హిడ్మా సరెండర్ అయ్యాడన్న ప్రచారం ఓ కట్టుకథ -వికల్ప్ ప్రకటన
04-02-2022
సిపిఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డికెఎస్‌జెడ్‌సి)సభ్యుడు, బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ హిద్మా లొంగిపోయిన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వికల్ప్ ప్రకటన పూర్తి పాఠం....
ʹఅగ్ర మావోయిస్ట్ హిద్మా లొంగుబాటుʹ అనే తప్పుడు ప్రచారాన్ని ఖండించండి!
ప్రభుత్వం సాగిస్తున్న మానసిక దాడికి వ్యతిరేకంగా పోరాడండి!
సిపిఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డికెఎస్‌జెడ్‌సి)సభ్యుడు, బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ హిద్మా లొంగిపోయిన్నట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు విప్లవోద్యమానికి వ్యతిరేకంగా సైనిక దాడిని తీవ్రతరం చేస్తూనే మరోవైపు అబద్ధాలు, అర్ధసత్యాలు చెబుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించి పార్టీపై అసత్య, దుష్ప్రచారాలు చేస్తున్నారు.
మాడ్వి హిద్మా అనే వ్యక్తిని అరెస్టు చేసి అతను ʹటాప్ అండ్ హార్డ్ కోర్ మావోయిస్టు హిద్మాʹ అని అతనిపై 25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
మా కార్యకర్తలు, విప్లవకారులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎప్పుడూ నమ్మరు. అణగారిన ప్రజలను, ప్రజానుకూల మేధావులను, పార్టీ మద్దతుదారులను, సానుభూతిపరులను తప్పుతోవపట్టించడానికి పోలీసులు ఈ దుష్ప్రచారాన్ని చేపట్టారు. అయితే ఎప్పుడూ తప్పుడు ప్రచారం ద్వారా సత్యాన్ని కప్పిపుచ్చలేరు. మా బెటాలియన్ కమాండర్, DKSZCM సెక్రటేరియట్ సభ్యుడు కామ్రేడ్ హిద్మా గెరిల్లా స్థావరాలలో దండకారణ్య ప్రజలతో క్షేమంగా ఉన్నారు.
అణగారిన వర్గాలు, సామాజిక వర్గాలు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాల తప్పుడు ప్రచారాలను, మానసిక యుద్ధాన్ని ఖండించాలని, తీవ్రంగా వ్యతిరేకించాలని DKSZC పిలుపునిస్తోంది. వర్గ పోరాటం, గెరిల్లా యుద్ధం,ప్రజా యుద్ధంలో మరింత చురుకుగా పాల్గొనాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము.
వికల్ప్
ప్రతినిధి
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)
సీపీఐ (మావోయిస్టు)
Keywords : cpi maoist, vikalp, COMMUNIST PARTY OF INDIA (MAOIST), Dandakaranya Special Zonal Committee, Hidma, surrender
,
(2023-09-26 04:14:54)
No. of visitors : 964
Suggested Posts
| ఎన్కౌంటరే జరగలేదు..మావోయిస్టులు చనిపోలేదు - మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటనచత్తీస్గడ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో తాము చేపట్టిన మూడురోజుల ఆపరేషన్ లో 20 మంది మావోయిస్టులు చనిపోయారని దంతెవాడ CRPF ఐజీ చేసిన ప్రకటన అసత్యమని తేలిపోయింది. కొద్ది రోజుల క్రితం మావోయిస్టుల... |
| ʹThere Was No Encounter.. No casualities from Maoistsʹ -maoist party audio statementMaoist party rejects heavy encounter in Sukma district of Chhattisgarh. firing, encounter news are creation of rumour mills |