, గ్రామం మొత్తం పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు, పోలీసులు విజయ్ ముర్ము ఇంటిపై దాడి చేసి, తాళం పగులగొట్టి, అతని ఇంటి నుండి గిరిజన-ముల్వాసి వికాస్ మంచ్ రసీదుల పుస్తకం, సిమ్ కార్డు లేని చిన్న మొబైల్, అలహాబాద్ నుండి ప్రచురితమయ్యే ʹదస్తక్ నయే సమయ్ కిʹ పత్రిక, జర్నలిస్టు రూపేష్ కుమార్ సింగ్ జైలు డైరీ ʹఖైద్ ఖానే కి ఆయినాʹతో సహా కొన్ని పుస్తకాలు తీసుకెళ్లారు. ఇంట్లో వున్న బియ్యం, పెట్టెలలో వున్న దుస్తులు మొదలైన వాటిని చెల్లాచెదురు చేశారు. విజయ్ ముర్ము భార్య ఫూల్ముని దేవిని కూడా పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారించారు. ఈ నివేదిక రాసే సమయానికి, పోలీసులు బలదేవ్ ముర్ము వస్తువులను లేదా ఫూల్ముని దేవి వస్తువులను తిరిగి ఇవ్వలేదు. ఈ మొత్తం సంఘటనపై వివరాలు తెలుసుకునేందుకు అధికారులకు ఫోన్ చేయగా వారు ఫోన్‌ ఎత్తలేదు.

ఈ పోలీసుల అణిచివేతకు వ్యతిరేకంగా త్వరలో పెద్ద నిరసన సభ నిర్వహించనున్నామని, న్యాయవాదిని సంప్రదించి పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదివాసీ-మోల్వాసీ అధికార్ మంచ్ అధ్యక్షుడు అర్జున్ ముర్ము తెలిపారు.

3 రోజుల పాటు ఓ ఆదివాసీ యువకుడిని మావోయిస్టుగా చేసేందుకు పోలీసులు కుట్ర పన్నిన తీరు చాలా భయానకంగా ఉందని బాల్దేవ్ విడుదల కోసం చురుగ్గా పనిచేసిన జార్ఖండ్ జన్ సంఘర్ష్ మోర్చా, జార్ఖండ్ క్రాంతికారీ మజ్దూర్ యూనియన్ నాయకుడు రజాక్ అన్సారీ అంటున్నారు. ఆదివాసీల ప్రయోజనాల గురించి మాట్లాడే ప్రభుత్వం ఆదివాసీలపై అత్యంత దౌర్జన్యాలకు పాల్పడుతోంది.
సోషల్ మీడియాలో ప్రచారం చేయకపోయి వుంటే, ప్రతి రోజూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లకపోయి వుంటే, హైకోర్టుకి ఈ-మెయిల్ చేయకపోయి వుంటే కనక, జార్ఖండ్ పోలీసులు బలదేవ్ ముర్మును క్రూరమైన మావోయిస్టుగా ప్రకటించి అరెస్టు చేసి వుండేవారని జార్ఖండ్ జన్ సంఘర్ష్ మోర్చా కన్వీనర్ బచ్చా సింగ్ అంటున్నారు..

ఇటీవల ఏర్పాటైన జార్ఖండ్ జన్ సంఘర్ష్ మోర్చాను జార్ఖండ్ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న తీరు చాలా బాధాకరంగానూ, భయానకంగానూ ఉంది. జార్ఖండ్ జన్ సంఘర్ష్ మోర్చా మొత్తం కార్యాచరణ, కార్యక్రమం పట్టపగటి వెలుగులా స్పష్టంగా ఉంది, ఈ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి మాత్రమే ఏర్పాటు అయింది. గత బిజెపి రఘువర్‌దాస్‌ ప్రభుత్వానికి, ప్రస్తుత హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు. ఈ ఆదివాసీ వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జార్ఖండ్ అంతటా విస్తృత ఉద్యమాన్ని నిర్మిస్తాం.

ప్రజలు చేస్తున్న జల్-జంగిల్-జమీన్ (నీరు-అడవి-భూమి)ను రక్షించే పోరాటాన్ని అణచివేయడానికి, వాటిని సులభంగా పెట్టుబడిదారులకు యివ్వడానికి తమ ఊరి యువకులను మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్నారని, తమ ఊరి యువకులంతా ఆదివాసీ-మూల్‌వాసీ వికాస్ వేదికలో చేరి నీరు-అటవీ-భూమిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు అని బాల్దేవ్ ముర్ము గ్రామానికి చెందిన బాబులాల్ మాంఝీ అంటున్నారు.

54 గంటలపాటు అక్రమంగా పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు బాల్దేవ్ ముర్ము ఏమాత్రం బెదరలేదని, తాను జీవించి ఉన్నంత వరకు నీరు, అడవి, భూమిని కాపాడేందుకు పోరాడుతూనే ఉంటానని దృఢంగా చెప్పారు.

(janchowk.com సౌజన్యంతో )

జర్నలిస్టు రూపేష్ కుమార్ సింగ్ నివేదిక‌

తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి

Keywords : jharkhand, adivasi, police, arrest, maoist, jharkjand police illegally kept baldev murmu in custody
(2024-04-27 09:55:43)



No. of visitors : 1170

Suggested Posts


kashmir: UAPA కింద 15 ఏండ్ల బాలుడు అరెస్ట్

జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లా బుమ్హామా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులతో కలిపి 15 ఏండ్ల బాలుడు జహాబ్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద‌ కేసు నమోదు చేశారుపోలీసులు. ఈ నలుగురిని మే 29 న పోలీసులు అరెస్టు చేశారు

కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం

తంలో ఇలాంటి ర్యాలీ నిర్వహించినందుకు జమ్ము కాశ్మీర్ కు చెందిన బీజేపీ మంత్రి లాల్ సింగ్ ను మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం గత నెలలో మంత్రి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు అతని తమ్ముడు రాజేందర్ సింగ్ అద్వర్యంలో మళ్ళీ ర్యాలీ నిర్వహించారు.

ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI

The Network of Women in Media, India, expresses its outrage at the harassment and violence meted out to the elderly parents of award-winning Kashmiri photojournalist and NWMI member Masrat Zahra. Such harassment of vulnerable family members is an abhorrent strategy of intimidation that must be strongly condemned.

మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా

యాసీన్ మాలిక్ కశ్మీరీ ప్రతిఘటనా పోరాట నాయకుడు. 1966లో శ్రీనగర్ లోని డౌన్ సిటీలో పుట్టిన యాసీన్ మాలిక్ కశ్మీర్ అత్యంత సంక్షోభ కాలంలో పెరిగాడు అక్కడ. ఆ కాలంలో పుట్టి పెరిగిన పిల్లల జీవన ప్రయాణాన్ని నిర్దేశించినది తల్లిదండ్రులు కాదు. ఆ ప్రాంత అల్లకల్లోల రాజకీయ పరిస్థితులు. వాళ్లను ఉగ్రవాదులు అన్నా, ఫండమంటలిష్టులు అన్నా- ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరు ఎలా

మహిళా జర్నలిస్టుపై UAPA కేసు - దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ‌

ఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జమ్ము కాశ్మీర్ పోలీసులు UAPA కేసు నమోదు చేశారు. జమ్ము కాశ్మీర్ లో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా తన ఫేస్ బుక్ పోస్టులతో యువతను రెచ్చగొడుతోందని, దేశవ్యతిరేక పోస్టులను పోస్ట్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ యిల్లు దురాక్రమణ, భీభత్సం

లాక్డౌన్ సమయంలో తన సోదరి ఇంట్లో వుంటున్న కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ అక్టోబర్ 5, ఆదివారంనాడు తన ఇంటికి వెళ్లినప్పుడు ఇల్లంతా భీభత్సంగా వుండటమే కాకుండా, పడకగదిలో మంచం మీద డాక్టర్ ఇమ్రాన్ గనై అనే వ్యక్తి పడుకొన్నాడు. అతనితో పాటు కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు.

ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు దిగిన జమ్ముకశ్మీర్ విద్యుత్ ఉద్యోగులు- ఆర్మీని దించిన ప్రభుత్వం

మోడీ-షా ప్రభుత్వం భారత రైతాంగ పోరాట అణిచివేతకు బరితెగించి భంగపడింది. నాగాలాండ్ ప్రజల్ని టెర్రర్ చేయబోయి చతికిల పడింది. విదేశీ యుద్దాలకై శిక్షణ ఇచ్చి నిర్మించిన ఇండియన్ ఆర్మీని ఇండియన్ పౌరులపై యుద్దానికి వాడుకుంటోంది. ఇప్పుడు జమ్మూ& కాశ్మీర్ లో ఆర్మీ మరో క్రూర ఫాసిస్టు చర్యకు బరితెగిస్తోంది.

kashmir:పడవ ప్రమాదం పై వాట్సప్ లో స్టేటస్ పెట్టినందుకు జర్నలిస్టు అరెస్టు

గతంలో పడవ ప్రమాదంలో చనిపోయిన వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఫోటోలను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నందుకు ఓ జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు.

kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI

అవార్డు గ్రహీత, కశ్మీరీ ఫోటో జర్నలిస్ట్, NWMI సభ్యురాలు మస్రత్ జహ్రా వృద్ధ తల్లిదండ్రులను వేధింపులు, హింసకు గురిచేయడం పట్ల నెట్ వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా (NWMI), ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


హక్కుల